రాత్రి అమ్మ అర్జెంటు గా ఉప్మా రవ్వ తెమ్మంటే..కూతురు రాణి బయటకు వచ్చింది. పక్క వీధిలో ఉన్న షాప్ కు నడచి వెళ్లి...రవ్వ తీసుకుంది. తిరిగి వస్తున్నప్పుడు, ఎవరో తనని ఫాలో అవుతున్నట్లు అనిపించింది. వెనుకే వచ్చిన ఆ అబ్బాయిలు..తనని ఏడిపించడం మొదలు పెట్టారు. ఏమిటి చెయ్యాలో అర్ధం కాక 'హెల్ప్' అని కేకలు వేసింది రాణి.
అప్పుడే ఆఫీస్ లో షిఫ్ట్ ముగించుకుని, వస్తున్న వందన...అది విని..అక్కడికి వచ్చి..చెడా మడా రెండు తగిలించి ..అమ్మాయిని ఇంటి దగ్గర డ్రాప్ చేసింది.
థాంక్స్ అక్కా! నీకు చాలా ధైర్యం అక్కా!
మనం భయపడకూడదు..మనం భయపడితే..ఇంకా భయపెడతారు. ఆడవారు ఇలా ఉంటే ఎలా చెప్పు? ఈ రోజుల్లో?
లోపలి రా అక్కా! మా అమ్మ కు పరిచయం చేస్తాను..
"అమ్మా!ఈ అక్క నన్ను ఈరోజు పోకిరిల నుంచి కాపాడింది.."
"ఆంటీ! మీ అమ్మాయిని పులి లాగ పెంచాలి.."
"ఎంతైనా ఆడవాళ్లమి...మగవాళ్ళ దగ్గర నెగ్గగలమా..చెప్పు?..ఆయనే ఉంటే, మా అమ్మాయిని బయటకు ఎందుకు పంపిస్తాను చెప్పు?"
ఆడవారిని తక్కువ అంచనా వెయ్యకండి..ఆ రోజులు పోయాయి ఆంటీ..ఇప్పుడు ఆడవారు అన్ని రంగాలలో ముందుకు దూసుకు వెళ్తున్నారు.
విమానాలు నడుపుతున్నారు, వాహనాలు నడుపుతున్నారు, స్పోర్ట్స్ ఆడుతున్నారు, మగవాళ్ళకు సమానంగా ఏదైనా చేస్తున్నారు.
ఒకప్పుడు నేనూ నీలాగే ఉండేదానిని. ఆ తర్వాత ఇలా ఉంటే కుదరదని..సలహా కోసం మా గురువు గారి దగ్గరకు వెళ్ళాను. ఆయన నన్ను సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోమని చెప్పారు. సమాజంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తే, మహిళలకు సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా అవసరం. నువ్వు కుడా నేర్చుకొని, ధైర్యంగా సమస్యలను ఎదురుకోవాలి రాణి. నేను ఇప్పుడు చాలా మంది అమ్మాయిలకి సెల్ఫ్ డిఫెన్స్ ఫ్రీ గా నేర్పిస్తున్నాను. నువ్వూ నేర్చుకో..ఇంకా చాలా మందికి నేర్పించు..
*****