"అన్నయ్య ను చూస్తే చాలా ముచ్చట వేస్తుంది. పెళ్ళి చేసుకుని ఎంత ఆనందంగా ఉన్నాడో! పెళ్ళి లో అంత గొప్పతనం ఉంది మరి! పెళ్ళాం వస్తే, లైఫ్ అంతా హ్యాపీ యే అనమాట..." నిజమే కదా అనిల్?
"ఏమో రా! పెళ్ళి గురించి నన్ను అడగకు..నేను దానికి చాలా దూరం.." ఆలోచించకుండా అనేసాడు ఫ్రెండ్ అనిల్
"ఎందుకు రా..మా అన్నయ్యను చూస్తే, పెళ్ళి ఎప్పుడెప్పుడు చేసుకుందామా! అనిపిస్తుంది నాకు. లైఫ్ ఎంజాయ్ చెయ్యాలని ఉంది రా.."
"అంతా నీ భ్రమ రా...! "
నా ఫ్రెండ్ రాజేష్ గురించి నీకు తెలియదు కాబోలు..పెళ్ళికి ముందు పులి లాగా ఉండేవాడు. పెళ్ళైన తర్వాత, పిల్లి లాగ పెళ్ళాం చెప్పిన మాటకు ఊ..కొడుతూ బతికేస్తున్నాడు. ఫ్రెండ్స్ ను కలవడం మానేసాడు. ఏమైనా అంటే, పెళ్ళాం పర్మిషన్ లేదంటాడు. ఒక పని చెయ్యరా..సరాసరి వెళ్లి నీ అన్నయ్యనే అడుగు..అప్పుడు నీకే తెలుస్తుంది..
ఒకరోజు ఇంట్లో అందరూ బయట ఫంక్షన్ కు వెళ్లారు. అన్నయ్య, నేను మాత్రమే ఉన్నాము. అప్పుడు అన్నయ్య దగ్గరకు వెళ్లి, పెళ్ళి గురించి అడిగాను..
"అన్నయ్యా! పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను..ఎలాంటి అమ్మాయి అయితే బాగుంటుందో చెప్పవా?"
"ఎలాంటి అమ్మాయైనా..పెళ్ళాం గా వస్తే, మగాడి జీవితం కి కామా లు, ఫుల్ స్టాప్ లు పడతాయి రా! ఇప్పుడు నీ జీవితం స్పీడ్ బ్రేకర్ లేని బండి లాగ వెళ్ళిపోతూ ఉంటుంది కదా.."
"అవును..అన్నయ్యా..!"
"నువ్వు నీకు ఏది ఇష్టమైతే అది చేస్తావు కదా.."
"అవును..కరెక్ట్.."
"నిన్ను గుచ్చి గుచ్చి ఎవరైనా ప్రశ్నిస్తారా? పేరెంట్స్ అయినా, నేనైనా నిన్ను కొంతవరకే అడుగుతాము కదా! కానీ, పెళ్ళైన తర్వాత అంతా మారిపోతుంది రా !"
"మరి నువ్వు చాలా హ్యాపీ గా కనిపిస్తావు కదా అన్నయ్యా.."
కనిపిస్తాము..కనిపించాలి..తప్పదు సోదరా..కొన్ని కావాలంటే, తప్పదు మరి. పెళ్ళానికి అన్నింటికీ 'ఎస్' కుడా చెప్పాలి..చెప్పినట్టు వినాలి..అలా అన్నీ చేస్తేనే, లైఫ్ అలా ముందుకు వెళ్తుంది.
నీకు ఇంకా వయసు తక్కువ..ఎందుకు రా పెళ్ళికి తొందరా? పెళ్ళి ఇంపార్టెంట్..కాదనను. కానీ.. ముందు లైఫ్ ని, లైఫ్ లో ఫ్రీడమ్ ని ఎంజాయ్ చెయ్య రా..
*****