అవంతి రాజ్యాన్నిగుణశేఖరుడు అనేరాజు పరిపాలిస్తుండేవాడు. ఒకరోజు తన మంత్రి సుబుధ్ధితో కలసి సదానందుని ఆశ్రమానికివెళ్ళాడు అక్కడ సదానందుడు విద్యార్ధులకు బోధిస్తూ ఉండటంతో పాఠశాల చేరువులోని అరుగు పైన కూర్చుని సదానందుని బోధన వినసాగాడు....
' నాయనలారా మనిషికి ఒక్కటే జీవితం ఈజీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి జీవించడానికి ధనం కాని ,ధనంకోసం జీవించకూడదు. నిస్వార్ధంగా జీవించాలి,ఉదాహరణకు చెట్లకు కాచే ఫలాలు ఆచెట్లే తినలేవు,
సమస్త ప్రాణకోటి దాహాన్ని తీర్చే నదీ తన నీటిని అది తాగదు. పసువులు ఇచ్చే పాలు ఇతరులకు వినియోగపడతాయి కాని అవి తాగవు.
రళ్ళతో కొట్టినా తీయ్యని ఫలాలను అందిస్తాయి చెట్లు,ఒక్క రోజు జీవించే పుష్పలు సుగంధ భరితమైన వాసనలు వెదజల్లుతాయి.పూచే పూవ్వుకు ,కాచే పండుకు లేని స్వార్ధం మనిషిలో ఎందుకు ఉండాలి? వందేళ్ళు జీవించలేమని తెలిసి వేయ్యేళ్ళకు సరిపడ మనిషి ఎందుకు సంపాదిస్తాడో తెలియదు. రాజ్యవిస్ధీర్ణత పేరున యుధ్ధాలు చేస్తూ వేలమంది ప్రాణాలు కోల్పోవడం ,మరెందరికో అంగవైకల్యం కలగడం ఎంతవరకు న్యాయం? ...వెలుపల గుర్రం సకలింపు వినిపించడంతో ,పాఠశాల వెలుపలకు వచ్చి రాజును చూసిన సదానందుడు "ప్రభువులకు అభివాదములు ఎప్పుడు వచ్చారు "అన్నాడు. " గురు దేవ రేపు భువనగిరి రాజ్యంపై దాడి చేయబోతూ తమరి ఆశీర్వాదాలు పొందడానికి వచ్చాను తమరు
బోధన విన్న అనంతరం నాకు కనువిప్పి జరిగింది యుధ్ధం వలన ఇరుదేశాల ప్రజలు నన్ను ద్వేషిస్తారు కనుక యుధ్ధం ప్రయత్నం విరమిస్తున్నాను అని ,రాజధానికి చేరి వేగులు తెచ్చిన వార్త విని ఆవేశంగా
తన రెండు లక్షల సైన్యంతో బయలుదేరి భువనగిరి రాజ్య పొలిమేరలలో విడిదిచేసాడు.
లక్షమంది సైనికులతో వచ్చి భువనగిరిని జయించాలని బయలుదేరాడు అమరావతి రాజు చంద్రసేనుడు, కాని భువనగిరికి రక్షగా అవంతి రాజు గుణశేఖరుడు అన్నాడన్న విషయం తెలుసుకుని యుధ్ధం విరమించి తనసైన్యంతో మార్గమధ్యనుండి వెనుతిరిగాడు. విషయం తెలుసుకున్న భువనగిరి రాజు, అవంతి రాజు గుణశేఖరునికి ఆపదలో ఆదుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసాడు. భువనగిరి ప్రజలు గుణశేఖరునికి బ్రహ్మరధం పట్టారు. " ప్రభు తమరు నిన్న ఈ భువనగిరిపై దాడిచేసి స్వాధీన పరుచుకోవాలి అనుకున్నారు అదే జరిగి ఉంటే ఇరువైపుల వేలమంది సైనికులు మరణించేవారు ఇరుదేశాలకు ఆర్ధిక భారంఅయ్యేది ఈ భువనగిరి ప్రజలు తమరిని శత్రువుగా పరిగణించేవారు. తమ యుధ్ధం వద్దు అని తీసుకున్న సముచిత నిర్ణయం వలన నేడు భువనగిరి ప్రజలు తమరికి జేజేలు పలుకుతున్నారు అందరూ సంతోషంగా ఉన్నారు "అన్నాడు అతని మంత్రి. " నిజమే మంత్రివర్యా ఇచ్చిపుచ్చు కోవడం ,సాటి వారితో స్నేహంగా మెలగడంలో ఆనందం ఉందని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను " అన్నాడు గుణశేఖరుడు.