మథుర - ఐసున్ ఫిన్

Madhura

(నువ్వు ఎక్కడవున్నా పక్కన ఉన్నట్టుందే ఇదే ప్రేమో మరి అంటూ సూర్య అనుకుంటున్న సమయానికి జనని నడుచుకుంటూ వస్తుంది. కనుల రెప్పలు వేయకుండా తదేకంగా చూస్తూ, చిన్న చిరునవ్వుతో)

జనని, ఇదిగో ఈ చీర నీకు చాలా బాగుంటుంది. నేనే వెతికి మరి నీకోసం తెచ్చా. సాయంత్రం పూజకి ఇది కట్టుకుని వస్తావా?

(ఒక చిన్న మెరుపు లాంటి ఆనందం జనని కనులలో, సరే అంటూ తలను తిప్పి లోపలికి వెళ్ళింది)

ఆంటీ, పూజ కోసం కలశం అడిగారుగా ఇదిగోండి.

థాంక్యూ, ఆ సారీ ఏంటమ్మా చేతిలో?

అంటే అమ్మ ఈవెనింగ్ పూజకి ఈ సారీ కొన్నారు.

చాలా బాగుంది.

(డోర్ వెనకాల సూర్య ఆనందపడుతున్నాడు, జనని ఇంటికి వెళ్ళాక)

జనని, ఆంటీకి కలశం ఇచొచ్చావా?

హ ఇచ్చా.

ఆ సారీ ఏంటి?

ఆంటీ ఇచ్చారమ్మ.

అవునా, చాలా బాగుంది. మనం కూడా పూజకి ఒక చీర పెట్టాలి.

(ఈవెనింగ్ సారీలో జననిని కోసం ఎంతగానో సూర్య వెయిట్ చేస్తూన్నాడు అలాగే జనని కూడా సూర్య కోసం కష్టపడి సారీ కట్టుకుని అందంగా తయారయ్యింది)

జనని పద ఇంకా ఎంతసేపు ఆ అద్దం ముందు తయారవుతావు.

వస్తున్నానమ్మా.

(జనని పట్టీల శబ్దం వినబడిన సూర్య అటు చూడగా, ఒక్కసారిగా అలా చూస్తుండిపోయాడు)

హలో, సూర్య గారు ఏంటి అలా నిల్చునిపోయారు, కొంచెం జరగండి వెళ్ళాలి.

చాలా అందంగా ఉన్నావు జనని, అసలు చెప్పడానికి మాటలు రావట్లేదు. నా దిష్టే తగిలేలాఉంది.

(అని సూర్య చేతితో దిష్టి తీసాడు)

నువ్విచ్చిన చీర కదా అందుకే అందంగా ఉన్నాను.

లేదు నీ వల్లే చీరకి అందం వచ్చింది. ఎందుకింత అందంగా ఉన్నావు జనని నువ్వసలు.

నీ పక్కన నేను కనబడాలంటే నీకన్నా కొంచెం అందంగా ఉండాలి కదా, లేకపోతే నువ్వే హైలైట్ అవుతావు.

( ఆరోజు పూజకి వచ్చిన సూర్య బంధువులందరూ ఆ అమ్మాయి చాలా బాగుంది తనని సూర్యకిచ్చి పెళ్ళి చేస్తే బాగుంటుందనిఅన్నవారే )

మనకి ఇష్టం ఉన్న వాళ్ళ మనసులో ఏముందో తెలీదు కదండీ.

ఒకసారి అడగండి వాళ్ళ కుటుంబాన్ని, నచ్చితే చేసుకుందాం లేకపోతే వేరేవాళ్ళని కనుక్కుందాం.

సరే రేపు వెళ్ళి మాట్లాడదాం.

(ముందుగా ఈ విషయం తెలుసుకున్న సూర్య, జననిని ఏడిపించాలని)

జనని, నాకు రేపు పెళ్ళి చూపులంట. నువ్వేమో మన గురించి చెపుదాం అంటే ఇంకొన్ని రోజులు అని పోస్టుపోన్ చేస్తూ వస్తున్నావు.

అదేంటి సూర్య? అంత సడన్గ పెళ్ళి చూపులేంటి? ఎవరా అమ్మాయి?

తెలీదు. రేపు చూసొచ్చి చెప్తాలే.

అంటే నువ్వేళ్తావా? ఇష్టం లేదని చెప్పొచ్చుగా.

ఎలా చెప్తాము, చూడకుండానే? చూసి చెపుదామని ఆగా.

ఆ అమ్మాయి నాకన్నా అందంగా ఉంటే తననే చేసుకుంటావా?

చూదాం.

( కోపం తో మూతి తిప్పుకొని జనని వెళ్లిపోయింది. తర్వాత రోజు, సూర్య వాళ్ళ కుటుంబం జనని వాళ్ళ ఇంటికొచ్చారు )

ఇలా చెప్పకుండా వచ్చాం అని ఏమనుకోకండి.

మేమేం అనుకుంటాం, మనం ఎప్పటినుంచో పక్క పక్క ఇళ్లలోనే ఉంటున్నాం కదా, మీరు ఎప్పుడైనా రావొచ్చు.

అంటే ఇది ముఖ్యమైన విషయం.

హ చెప్పండి.

పిల్లలిద్దరూ చిన్నవాళ్ళలాగానే కనపడతారు కానీ వాళ్ళు పెద్దవాళ్ళైయారు, పెళ్ళి చేయాల్సిన వయసు వచ్చేసింది.

అవును, సూర్యని చిన్నప్పటినుంచి చూస్తున్నాం. చాలా బాగా మాట్లాడతాడు, మంచివాడు.

మీ కూతురు జననిని, సూర్యకిచ్చి పెళ్ళిచేస్తారా అని అడగడానికి వచ్చాం.

తప్పకుండ, కూతురుని దూరంగా ఎక్కడికో పంపించడంకంటే మన ఇంటి పక్కనే ఉంటే ఎంతో బాగుంటుంది. కానీ పిల్లల మనసులో ఏముందో తెలుసుకోవాలిగా.

అందుకే ఒకసారి ఇద్దరినీ అలా మాట్లాడుకోమంటే సరిపోతుంది.

సరే నేను వెళ్ళి ఒకసారి పిలిచుకొస్తా.

( ఇంకా జనని నిద్రలెగవలేదు )

జనని, ఇంతవరకు నిద్రపోతే ఎలా చెప్పు. లెగు,లెగు.

ఏంటమ్మా?

నీ కోసం సూర్య వాళ్ళు వచ్చారు?

( అది వినగానే జనని ఉలిక్కి పడి లేచింది)

ఏంటి?

అవును, సూర్యకి నీకు పెళ్ళి చేదాం అనుకుంటున్నాం. ఒకసారి మీ ఇద్దరు మాట్లాడుకుని చెప్తే ముందుకి వెళ్దాము.

( జనని, సూర్య ఇద్దరు బాల్కనీ లో )

సూర్య, నిన్నంతా నేను ఎంత ఫీల్ అయ్యానో తెలుసా?

జనని, ముందే చెప్తే సర్ప్రైజ్ మిస్సయ్యేదానివిగా.

ఏం సర్ప్రైజ్?

( అలా జనని చిటపటలాడుతుంటే, సూర్య, జనని చేతిని పట్టుకుని )

నిన్ను తప్ప నేను ఇంకెవరని నాతో ఊహించుకోను. ఈ చేయిని ఎప్పటికి విడవను.

( చేతి మీద ముద్దు పెడతాడు )

థాంక్యూ సూర్య. ఐ విల్ బీ విత్యూ ఫరెవర్.

(ఇద్దరు పెళ్ళికి ఒప్పుకున్నామని వాళ్ళ పేరెంట్స్ కి చెప్పగానే పెళ్ళి పనులు మొదలు పెట్టారు. జనని వాళ్ళ అమ్మ సుమతి, తన చెల్లెలైన లలితకు ఫోన్ చేస్తుంది)

హలో లలిత ఎలా ఉన్నారు?

మేము బాగున్నాం అక్క, మీరెలా ఉన్నారు?

బాగున్నాము, జననికి పెళ్లి కుదిరింది. పదిహేనున ఎంగేజ్మెంట్కి అందరు రండి.

అవునా అక్క, చిన్న పిల్లల ఉండేది జనని. అప్పుడే పెళ్లీడుకు వచ్చేసింది. మేమంతా కచ్చితంగా వస్తాము.

(లలిత ఆనందంతో)

ఆద్య, జనని ఎంగేజ్మెంట్ అంట. మనమందరం వెళ్ళాలి.

అక్కకి పెళ్ళా? చాలా రోజులైంది అమ్మ అందరం కలుసుకుని.

(ఎంగేజ్మెంట్ రోజు)

జనని అక్క, సూర్య అన్న కంగ్రాట్యులేషన్స్.

(జనని) థాంక్యూ ఆద్య.

(సూర్య) అక్క, అన్న కాదమ్మా.

జనని అక్కైతే, మీరు బావవుతారు కదా. కంగ్రాట్యులేషన్స్ బావ.

అవును. థాంక్యూ.

అయినా ఇది అరేంజ్డ్ మ్యారేజ్ లాగ లేదే. మీరిద్దరూ ఇరవై ఏళ్ల నుంచి పక్క పక్క ఇళ్లలోనే ఉంటున్నారు. ఎలా అరేంజ్డ్ ఒప్పేసుకుంటారు?

ఆద్య నువ్వు తెలివైనదానివేలే. మేము ఏడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నాము.

అయితే బావ , అమ్మ వాళ్లందరికీ మీ ప్రేమ గురించి తెలీదా?

లేదు, మేము ప్రేమించుకున్నాం. ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేస్తున్నారు మా ప్రేమ గురించి తెలియాల్సింది వాళ్లకి కాదు. మాకు.

(అంటూ సూర్య, జనని, చేతిని పట్టుకుని, ఒకరి కళ్ళలోకి ఒకరు అలా చూస్తున్నారు)

అర్థమైంది బావ, మీ ప్రేమను ఇప్పుడు చూపించక్కర్లేదండి.

హే జనని, గుర్తుపట్టావా?

హా, నిన్నెలా మర్చిపోతాను.

ఎవరు జనని తను?

తను మిథుల్, నా బెస్ట్ ఫ్రెండ్ , నీకు చెప్తూ ఉంటానుగా సూర్య.

అవునవును. మిథుల్ తెలుసు.

హాయ్ మిథుల్, ఎలా ఉన్నావు?

బాగున్నాను సూర్య. జననిని పెళ్ళి చేసుకుంటున్నారు, ఒక సంవత్సరం అయ్యాక ఎలా ఉంటారో చూడాలి?

మిథుల్, ఓవర్ ఆక్షన్ చేయకు.

ఎదో ఊరికే. మీది లవ్ మ్యారేజ్. మీరు బాగుంటారు. ఇలాగే హ్యాపీగా ఉండాలనే కోరుకుంటున్నాను.

థాంక్యూ.

(అప్పుడు మిథుల్ ఒక బహుమతిని ఇచ్చాడు. ఒక బొమ్మ అచ్ఛం సూర్య లాగ మోకాళ్ల మీద కూర్చుని ఉంగరాన్ని ఇస్తున్నట్టు, ఇంకో బొమ్మ జనని లాగ ఆ ఉంగరాన్ని తీసుకుంటున్నట్లుగా ఉంది. అలాగే లవ్ ఈజ్ ఇన్ ఎయిర్ అని ఒక లైన్ ఆర్చ్ లాగ ఉంది)

అద్భుతంగా ఉంది మిథుల్, అసలు ఎలా చెప్పాలో అర్ధం కావట్లేదు. చాలా అంటే చాలా బాగుంది.

నీకు నచ్చుతుందనే తెచ్చా జనని. ఈవెనింగ్ పార్టీ ఇస్తున్న. మీరు కచ్చితంగా రావాలి.

కచ్చితంగా వస్తాం.

(ఈవెనింగ్ పార్టీలో)

పార్టీ నేను కదా మిథుల్ ఇవ్వాల్సింది.

నువ్వు, నేను ఒకటే కదా జనని.

(అక్కడకి సూర్య ఫ్రెండ్స్ కూడా వస్తారు)

మీరంతా వస్తున్నారని నాకు చెప్పలేదు?

మిథుల్ చెప్పొద్దన్నాడు సూర్య .

థాంక్యూ మిథుల్.

(ఆద్యకి ఒంటరిగా అనిపించి ఇంటికి వెళ్లిపోదామనుకుంటుంది)

అక్క, నేను ఇంటికి వెళ్తా. అమ్మ కాల్ చేస్తుంది.

సరే ఆద్య జాగ్రత్త.

(అని జనని పక్కకు వెళ్ళింది, కానీ అది విన్న సూర్య)

ఆగు ఆద్య, ఎలా వెళ్తావు? మాతో వచ్చావు, అందరం కలిసే వెళ్దాము.

అది కాదు బావ అమ్మ ఫోన్ చేస్తుంది.

నేను మాట్లాడతాలే, ఫోన్ ఇవ్వు.

అదేం లేదు, నాకు బోర్ కొడుతుంది.

ఓకే, ఆద్య.

నీకు నచ్చకపోతే, నువ్వెళ్ళిపోవచ్చు. కానీ ఒంటరిగా ఎలా వెళ్తావు, నా ఫ్రెండ్ అర్జున్ని పంపిస్తా.

(సూర్య, అర్జున్ని పిలుస్తాడు)

అర్జున్, తను నా మరదలు, ఆద్య. ఆద్య, తను అర్జున్. తనకి కూడా పార్టీ అంటే బోర్ ఏ.

హలో ఆద్య. నైస్ టూ మీట్యు.

హాయ్ అర్జున్. నైస్ టూ మీట్యు టూ.

సరే అర్జున్ తనని ఇంటి దెగ్గర డ్రాప్ చేసి, నువ్వు ఇంటికి వెళ్ళు.

ఓకే, సూర్య.

(ఇంటికి వెళ్తారు)

థాంక్యూ అర్జున్.

వెల్కమ్ ఆద్య.

(అర్జున్ వెంటనే వెళ్ళిపోతాడు)

ఏంటి ఆద్య నువ్వొక్కదానివే వచ్చావు, వాళ్ళేరి?

ఇంకా పార్టీ జరుగుతూనే ఉంది, నాకే బోర్ కొట్టి వచ్చేసా.

పెళ్ళికి టైం ఎక్కువ లేదు కదా, చాలా పనులున్నాయి.

(అలా పెళ్ళి పనులతో పెళ్ళి కూడా జరిగిపోతుంది, ఈ సమయంలో ఆద్య, అర్జున్ మంచి స్నేహితులవుతారు. ఆద్య ఊరెళ్లిపోయే ఆఖరి రోజు ముందుర ఈవెనింగ్, అర్జున్, ఆద్య, అభి మూన్ లైట్ డిన్నర్ కి వెళ్తారు)

ఆద్య, ఈ పైన ఆకాశం లో నక్షత్రాలు కనిపిస్తున్నాయా చూడు?

లేదు అర్జున్.

మన చిన్నప్పుడు ఇలా దాబా మీద కూర్చుని భోజనం చేసేటప్పుడు ఎన్ని నక్షత్రాలు ఉండేవో.

(అభికి ,అర్జున్ని చూస్తే చాలా డల్గా కనబడతాడు, ఇంటికి వెళ్ళేటప్పుడు)

ఆద్య, ఈరోజు అర్జున్ ఎందుకో సరిగ్గా ఉన్నట్టు లేడు. నీకేమైనా తెలుసా?

బానే ఉన్నాడు కదా.

ఏమో మరి నాకే అలా అనిపించిందేమో.

(తర్వాత రోజు మార్నింగ్, అర్జున్ ఆఫీస్ కి లేట్గా వచ్చి)

పదరా అభి కాంటీన్కి వెళదాం.

ఏంట్రా అర్జున్? ఈరోజు ఇంపార్టెంట్ క్లయింట్ మీటింగ్ ఉందని తెలుసుగా. వచ్చిందే లేటు మళ్ళా కాంటీన్ అంటావు. ఎప్పుడూ టైంకన్నా ముందే వచ్చేవాడివి. నిన్న కూడా అసలు డల్గా ఉన్నట్టున్నావు. నీకేమైంది?

ఏమని చెప్పమంటావ్ అభి. ఇది తెలియాలంటే ముందు నా ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో, నా గతం ఏంటో తెలియాలి.

చెప్పు అర్జున్.

(అర్జున్ తన కాలేజీ లైఫ్ నుంచి స్టార్ట్ చేస్తాడు, ఆరోజు రిజల్ట్స్)

అర్జున్ మళ్ళీ నువ్వే టాప్ వచ్చావు.

(అలా సిగరెట్ తో స్మోక్ రింగ్స్ చేస్తూ అర్జున్ ఒక హీరో లెవెల్ లో నడుచుకుంటూ)

మనల్ని ఎవడురా దాటేది?

పార్టీ లేదా అర్జున్?

ఈవెనింగ్ షార్ప్ సెవెన్ కి , బ్లాక్ డాగ్ వైన్స్ లో పార్టీ. తాగినోడికి తాగినంత.

(ఈవెనింగ్ పార్టీ అయ్యాక, అర్జున్ బిల్ చూసి)

ఏంట్రా ఇది? మన బిల్లేనా లేకపోతే వైన్స్ కి వచ్చిన అందరి బిల్లులు మనకే కలిపి ఇచ్చాడా?

మనదేరా.

ఇంత? నేను అసలు ఊహించలేదు. ఇప్పుడు మా నాన్నని రమ్మనాలి డబ్బులు కట్టడానికి.

నువ్వే కదరా ఎంత కావాలంటే అంత తాగండి అన్నావు.

అన్నాను కానీ మరి ఇంత అనుకోలేదు.

(అర్జున్ కాల్ చేసి చెప్పిన వెంటనే, అర్జున్ వాళ్ళ నాన్న అరవింద్, వైన్స్ కి వచ్చి బిల్ మొత్తం కట్టేసి, ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు)

చూడే వీడు, సిగరెట్లు , మందు, కొట్లాటలు అన్ని చెడ్డ అలవాట్లే. ఇలా తయారయ్యాడంటే నీ గారాబం వల్ల, నువ్వు వెనకేసుకు రావడం వల్లే.

చిన్న పిల్లోడు, వాడి తప్పేముండదులెండి. అంత ఫ్రెండ్స్ ప్రభావమే.

వాళ్ళు వీడిని పాడు చేయడం కాదు, వీడే వాళ్ళని పాడు చేస్తున్నాడు.

నేనే పార్టీ ఇచ్చా. మమ్మీ ఇచ్చిన డబ్బులు సరిపోలేదు అందుకే నిన్ను అడగాల్సొచ్చింది డాడీ.

(నెక్స్ట్ డే కాలేజీలో)

అర్జున్, అన్నిట్లో టాప్ ఉన్న నువ్వు ఎందుకు ఇలా బాడ్ హ్యాబిట్స్ తో ఫుల్ అయ్యి ఉన్నావు. అవి ఆపేస్తే బెస్ట్ స్టూడెంట్ అవుతావు కదా.

రెస్పెక్ట్డ్ ప్రిన్సిపాల్ సర్, మేము ఇక్కడ బెస్ట్ అని చెప్పుకోవడానికి రాలేదు. కాలేజీ లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి వచ్చాము.

అవును కానీ ఒక రోల్ మోడల్ లాగ ఉండాలనే కదా అనుకుంటాము.

సర్, వాళ్ళని, వీళ్ళని చూసి ఎందుకు. ఎవరికీ నచ్చినట్టు వాళ్ళు బతికితే చాలు.

(ఇలా ఉన్న అర్జున్ ఒక రోజు బైక్ మీద వెళ్తుంటే, ఒక వైట్ చుడిదార్ వేసుకున్న అమ్మాయి తనని క్రాస్ చేస్తుంది)

ఏంటి నాకన్నా ఫాస్ట్గ వెళ్తుంది ఎవరు తనసలు?

(అని అనుకుంటూ అర్జున్ తనని క్రాస్ చేస్తాడు, మల్లి తను అర్జున్ని క్రాస్ చేస్తుంది. అలా అర్జున్ ఆ అమ్మాయిని ఫాలో అవుతూ ఒక స్పోర్ట్స్ క్లబ్కి వెళ్తాడు. అక్కడ ఆ అమ్మాయి షటిల్ ఆడుతువుంటుంది)

ఒకసారి అటు చూడు ఫాతిమా, ఆ అబ్బాయి ఎవరో నన్నే ఫాలో అవుతూ ఇక్కడి దాకా వచ్చాడు. ఇప్పుడు కూడా నన్నే చూస్తున్నాడు.

అలా ఏమి అయ్యుండదు రజియా, తను కూడా ఇక్కడికే రావాలనుకున్నాడేమో. అందరూ మనల్నే చూస్తున్నారనుకుంటే అందరిని గమనిస్తూ ఉండాల ఏంటి?

కానీ ఎందుకో అలా అనిపించింది, సరే వదిలేద్దాం.

(అర్జున్ అటుగా వెళ్తున్న అమ్మాయిని పిలిచి)

హలో మిస్. అక్కడ వైట్ చుడిదార్లో షటిల్ ఆడుతుంది కదా, తన పేరేంటి?

రజియా, అయినా మీకెందుకు?

అంటే తను నా స్కూల్ ఫ్రెండ్. ఎక్కడో చూసినట్టు అనిపించింది, పేరు గుర్తులేదు. ఒకసారి తను ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా.

అదేదో మీరే అడిగి తెలుసుకోవచ్చుగా.

అంటే చెప్పా కదా, పేరు కూడా గుర్తులేదని. కొంచెం తన గురించి తెలుసుకుని ఉంటె ఈజీగ మాట్లాడొచ్చని.

ఓకే, రజియా ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్. స్పోర్ట్స్ అంటే తనకి చాలా ఇంటరెస్ట్. నేషనల్ లెవెల్ లో సిల్వర్ వచ్చింది. ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్దాము అనుకునేటప్పటికీ వాళ్ళ నాన్న తనకొక పెళ్లి సంబంధం తీసుకొచ్చారు. స్పోర్ట్స్ ఆపేయమన్నారు. మూడు నెలల్లో తనకు పెళ్లి. అంతేనా ఇంకేమైనా కావాలా?

థాంక్యూ చెప్పినందుకు. నేను వెళ్లి తనతో మాట్లాడతాను.

(అలా అర్జున్ని చూసిన రజియా)

ఫాతిమా వాళ్లిద్దరూ నా గురించే మాట్లాడుతున్నారనిపిస్తుంది, అతను ఇటు వైపే వస్తున్నాడు.

వస్తే చూసుకుందాం.

హలో రజియా.

హే మిస్టర్, ఎవరు నువ్వు. నీకెలా తన పేరు తెలుసు?

ఆగండి, మీతో మాట్లాడలేదు కదా. మీరెందుకు మధ్యలోకి వస్తున్నారు?

మీరెవరు? ఎందుకు నన్ను ఫాలో అవుతున్నారు?

రజియా, ఐ లవ్ యు.

సారీ, నాకు ఆల్రెడీ పెళ్లి సెట్ అయ్యింది.

తెలుసు, అయినా మూడు నెల్లలు టైం ఉంది. ఈ మూడు నెలల్లో నీకు నేను నచ్చొచ్చుగా.

అలా ఎలా అవుతుంది, నాకు నువ్వెవరో కూడా తెలీదు?

నా పేరు అర్జున్, నేను బి టెక్ ఫైనల్ ఇయర్. నేను ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్న ఇంటర్న్ గా. నెక్స్ట్ మంత్లో అది పెర్మనెంట్ అవుతుంది. నెలకి రెండు లక్షల జీతం. నేను ఎప్పుడు నిన్ను ఇది చేయమని ఫోర్స్ చేయను, నీకు నచినట్టే ఉండు. ఇంటర్నేషనల్ లెవెల్ లో పార్టిసిపేట్ చేదాం అనుకుంటున్నావు కదా. నేను నీకు సపోర్ట్ చేస్తా.

నేను నిన్నెందుకు లవ్ చేయాలి?

ఎందుకంటే ఇప్పటి దాకా నీకు సపోర్ట్ ఎవరు లేరని నాన్న చెప్పినట్టే చేస్తున్నావు. నీ ఆశయాలని చెప్పలేకపోతున్నావు. నేను ఉన్న నీకు. నువ్వు ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. నీకు నచ్చినట్టుగా నువ్వుండు.

(అర్జున్ చెప్పిన మాటలు రజియాకి నచ్చినట్టు అనిపించింది. అలా అర్జున్, రజియా రోజు మాట్లాడుకునేవారు. ప్రేమలో పడ్డారు. రజియా కోసం బాడ్ హబిట్స్ అన్ని వదిలేసాడు అర్జున్. రజియా పెళ్లి దెగ్గరపడింది)

అర్జున్, ఇంకో వారంలో పెళ్లి. నాకేం అర్ధం కావట్లేదు. నెక్స్ట్ మంత్ టెస్ట్ మ్యాచ్ ఉంది.

నువ్వేం కంగారు పడకు రజియా, నేను మీ నాన్నతో మాట్లాడతాను.

(అర్జున్, రజియా వాళ్ళ నాన్నతో మాట్లాడటానికి ఇంటికి వస్తాడు)

హలో అంకుల్. నా పేరు అర్జున్. నేను, రజియా ప్రేమించుకుంటున్నాము. రజియా ఇంటర్నేషనల్ లెవెల్ లో ఆడాలనుకుంటుంది. నేను తనకి సపోర్ట్ చేస్తాను, మీరు కూడా తనకు నచ్చినట్టుగా వదిలేస్తారని కోరుకుంటున్న.

ఎవడ్రా నువ్వు మా ఇంటికొచ్చి ఇంకో ఆరు రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి గురించి ఇష్టం వాచినట్టు మాట్లాడుతున్నావు. రజియా నా మాట కాదని ఏది చెయ్యదు. ఊరికే కథలు చెప్పకు.

ఒకసారి, రజియాని పిలవండి అంకుల్. మీకే తెలుస్తుంది. రజియా, రజియా.

అప్ప, నాకు అర్జున్ ఇష్టం. నేను ఇంటర్నేషనల్ లెవెల్ లో ఆడాలనుకుంటున్నాను.

రజియా, నీకు ఇంకో వారంలో పెళ్లి ఉందని తెలుసు. ఆయినా నువ్వెందుకు ఇప్పుడు చెప్తున్నావ్.

అప్పుడు నాకు బయమేసింది, అప్ప. అర్జున్, నాకు దైర్యం ఇచ్చాడు.

ఇప్పుడు నువ్వు చెప్పిన జరిగేది నేను మార్చను.

అంకుల్, ఇలా మూర్ఖంగా ఆలోచించకండి. రజియాకి నచ్చకుండా మీరు ఇదంతా చేసి ఎలా సంతోషంగా ఉంటారు?

తనకి ఇదే రైట్, అదంతా జరగదు. నీతో ఉంటె ఆనందంగా ఉంటుందని నువ్వనుకుంటే సరిపోదు, నాకు నేను తెచ్చిన వాడితో ఆనందంగా ఉంటుందని తెలుసు. అతన్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్న.

(అర్జున్ని బయటకు గెంటేస్తారు, రజియా ఏడుస్తుంది)

అప్ప, నాకు అర్జున్ అంటేనే ఇష్టం.

రజియా, నా మాట విను. అతను నీకు కరెక్ట్ కాదు.

లేదు అప్ప.

నువ్వు వినకపోతే అర్జున్ మీద ఎటాక్ చేపిస్తా.

(ఎప్పుడు కలుసుకునే స్పోర్ట్స్ క్లబ్ దెగ్గరికి ఇద్దరు వస్తారు)

అర్జున్, ఇక ఇది ఆపేద్దాం.

రజియా, అలా అనకు. నేను నిన్ను మర్చిపోలేను. నువ్వు నాతో వచ్చేయి. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదాం .

నీ ఫామిలీ, జాబ్ అన్ని ఇక్కడే ఉన్నాయి.

నీకన్నా ఏవి నాకు ఎక్కువ కాదు.

లేదు అర్జున్, నీ మీద నాకు ప్రేమ లేదు. ఇది ఇష్టం మాత్రమే.

నిజం చెప్పు రజియా. నా కళ్ళలోకి చూసి చెప్పు.

(అర్జున్, రజియా ఒకేచోట ఉన్నారని తెలుసుకున్న రజియా వాళ్ళ నాన్న గన్ తో వస్తారు)

రజియా , ఇదే ఆఖరి సారి అడుగుతున్న. నేను చెప్పేది వింటావా లేదా?

వింటాను అప్ప, అర్జున్ని ఏమి చేయకండి.

అతన్ని మర్చిపో, వచ్చి పెళ్లి చేసుకో.

అది చెప్పడానికే వచ్చా అప్ప.

రజియా నువ్వేమి బయపడకు. దైర్యంగా ఉండు. నేను చూసుకుంటా.

ఏంట్రా నువ్వు చూసుకునేది?

అర్జున్, నువ్వు నాకు వద్దు.

విన్నావుగా, ఇక పద రజియా.

(రజియా చేయి పట్టుకుని అర్జున్ ఆపేస్తాడు)

వదులు అర్జున్. నన్ను మర్చిపో, ప్లీజ్.

(కోపంలో రజియా వాళ్ళ నాన్న గన్ తో షూట్ చేస్తాడు, అప్పుడు రజియా అడ్డంగా నిలబడుతుంది. బులెట్ రజియా మెదడులోకి వెళుతుంది. వెంటనే రజియాని హాస్పిటల్ కి తీసుకువెళతారు. రజియా కోలుకుంటుంది కానీ తనకి ఏమి జ్ఞాపకం లేదు. రజియా వాళ్ళ నాన్న, ఆ గన్ ఫైర్ చేసింది అర్జున్ అని తనని జైలు లో పెట్టిస్తాడు. అర్జున్ జైలు నుంచి రిలీజ్ అయ్యేసరికి రజియాకి పెళ్ళైపోతుంది)

ఎందుకు అర్జున్ మాకు ఇవేమి చెప్పకుండా, నువ్వొక్కడివే బాధపడుతున్నావ్?

ఇప్పుడు కూడా చెప్పాలనుకోలేదు కానీ మొన్న ఆద్య చూపించిన ఫోటోస్లో రజియాను చూసా. తను ఆద్య వాళ్ళ పక్కింట్లోనే ఉంటుందంట. తన భర్త ఆక్సిడెంట్లో చనిపోయాడంట. తనకొక పాప ఉంది తన పేరు మథుర అని ఆద్య చెప్పింది. ఆ పేరును నేను, రజియా పెళ్లి చేసుకున్నాక మాకు పాప పుడితే పెడదాం అనుకున్నాము.

అంటే రజియాకి గతం గుర్తొచ్చిందా?

తెలియట్లేదు అభి. ఆద్య ఈరోజు వెళ్ళిపోతుంది, నాకు వెళ్లాలని ఉంది. వెళ్లి రజియాని కలవాలని, తనతో మాట్లాడాలని ఉంది.

నువ్వేం చేయాలనుకుంటున్నావ్ అర్జున్?

నేను జాబ్ మానేదాం అనుకుంటున్నా.

ఎందుకు అభి, ఒకసారి కలిసి రావడానికి జాబ్ మానేయాలా?

లేదు, తనతోనే ఉండాలనిపిస్తుంది. మనకు నచ్చినట్టు బతకడమే జీవితం అనుకున్న కానీ ఇప్పుడు తనకోసం నేను జీవిస్తుంటే తెలుస్తుంది తనతో జీవిస్తే ఇంకెంత బాగుంటుందోనని.

ఒకసారి ఆలోచించు అర్జున్.

చాలా ఆలోచించ అభి. నేను వెళ్తున్న అది చెప్పడానికే ఈరోజు వచ్చా.

(అర్జున్, ఆద్య కి కాల్ చేస్తాడు. తను లిఫ్ట్ చేయదు, మల్లి కాల్ చేస్తూనే ఉంటాడు)

ఆద్య, ఎక్కడి దాకా వచ్చిందేంటి? అర్జున్ అసలు ఆపకుండా నీకు కాల్ చేస్తూనే ఉన్నాడు.

అదేం లేదు జనని అక్క, ఈరోజు వెళ్ళిపోతున్నాను కదా, జస్ట్ సెండాఫ్ చెప్పడానికి అంతే.

అంతే అంటారులే, మాకు తెలీదా ఏంటి. సూర్య చెప్తుంటాడు అర్జున్ గురించి. ఇంత తక్కువ రోజుల్లో అర్జున్ ఎవరికీ అంత దెగ్గర కాడు.

నువ్వనుకుంటుందేమి కాదు. మా అభిప్రాయలు కొన్ని మ్యాచ్ అయ్యుండచ్చు అందుకే త్వరగా ఫ్రెండ్స్ అయ్యాం. సరే ముందు కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడతా నువ్వే విను.

(ఆద్య కాల్ లిఫ్ట్ చేస్తుంది)

హలో అర్జున్, ఏమైంది కాల్ మీద కాల్ చేస్తున్నావ్?

ఎక్కడ ఆద్య, బయల్దేరావ?

లేదు, ఇంకో వన్ అవర్లో స్టేషన్ కి వెళ్తాము.

ఆద్య, నేను కూడా నీతో వస్తా.

అదేంటి, నాతో రావడం?

(పక్కనుంచి జనని)

ఏంటి ఆద్య అర్జున్ నీతో వస్తానంటున్నాడు? నాకు చెప్పలేదు నువ్వు.

నాకే తెలీదు అక్క.

ఉండు ఏం చెప్తాడో విందాం.

ఆద్య, నేను కొన్ని రోజులు సబ్బటికల్ లీవ్ పెట్టా. కొన్ని రోజులు మీ ఊర్లో పని ఉంది, అందుకే నీతో వద్దాం అని అనుకుంటున్నా. నీకేం ప్రాబ్లెమ్ లేదు కదా?

(ఇప్పుడు నో అంటే అక్క ఏం అంటుందో, ఓకే అంటే ఏమంటుందో? అయినా మనకి ఏం ఫీలింగ్ లేనప్పుడు, వేరే వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి. సరే అని చెపుదాం)

నాకేం ప్రాబ్లెమ్ లేదు అర్జున్.

ఆహా ఆద్య, అర్జున్ కి నీ మీద ఏం ఇంటరెస్ట్ లేదనుకుంటున్నావా?

అవును లేదు. తను వర్క్ నుంచి బ్రేక్ తీసుకోవాలని అనుకున్నాడు. లీవ్ పెట్టాడు. మా ఊర్లో తన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారేమో అందుకే నాతో పాటు వద్దాం అని అనుకున్నాడు అంతే.

(అలా ఆద్య, అర్జున్ ఊరెళ్తారు)

ఆద్య, నువ్వేం అనుకోకపోతే ఒక హెల్ప్ చేస్తావా?

ఏమైంది అర్జున్, చెప్పు చేస్తా?

నాకు ఒక రూమ్ వెతికిపెట్టగలవా?

(ఆద్య వాళ్ళ అమ్మ విని)

ఎందుకు అర్జున్, నువ్వు మా ఇంట్లో ఉండు?

వద్దు ఆంటీ, మల్లి మీకెందుకు ఇబ్బంది.

కాదు అర్జున్, నువ్వు మాకు హెల్ప్ చేసావు. మా ఊరు వచ్చి నువ్వు ఇబ్బంది పడటమేంటి? నువ్వు మాతోనే ఉంటున్నావు అంతే. నీ వర్క్ కంప్లీట్ చేస్కునే వరకు ఉండు. మేమేమి డిస్టర్బ్ చేయము.

థాంక్యూ ఆంటీ.

(ఇంటికి వెళ్ళాక అర్జున్, ఆద్య చుట్టూ తిరుగుతువుంటాడు. అప్పుడే మధుర ఆద్య వాళ్ళ ఇంటికి వస్తుంది)

ఎవరు ఆద్య అక్క ఇతను?

మథుర, తను అర్జున్, నా ఫ్రెండ్.

హలో అంకుల్ నైస్ టూ మీట్ యు.

హాయ్ మథుర, నైస్ టూ మీట్ యు టూ.

ఆద్య అక్క బిజీ గా ఉన్నావా? అంకుల్, ఇది చూడండి నేనే వేసా బొమ్మ ఎలా ఉంది?

(టెన్నిస్ లో గోల్డ్ మెడల్ గెలుచుకున్న అమ్మాయి బొమ్మ)

వావ్ ఆద్య చాలా బాగా వేసావు. ఇంకా ఇలాంటివి ఏమైనా ఉన్నాయా?

బోలెడున్నాయి, మా ఇంటికి రండి.

(అంటూ మథుర అర్జున్ చేతిని పట్టుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది, వెళ్లే దారిలో అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. రజియా తనని గుర్తుపడుతుందా లేకపోతే ఏమంటుందో అని సతమతమైపోతున్నాడు )

ఇదిగోండి అంకుల్ ఇది చూడండి, ఇది చూడండి. ఎలా ఉన్నాయ్?

చాలా బాగున్నాయ్ మథుర.

(తన రూంలో టెన్నిస్ రాకెట్ని చూస్తాడు అర్జున్)

టెన్నిస్ బాగా ఆడతావా మథుర?

ఓ, మా స్కూల్ లో నేనే ఫస్ట్.

(అప్పుడే రజియా రూమ్ లోకి వస్తుంది)

మథుర ఏంటి నీ అల్లరి, ఈ పాపేర్లన్ని ఇలా పడేశావు.

సారీ మా,ఈ అంకుల్ ఆద్య అక్క వాళ్ళ ఇంటికి వచ్చారు, పేరు అర్జున్.

(రజియా, అర్జున్ వైపు చూసింది)

ఏమనుకోకండి మథుర అందరితో త్వరగా కలిసిపోతుంది.

(రజియాను చూసాక, ఒక నిమిషం అర్జున్ కి ఏమి వినబడలేదు)

పర్లేదండి. నేను వెళ్తాను.

(అంటూ కంట నీరుని లోపల అణచిపెట్టి బయటకు వచ్చేసాడు అర్జున్)

ఎందుకు రజియా? ఇలా నాకే ఎందుకు జరగాలి? రజియాకి నేను గుర్తేలేను.

(ఆద్య, అర్జున్ అర్జున్ అంటూ పిలుచుకుంటూ వస్తుంది, అక్కడ అర్జున్ కనపడతాడు)

ఏంటి అర్జున్ ఇక్కడేం చేస్తున్నావ్?

(కంట నీరుని తుడుచుకుని, ఆద్య వైపుకి తిరిగి)

ఏమి లేదు ఆద్య. మథుర టెన్నిస్ బాగా ఆడుతుందని చెప్పింది.

అవును అర్జున్, తను చిన్నపిల్లయినప్పటికీ నన్ను కూడా ఓడిస్తుంది.

మథుర ఏమైనా ట్రైనింగ్ తీసుకుంటుందా?

లేదు, రజియా ఆడిపిస్తుంది అంతే. ఇంకో ఐదేళ్లాగితే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడొచ్చు.

అదే కదా, నేషనల్ లెవెల్ ప్లేయర్ని ఉంచుకుని మల్లి ట్రైనింగ్ ఎందుకు.

రజియా నేషనల్ లెవెల్ ప్లేయర్ అని నీకెలా తెలుసు అర్జున్, నాకే తెలీదు?

అంటే అది.

(అని అర్జున్ చెప్పేలోపల రజియా వస్తుంది)

ఆద్య ఎలా జరిగింది పెళ్లి?

హా బాగా జరిగింది రజియా.

మరి నీ పెళ్ళెప్పుడు?

(అలా వాళ్లిద్దరూ మాట్లాడుతుంటే అర్జున్ లోపలకి వెళ్ళిపోతాడు)

ఇంకా చాలా టైం ఉందిలే రజియా.

అర్జున్, నువ్వు ఏమైనా?

లేదు, తను ఫ్రెండ్ మాత్రమే. కొన్ని రోజులు పని ఉంటె మా ఇంట్లో ఉండమన్నాము.

(ఎలాగైనా రజియాకి దెగ్గర కావాలి, అది మథురతోనే సాధ్యమవుతుంది. తర్వాత రోజు)

హే మథుర స్కూల్కేగ?

అవును అంకుల్.

పద నేను డ్రాప్ చేస్తాను.

మా, వెళ్ళనా?

అర్జున్, మీకెందుకు శ్రమ?

అదేం లేదు, నేను అటు వైపే వెళ్తున్న.

సరే మథుర, వెళ్ళు.

(అలా అర్జున్, మథుర స్కూల్కి వెళ్తారు)

మథుర, నీకేమంటే ఇష్టం?

ఈ సిటీ అంత తిరగడం అంటే ఇష్టం.

మరైతే తిరిగొద్దామా?

అమ్మో, మాకి తెలిస్తే అంతే. అసలు ఒప్పుకోదు, స్కూల్ మానేశానంటే తిడుతుంది.

సరే నీకు నైట్ రైడ్ ఇష్టమా?

చాలా ఇష్టం.

(నాకు తెలుసు, రజియాకి కూడా నైట్ రైడ్ అంటే చాలా ఇష్టం)

అంకుల్, ఏంటి ఆలోచిస్తున్నారు?

సరే అందరు నిద్రపోయాక, నైట్ రైడ్ కి వెళ్దాము.

థాంక్యూ అంకుల్.

(ఆద్య రోజు ఆఫీస్ కి వెళ్లి వస్తుంది. ఆరోజు ఆద్య ఇంటికి రావడానికి లేట్ అయ్యింది)

ఎంత కంగారుపడ్డామో తెలుసా ఆద్య. ముందే లేట్ అవ్వుద్దని ఫోన్ చేసి చెప్పొచ్చుగా. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది.

తెలీదు అర్జున్ లేట్ అవుతుందని, అప్పటికి ఫోన్ చేసి చెపుదాం అనేసరికి స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఈసారి అలా ఏమి అవ్వకుండా చూస్తా.

మాకన్నా అర్జునే ఎక్కువ కంగారుపడ్డాడు ఆద్య.

సరే అందరం నిద్రపోదాం, లేట్ అవుతుంది.

(అందరు నిద్రపోయాక, అర్జున్, మథుర కలిసి బాగా ఎంజాయ్ చేస్తారు. అప్పుడు 12 అవుతుంది. మథుర బర్త్డే అని తెలిసిన అర్జున్ తన కోసం చాలా బాగా డెకరేట్ చేసి సుర్ప్రైస్ చేస్తాడు)

హ్యాపీ బర్త్డే మథుర.

థాంక్యూ సో మచ్ అంకుల్. అసలు నేను ఇది ఊహించలేదు. అయినా నా బర్త్డే మీకెలా తెలుసు?

ఆద్య చెప్పింది. ఇంకేం కావాలో చెప్పు?

అంకుల్ మీకొకటి చెప్పాలి, ఆద్య కోసం ఒక హెల్మెట్ పెట్టుకుని వచ్చే అంకుల్ నా బుగ్గల్ని, పెదవుల్ని, చేతుల్ని తడుముతూ.

అర్థమైంది మథుర నేను చూసుకుంటా, నీ ముందే తనకి బుద్ధోచ్చేటట్టు చేస్తా. ఈసారి వస్తే నాకు చెప్పు.

(తర్వాత రోజు ఇంటి దెగ్గర బైక్ మీద హెల్మెట్ పెట్టుకున్న అబ్బాయితో ఆద్య మాట్లాడి పైకి వస్తుంది)

ఎవరు ఆద్య?

నాతో వర్క్ చేసేవాడే అర్జున్.

మరి పైకి రమ్మనకుండా కిందే మాట్లాడుకున్నారెందుకు?

ఎందుకులే పైకి అని.

(ఆద్య లోపాలకి వెళ్తుంది, అప్పుడు మథుర వచ్చి)

అంకుల్, అతనే.

అవునా, పద మథుర.

(అతన్ని అర్జున్ బైక్ మీద నుంచి దిగామని చెప్పి, చిన్నపిల్లల్ని చూస్తే ఎలా అలా చేయాలనిపిస్తుంది అని కొడతాడు అర్జున్, ఈసారి ఇటు వైపొస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు అంటూ ఉంటె అది ఆద్య చూసి లోపలకి వెళ్లిపోతుంది)

ఈసారి ఇలా చేయకూడదని నువ్వే తిరిగి ఎదురుచెప్పాలి, మథుర. ఇప్పుడు హ్యాపీ ఆ?

చాలా. నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. కానీ మా ఎప్పుడు తీసుకేల్లదు. అప్పుడప్పుడు ఆద్య అక్కతో వెళ్తున్న అని చెప్పి సినిమాకి వెళ్తాము.

సరే ఈరోజు వెళ్దాము.

మరి ఆద్య అక్క ఉండాలిగా?

అది నాకొదిలేయ్ నువ్వెళ్ళి రెడీ అవ్వు.

(అర్జున్, ఆద్య దెగ్గరకు వెళ్లి)

ఆద్య ఈరోజు మూవీ కి వెళ్దాము, మథుర ని కూడా రమ్మందాం. రజియాతో నువ్వు మాట్లాడాలి కదా.

ఓకే అర్జున్, కానీ.

(ఇప్పుడు అర్జున్, తనని ఎందుకు కొట్టాడో అని అడగాలా? ఒకవేళ అడిగితే అర్జున్ ఏమని చెప్తాడు? నేను తనతో మాట్లాడటం అర్జున్ ఏమైనా పొసెసివ్ ఫీల్ అవుతున్నాడా? నా మీద ఏమైనా? అదేం లేదులే)

ఏమైంది ఆద్య?

ఏమి లేదు అర్జున్, వెళదాం. నేను వెళ్లి రజియాతో మాట్లాడొస్తా.

(అలా ముగ్గురు సినిమాకి వెళ్తారు, ఆద్య పక్కన అర్జున్, అర్జున్ పక్కన మథుర కూర్చుని ఉంటారు)

మథుర ఇక్కడ మధ్యలో కూర్చో.

వద్దు ఆద్య, మథురాని ఇటు పక్కనే కుర్చోపెడదాం.

(అర్జున్ నాపక్కన కూర్చావాలని అనుకుంటున్నాడా? అడగకుండానే అన్ని చేస్తున్నాడు)

ఆద్య ఏంటి ఆలోచిస్తున్నావు?

ఏమి లేదు అర్జున్.

(ఆ తర్వాత బయట తినేసి ఇంటికి వెళ్తారు)

(జనని కాల్ చేస్తుంది ఆద్యకి)

ఏంటి జనని ఇప్పటికైనా నిజం చెప్తావా లేదా?

దేని గురించి అక్క?

అదే నీకు, అర్జున్ కి మధ్యలో ఎం జరుగుతుందని?

(ఇప్పటి దాకా జరిగందంతా చెప్తుంది ఆద్య)

అక్క, ఇది ప్రేమేనంటావా?

అవును ఆద్య ఇప్పటికైనా అర్థమైందా నీకు.

మరి అర్జున్ నాతో డైరెక్ట్గా ఏమి చెప్పలేదు అక్క.

తను చేసే పనులు కనపడుతున్నాయి కదా.

అయితే నేనే అడగనా మనిద్దరి మధ్య ఏముందని?

ముందు నువ్వు అర్జున్ని ప్రేమిస్తున్నావా లేదో చెప్పు?

అంటే అక్క, చెప్పాలంటే అర్జున్ నా పక్కన ఉంటె బాగుంటుంది.

అయితే నువ్వే చెప్పు.

(ఆద్య ఎలా అర్జున్ కి చెప్పాలని ఆలోచిస్తుంది, అప్పుడే అర్జున్ వస్తాడు)

ఏంటి ఆద్య అలా ఉన్నావ్?

నేనొకటి చెప్పాలి అర్జున్.

ఏంటది ఆద్య?

చెప్పడం కాదు, అడగాలి.

ఏంటో అడుగు?

సరే నువ్వేం మాట్లాడకు, నేను చెప్పేది విను. నేను ఇటు వైపు తిరిగి ఉంటా. నేను మొత్తం అయ్యాక నీ వైపు తిరుగుతా, అప్పుడు నువ్వు మాట్లాడు, సరేనా?

సరే ఆద్య.

అర్జున్, నువ్వు నాతో పాటు మా ఊరు వచ్చావు. మా ఇంట్లోనే ఉన్నావు.

(అర్జున్, మథుర పిలిచిందని బయటకు వెళ్తాడు)

ఎవ్వరికి దెగ్గర కానీ నువ్వు నాకెందుకు దెగ్గరయ్యావు? నేను ఇంటికి లేట్ గా వస్తే కంగారు పడ్డావు, వేరే అతనితో మాట్లాడితే అతన్ని కొట్టావు, నేను అడగకుండానే సినిమాకి తీసుకెళ్ళావు, బయట డిన్నర్ చేసాము. నీతో ఉంటె నాకు చాలా బాగుంటుంది. ఇలా నాకోసం నువ్వెందుకు ఇవన్నీ చేస్తున్నావు? ఇదంతా ప్రేమనే అంటావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అంటే, నేను నిన్ను ప్రేమిస్తున్న అర్జున్.

(అని చెప్పి ఆద్య ఇటు వైపు తిరుగుతుంది, అప్పుడు అర్జున్ కనపడడు. ఇదంతా రజియా వింటుంది. రజియా కంట్లో నీరు తిరుగుతుంటుంది. ఆద్య, అర్జున్ కోసం వెతుకుతుంది, మథురతో ఆడుతూ కనిపిస్తాడు)

అర్జున్, అర్జున్.

ఏంటి ఆద్య?

నేను చెప్పింది విన్నావా అసలు?

(మల్లి వినలేదంటే ఆద్య ఏమంటుందో)

హా విన్నాను ఆద్య.

అయితే నేను చెప్పినదానికి ఏమంటావో చెప్పు.

(ఏమనిన్ది ఆద్య అసలు, తనతో వాళ్ళ ఉరికి వచ్చా, వాళ్ళ ఇంట్లోనే ఉన్న, అంతే కదా. అవును అనే అందాం)

అవును ఆద్య.

నిజంగానే?

హ నిజంగా.

(ఆద్య సంతోషంలో తేలిపోతుంటుంది. రజియా చాలా బాధపడుతుంది)

అంకుల్, మీతో మా ఎదో మాట్లాడాలి అని అన్నారు.

అవునా, ఎక్కడున్నారు?

ఇంట్లోనే.

సరే నేను వెళ్లి మాట్లాడతా.

(అర్జున్, రజియా కోసం వెతుకుతాడు)

రజియా, మాట్లాడాలన్నారంట కదా.

(రజియా కంటి నీరుని దాచిపెట్టి)

ఏమి లేదు అర్జున్, మథుర అన్ని చెప్పింది. మీరు మథుర కోసం చాలా చేశారు. ఎందుకు అని నేనేమి అడగను. ఇకపై ఇలాంటివేవీ చేయకుండా, కొంచెం మథురకు దూరంగా ఉంటె బాగుంటుంది.

(ఇది విన్న అర్జున్, ఎందుకు రజియా నాకు దూరం కావాలనుకుంటున్నావు. నేను రజియా, నీ అర్జున్ ని! ఎప్పటికి, నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటా)

ఎందుకు మీరు ఇలా అంటున్నారు? మథుర హ్యాపీగానే ఉంది కదా.

మథుర, వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు చాలా రోజులు బాధపడింది. మీరు వచ్చాక తనలో చాలా సంతోషాన్ని చూసాను. మీరు మీ ఊరెళ్ళిపోతే మిమ్మల్ని మిస్ అయ్యాను అనే ఫీలింగ్ ఉండిపోతుంది. తను బాధపడుతుంది. అది నేను చూడలేను.

(ఇప్పుడు రజియాకి చెప్పేస్తా, నేను తనతోనే ఉంటానని)

రజియా, నేను నీతోనే..

(ఆద్య వస్తుంది)

అర్జున్, పద నేను అంత చెప్పేసాను. నువ్వు కూడా ఒకసారి చెప్పు అప్పుడే ఇంకా నమ్మకం వస్తుంది.

దేని గురించి?

రా అర్జున్.

(అర్జున్ ని లాక్కుని వెళ్తుంది)

అమ్మ, నాన్న. మీకు తెలుసు కదా అర్జున్ గురించి. తను, నేను ప్రేమించుకుంటున్నాము. ఇదిగోండి, అర్జున్ కూడా చెప్తాడు.

ఆద్య, ఏంటి నువ్వుంటుంది? నాకేమి అర్థంకావట్లేదు.

నువ్వే కదా అర్జున్ అడిగితే అవును అన్నావ్. ఇప్పుడేంటి అర్థంకావట్లేదంటున్నావ్, జోక్ చేయకు.

లేదు ఆద్య, నిజమే చెప్తున్నా. నేను, నిన్ను ప్రేమించట్లేదు.

అంటే నేను పొద్దున్న చెప్పింది నువ్వు వినలేదా? మరి, ఎవరిని ప్రేమిస్తున్నావ్?

లేదు. నువ్వేం చెప్పావో నాకు తెలీదు.

సరే ఇప్పుడడుగుతున్న, అసలు నువ్వెందుకు నాతో ఈ ఊరొచ్చావు? మా ఇంట్లోనే ఎందుకు ఉన్నావు?

(అప్పుడే రజియా వస్తుంది, రజియా కోసమే వచ్చానని చెప్తే ఇప్పుడు రజియా కు నాకు జరిగిన గతం చెప్పాలి కానీ రజియా నన్ను కాదంటే నేను తట్టుకోలేను)

నేను ఇప్పుడు చెప్పలేను ఆద్య.

లేదు అర్జున్, ఇప్పుడే చెప్పాలి.

నా వల్ల కాదు, ఆద్య. నేనేం చెప్పిన నువ్వు వినే పరిస్థితుల్లో లేవు.

అయితే వెళ్ళిపో అర్జున్.

ఆద్య?

అవును అర్జున్.

(అంటూ ఆద్య ఏడుస్తూ లోపాలకి వెళ్ళిపోతుంది)

సారీ అంకుల్, ఆంటీ. నేను ఆద్యని బాధపెట్టాలని అనుకోలేదు.

పర్లేదు అర్జున్, తను చిన్నపిల్ల. తన మాటలేమి పట్టించుకోకు.

లేదు, నేను వెళ్ళిపోతాను. ఇన్ని రోజులు నన్ను చాలా బాగా చూసుకున్నారు. థాంక్యూ సో మచ్.

అంకుల్ మీరు వెళ్లిపోతున్నారు?

లేదు మథుర నేను పక్కన ఇక్కడైనా ఉంటాను. నీకోసం వస్తూనే ఉంటాను.

అర్జున్, తనేదో ఊరికే అనింది, సీరియస్గా తీసుకోకు.

లేదాంటీ, నాకే ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. నేను వేరే దెగ్గర ఉంటాను. ఇంకేం చెప్పకండి.

(రజియా, ఆద్య రూమ్ కి వెళ్తుంది)

బాధపడకు ఆద్య.

నేను తను ప్రేమించనందుకు కాదు బాధపడేది, నేను ఎలా ఇలా తప్పుగా తను ప్రేమిస్తున్నాడని అనుకుని ఇంతలా చేశానని తలచుకుంటేనే ఏదోలా ఉంది.

నీకు నేను చాలా సార్లు చెప్పాలనుకున్న కానీ చెప్పలేకపోయాను.

ఏంటది రజియా?

నాకు ఫారూఖ్ కి పెళ్లైనప్పుడు మేము చాలా చోట్లకి వెళ్లాం. బాగా ఎంజాయ్ చేసాం. అలా మేము చూసిన ప్రదేశాలని, వాటిలో ఉన్న మెమోరీస్ ని రాయడమంటే నాకు చాలా ఇష్టం. నేను రాసేది ఫారూఖ్ కూడా చదివేవాడు.

(అలా రజియా చెప్తూ ఉంటుంది)

రజియా, ఈరోజేం రాసావు?

లేదు ఫారూఖ్ ఈరోజు నేనేమి రాయలేదు?

ఎందుకు? కోపంగా ఉన్నట్టున్నారు.

లేదు, ఈరోజేంటో అసలు మీకు గుర్తుందా ఏంటి?

(అలా రజియా చేతిలో బుక్ లాక్కుందాం అని ఫారూఖ్ ప్రయత్నిస్తాడు, బుక్ లాక్కుంటాడు, కోపంగా రజియా వెళ్లి తలుపు డోర్ వేసుకుంటుంది, బుక్లో-ఈరోజు మన పెళ్లి రోజు కొంచెం కూడా గుర్తులేదు. కాల్ చేస్తేనేమో మీ ఆఫీస్ కొలీగ్ రష్మీ ఎత్తుతుంది నాకు చాలా మండిపోతుంది. అని ఉంటుంది)

రజియా, కోప్పడకు తలుపు తీయి. నీ కోసం సారీ తీసుకురావడానికి తన హెల్ప్ తీసుకున్న. అయినా తను నీతో మాట్లాడిందని నాకు తెలీదు. ప్లీజ్, నన్ను క్షమించు.

(ఆనందాలు, చిన్ని చిన్ని గొడవలతో సాగుతున్న మా జీవితంలోకి మథుర వచ్చింది)

రజియా, పాప కి ఎం పేరు పెడదాం అని అనుకుంటున్నావు.

మీరే పెట్టండి, నేను చెప్పేదేదో మీరు చేసేటట్టు.

లేదు రజియా, ఈసారి నీ మాటే వింటా.

ఓహో, నిజంగానా.

అవును, సీరియస్గా.

సరే, మథుర అని పెడదాం.

(కానీ ఆరోజు మథుర అనే ఈ పేరు నేనెందుకు పెట్టాలనుకున్నానో నాకే తెలీదు)

సరే నీ ఆజ్ఞను శిరసావహిస్తున్నాను. మథుర ఇటు చూడు.

(ఒకరోజు రజియా బుక్ లో ఏమి రాసిందో అని బుక్ కోసం ఫారూఖ్ వెతుకుంతున్నప్పుడు, పాత బుక్స్ ఏవో కనపడతాయి)

ఏంటి ఇవి? రజియా చిన్నప్పటి బుక్స్ ఆ?

(అంటూ ఒక్కోటి తీసి చదువుతుంటాడు)

నేను ఎలాగైనా ఈ నేషనల్స్ లో సెలెక్ట్ అవ్వాలి...నెక్స్ట్ ఇంటర్నేషనల్ లెవెల్ కోసాం బాగా కష్టపడాలి...

(రజియా నేషనల్స్ కి సెలెక్ట్ అయ్యిందా, మరి నాకు ఎప్పుడు చెప్పలేదు)

నేను అనుకోలేదు ప్రేమంటే ఇదేనని, కలిసిన ఒక్కసారికి ఐ లవ్ యు , అనే మూడు అక్షరాలని అంత సులువుగా ఎలా చెప్పాడని. కానీ ఇప్పుడిప్పుడే నాకు అర్ధమవుతుంది...

నా గురించి అర్జున్ ఆలోచించినంత ఎవరు ఆలోచించలేరనుకుంటా, ఆఖరికి నేను కూడా...

(ఎవరు అర్జున్ అని ఫారూఖ్ ఆలోచిస్తున్నప్పుడే రజియా ఇంటికి వస్తుంది. అన్ని సద్దేస్తాడు)

ఎప్పుడు వచ్చావ్ ఫారూఖ్? మథురని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్లాను.

ఇప్పుడే రజియా. నీతో కొంచెం మాట్లాడాలి.

హ చెప్పు ఫారూఖ్.

రజియా నువ్వు టెన్నిస్ నేషనల్ ప్లేయర్ ఆ?

లేదు ఫారూఖ్, నాకు టెన్నిస్ అంటే ఇష్టం అంతే. నేషనల్ ఏంటి?

నిజంగానా? నువ్వ బయట ఎక్కడ ఆడలేదా?

లేదు, ఇంట్లో ఆడేదాన్నేమో. నాకేం గుర్తులేదు అసలు.

(ఎందుకో రజియా నా దెగ్గర ఎదో దాస్తుందనిపిస్తుంది)

సరే రజియా, ఊరికే అడిగాలే.

(తర్వాత రోజు, మిగితా బుక్ చదువుతూ)

ఈరోజు నీతో గడిపిన క్షణాలను నేను ఎప్పటికి మర్చిపోలేను అర్జున్... మనకు పాపా పుడితే అర్జున్ అన్నట్టే మథుర అని పేరు పెడదాం..

(అప్పుడు ఫారూఖ్ రజియాని పిలుస్తాడు)

రజియా, పెళ్లి కాక ముందు ఎవరినైనా ప్రేమించావా?

లేదు, ఫారూఖ్.

అర్జున్ అని ఎవరైనా తెలుసా.

లేదు. అయినా ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు ఇప్పుడు.

నేను నమ్మలేకపోతున్నా రజియా. నువ్వు చెప్పేది ఏది నిజమో ఏది అబద్దమో అని.

ఏమైంది ఫారూఖ్?

మథుర అనే పేరుని ఎందుకు పెడదాం అన్నావు?

ఏమో నాకు అప్పుడు అలా అనిపించింది పర్టికులర్ రీసన్ ఏమి లేదు.

ఉంది రజియా, ఈ బుక్ లో అన్ని ఉన్నాయ్.

ఎం బుక్ అది?

ఒక నిమిషం ఈ హ్యాండ్ రైటింగ్ నీదే కదా.

అవును. కానీ ఇది నేను రాసినట్టు అసలు నాకు గుర్తేలేదు.

చెప్పు, రజియా ఇంకా చెప్పు. ఏమి గుర్తులేదంటావేంటి? ఇక్కడ అంత కనపడుతూనే ఉంది. నువ్వు నా గురించి రాసిందానికంటే ఆ అర్జున్ గురించి రాసిందే ఎక్కువ ఉంది.

నాకు అసలు ఎవరు తెలీదు ఫారూఖ్. నేను నిజమే చెప్తున్నా. నన్ను నమ్ము ఫారూఖ్.

లేదు రజియా నువ్వు దూరంగానే ఉండు, నీతో మాట్లాడాలంటేనే నాకు చిరాకొస్తుంది. నువ్వు చెప్పువాటికి, చేసినవాడికి అసలు సంబంధమే లేదు.

(అంటూ డోర్ వేసేసి ఫారూఖ్ బయటికి వెళ్ళాడు, రజియా చాలా బాధపడింది. తాగేసి ఇంటికి వచ్చాడు)

అప్ప, ఎందుకు ఇంత లేట్ అయ్యింది.

నువ్వు నా దెగ్గరకు రాకు.

(అని ఫారూఖ్ కోప్పడతాడు)

ఫారూఖ్ తాగి వచ్చావా? మథుర మీద ఎందుకు నీ కోపాన్ని చూపిస్తున్నావు?

ఇదిగో నీ బుక్ లో నువ్వు రాసింది చూస్తుంటే, ఈ మథుర నా కూతురే కాదనిపిస్తుంది.

తప్పుతప్పుగా మాట్లాడకు ఫారూఖ్.

నేను తప్పుగా మాట్లాడటం కాదు, నువ్వే తప్పులన్నీ చేసేసి ఏమి తేలినట్టు ఉన్నావు. అయినా ఈ ఇంట్లో ఒక్కక్షణం కూడా ఉండాలనిపించట్లేదు.

(అని బట్టలన్నీ సర్దుకుని ఫారూఖ్ వెళ్లిపోతుంటే, రజియా ఆపడానికి ప్రయత్నిస్తుంది కానీ ఫారూఖ్ , రజియా ని తోసేసి వెళ్ళిపోతాడు. పొద్దున్నే రజియాకి కాల్ వస్తుంది)

రజియానేనా మాట్లాడేది?

అవునండి, ఏమైంది?

మీ హస్బెండ్ ఫారూఖ్ డ్రింక్ చేసి బైక్ నడిపారు, చూసుకోకుండా డివైడర్ ని గుద్దేసారు స్పాట్ లోనే చనిపోయారు.

(అది విన్న రజియా ఒక్కసారిగా గట్టిగ ఏడిచింది, ఫారూఖ్ వస్తువులన్నీ ఇచ్చినప్పుడు, ఆ బుక్ కూడా ఉంది)

ఇదంతా ఈ బుక్ వల్లే, అసలు ఈ బుక్ లో ఏముంది?

(అని రజియా మొత్తం చదువుతుంది, తనకి అర్జున్ కి మధ్యలో జరిగినవన్నీ రజియాకి గుర్తొస్తుంది)

రజియా, రజియా?

సారీ ఆద్య, నేను జరిగినదని చెప్పి ఇబ్బంది పెట్టాలనుకోలేదు.

అది కాదు రజియా, ఇప్పుడు అర్జున్ అంటే ఈ అర్జున్ ఏనా?

అవును, ఆద్య. అర్జున్ ప్రతి సారి మథుర కోసం చేసేవన్నీ మథుర నాకు చెప్తూనే ఉండేది. అది విని నేను అర్జున్ తో మాట్లాడదాం అనుకున్నప్పుడు, నువ్వు అర్జున్ ని ప్రేమిస్తున్నావని తెలిసింది. సరే తను నన్ను మర్చిపోయాడేమో, మీరు హ్యాపీగా ఉండాలని అనుకున్నాను.

కానీ అర్జున్ నన్ను ప్రేమించలేదు. తను నీకోసమే ఇక్కడికి వచ్చాడు. నాకు ఇప్పుడు అర్థమైంది.

పద వెల్దాము.

లేదు, ఆద్య. తను నాకోసం వచుంటే మొదటి రోజే నాకు చెప్పేవాడు కదా.

రజియా, నువ్వు గతం మర్చిపోయావని తను అనుకున్నాడు. తను చేసే పనులతో మథుర కి దెగ్గర అవుదామనుకున్నాడంటే నీకు దెగ్గర అవ్వడం కోసమే.

(ఆద్య, రజియా కలిసి అర్జున్ కోసం వెళ్తారు)

అర్జున్, ఆగు.

సారీ ఆద్య, నేను నిన్న బాధపెట్టాలనుకోలేదు.

అది మర్చిపో, రజియా నీతో మాట్లాడాలి.

రజియా, నేను మథురకి దూరం కాలేను. ఎప్పుడు తనతోనే ఉండాలనిపిస్తుంది.

అర్జున్, నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తున్నావా?

(ఆ మాట వినగానే అర్జున్ ఆనందానికి హద్దులు లేవు)

అవును రజియా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నా పక్కన ఉన్న లేకపోయినా ఇప్పటి దాకా ప్రతిదీ నీతో ఉన్న జ్ఞాపకాలే నన్ను ఇప్పటివరకు ఉండేలా చేశాయి. ఇకపై నిన్ను వదిలి నేను ఉండలేను.

(అలా ఇద్దరు తమ ప్రేమను వ్యక్తపరుచుకుని, హతుక్కుంటారు)

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు