మీరు - ఐసున్ ఫిన్

Meeru

ఆరోజు నేను అలా అనకుండ ఉండాల్సింది. నాదే తప్పైఉండచ్చు కానీ నేను చేసింది తప్పని నాకు ఎందుకు ఎవ్వరు చెప్పలేదు. ఇప్పుడు అనుకుని ఏమి లాభం అంత అయిపోయాక. చేసినదాన్ని మార్చలేనప్పుడు ఇప్పుడు చేయాల్సింది ఇంకేం ఉంటుంది. అంత దాని మీదే ఆదారిపడి ఉందా?

వర్ష ఎందుకు ఆలా బాధపడతావు ఇప్పటికి నువ్వు చేసినదాన్ని కరెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉండచ్చేమో కదా. జరిగిపోయిన వాటి ప్రభావం జరిగే దాని మీద ఉండొచ్చేమో కానీ జరగబోయే వాటి మీద ఉండకూడదు. జరగబోయేది నీ చేతుల్లోనే ఉంది.

నువ్వంటున్నది నిజమే కానీ ఎలా బయటపడాలో నాకు అర్ధం కావట్లేదు నిషా. ఎంత ఆలోచించిన నేను ఇప్పుడు ఏమి చేయలేను. ఏమి చేయాలనిపించట్లేదు. ఎందుకో ఏమిటో ఎలానో ఇలా అర్థంకావట్లేదు.

అయితే వదిలేసేయి , దాని గురించి ఆలోచించకుండా ఉండాలంటే ఏదోక పని లో బిజీ అవ్వాలి. అసలు ముఖ్యమైనది ఏంటో అది ఆలోచించాలి. ఇలా పనికిరాని ఆలోచనలతో సతమతమవ్వద్దు. నీకు ఎం కావాలో అదే లభిస్తుంది. ఇప్పుడు కాకపోతే ఏంటి,నీకు కావలసినప్పుడు కచ్చితంగా నీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది.

ఏమో నేను వదిలేసినా అది గుర్తొచ్చినప్పుడల్లా తెలియని అలజడి. కన్నీరుతో పోనీ జ్ఞాపకం. విడవలేని భారం. వదిలేద్దాము ఇప్పటికి. నువ్వు ఎదో చెప్పాలని వచ్చావ్ కానీ ఈ టాపిక్ లోకి ఎందుకు వచ్చాం అసలు. నువ్వు ఎం చెప్పాలని వచ్చావు?

నాకు బెంగళూరు లో జాబ్ వచ్చింది. రేపు ఈవెనింగ్ నేను వెళ్తున్నాను. నన్ను స్టేషన్ దెగ్గర డ్రాప్ చేస్తావేమో అని అడగడానికి వచ్చా.

అవునా నాకెందుకు ముందే చెప్పలేదు. కంగ్రాట్యులేషన్స్! మరి పార్టీ ఇచ్చేంత టైం లేదనుకుంట కదా. కానీ ఫస్ట్ శాలరీ తో పార్టీ కచ్చితంగా ఇవ్వాలి. అయినా డ్రాప్ చేస్తావా అని అడగడమెందుకు, నేను ఉన్న కదా.

నాకే లేటుగా తెలిసింది. నీకేం చెప్తాను. పార్టీ ఇస్తానులే. డ్రాప్ చేస్తావని తెలుసు కానీ, ఏమైనా బిజీగా ఉంటావేమో అని. సరే రేపు 6 కి బయల్దేరుదాం, 6 30 కి ట్రైన్.

(ఆరోజు ఈవెనింగ్ 6 కి. ఇద్దరు బండి మీద స్టేషన్ కి వెళ్తున్నప్పుడు)

నీతో పరిచయం కొన్నాళ్ళైనా ఎంతో బాగుంది. నువ్వు అక్కడికి వెళ్ళాక నిన్ను కచ్చితంగా మిస్ అవుతాను, నిషా. అప్పుడప్పుడు కాల్ చేస్తూవుండు.

నేను కూడ, వర్ష. నువ్వే మర్చిపోతావేమో నన్ను. నువ్వు అసలు ఎప్పుడు కాల్ చేయవు. నీతోనే నేను ఈ సిటీ అంత తిరిగాను. అక్కడ అంత కొత్త, ఏమి తెలీదు.నేర్చుకోవాలి.

(స్టేషన్ లో నిషా ని దింపేసి వర్ష ఇంటికెళ్తుంది)

అమ్మ అన్నం పెట్టవా ఆకలేస్తుంది. రేపటి నుంచి త్వరగా వెళ్ళాలి ఆఫీస్ కి. కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. అలాగే కొత్త సీఈఓ కూడా వస్తారు.

సరే త్వరగా తిని నిద్రపో మల్లి ఆ ఫోన్ లో మునిగిపోకు వర్ష.

(తర్వాత రోజు, వర్ష ఆలస్యంగా ఆఫీస్ కి వెళ్తుంది)

వర్ష, ఈ రోజు కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి త్వరగా రమ్మన్నాను. అయినా నీకు చెవికెక్కలేదు. సీఈఓ వచ్చి నువ్వు ఎందుకు రాలేదు అని క్వశ్చన్ చేశారు. ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే ఎలా. వెళ్లి సీఈఓని కలిసి సారీ చెప్పు.

సారీ దయ సర్. నేను కావాలని చేయలేదు, ఇప్పుడు ఏం చెప్పిన మీకు నేను ఎదో రీసన్ చెప్తున్నాననిపిస్తుంది. నా వల్ల ఇంక ఏ లేట్ అవ్వకుండా చూసుకుంటా.

(వర్ష , సీఈఓ రూమ్ కి వెళ్తుంది)

మీరు వర్ష కదా? మీ గురించే నేను అడిగాను ఇందాక. మీరు అందరికన్న చాలా బాగా పని చేస్తారని పాత సీఈఓ చెప్పారు .ఇంత లేట్ గా వస్తారని అనుకోలేదు.

సారీ సర్. మా అమ్మ కి బాగోలేదు. ఇంట్లో పనులు, వంట చేసి ఫాస్ట్ గా వస్తుంటే బండాగిపోయింది. బస్సు పట్టుకుని వచ్చేసరికి లేట్ అయిపోయింది. నేను ఎప్పుడు త్వరగానే వస్తాను సర్.

పర్లేదు. మీరు ఈ కొత్త ప్రాజెక్టుకి లీడ్. మీరే ఈ ప్రాజెక్ట్ విషయాలని నాకు అప్డేట్ చేస్తుండాలి.

థాంక్యూ సర్. నేను ఖచ్చితంగా బాగా చేసి చూపిస్తాను.

(ఎమోషన్ రెకగ్నిషన్ అండ్ మూడ్-బేస్డ్ ఆటోమేషన్ ఫీచర్ ఇన్ ది స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ సిస్టం అనేది ప్రాజెక్ట్. వర్ష తన టీం మెంబర్స్ తో డిస్కస్ చేస్తుంది )

అందరు వినండి. ఇది మనకి చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్. వేరే కంపెనీస్ తో పోలిస్తే మనం చాలా వెనక ఉన్నాం. మన డెడ్లైన్ కూడా తక్కువే, త్వరగా కంప్లీట్ చేయాలి. ఎవరెవరు ఏ ఏ టాస్కులు చేయాలో అన్ని మెయిల్స్ కి పెట్టాను.

వర్ష , ఎక్కువ టెన్షన్ తీసుకోకు మెల్లగా చేద్దాం. కంగారుగా చేస్తే ఆ పనిలో పర్ఫెక్షన్ మిస్ అవుతుంది. ముందు మనం అసలెందుకు ఇది చేస్తున్నామో చెప్పు. ఈ ప్రాజెక్ట్ వల్ల యూజ్ ఏంటి? అంటే మనం వాళ్ళ ప్లేస్ లో ఉంటే ఎలా ఫీల్ అవుతామో ఆలా చేయాలి కదా.

నేనేమి కంగారు పడట్లేదు, రియాజ్. మనం చేయాల్సినది ఎంతవుందో చెప్తున్నా. ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే, 6 థింగ్స్. ఫస్ట్ ఇది ఎందుకంటే ఒక మనిషి ఇంకో మనిషి తో చెప్పుకోలేనప్పుడు తన చుట్టూ ఉన్న పరిసరాలు తనతో మాట్లాడుతున్నట్టనిపిస్తుంది, అవి మనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి కాబట్టి వాటికి మనకి ఒక బంధాన్ని కలపడం. ఏంటంటే మనం ఉన్న పరిస్థితుతలకు తగిన విధంగా పరిసరాలు మారడం. ఎవరైతే తమ కష్టసుఖాలను బట్టి ఒక సామరస్య పరిసరాలను కోరుకుంటారో వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కడంటే మన ఇళ్లల్లో. ఎలా అంటే ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ ఉపయోగించుకుని.

అయితే ఇది యాభై వేల నుంచి మూడు లక్షల వరకు ఉండొచ్చేమోగా. ఒకవేళ మనం ఇది చేస్తే, మనకి చాలా లాభం వస్తుంది. సరే వర్ష, దీని మీద మనం బాగా వర్క్ చేదాం.

(ఆరోజు పని లేట్ అయ్యి , పూర్తి చేసుకుని వర్ష ఇంటికి బయలుదేరుతుండగా)

వర్ష మీరు ఎలా వెళ్తారు? మీ బండి ఆగిపోయింది అని అన్నారు కదా. కావాలంటే నేను నా కార్ లో మీ ఇంటి వరకు డ్రాప్ చేస్తాను.

నో థాంక్స్ సర్. నా బండి ని రిపేర్ కి ఇచ్చి వచ్చాను. మెకానిక్ ఇక్కడికి తీసుకువస్తానన్నాడు.

వెల్ చాలా లేట్ అయిపోయిందని అడిగాను. రీచ్ సేఫ్.

(వర్ష బండి తీసుకుని, ఇంటికి వెళ్తుంది)

ఏంటి వర్ష ఈరోజు ఏమైంది, ఇంత లేట్ గా వచ్చావు?

ఇంకేం కావాలమ్మా. నువ్వేమో హెల్త్ సరిగ్గా చూసుకోవు. ఇలా నీ ఆరోగ్యం పాడైపోయి నువ్వు రెస్ట్ తీసుకుంటే నేనే అన్ని చేయాల్సివస్తుంది. కనీసం పనమ్మాయిని కూడా వద్దంటావ్. నేనే పొద్దున్న అన్ని చేసి వెళ్ళ. దారిలో బండాగిపోయింది. లేట్ అయిపోయింది. అయినా మా సీఈఓ నన్ను ఏం అనలేదు తెలుసా. నన్ను ప్రాజెక్ట్ లీడ్ని కూడా చేశారు. ఇందాక కారులో డ్రాప్ చేస్తానని కూడా అన్నారు. ఎంత మంచివారో.

సరేలే, నీ నోట్లో తల పెట్టడం నాది తప్పు. వెళ్లి స్నానం చేసి వచ్చి అన్నం తిను. బాగా కష్టపడివుంటావ్గా, త్వరగా నిద్రపో.

(తర్వాత రోజు మీటింగ్ జరుగుతుండంగా)k

ఇండియా లోనే టాప్ వెంచర్ కాపిటలిస్ట్ అయినా యశ్వంత్ గారు ఇప్పుడు మన కంపెనీ కి సపోర్ట్ చేస్తున్నందుకు మనం వారికి ది బెస్ట్ ఔట్పుట్ ఇవ్వాలి.

అదేం లేదు రవీంద్ర గారు. మీరున్నారనే నేను వచ్చాను. యంగ్ బ్లడ్ ఎక్కడుంటే అక్కడ అవుట్కం కచ్చితంగా ఉంటుంది. మీ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ చూసాను, చాలా బాగున్నాయి. మీరు ఈ కంపెనీ సీఈఓ అయినందుకు కాంగ్రాట్యులేషన్స్.

థాంక్యూ సర్. మీరిలా మాకు బ్యాక్ బోన్ గా ఉంటే మేము చాలా అచీవ్ చేయగలం. అలాగే ఇప్పుడు మా ప్రాజెక్ట్ లీడ్ వర్ష గారిని మీకు పరిచయం చేయాలి. ఈమె ఇంతకముందు చేసిన ప్రాజెక్ట్స్ లో జస్ట్ ఒక పార్ట్ గా ఉన్నప్పటికీ మాక్సిమం తనే మొత్తం కంప్లీట్ చేసింది. తను చాలా డెడికేటెడ్.

థాంక్యూ సర్. నన్ను మీతో పాటు ఈ మీటింగ్లో ఉంచినందుకు, మీ గైడెన్స్ మాకు చాలా విలువైనది. నేను ఎన్ని ప్రాజెక్ట్స్ చేసిన, ఈ ప్రాజెక్టుకి లీడ్ చేసినందుకు నాకు చాలా హ్యాపీ గా ఉంది.

అయితే మీరందరు కలిసి బాగా చేస్తారు, నాకు తెలుసు. ఆల్ ది వెరీ బెస్ట్.

(ఐదు రోజుల తర్వాత వర్ష చాలా కంగారుపడుతూ ఉంటుంది)`

ఏమైంది వర్ష ఎందుకంత కంగారు పడుతున్నావు. నువ్వు ఇచ్చిన టాస్క్స్ పాతిక శాతం అయిపోవచ్చింది కదా. మనం కూల్ గా ఉండొచ్చు.

లేదు రియా మనం చేసినదంతా ఇక్కడ కనిపించట్లేదు. మల్లి ఫస్ట్ కి వచ్చింది, ఎలా డిలీట్ అయిపోయిందో నాకేం అర్ధం కావట్లేదు. దీనికి బ్యాక్ అప్ ఉందా?

అవునా! అలా ఎలా అంటున్నావు. మా కంప్యూటర్స్ లో బానే కనిపిస్తుంది కదా. పొద్దునే చూసా.

పొద్దున్న కాదు. ఇప్పుడు చూడు. నేను అన్ని చెక్ చేశా. జీరో చూపిస్తుంది.టీం మెంబెర్స్ అందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేదాం. అందరిని రమ్మని చెప్పు.

అవును వర్ష. ఎందుకు ఇలా అయ్యింది. నేను అందరిని రమ్మని చెప్తా.

(మీటింగ్ కి అందరు వస్తారు రియాజ్ తప్ప)

పొద్దున్న వరకు బానే ఉన్నది సడన్ గా ఇలా అయిందంటే ఎవరో ఎదో మిస్టేక్ చేసి ఉంటారు. ఎవరెవరు రియా తర్వాత లాగిన్ అయ్యారో చెప్పండి. మీ తప్పు ఉండకపోవచ్చు కానీ ఎవరి వల్ల , అంటే తెలియకుండా ఏమైనా మార్చేశారా అని. నేనేమి సీరియస్ చెయ్యను, మనం చేసినదాని మీద మల్లి ఫస్ట్ నుంచి అంటే కష్టమే కదా.

లేదు వర్ష మేమెవ్వరం లాగిన్ అవ్వలేదు. మేము డాక్యుమెంటింగ్ మీద వర్క్ చేస్తున్నాం.

రియాజ్ ఎక్కడ? కనబడట్లేదు. ఈరోజు పొద్దున్న వచ్చాడు కదా.

వాళ్ళ ఫ్యామిలి ఫంక్షన్ ఉందంట మధ్యాహ్నం నుంచి లీవ్ తీసుకున్నాడు. రేపు కూడా రాడు.

ఇప్పుడు మరి ఏం చేదాం? దయ సర్ కి చెప్తే ఊరికే కోప్పడతారు. రవీంద్ర సర్ కి చెపుదాం అంటే నా మీద చాలా నమ్మకం తో ఫస్ట్ టైం నన్ను లీడ్ని చేశారు. ఇలా తప్పులు చేస్తుంటే ఏం అనుకుంటారో అని భయమేస్తుంది. ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది అని అడుగుతారు. రేపు మనం ఫస్ట్ వీక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలి. అలాగే రియాజ్ కూడా లేడు. ఐదు రోజులు చేసినదాన్ని ఒక్క రోజులో ఎలా చేస్తాం?

పర్లేదు ఓవర్ టైం చేదాం. కంప్లీట్ చేసేదాం. ఏమి చేయకుండా ఉండటం కంటే ఏదోకటి చేయడం ఇంపార్టెంట్ కదా.

(అలా ఓవర్ టైం చేయడం చూసిన రవీంద్ర.)

హలో మెంబెర్స్, ఏంటి రోజు త్వరగా వెళ్ళిపోయేవారు. ఇంత లేట్ అయినా ఇంకా వర్క్ చేస్తున్నారు. మీరు రిపోర్ట్ లో హండ్రెడ్ పర్సెంట్ చూపించక్కర్లేదు. అంతా ఐదు రోజుల్లో అయ్యేది కాదు. ఇంటికి వెళ్ళండి.

సర్, మాకు ఈ ఆఫీస్ చాలా బాగుంది, అసలు వదిలి వెళ్లాలని లేనే లేదు. మీరు వచ్చాక అసలు ఈ వాతావరణం చాలా మారిపోయింది. మాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది.

జోక్ గా కాదు సీరియస్ గా చెప్తున్నా కుమార్. లీవ్ ది ఆఫీస్ రైట్ నౌ. మీరు మీ ఇంటిని కూడా గుర్తుపెట్టుకోవాలి, మీ కోసం మీ అమ్మలు ఎంత వేచిచూస్తుంటారో.

సర్, మీకో విషయం చెప్పాలి.

చెప్పండి వర్ష. మీరు టీం లీడ్. మీ టీం అంత ఎందుకు ఇంకా ఉన్నారు?

సర్, అది..అది.. మేము చేసిన ప్రోగ్రెస్ డిలీట్ అయిపోయింది, మల్లి ఫస్ట్ నుంచి వర్క్ చేయాల్సివచ్చింది. అందుకే కంప్లీట్ చేద్దామని ఉన్నాం. కచ్చితంగా ఇంప్రూవ్మెంట్ చూపిస్తాం సర్.

నేను మీతో ఎప్పుడైనా స్ట్రిక్టుగా ఉన్నానా? నాతో మీరు చెప్పాల్సింది. నేను మీకు హెల్ప్ చేస్తాను. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్లో ఏం ఉంది.

(ప్రాబ్లెమ్ సింపుల్గా సాల్వాయిపోతుంది. అందరు ఇంటికి వెళ్తుండగా రవీంద్ర, వర్ష ని తన క్యాబిన్ కి రమ్మంటాడు)

వర్ష, మీరు నాతో చెప్పడానికి ఎందుకు ఆలోచించారు. మీకు అర్థంకాకపోతే నన్ను వచ్చి అడగండి. నేనేమి మిమ్మల్ని జడ్జ్ చేయను. నన్ను సీఈఓ గా కాకుండా మీ కో ఎంప్లొయీగా అనుకోండి.

సారీ సర్. నాకు కొంచెం బయమేసింది, కానీ ఇకపై ఇలా చేయను.

నో ఫార్మాలిటీస్. మీకు ఇంకా కంఫోర్టాబుల్ అయితే రవీంద్ర అని పిలవండి.

లేదు సర్. నాకు సర్ ఏ కంఫోర్టాబుల్.

ఓకే మీ ఇష్టం. మీరు వెళ్లొచ్చు.

(వర్ష ఇంటికి వెళ్తుంది)

(పొద్దున్నే బిందు బుక్ కోసం వెతుకుతుంటుంది)

ఆర్య ఎక్కడున్నావ్ రా. నా ఫైల్ కనబడట్లేదు నీ రూంలో ఉందేమో చూడు. ఇంట్లో లేడా అమ్మ వీడు?

లేడే వాడు పొద్దున్నే క్రికెట్ ఆడటానికి గ్రౌండ్ కి వెళ్ళాడు.

సర్లే నేనే వాడి రూంలో వెతుకుతా.

(ఒక బుక్ కనపడుతుంది, దాంట్లో)

ఈరోజే ఫస్ట్ టైం ప్రింటర్ షాప్ లో చూసా. నువ్వు యూనిఫామ్ లో చిన్నపిల్లలా తిరుగుతున్నావు, నేను రాగానే ఆగిపోయావు. మీ అమ్మ తో వెళ్ళిపోయావు.

ఎప్పుడు చదువుతూనే ఉంటావు. నీ పనేదో నువ్వు చేసుకుంటూ ఉంటావు.

నువ్వు నవ్వితే చాలా బాగుంటావు. ఈరోజు చుడిదార్ లో చాలా బాగున్నావు.

నీకోసమే ఈరోజు పాట పాడాను.

ఆమాయకమో లేదా కావాలని ఆలా చేస్తావో తెలీదు కానీ నువ్వు చాలా నచ్చేసావు. నీ వాయిస్ చాలా మధురంగా ఉంటుంది.

నీతో మాట్లాడాలి అని ఏదోకటి మాట్లాడతాను. అందరికి తెలుస్తుంది నీకు తప్ప. తెలిసిన , తెలియనట్టుంటావో తెలీదు.

ఆటో లో ఈరోజు మనిద్దరం పక్క పక్కనే కూర్చున్నప్పుడు నీ కళ్ళలో ఎలాంటి ఇబ్బంది ఎందుకు కనపడలేదు. అంటే నేను నీకు ఇష్టమేనేమో?

నాన్న కి కూడా నువ్వంటే బలే ఇష్టం.

నీకోసమే మ్యూజిక్ క్లాస్లో చేరాను. నీతో ఎక్కువ మాట్లాడొచ్చని. కానీ నావైపు చూడవు.

నిన్ను ఉడికించాలి అని పక్కన అమ్మాయిలతో మాట్లాడిన నువ్వు ఎందుకు బయటపడవు.

ఇవాళ ఫేర్వెల్ లో నువ్వు ఏడుస్తూ సర్ దెగ్గరికి వచ్చేసరికి ఎవరు నిన్ను ఏడిపించారో అని చాలా కోపం వచ్చింది కానీ దాని కారణం తెలిసి బలే నవ్వొచ్చింది.

ఎప్పుడైనా ఫ్రెండ్స్ కలుద్దాం అన్నప్పుడు ఎందుకు త్వరగా వెళ్ళిపోతావు? ఇంకాసేపు ఉంటే బాగుంటుంది కదా.

అప్పుడప్పుడు మీ ఇంటి వైపు వస్తుంటా కానీ నీ చూపు నాపైన ఉండదే!

ఎప్పుడు కలలో కనిపిస్తుంటావు. ఎదురుగా ఉండవు.

నువ్వు పనిచేస్తున్న కంపెనీ పక్కనే నేను కంపెనీలో పనిచేస్తున్నాను. నన్ను ఒక్కసారి కూడా చూడవెందుకు. నిన్ను చూస్తూ ఇలా రోజులు గడిచిపోతూనే ఉన్నాయి.

(అప్పుడే ఆర్య వస్తాడు)

అరేయ్ ఆర్య నీ బుక్ నేను చదివాను. ముందు ఆ అమ్మాయి ఎవరో చెప్పు అసలు. అయినా ఇక్కడ కంపెనీ అని రాసావ్ మా కంపెనీ కూడా మీ కంపెనీ పక్కనే కదరా. మా కంపెనీలో నీతో చదివిన అమ్మాయి ఎవరు రా? ఇది ప్రేమేనా? ఎప్పటినుంచి ఇది జరుగుతుంది? నాకు ఎప్పుడు నువ్వు చెప్పలేదు.

అదంతా ఎదో ఊహించి రాసింది. ఊరికే రాసా. అయినా నీకు అన్ని చెప్పాలా?

ఊరికే రాస్తే ఓకే రా. కానీ నిజంగా తన కోసం వెయిట్ చేస్తూ తనకి చెప్పకుండా, తను చెప్తుంది అని అనుకుంటే ఉపయోగం లేదు. ఇదంతా చూస్తే ఊరికే రాసినట్టు లేదు, చాలా రోజులు అయినట్టుంది.

అదంతా ఏం లేదు. కాలిగా ఉన్నప్పుడు అలా రాస్తుంటాను.

సరే రా, నా ఫైల్ ఒకటి ఉండాలి. అది పింక్ కలర్ లో ఉంటుంది ఒకసారి చూడరా.

ఎన్నిసార్లు చెప్పాను? నీ ఫైల్స్ నా రూంలో పెట్టొద్దని, ఇదిగో ఇక్కడే ఉంది.

ఏంటో పెద్ద రూమ్ , ఇంత దారుణంగా నీ రూమ్ తప్ప ఏది ఉండదు. వైఫై కోసం ఇక్కడకి వస్తా. నీ రూంలోనే బాగా వస్తుంది.

(బిందు, ఆర్య ఇద్దరు కంపెనీలకి వెళ్ళిపోతారు )

వర్ష నీ ప్రాజెక్ట్ ఎంత వరకు వచ్చింది? రిపోర్ట్ కంప్లీట్ అయ్యిందా? సర్ రమ్మంటున్నారు.

హా అయిపోయింది బిందు. ఇప్పుడే సర్ దెగ్గరికి వెళదామనుకుంటున్న.

ఇదిగో ఈ ఫైల్ లో మీ టీం మెంబెర్స్ నెక్స్ట్ చేయాల్సిన డీటెయిల్స్ ఉన్నాయి. అలాగే ఏమైనా చేంజెస్ చేయాలంటే నాకు చెప్పు.

సరే బిందు. మా ప్రోగ్రెస్ ని మానిటర్ చేసేది నువ్వొక్కదానివేన? అంటే నిన్న మా ప్రోగ్రెస్ జీరో కి వెళ్ళింది, సర్ సాల్వ్ చేశారు. ఎలా చేశారో తెలియలేదు. అలా ఎందుకు జరిగిందో నీకేమైనా తెలుసా?

అవునా, నాతో పాటు దయ కూడా మానిటర్ చేస్తాడు. అది కావాలని డిలీట్ చేసాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ప్రాజెక్ట్ లీడ్ చేసేది దయనే. ఇప్పుడు మీ టీం చేస్తున్నారని కొంచెం కోపంతో ఉన్నట్టున్నాడు.ఎలాగైనా ప్రాజెక్ట్ నుంచి మిమ్మల్ని తప్పించి తను చేయాలనుకుంటున్నాడేమో. నేను ఆ మానిటర్ సెట్టింగ్స్ చేంజ్ చేస్తాను.

ఎప్పుడు మాకు హెల్ప్ చేస్తుంటావు, థాంక్యూ బిందు.

(వర్ష రిపోర్ట్ సబ్మిట్ చేసి, ఇంటికి వెళ్ళింది.నిషా కాల్ చేసింది)

ఏంటి వర్ష కాల్ చేయలేదు అసలు. మర్చిపోయావా. నీకో విషయం చెప్పాలని కాల్ చేసాను. మా కంపెనీలో జాన్ ని చూసాను. నన్ను చూడగానే గుర్తుపట్టాడు. నీ గురించి కూడా అడిగాడు, ఎలా ఉన్నావ్, ఎం చేస్తున్నావని. తను ఇక్కడ ఒక ప్రాజెక్ట్కి టీం లీడ్ అంట. నేను ఆ ప్రాజెక్ట్ లో ఉన్నాను.

అవునా, నేను ఇంకా జాన్ కి గుర్తున్నానా, ఎప్పుడో మర్చిపోయుంటాడు అనుకున్న. వెళ్ళగానే ప్రాజెక్ట్ లో బిజీ అయిపోయినట్టున్నావుగా. నేను ఇక్కడ ఒక ప్రాజెక్టుని లీడ్ చేస్తున్న.

కంగ్రాట్స్, నువ్వొకసారి ఇక్కడికి రావాలి. మనం పార్టీ చేసుకోవాలి.

కచ్చితంగా మనం పార్టీ చేసుకోవాలి. తర్వాత మాట్లాడతాను.

(వర్ష ఫోన్ కట్టేసిన తర్వాత ఎదో బాధలో ఉన్నట్టుంటుంది)

(ఒక నెల తర్వాత.ఈరోజు వర్ష బర్త్డే.కంపెనీ కి వెళ్ళింది.చాలా స్పెషల్ గా డెకొరేషన్స్ చేశారు.రెడ్ రొసెస్ తో తన కేబిన్ చాలా అందంగా నిండిపోయింది.ఎంప్లాయిస్ అందరు వర్ష కి విషెస్ చెప్పారు. కానీ ఇదంతా ఎవరు చేశారో వర్ష కి అర్ధం కాలేదు. అక్కడికి నిషా, జాన్ వస్తారు)

నేను నీకు మొదటి సారి నా ప్రేమను చెప్పినప్పుడు, అది ప్రేమ కాదని అన్నావు కానీ నిన్ను వదిలి వెళ్ళిపోయినా తర్వాత ఎంత బాధ పడ్డావో నిషా నాకు చెప్పింది. ఈరోజు నీకు మల్లి చెప్పడం కోసమే ఇదంతా చేసాను. ఐ లవ్ యు, వర్ష. నేను ఎప్పుడు నిన్ను మర్చిపోలేను.

జాన్, మనం చిన్నపటినుంచి పక్క పక్క ఇళ్లల్లో ఉండేవాళ్ళం కానీ నేను ఎప్పుడు నిన్ను ఒక ఫ్రెండ్ లాగే చూసాను. ఆరోజు నువ్వు చెప్పినప్పుడు, నాకు అసలు ఏమి అర్ధం కాలేదు. ఆరోజు మనిద్దరం ఒకే జాబ్ కి అప్లై చేసాం. ఆ జాబ్ నీకువచ్చిన నువ్వు, నేను నో చెప్పడంతో అసలు ఇల్లే వదిలి వెళ్ళిపోయావు. నువ్వు ఎక్కడికి వెళ్ళావో , అప్పుడు నీకు ఆ జాబ్ ఎంతో ఇంపార్టెంట్ కదా. నా వల్ల నీ జాబ్ పోయిందని చాలా బాధపడ్డాను. ఆ జాబ్ ఇప్పుడు నేను చేస్తున్నది. నీ వల్లే వచ్చింది.

నిజం చెప్పు వర్ష, నువ్వు నా జాబ్ కోసం బాధ పడ్డావా? అంటే నా గురించి, నా ప్రేమ గురించి ఆలోచించలేదా. ఆరోజు నేను వెళ్లిపోయింది నువ్వు నో అందుకు కారణం - నేను నిన్ను ఎలా చూసుకుంటానో నీకు తెలీదేమో అని. ఎందుకంటే నాకు జాబ్ అప్పుడే వచ్చింది అది కూడా చిన్నది, నిన్ను చూసుకునేటందుకు ఇంకా అర్హత పొందాలని. ఇప్పుడు నేను చాలా మంచిగా సెటిల్ అయ్యాను. నిన్ను చాలా బాగా చూసుకుంటాను. చిన్నపటినుంచి చూస్తున్నావు కదా. ఎప్పుడు కూడా నాపైన ఏ ఫీలింగ్ కలగలేదా, నేను చూపించిన ప్రేమ నీకు తెలియలేదా. దూరం అయితే విలువ తెలుస్తుంది అనుకున్న. ఇప్పటికి ఆలస్యం, తొందర ఏం లేదు. ఆలోచించి చెప్పు వర్ష.

అది కాదు జాన్, ఇలా అందరి ముందు చెప్తే నేనేం చేయను. నాకు నీతో ఉండటం ఇష్టమే కానీ అది ప్రేమ అని చెప్పలేను. నువ్వు లేనప్పుడు బాధపడ్డాను కానీ నేను ఆగిపోలేదు కదా. నిన్ను నేను బాధపెట్టకూడదు అనే ఉంది. నువ్వు నాతో ఇంతకముందు లాగ ఉండలేకపోతున్నావు, అలాగే నేను కూడా. ఇప్పుడు అన్ని మర్చిపోయి దెగ్గరవ్వచ్చు కదా. ఆరోజు నేను చాలా గట్టిగ చెప్పాను అని నాకు తెలుసు, అయినా నువ్వు ఈరోజు మల్లి నాకోసం వచ్చినందుకు, నన్ను నువ్వు చాలా ప్రేమిస్తున్నావని తెలుస్తుంది. కానీ అదే ప్రేమ నాలో ఉండాలి కదా. నీ అంత ప్రేమని నేను ఇవ్వలేకపోతున్నందుకు నన్ను క్షమించు.

నేను లేకుండా నువ్వు ఉండగలవేమో కానీ, నేను ఉండలేను. నీకు ఎలా చెప్పమంటావు. ఇదే ఆఖరి మాట అంటావా? ఇన్నేళ్లు నీకు దూరంగా ఉన్నా, నీ జ్ఞాపకాలతోనే నేను నిండిపోయి ఉన్నాను. ఈరోజు కోసం వేచిఉన్నాను. నీ కోసం ఇలాగే వేచిఉంటాను. నీకు అనిపించినప్పుడే చెప్పు వర్ష.

నీకు ఎలా చెప్పాలో, నాకు అర్ధం కావట్లేదు జాన్. మనం మంచి ఫ్రెండ్స్ లాగ ఉందాము.

(వర్ష ఎప్పటికైనా జాన్ ప్రేమని అర్ధం చేసుకుంటుంది అన్న భావంతో జాన్ మల్లి చెన్నైకి వెళ్ళిపోతాడు)

అరేయ్ ఆర్య నేనొకటి చెప్పాలి. ఈరోజు వర్ష బర్త్డే కోసం తన లవర్ జాన్ ఎంత బాగా డెకరేషన్ చేసాడో. తనకి ఎంత క్యూట్గా ప్రపోస్ చేసాడో. కానీ తను ఒప్పుకోలేదు. పాపం చాలా ఫీల్ అయ్యాడు. చిన్నపాటి నుంచి ప్రేమిస్తున్నాడంట.

అయితే నన్నేం చేయమంటావు. వాళ్ళిద్దరిని కలపమంటావా? నన్ను మీ కంపెనీ లో జాయిన్ చేసుకో అప్పుడు చేసి చూపిస్తా.

ఏంటి నీ లవర్ని కలుసుకోవడానికా?

లేదక్కా, నీకు చెప్పా కదా అది ఊరికే రాసా అని. తను ఎందుకు ఒప్పుకోలేదు అయినా?

ఏమోరా తనకి ఇష్టం ఉన్నట్టే ఉంది కానీ ఎందుకో వెనకడుగు వేస్తున్నట్టనిపిస్తుంది. ఇష్టం అంటుంది, ఫ్రెండ్ అంటుంది.

(ఇప్పటికే ఆలస్యం అయిపోయింది.అతను చిన్నపటినుంచి తనతో ఉన్న తనని ప్రేమించలేదంటే, ఇక నన్ను అసలు లెక్కే చేయదు. ఎలాగైనా తనకి నేను దెగ్గర కావాలి.అని ఆర్య, వర్ష గురించి ఆలోచిస్తున్నాడు)

(ఆ తర్వాత రోజు)

నిన్న మీ బర్త్డే అంట కదా. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే.

థాంక్యూ సర్. ప్రాజెక్ట్ 50% కంప్లీట్ అయిపోయింది.

వెరీ నైస్. నిన్న జరిగిన విషయం తెలిసింది. మీరు ఎందుకు జాన్ ని రిజెక్ట్ చేశారు. సారీ ఇది మీ పర్సనల్ కానీ మీకు ఇష్టం ఉంటె చెప్పొచ్చు.

సారీ సర్. దానికి రీసన్ నాకు తెలీదు.

నేను మీకు జాన్ గురించి చెప్పాలి. అతను మూడేళ్ళ క్రితం ఒక బేసిక్ పే తో బెంగళూరు లో కంపెనీ లో జాయిన్ అయ్యాడు. కానీ ఇప్పుడు నెలకి ఐదు లక్షలు సంపాదిస్తున్నాడు. నేను సంపాదన గురించి చెప్పాలని అనుకోవట్లేదు. జస్ట్ మూడేళ్ళలో అంత డెవలప్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. తను నీకోసం అదంతా చేసాడు అని తెలిసింది. ఇప్పుడు మనం చేసే ప్రాజెక్ట్ ఏ, జాన్ కూడా చేస్తున్నాడు. వాళ్ళది 75 % అయిపోయింది.

నాకేం అర్ధం కావట్లేదు సర్. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?

అంటే మనకి ఈ ప్రాజెక్ట్ చాలా ముఖ్యం. మీరు లీడ్ గా చేస్తున్న ఫస్ట్ ప్రాజెక్ట్. కొంచెం మీరు అడిగితే జాన్ మనకి ఏమైనా హెల్ప్ చేస్తాడేమో అని.తన వర్క్ మీద కొంచెం భయం. ఇంకో వారం లో 80% అయిపోతుంది. క్లైంట్స్ కి కూడా నచ్చేస్తుంది.

సారీ సర్, నేను అలా చేయాలనుకోవటంలేదు. అది రైట్ కాదేమో అనిపిస్తుంది. నేను అవసరం కోసం అడిగినట్టుంటుంది. అయినా మన వర్క్ మీద మనకి గట్టి నమ్మకం ఉంటె ఎదుటివారిని చూసి ఎందుకు బయపడతాం సర్. మీరు భయపడాల్సిన అవసరం లేదు. అయిపోడం కాదు సర్ ముఖ్యం, మనం ఎంత బాగా చేసాం అనేది ముఖ్యం.

మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోలేదు వర్ష. కంపెనీ కోసం అడిగాను. మీకు ఇష్టం లేకపోతే ఓకే.

(వారం రోజుల తర్వాత,నిషా, వర్ష కి కాల్ చేస్తుంది)

వర్ష, ఎలా ఉన్నావ్? నువ్వు బానే ఉంటావ్ కానీ ఇక్కడ జాన్ అసలు బాగాలేడు. కంపెనీ కి కూడా రావట్లేదు. ఇక్కడ మా ప్రాజెక్ట్ అసలు ముందుకి కదలట్లేదు. జాన్ తో ఒకసారి మాట్లాడు.

నేను బాగున్నానని ఎవరు చెప్పారు. నీకు తెలీదా నేను ఎలా ఉన్నానో అని? జాన్ లేని రోజులు గడిచిపోయినా ఇప్పుడున్నంత బాధ అప్పుడు లేదు. తనని నేను బాధపెట్టాలనుకోవటం లేదు. నా వల్ల తను బాధపడుతున్నాడని నేను బాధపడుతున్న.

అసలు ఎందుకు తన మీద నీకు ప్రేమ లేదు? నాకు చెప్పకపోయినా పర్వాలేదు, తనకి చెప్పు. ఒకటి , నువ్వు తనని ప్రేమించడం. రెండు, నువ్వు ఇంకొకరిని ప్రేమించడం. జాన్ తో మాట్లాడు.

సరే నిషా, నేను జాన్ తో మాట్లాడతాను.

(వర్ష జాన్ కి కాల్ చేస్తుంది)

జాన్, నీ ప్రేమ నాకు అర్ధం అయ్యింది. నువ్వు నన్నెంతో ప్రేమిస్తున్నావో అంతే నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నాను. నేను నీకు ఆరోజే చెప్పాలనుకున్న కానీ ఎలానో తెలియలేదు. నువ్వు, నా మీద ఏ ఆశలు పెట్టుకోవద్దు, దయచేసి నన్ను నీ ఆలోచనల నుంచి తీసెయ్యి.

నువ్వు చెప్పేది నమ్మమంటావా వర్ష? ఇన్నేళ్లు నాకు తెలిసినంత వరకు నువ్వు ఎవ్వరితో సరిగ్గా మాట్లాడలేదు, నీ పనేదో నువ్వు చేస్కుంటుంటావు. నా ప్రేమను ఒప్పుకోకూడదని, నేను నిన్ను మర్చిపోవాలని నువ్వు అలా అంటున్నావా?

లేదు జాన్. నేను నిజంగానే చెప్తున్నాను. నీకెలా తెలుస్తుంది నువ్వే చెప్పావ్ కదా ఎవ్వరితో మాట్లాడాను అని, నీతో కూడా నేను ఎప్పుడు చెప్పలేదు.

ఎవరు వర్ష అతను?

ముందు నువ్వు , నా గురించి కాకుండా నీ పని మీద ద్యాస పెట్టు. నువ్వెప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ వుంటావు కదా, అలా ఉండు. మన మధ్య ఈ దూరం తగ్గినప్పుడు చెప్తాను.

నేను అంత త్వరగా దీన్ని నమ్మలేను వర్ష. నాకు కొంచెం టైం పడుతుంది.

అలా కాదు జాన్. మనల్ని ప్రేమించే వారి సంతోషమే కదా మనకి ముఖ్యం. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నేను సంతోషంగా ఉండాలంటే నువ్వు సంతోషంగా ఉండాలి, అంటే నన్ను ప్రేయసి లాగ కాకుండా, ఒక మంచి స్నేహితురాలిగా చూడు.

ఆలోచించి చెప్తాను వర్ష, నువ్విలా అంటుంటే ఎదోలాగా ఉంది. నాకేం అర్ధం కావట్లేదు. నీ జ్ఞాపకాలని ఎలా చెరపను. నువ్వింకొకరిని ఎందుకు ప్రేమిస్తున్నావు? ఒక్క కారణం చెప్పు చాలు.

నా భావాలను నేను ఎప్పుడు బయటపెట్టను, నేనేం అనుకుంటున్నానో ఎవరికీ తెలియదు. నేను చెప్పకుండానే నన్ను అర్ధం చేసుకుంటాడు, నేను కోరుకునే తోడు, నేనెప్పుడూ ఒంటరి కాదని తెలిసేలా చేస్తాడు. నాలో ఇంకొకరిని గుర్తించాడు. చెప్పడానికి కారణాలు అవసరం లేదనేలా ప్రేమనిస్తాడు.

సరే వర్ష నాకు అర్ధమయ్యింది. నిన్ను బలవంతం చేయలేను. నీపై ఈ ప్రేమను తీసివేయడం కష్టాంగా ఉన్న, నీ కోసం నిన్నే నేను వదిలేస్తున్న. నిన్ను,d నేను స్నేహితురాలిగా చూడాలంటె ఇంకొంచెం సమయం పడుతుంది.

ఒక దాన్ని మర్చిపోవాలంటే , ఇంకొక దాని మీదకి ద్యాసని మళ్లించాలి. నీ ప్రాజెక్ట్ మీద ఫోకస్ చెయ్యి.

(వర్ష వాళ్ళ టీం 75% ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు. రవీంద్ర కి చూపించారు)

వెల్డన్ వర్ష. మీరు చెప్పినట్టే చాలా బాగా చేశారు. మీరు ఇంత ఫాస్ట్ గా చేస్తారని అనుకోలేదు. ఈ ఈవెనింగ్ మనం పార్టీ చేసుకుంటున్నాం. అందరు ఫామిలీ తో రావాలి.

(బిందు, ఆర్యని పార్టీ కి తీసుకొస్తుంది)

హలో వర్ష, గుర్తున్నానా నేను?

హాయ్ ఆర్య, నేను మర్చిపోలేదు. అందరు గుర్తున్నారు. ఇప్పుడు పక్క కంపెనీలో జాబ్ చేస్తున్నావు కదా.

అవును, మీ కంపెనీలో నాకు జాబ్ ఇప్పించొచ్చుగా.

మీ అక్క బిందు, సీనియర్ని అడగకుండా నన్ను అడిగితే ఎలా?

ఎందుకంటే నువ్వు ఇప్పుడు టీం లీడ్. నువ్వు వెరీ టాలెంటెడ్. నువ్వు చెప్తే సీఈఓ కూడా ఏదైనా చేస్తాడు అంటగా.

అదేం లేదు. నీ అంత టాలెంట్ ఇక్కడ ఎవరు తట్టుకోగలరు. మీరు ఇక్కడ కాదు ఎక్కడో ఉండాలి.

ఇది మరి కామెడీగా ఉంది. ఈరోజు డ్రెస్ లో చాలా బాగున్నావు వర్ష.

థాంక్యూ ఆర్య.

(వర్ష, ఆర్య ని చూసి బిందు)

ఏంటి వర్ష , నువ్వు ఆర్య క్లాస్మేట్స్ ఆ? నువ్వు మ్యూజిక్ నేర్చుకున్నావా?

అవును బిందు, ఏమైంది?

ఏం లేదు, ఆర్య ఎప్పుడు నీ గురించే చెప్తుంటాడు.

లేదు, అదేం కాదు వర్ష. ఒక నిమిషం.

(బిందుని పక్కకు తీసుకెల్లి ఆర్య)

ఏంటి అక్క, నీకేం కావలి? ఆ బుక్లో రాసింది వర్ష గురించే. చూస్తూనే ఉన్నావు కదా. తనకి అసలు ఎలా చెప్పమంటావు. ఎప్పుడు కలిసిన చూడు అందరితో ఒకే లాగ ఉంటుంది. నేను ప్రొపోజ్ చేసిన , జాన్ లాగ నన్ను రిజెక్ట్ చేయడం కన్న చెప్పకుండా ఉంటేనే బాగుంటుంది.

అయితే నిజంగానే వర్ష ని ప్రేమిస్తున్నావు. నిన్ను ఈ కంపెనీ లో తీసుకునేలా నేను ట్రై చేస్తా.

(రవీంద్ర, ఆర్యని చూస్తాడు)

నువ్వు పక్క కంపెనీ లో వర్క్ చేస్తావు కదా, ఇక్కడ ఏంటి?

బిందు, మా సిస్టర్ సర్. తనతో వచ్చాను. నా పేరు ఆర్య.

నైస్ మీటింగ్యు ,ఆర్య. బిందు ఇష్టాలేంటో చెప్తావా?

ఎందుకు సర్? తనకి పెయింటింగ్స్, క్రాఫ్ట్స్ అంటే చాలా ఇష్టం.

నాకు బిందు అంటే చాలా ఇష్టం, తనతో మాట్లాడాలి, తనకి నచ్చింది చేయాలనిపిస్తుంది.

అవునా సర్. మీరు ఏమి అనుకోకపోతే నన్ను మీ కంపెనీ లో తీసుకుంటారా. నేను , మిమ్మల్ని అక్కని కలుపుతాను.

కచ్చితంగా. రేపటి నుంచి వచ్ఛేయి.

థాంక్యూ వెరీ మచ్, బావ.

ఇది మనిద్దరి మద్యే ఉండాలి, బామ్మర్ది.

(ఆర్య ఎదురుచూసిన సమయం వచ్చేసింది)

అదేంట్రా, మా కంపనీ లో నువ్వు, ఎలా?

మా టాలెంట్, మాకుంటుంది. నువ్వు ఎలాగో చేయలేదుగా.

అవునా, మా సీఈఓ చాలా స్ట్రిక్ట్. ఎవర్ని పడితే వాళ్ళని అసలు పట్టించుకోరు.

ఆగు ఇప్పుడే చూపిస్త మేమెంత క్లోజ్ అని.

(ఆర్య, రవీంద్ర ఇద్దరు ఫ్రెండ్స్ లాగ మాట్లాడుతుంటారు. అది చూసి బిందు వీడేలా, ఇలా అని ఆలోచిస్తుంది. ఆర్య ని వర్ష టీం లో వెయ్యమని, సీఈఓ ని అడుగుతాడు ఆర్య)

ఓకే ఆర్య, రియాజ్ రావట్లేదు. తన ప్లేస్ లో నిన్ను పెడతాను. నువ్వు వర్ష టీం మెంబెర్.

థాంక్యూ బావ.

థాంక్యూ కాదు, మీ అక్కని నన్ను నువ్వే కలపాలి.

దాని గురించి మీకెందుకు, నేను చూసుకుంటానుగా బావ.

(ఆర్య, వర్ష దెగ్గరికి వెళ్తాడు)

హలో మేడం, నేను కొత్త్తగా జాయిన్ అయ్యాను. నా పేరు ఆర్య, మీ టీం మెంబెర్ని.

నిన్ననే అన్నావు , ఈరోజే జాయిన్ అయిపోయావ్ ఎలా ?

ఎదో మేడం మీ దయ.

అదేం లేదు.

ప్రాజెక్ట్ దాదాపుగా అయిపోయినట్టేగా. వర్షం పడుతుంది మనం ఒక కప్ కాఫీ తాగొద్దామా?

నాకు వర్షం లో కాఫీ తాగడం చాలా ఇష్టం.

(ఆర్య, వర్ష కాఫీ కోసం కెఫెటేరియా కి వెళ్తారు)

నాకు వర్షం లో తడవడం అంటే చాలా ఇష్టం, ఆర్య. అన్ని సీసన్స్ కన్నా నాకు వర్ష కాలం అంటేనే ఇష్టం.

నాకు కూడా వర్ష అంటే చాలా ఇష్టం.

ఏంటి?

అదే వర్షం అంటే చాలా ఇష్టం.

అలా వర్షం లో రైడ్ కి వెళ్లడం అంటే ఇంకా ఇష్టం.

మరి ఎందుకు ఇక్కడ ఉండేది, పద వెళ్దాము.

మల్లి కంపెనీ కి రావాలి కదా, తడిచిపోయి ఎలా వస్తాం.

అదంతా ఎందుకు, ఇప్పుడు రైడ్ కి వెళ్ళాలి అదే ఇంపార్టెంట్. పద నేను నా బైక్ లో తీసుకువెళతాను.

లేదు, నేనొక్కదాన్నే వెళ్లడం ఇష్టం. అలా పాటలు పాడుతూ , రైడ్ చేస్తూ వెళ్తాను. కానీ ఇప్పుడు వద్దులే.

అదేం కుదరదు, నా కోసం. నువ్వు పాటలు పాడు, ఏదైనా చేయి కానీ నా బైక్ లో వెళ్దాము. కావాలంటే నేను సీఈఓ తో వెళ్లి మాట్లాడతాను. ఆగు ఒక 5 నిమిషాలలో వచ్చేస్తా.

(ఆర్య, సీఈఓ దెగ్గరకు వెళ్లి)

బావ , పద అక్కని తీసుకుని వర్షం లో ఒక రైడ్ కి. అక్కకి వర్షం అంటే ఇష్టం. నేను, వర్ష కూడా వస్తాము.

అవునా, కానీ నాకు వర్షం లో తిరిగితే జలుబు చేస్తుంది.

ఎవరికైనా అలానే ఉంటది, కానీ ఇలాంటి చిన్న చిన్నవి చేయకపోతే ఎలా మా అక్క దొరుకుతుంది నీకు.

సరే, మీ అక్క కోసమే.

(ఆర్య, బిందు దెగ్గరికి వెళ్తాడు)

నేను, వర్ష ఇప్పుడు రైడ్ కి వెళ్ళాలి. దాని కోసం నువ్వు,సీఈఓ సర్ తో రైడ్ కి రావాలి.

అదేంటి మీరిద్దరూ వెళ్ళటం కోసం నేను , సర్ తో ఎలా. అయన, నాతో ఎందుకు వస్తారు.

వస్తున్నారు అక్క. నువ్వు రాకపోతే అంతే. ఇప్పటి వరకు ఏమి చేయలేదు నువ్వు. ఇదొక్కటైన చేయి అక్క. లేకపోతే వర్ష నాకు దూరం అవుతుంది. ఎదో కొంచెం టైం ఉన్న ఉపయోగించుకోవాలి కదా.

సరే ఏడవకు. వస్తా.

( అలా నలుగురు , రెండు బండ్ల మీద రైడ్ కి వెళ్తారు)

(బిందు, రవీంద్ర )

సర్, మీరు ఎందుకు మా తమ్ముడికి జాబ్ ఇచ్చారు?

ఆర్య చురుకైనవాడు. బలే మాట్లాడతాడు. ప్రెసెంటేషన్స్ బాగా చేస్తాడు అని నా ఫ్రెండ్ అదే పక్క కంపెనీ సీఈఓ చెప్పాడు. ఆర్య కి మన కంపెనీ మీద ఇంటరెస్ట్ ఉందన్నాడు అందుకే జాబ్ ఇచ్చాను. అయినా తమ్ముడికి జాబ్ వస్తే హ్యాపీగా ఇద్దరు కలిసి వర్క్ చేసుకోవచ్చు కదా.

కానీ సర్, ఎందుకు ఈ రైడ్ కి ఒప్పుకున్నారు? మిమ్మల్ని ఏదోకటి చెప్పి ఇలా చేసి ఉంటాడు. వాడిని అసలు నమ్మద్దు. వాడు, వర్ష కోసం వచ్చాడు. ఇదంతా తన కోసమే.

అవునా, ఆర్య, వర్ష ఎలా? నేను ఈ రైడ్ మీకోసం ఒప్పుకున్నాను.

ఏంటి సర్?

బిందు, నువ్వంటే నాకూ చాలా ఇష్టం. మన ఇద్దరినీ కలుపుతానని ఆర్య అన్నాడు. నేను ఇది ఎప్పటినుంచో చెప్పాలనుకుంటున్నాను. నువ్వు చాలా అందంగా ఉంటావు, అందరితో చాలా బాగా మాట్లాడతావు, అందరికి హెల్ప్ చేస్తావు, అన్నిటిని బాలన్స్ చేస్తావు. ఐ లవ్ యు, బిందు.

సర్, మీరు ఇలా చెప్తే, నేనెలా నో అనాలి. లవ్ యు టూ సర్.

నిజంగానా, నా ప్రేమను అంగీకరించినందుకు థాంక్యూ సో మచ్.

సర్, మీరు వచ్చాక కంపెనీ లో చాలా మార్పులు వచ్చాయి, మీరు కంపెనీని చాలా బాగా చూసుకుంటారు, ఎంప్లాయిస్ అందరిని మీరు ఎంతో ఆదరిస్తారు. మీకు ఏ సంబంధం లేని వారినే అంతా బాగా చూసుకుంటే ఇక మీ ప్రేమికురాలిని ఇంకా ఎంత బాగా చూసుకుంటారో.

నువ్వు నాకు దొరకడం నా అదృష్టం. నా మీద నీకు ప్రేమ ఉండ4టం ఇంకా అదృష్టం. సర్ ఎందుకు , రవి అని పిలువు.

చాలా బాగుంది రవి. కానీ మనల్ని కలుపుతానన్న ఆర్య ఎం చేసాడు, తన లవ్ తో వెళ్ళిపోయాడు.

అయినా ఆర్య ని వర్ష ఇష్టపడుతుందా? జాన్నే వద్దనుకున్నా వర్ష, ఆర్య ని ఎలా ఇష్టపడుతుంది?

ఏమో రవి, ఆర్య తనకోసం ఎదురుచూస్తున్నాడు కానీ ఏమి చెప్పట్లేదు, చెప్తేనే కదా తెలుసుతుంది మల్లి చెప్తే నో అంటుందేమో అని భయం. ఆర్య, జాన్ అంత కాకపోయినా ఎదో తనంతో అయ్యే పనులు ఏవో చేస్తున్నాడు.

అయితే మనం వాళ్లిద్దరినీ కలిపే ప్రయత్నం చేదాం.

కచ్చితంగా రవి.

(వర్ష, ఆర్య )

వర్ష, ప్రేమ గురించి నువ్వేం అనుకుంటున్నావు?

అమ్మ ప్రేమ చాలా గొప్పది. అమ్మ మనల్ని మోసేది తొమ్మిది నెలలు కానీ నాన్న మనల్ని జీవితాంతం మోస్తాడు అని అంటారు. కానీ ముందు నాన్న మోయాలంటే, అమ్మ మోయాలి కదా.

నీకు అమ్మ అంటే ఎక్కువ ఇష్టం కదా.

లేదు, నాన్నంటేనే ఇష్టం. అమ్మ ఎప్పుడు కోప్పడుతుంది, పనులు చేయమంటుంది, ప్రతి ఇంట్లో ఉండే గోలే.

ఇద్దరు సమానమంటావా?

కాదు, నాకు అమ్మ ఎక్కువ.

నువ్వు ప్రేమను ఎలా చెప్తావు?

నేను ప్రత్యేకంగా చూపించాలనుకొను, మనం చేసే పనుల్లో అది తెలిసిపోతుంది ఎంత ఇష్టమో అని. స్పెషల్గా ఐ లవ్ యు అని చెప్పకపోయినా, మన మీద వారికి, వారి మీద మనకి ఉన్న ఫీలింగ్ ఎప్పటికి పోదు.

వర్ష, ప్రేమ అంటే అమ్మ, నాన్న తర్వాత ఇంకెవరు?

ఇంకెవరు మన చుట్టూ ఉన్నవాళ్ళంతా.

అందరిని ప్రేమిస్తావా?

చెప్తాము కదా ప్లెడ్జి లో ఐ లవ్ మై కంట్రీ అని, దాంట్లో అందరు వస్తారుగా.

చెప్తాము కానీ అందరిని ప్రేమిస్తావా?

లేదనుకో కొంత మంది మీద కోపం వస్తది, కొంత మంది అసలు మనకు తెలీదు, గ్రూప్స్ లాగ ఉంటారు, నేను ఏ గ్రూప్ కాదు. అమ్మ, నాన్న తర్వాత ఎవరు లేరు అయితే. ఇంట్లో నేనొక్కదాన్నే.

ఫ్రెండ్స్?

ప్రేమించే ఫ్రెండ్స్ అంటే అలా లేరేమో? నార్మల్ ఫ్రెండ్స్ నిషా, ఆఫీస్లో వాళ్ళు, మన కాలేజీ వాళ్ళు.

జాన్?

ఆర్య, నీకు జాన్ తెలుసా?

లేదు, అక్క చెప్పింది. నీకు ప్రొపోజ్ చేసాడని. నువ్వు నో అన్నావు అని.

అవును, నేను జాన్ ని ప్రేమించలేదు. మూడేళ్ళ క్రితం వరకు పక్కింట్లో ఉండేవాడు.

ఎందుకు వర్ష రిజెక్ట్ చేసావు?

నాకు ప్రేమ అంటే తెలీదు, అమ్మ, నాన్న తో ఉన్న ఫీలింగ్ వేరొకరి తో ఉంటె వచ్చేదే కదా. అది ఎప్పుడు లేదు. అంటే ఇష్టం. ఉంటె బాగుంటుందని కానీ లేకపోతే నేను ఉండలేను అని కాదు.

అంటే ఇప్పటి వరకు అలా ఎవరు లేరా?

ఆర్య, ఎందుకు ఇవన్ని ఇప్పుడు?

లేదు వర్ష, నేను ఊరికే అడిగాను.

(వర్ష ని ఇంటి దెగ్గర డ్రాప్ చేస్తాడు)

ఆర్య, మా ఇంటి అడ్రస్ నీకు ఎలా తెలుసు?

నువ్వే ఒకసారి కాలేజీ లో చెప్పావు.

(తర్వాత రోజు వర్ష కంపెనీ కి వెళ్ళలేదు, నిషా కాల్ చేస్తుంది)

వర్ష, ఏం చెప్పావు జాన్ కి? తను జాబ్ రిజైన్ చేసాడు. ఇదంతా తను నీకోసమే చేసాడు, నువ్వు లేకపోతే తనకి ఇదంతా వద్దంటా. నిజంగానే నువ్వు వేరొకరిని ప్రేమిస్తున్నావా?

(అలా మాట్లాడుతున్నప్పుడే, ఆర్య కాల్ చేస్తాడు. వర్ష చూసుకోకుండా, నిషా కాల్ హోల్డ్ లో పడిపోయి ఆర్య కాల్ లిఫ్ట్ అయిపోతుంది)

అదేంటి? నువ్వే కదా కుదిరితే తనని ప్రేమిస్తున్నానో లేకపోతే వేరొకరిని ప్రేమిస్తున్నానో చెప్పమన్నావు. వేరొకరిని ప్రేమిస్తున్నాని చెప్పా. జాన్ నా కోసం జాబ్ మానేయడం ఏంటి? నిషా, నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు. జాన్ ని ప్రేమిస్తున్నాని చెప్పాలా? అది చెప్తే మల్లి మాములుగా ఉంటాడా? ఎలా అలా మనసు అనేది ఉండదా నాకు?

వర్ష, ఆగు కంగారు పడకు. నేను ఆర్యని . నువ్వెందుకు కంపెనీ కి రాలేదో అని ఫోన్ చేసా. నీకు ఇష్టం లేకుండా నువ్వు ప్రేమించక్కర్లేదు. నేను సాల్వ్ చేస్తాను ఇది.

సారీ, నేను చూసుకోలేదు,ఆర్య. నిన్న వర్షం లో బాగా తడిచేసరికి ఈరోజు ఫీవర్ వచ్చింది, అందుకే రాలేదు. అయినా నా ప్రాబ్లెమ్ నువ్వెందుకు నేత్త్తిన వేసుకుంటావు.

లేదు వర్ష, నేను నిన్ను అడగడట్లేదు, చేస్తానని చెప్తున్నా. నువ్వు నిషా తో నన్ను ప్రేమిస్తున్నాని చెప్పు. మనిద్దరం ఒకసారి బెంగళూరు వస్తామని చెప్పు.

ఏంటి? ఆర్య, నేను ఇలా ఎలా చేస్తానని అనుకుంటున్నావు?

లేదు వర్ష, నేనేమి కావాలని చెప్పట్లేదు, జాన్ నీ కోసం తన జాబ్ వదిలేసుకున్నాడంటే తను అసలు నిన్ను ఎలా మర్చిపోతాడనుకుంటున్నావు? నువ్వు ఇంకొకరిని ప్రేమిస్తున్నాని చెప్తే తను ఎలా నమ్ముతాడనుకున్నావు? పిచోడైపోతాడు. ముందు నిషా కి చెప్పు.

తర్వాత ఏం చేస్తావ్?

నేను చెప్తా వర్ష. నన్ను నమ్ము.

(ఆర్య చెప్పినట్టే వర్ష చేస్తుంది )

అవునా వర్ష, మరి నాకు ఎప్పుడు చెప్పలేదు?

మేము ఒకే కాలేజీ లో చదువుకున్నాం, ఇప్పుడు మా కంపెనీలోనే పని చేస్తున్నాడు.

సరే నీ ఇష్టం వర్ష, జాన్ ని త్వరగా మార్చండి.

(కంపెనీ లో వర్ష, ఆర్య)

ఏంటి ఆర్య, నాకేం అర్ధం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి?

ఇదిగో వర్ష , సీఈఓ పర్మిషన్ ఇచ్చారు. పద మనం బెంగళూరు వెళ్తున్నాం ఇప్పుడు.

అదేంటి ఎలా ఇచ్చారు, మనం ఏం చేయడానికి వెళ్తున్నాం అని చెప్పావు?

అదంతా ఎందుకు, నీకు చెప్పా కదా మనం వెళ్తున్నాం అని నిన్న కాల్ లో. పద పద.

ఏంటో నాకేమి అర్ధం కావట్లేదు.

మన కంపెనీ, జాన్ కంపెనీ ఒకే ప్రాజెక్ట్ మీద చేస్తున్నాం అని తెలుసు కదా. కొలాబరేషన్ కి ట్రై చేయడానికి వెళ్తున్నాం. జాన్ అక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేవాడు, కానీ జాన్ లేకపోవడం తో వాళ్ళ ప్రాజెక్ట్ లో మూడు వారాల నుంచి నో ఇంప్రూవ్మెంట్.

నిన్న జాన్ ని మార్చాలి అన్నావ్, ఇప్పుడేమో కంపెనీ గురించి చెప్తున్నావ్?

వర్ష, ఎలా వెళ్తున్నామో చెప్తున్నా. అక్కడికి వెళ్లి ఏం చేస్తామో నువ్వే చూస్తావ్.

(బెంగళూరు చేరుకుంటారు. ఆర్య, జాన్ తో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్తాడు. జాన్ కి ఆర్య ఎవరో తెలీదు కానీ వర్ష వచ్చింది అని చెప్పగానే సరే అంటాడు. వర్ష, ఆర్య, జాన్ ముగ్గురు ఒక కేఫ్ లో మీట్ అవుతారు )

జాన్, నేనే మీకు కాల్ చేసాను. నా పేరు ఆర్య. మేము , మీరు చేసే ప్రాజెక్ట్ ఒకటే. మీరు వర్ష వల్ల ఈ జాబ్ వదిలేసుకున్నారు కానీ మీరు కంపెనీస్ గురించి ఎందుకు ఆలోచించలేదు. మీరు చాలా టాలెంటెడ్, అతి తక్కువ సమయం లో ఎంతో పై స్థాయికి రీచ్ అయ్యారు.

సారీ ఆర్య, మీరెందుకు ఇదంతా చెప్తున్నారో నాకు అర్ధం కావట్లేదు. నేను, వర్ష కోసం వచ్చాను. వర్ష నువ్వు మాట్లాడు.

నేనే , వర్షని ఇక్కడికి తీసుకువచ్చాను. తను నన్ను ప్రేమిస్తుంది. తనకి ఇష్టం లేదన్న కూడా మీరు ఎందుకు తనని ఇంకా ఇబ్బంది పెడుతున్నారు? నేను దీని గురించి మాట్లాడటానికి రాలేదు. మన ప్రాజెక్ట్ గురించి వచ్చాను.

ఆర్య, ఇది నాకు, వర్ష చెప్పాల్సిన సమాధానం. నువ్వు కాదు. ఇప్పటిదాకా వర్ష చెప్పింది నమ్మలేదు, కానీ ఇప్పుడు తను చెప్పాలి.

జాన్, నేను ప్రేమిస్తున్న వ్యక్తి ఆర్య. తను నా క్లాస్మేట్, ఇప్పుడు మా కంపెనీ లోనే వర్క్ చేస్తున్నాడు. మనం కలిసి ప్రాజెక్ట్ ని కాలాబోరేటెడ్ గా చేదాం అనే ప్రపోసల్ తో వచ్చాము. నువ్వు లీవ్ అయిపోతే అక్కడ నీ టీం లో ఉన్న నా ఫ్రెండ్ నిషా, తన ఫస్ట్ ప్రాజెక్ట్ , తన జాబ్ కి రిస్క్.

సరే వర్ష. మీరు బాగుండండి. మీ ప్రాజెక్ట్ మీరు చేసుకోండి.

జాన్, మా ప్రాజెక్ట్ మేము చేసేటందుకు అయితే నిన్ను ఎందుకు కలుస్తాము. నువ్వు ఈ ప్రాజెక్ట్ లో ఉండాలి. ఈ ప్రాజెక్ట్ లీడ్ నువ్వే. మీ కంపెనీ తరపున నువ్వు, మా కంపెనీ తరపున వర్ష.

వర్ష లేనప్పుడు, నాకెందుకు ఇదంతా.

లేదు, జాన్. ఈ ప్రాజెక్ట్ ఈ నెల లో అయిపోతుంది, అప్పటి వరకు నువ్వు ఉండాలి. తర్వాత నీ ఇష్టం.

(జాన్ ఇంకా వర్ష తనని ప్రేమించొచ్చేమో అనే ఆశ తో )

కానీ ఆర్య, మీరు బెంగళూరు లో నే ఉండాలి. ఇది ఓకే అయితే నాకు ఓకే.

(ఆర్య, వర్ష ఒప్పుకుంటారు)

(వర్ష, ఆర్య కేఫ్ నుంచి బయటికి వస్తారు)

నాకేం అర్ధం కావట్లేదు ఆర్య.

వర్ష నువ్వెందుకు ఆలోచిస్తావ్? పద ఈ నెలంతా మనం ఈ ఊర్లోనే ఉండాలి. కొంచెం తిరిగిచూదాం. ముందు ఉండటానికి ప్లేస్, ఆ తర్వాత నిత్య అవసర వస్తువులు.

ఆపు ఆర్య, నేనేదో ఉంటానని అన్న కానీ మా అమ్మ కి ఏం చెప్పలేదు. బెంగళూరు వస్తున్నాననే తెలీదు. ఇంకా నువ్వు ప్లేస్, వస్తువులు అంటున్నావు.

నేను ఆంటీ తో మాట్లాడేసా. నువ్వు అన్ని మర్చిపో.

అవునా. ఎలా?

ముందు పద. తర్వాత చెప్తా.

(వర్ష, ఆర్య ఒక టూ బెడ్ రూమ్ ఫ్లాట్ లో దిగి ఫ్రెష్ అయ్యి)

వర్ష రేపు మనం సిటీ అంత తిరుగుతున్నాం, ఎల్లుండి కంపెనీ కి వెళ్తున్నాం.

ఎందుకు?

ఎందుకంటావ్ ఏంటి చూడటానికి. నీకు బెంగళూరు ఇష్టం అని చెప్పావ్ కదా.

నేనా, ఎప్పుడు?

నాకు తెలుసులే, ఊరికే ఎందుకు ప్రశ్నలేస్తావు. ఉన్న జీవితానాన్ని ఎక్స్ప్లోర్ చేయి వర్ష.

(రోజంతా వర్ష, ఆర్య చాలా సంతోషంగా ఉంటారు. తర్వాత రోజు కంపెనీ కి వెళ్తారు )

వర్ష, నువ్వు నా తో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది.

నాకు కూడా నిషా. ఇదిగో ఆర్య, తను నా..

ఆల్రెడీ తెలుసు కదా, ఈ పరిచయాలేంటి పని మొదలుపెట్టండి.

జాన్, నేను నీకు తెలుసు కానీ నిషా కి తెలీదు కదా. నిషా, ఐ యాం ఆర్య. వర్ష టీం మేట్.

(జాన్, ఆర్య ని వర్ష కి దూరంగా ఉంచాలని ట్రై చేస్తాడు కానీ ఆర్య ఎప్పుడు వర్ష పక్కనే తిరుగుతుంటాడు)

వర్ష, నువ్వు, నేను ప్రేమించుకుంటున్నాము అని జాన్ కి చెప్పినప్పుడు అలానే ఉండాలి కదా. కొంచమైనా నటించు వర్ష.

నా వల్ల కాదు ఆర్య, ఈ నటించడం అసలు నాకు ఇష్టం లేదు.

సరే నువ్ నటించొద్దు నిజంగానే ప్రేమించు.

ఏంటి?

అదే, నటించడం ఇష్టం లేదన్నావ్ కదా. ఐ లవ్ మై కంట్రీ లాగ. నా పై ఎదో జాలి, కరుణ తో కూడిన ప్రేమ కురిపించు చాలు.

అసలు, నువ్వు మాట్లాడేది నాకు ఏమి అర్ధం కాదు ఆర్య.

సరే మాములుగానే ఉండు.

(ఇదంతా చూస్తున్న జాన్)

నిషా, మనిద్దరం క్లోజ్ గా ఉన్నట్టుంటే వర్ష కి నా మీద కోపం వస్తుంది అంటావా?

నీ మీద ప్రేమ ఉంటె కచింతంగా వస్తుంది.

సరే, మనిద్దరం అలానే ఉందామా?

(నిషా కి జాన్ అంటే చాలా ఇష్టం, వర్ష కోసం చేసిన , ప్రేమని ఇస్తే ఎంత బాగా చూసుకుంటాడో అని ఊహించేది. ఇప్పుడు నిజం కాకపోయినా వచ్చిన అవకాశాన్ని నిషా వదులుకోవాలనుకోలేదు)

కచ్చితంగా జాన్, నీ కోసం నేనేమైన చేస్తాను.

(కానీ వర్ష ఏం పట్టించుకోదు)

(ప్రతి క్షణం వర్షని సంతోషంగా ఉంచాలనే తపన ఆర్య లో కనపడుతూనే ఉంటుంది)

(అలా ప్రాజెక్ట్ కంప్లీట్ స్టేజి లో.. జాన్, నిషా కలిసి అందరం పార్టీ కి వెళ్దాము అని అంటారు. వర్ష ముందు రానని చెప్పిన, ఆర్య తనని ఒప్పించి తీసుకువెళ్తాడు. జాన్, నిషా డాన్స్ వేస్తుంటారు)

వర్ష పద మనం డాన్స్ చేదాం.

ఆర్య ఇదంతా ఓవర్ గా ఉన్నట్టు లేదు.

వర్ష, మనిద్దరం ప్రేమించుకుంటున్నాం అని చెప్పి వాళ్లిద్దరూ డాన్స్ చేస్తుంటే మనం ఏం చేయకపోతే మల్లి జాన్ నువ్వు తనని ప్రేమిస్తావేమో అనుకుంటాడు. ప్రేమించడం కన్నా డాన్స్ చేయడం ఈజీ కదా నీకు.

సరే ఏదోకటి చెప్పి నన్ను మార్చేస్తావు.

(వర్ష ఫేవరెట్ మ్యూజిక్, డ్రింక్, ఫుడ్, పరిసరాలు అన్ని సెట్ చేసి)

వర్ష, ఐ లవ్ యు.

ఆర్య?

(జాన్ చూస్తున్నాడని , వర్ష కి ఏం చేయాలో అర్ధం కాక)

ఐ లవ్ యు, ఆర్య.

(అది చూసిన జాన్, వర్ష కోసం కొన్న రింగ్ నిషా వేలికి తొడిగేసి, బయటికి వెళ్ళిపోతాడు)

సో ఇదంతా మా కొత్త ప్రాజెక్ట్ డెమో. మా ప్రాజెక్ట్ లీడ్స్ వర్ష అండ్ జాన్. నేను ఆర్య, ప్రాజెక్ట్ ప్రేసెంటెర్.

(అక్కడికి డెలిగేట్స్ ని ఆర్యనే ఇన్వైట్ చేస్తాడు. అందరు క్లాప్స్ కొడతారు)

వెరీ ఇంప్రెస్డ్ ఆర్య. మీ ప్రాజెక్ట్ మాకు చాలా బాగా నచ్చింది.

థాంక్యూ ఆల్.

(వర్ష, ఆర్య ఫ్లాట్ కి వెళ్ళాక)

నాకు ఎందుకు ఏం చెప్పవు ఆర్య? అన్ని నువ్వే చూసుకుంటానంటావు.

ఇప్పుడేమైంది మన ప్రాజెక్ట్ అయిపోయింది, అందరికి నచ్చింది. హ్యాపీ కదా.

కానీ సడన్ గా నాకెందుకు అలా చెప్పావ్.

అంటే నువ్వు నటించడం ఇష్టం లేదన్నావు, నీ మూడ్ బట్టి ఆటోమేటిక్ గా ఎలా పరిసరాలు మారుతాయో చూపిద్దాం అనుకున్న. ముందే చెప్తే నువ్వు ఎలా, ఓపెన్ గా ఉన్నట్టు ఉండదు కదా.

అంటే?

అంటే మనం చేసే ప్రాజెక్ట్ అదేగా వర్ష ,ఎమోషన్ రెకగ్నిషన్ & మూడ్ బేస్డ్ ఆటోమేషన్.

కానీ నువ్వు ,నన్ను ప్రేమిస్తున్నాని చెప్పావు. అప్పుడు నేను నిజంగానే ప్రేమిస్తున్నాన?

అది నాకెలా తెలుస్తుంది. ఎక్కువ ఆలోచించకు.

నువ్వు , నన్ను ప్రేమిస్తున్నావా?

రేపు మనం ఇంటికి వెళ్ళాలి, త్వరగా నిద్రపోవాలి.

(ఆర్య తను రూమ్ లో కి వెళ్ళి, చెప్పలేని, పట్టలేని సంతోషంలో తనలో తానే సతమతమైపోతాడు. వర్ష తనకు తెలియని ప్రేమ ఏంటో అని ఆలోచిస్తుంటుంది)

ఆర్య , నన్నెందుకు ఏమి అడగడు. కానీ అన్ని తెలిసిపోతాయి. నాకు నచ్చినవి చేసేస్తుంటాడు. నేను, నాకు తెలియకపోయిన, తనకి ఎలా తెలుస్తుంది. ఇదేనా ప్రేమంటే? ఈ నెల రోజులు అమ్మ తో లేకపోయినా, మిస్ అవ్వకుండా ఉండేటట్టు ఆర్య నన్ను చూసుకున్నాడా? నా కోసమే ఇదంతా చేశాడా?

(తర్వాత రోజు ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. కంపెనీ లో వర్ష,ఆర్య కోసం స్పెషల్ అప్ప్రీసియేషన్ జరుగుతుంది)

ఇదంతా వర్ష చేసింది. నేను జస్ట్ ప్రెసెంటేషన్ ఇచ్చాను. కంగ్రాట్స్ వర్ష.

అందరి సపోర్ట్ తోనే ఇది చేయగలిగాము. జాన్ చాలా చేసాడు.

అవును, జాన్ ఇప్పుడు మల్లి ఆ జాబ్ లో జాయిన్ అయ్యాడు. నెక్స్ట్ వీక్ నిషా అండ్ జాన్ మ్యారేజ్. మనల్నందరిని ఇన్వైట్ చేసాడు.

(అందరు వాళ్ళ ప్లేసెస్ కి వెళ్ళాక)

ఎలా మ్యారేజ్?

నీకు ఏమి తెలీదు వర్ష. నిషా ట్రూ గా, జాన్ ని లవ్ చేసింది. నిన్న లాస్ట్ నైట్ వరకు జాన్ కి నీ పై హోప్ ఉంది కానీ, నువ్వు, నాకు చెప్పిన నెక్స్ట్ మినిట్ జాన్, నిషా కి రింగ్ తొడిగాడు. ఈ నెలంతా జాన్ నిన్ను టెస్ట్ చేయబోయి తను నిషా ప్రేమలో పడిపోయాడు.

అయితే జాన్ ఇప్పుడు సంతోషంగానే ఉన్నాడుగా.

అవును. వర్ష నేను ఈ వీక్, ఆఫ్ తీసుకుంటున్నాను. ఫామిలీ తో కలిసి ట్రిప్ కి వెళ్తున్నాం. మా వాళ్ళు నన్ను నెలంతా మిస్ అయ్యారంట, కచ్చితంగా వెళ్ళాలి.

సరే మంచిది.

(వారమంతా వర్షకి ఏం తోచలేదు. తన మొహంపై చిరునవ్వు కరువైనట్టనిపించింది. ఆర్య ని మిస్ అయినట్టు, తను ఉంటె బాగుండేది అనిపించింది. ఆర్య రాగానే, వర్ష కళ్ళల్లో వెలుగు అంతులేనిది)

ఆర్య, నీతో మాట్లాడాలి .

వర్ష, నీ కోసం పట్టీలు తీసుకొచ్చాను. ఒకసారి పెట్టుకో బలే ఉంటాయి.

థాంక్యూ, నీతో మాట్లాడాలి.

చెప్పు వర్ష.

నాకే అర్ధం కాలేదు. ఒకరి సంతోషంలో మరొకరికి ఎలా సంతోషం లభిస్తుంది అని. అది ప్రేమిస్తేనే సాధ్యమవుతుంది. నీ పై నమ్మకం లేకుంటే నువ్వు చెప్పినవి నేనెలా చేస్తాను. నమ్మకం అనేది పునాది. ఆ తర్వాత గౌరవం, ఆప్యాయత, కృతజ్ఞత. ప్రేమ పూర్తి విలువను తెస్తుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఆర్య.

నేను, నిన్ను ప్రేమిస్తున్నాను వర్ష. నీపై ప్రేమకి రుజువులు లేకపోయినా , అసలు ప్రేమకి ఏ రుజువు అవసరం లేదని తెలిసింది. నిజమైన ప్రేమ ఏ సాక్ష్యాల మీద ఆధారపడదు. నాకు, నీతో ఉంటె చాలా బాగుంటుంది. నీ పెదవులపై చిరునవ్వు కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది.

(జాన్, నిషా పెళ్ళికి వెళ్తారు)

వర్ష, నన్ను క్షమించు. మనం ప్రేమించిన వ్యక్తిని కోల్పోయిన, మనల్ని ప్రేమించే వ్యక్తి ఉంటారు అని నాకు నిషా వల్లే తెలిసింది. నిన్ను ఎంతో ఇబ్బంది పెట్టాను. నిన్ను, ఆర్య ని చూసాకే, నువ్వు, నాతో స్నేహం మాత్రమే చేసావ్ అని అర్ధం అయ్యింది. నేనే, ప్రేమను ఊహించుకున్నాను. నా వళ్ళ నీ కన్నుల్లో బాధనే చూసాను, కానీ ఆర్య ఎప్పుడు నీ కళ్ళల్లో సంతోషాన్ని చూపించేవాడు.

పర్లేదు జాన్. హ్యాపీ మారీడ్ లైఫ్.

ఆర్య, మేము ఇలా కలిసున్నాం అంటే అది నీ వల్లే. నీకు ఎలా థాంక్యూ చెప్పాలో నాకు అర్ధం కావట్లేదు.

నేనేం చేశా, నిషా. నీ ప్రేమ నీకు సంతోషాన్ని ఇస్తుంది. దాన్ని వ్యక్తపరిస్తేనే అది అవతలి వారికి తెలుస్తుంది. అలాగే దాచిపెట్టుకుంటే ఏ ఫలితము ఉండదు. హ్యాపీ మారీడ్ లైఫ్.

ఆర్య, పెళ్లి అవసరమా ?

వర్ష, ప్రేమ అనేది మనుషుల్ని కలుపుతుంది. అదే పెళ్లి కుటుంబాలని కలుపుతుంది. ఎన్నో కుటుంబాల సమూహమే ఈ సమాజం.

అయినా ప్రేమించుకునేది ఇద్దరే కదా, వాళ్ళ కుటుంబాలు ఎలా కలుస్తాయి?

మనిద్దరం పెళ్లి చేసుకుంటే తెలుస్తుంది, వర్ష.

కానీ మా అమ్మకి ఏమి తెలీదు కదా. నేను ఎలా చెప్పాలి? మీ ఇంట్లో తెలుసా?

వర్ష, నేను ఎప్పుడో అంత సెట్ చేశా. ఇక్కడి నుంచి మనం ఇంటికి వెళ్ళాక నీకు తెలుస్తుంది.

(వర్ష, ఆర్య ఇంటికి వెళ్తారు)

వర్ష, ఈరోజు ఆర్య వాళ్ళ అమ్మ, నాన్న, అక్క మన ఇంటికి వచ్చారు. వాళ్ళు అంతా చెప్పారు. నేను చెప్పాలనుకుంది ఒకటే, ఆర్య చాల మంచోడు. నువ్వు నెలంతా బెంగళూరు లో ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా నాకు నువ్వు కాల్ చేయలేదు కానీ రోజు ఆర్య ఫోన్ చేసి ప్రతిదీ చెప్పేవాడు. నీతో, ఆర్య ఉంటె నాకే భయం ఉండదు. నువ్వు, ఆర్య పెళ్లి చేసుకోండి.

కానీ అమ్మ పెళ్లి..

వర్ష, నాకు తెలుసు నువ్వు నాన్న గురించే ఊహిస్తున్నావని. నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం. నేను, మీ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నా, నా పై ప్రేమ లేక నాన్న, నన్ను వదిలి వెళ్లిపోయారు. పెళ్లి తర్వాత ప్రేమ తగ్గిపోతుందేమో అని నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే పెళ్లి పరీక్ష లాంటింది, మనం ప్రిపేర్ అయ్యి, రాసి, వచ్చే మార్క్స్ కంటే, అవ్వకుండా, రాసి, వచ్చే, మార్క్స్ ఏ ఎక్కువ. పెళ్ళికి ముందు, తర్వాత అని ఆలోచించకు. ఇప్పుడు ఎలా ఉంటున్నారో అలానే ఉండండి.

(వర్ష, ఆర్య పెళ్లిలో)

వర్ష ఇంకో ఐదు నిమిషాల్లో నీ సంతోషం రెట్టింపవుతుంది చూడు.

నీతో ఈ పెళ్లే నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇంకా ఏమి ఉంటుంది?

(వర్ష వాళ్ళ నాన్న వస్తారు, వర్ష కంట్లో నీళ్లు తిరుగుతాయి)

వర్ష, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను మిమ్మల్ని దూరం చేసుకుని చాలా పెద్ద తప్పు చేసాను. నా జీవితంలో మీ అమ్మని వదిలి వచ్చాక అంత కోల్పోయాను. మల్లి తిరిగి రావాలంటే నా మీద నాకే కోపం వచ్చింది. మిమ్మల్ని ఎదురుకోలేక మీ దెగ్గరికి రాలేదు.

నాన్న, నువ్వొస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు. నిన్ను ఎప్పుడు నేను ప్రేమిస్తూనే ఉంటాను.

ఆర్యనే నేనిక్కడికి రావడానికి కారణం. తన ప్రేమే నన్ను, నీకు దెగ్గరయ్యేలా చేసింది, వర్ష.

ఆర్య, నువ్వు చూపించే ఈ ప్రేమకి నేను ఎలా తిరిగి చెప్పాలో నాకు తెలియట్లేదు.

వర్ష, నువ్వే కదా ప్రేమ మనం చేసే పనుల్లో కనిపిస్తుంది అని చెప్పావు. ప్రేమ దేన్నీ కోరుకోదు, తిరిగి ప్రేమను తప్ప. నువ్వు, నన్ను పెళ్లి చేసుకుంటున్నావు. ఇంత కన్న నాకు ఇంకేం కావాలి చెప్పు.

(అందరు సంతోషంగా ఉంటారు )

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు