తనదాకా వస్తే! - బోగా పురుషోత్తం.

Tana daakaa vaste

ఓ ఊరిలో ఓ రజకుడు వుండేవాడు. అతను చుట్టపక్కల పది ఊళ్లలో దుస్తులు తెచ్చి ూతికి ఇచ్చేవాడు. ఆ గ్రామాలకు, అతని ఊరికి మధ్య పెద్ద ఏరువుంది. అందులోనే దుస్తులు ూతికి వాటిని తీసుకెళ్లేందుకు ఓ గాడిదను కొనుగోలు చేశాడు. డబ్బు అధికంగా చెప్పడంతో ముసలి గాడిదను తీసుకున్నాడు.
ఆ గాడిద మీదే తన దుస్తుల మూటల్ని తీసుకుపోయేవాడు.
గాడిద వద్ద గొడ్డు చాకిరీ చేయించేవాడు. అది వయసు మీరడంతో దుస్తుల మూటల్ని మోయలేక ఓ రోజు నీటిలో పడిరది. కాలికి పెద్దరాయి తగిలి నడవలేకపోయింది. మట్టల మూటలు నీటిలో పడి తడిచిపోవడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ మూటల్లో పెళ్లివారి ఇస్త్రీ బట్టలు వుండడంతో సకాలంలో వాటికి అందించలేకపోయాడు. పెళ్లివారు రజకుడిని బాగా తిట్టారు.
రజకుడికి బాగా కోపం వచ్చింది. ఇంటికి వెళ్లి గాడిదను ‘‘ నాకు చెడ్డపేరు తెచ్చావు కదే.. పదివేలు పెట్టి కొనినా ఒక్క పని చేయలేకపోతున్నావు.. నీకు తిండి దండగ..’’ అని గొడ్డును బాదినట్లు బాదాడు. గాడిదకు ఆ రోజంతా తిండి పెట్టకుండా ఎడగట్టాడు.
కాలికి తగిలిన గాయంతో పైకి లేవలేకపోయింది. విపరీతమైన బాధతో గాడిద కన్నీరు కార్చింది.
మరుసటి రోజే ఇస్త్రీ బట్టల మూట గాడిదపై పెట్టాడు. అది నడవలేక నడిచింది. ఇక లాభం లేదనుకుని రజకుడు ఇస్త్రీ మూటను భుజంపై వేస్కుని మోకాటి లోతు నీటిలో నెమ్మదిగా అటు పక్కకు దాటుకుని ఊర్లోకి చేరుకున్నాడు. మోతుబరికి ఇస్త్రీ బట్టలు ఇచ్చి, అతను ఇచ్చిన బస్తా వరి ధాన్యం తీసుకుని భుజంపై వేసుకున్నాడు. మోయలేక మోసుకుని వెళుతుంటే పక్క ఊర్లో వున్న రైతులందరూ తమకు పండిన ధాన్యం రాగులు, సజ్జలు, వరి గింజలు తమకు తోచినంత మూటలు సంక్రాంతి కానుకగా ఇచ్చారు. వాటిని ఎంతో ఆశతో తీసుకున్నాడు. భుజంపై మూటలన్నీ వేసుకుని ఇంటిదారి పట్టాడు. ఏరు రానే వచ్చింది. ఎక్కువ నీటి ప్రవాహానికి దాటుతున్నప్పుడు కాళ్లు తడబడ్డాయి. కింద గులకరాయి గుచ్చుకోవడంతో పక్కకి వంగాడు. భుజంపై వున్న వరి ధాన్యం బస్తా నీటిలో పడిపోయి మునిగిపోయింది. కొంతదూరం నడవగానే పెద్ద గుంతలో పడి మునిగిపోయాడు. భుజంపై వున్న బస్తాలు గుంతలో పడి మునిగిపోయాయి. నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. భయంతో ‘‘ రక్షించండి.. రక్షించండి...’’ అని అరిచాడు.
అరుపులు విన్న గాడిద అతని వద్దకు వచ్చింది. ఆదపదలో వున్నాడని గ్రహించి అక్కడే చేపలు పడుతున్న మనుషుల వద్దకు వెళ్లి సాయం చేయాలని సైగచేసింది.
వాళ్లు రజకుని వద్దకు పరుగెత్తి నీటిలో ఈత కొడతూ రజకుని వద్దకు వెళ్లి పట్టుకుని తీసుకొచ్చాడు.
గట్టుపైకి వచ్చిన రజకుడికి పోయిన ప్రాణం లేచివచ్చినట్లంది. ధాన్యం మూటలు పోతేపోయింది.. ప్రాణాలు దక్కాయని సంతృప్తి .చందాడు.
రోజూ అధిక బరువుతో గాడిదను ఎలా బాధపెడుతున్నాడో గ్రహించాడు, గాయంతో మూలుగుతున్న గాడిదకు చికిత్స చేయించి తనను రక్షించినందుకు గాడిదకు కృతజ్ఞతలు తెలుపుకుని రోజూ కడుపు నిండా ఆహారం పెడుతూ కంటికి రెప్పలా చూసుకున్నాడు రజకుడు.

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు