సార్! ఇలాంటి కేస్లు మీరు చాలా హ్యాండిల్ చేశారు. ఇవేమ్ మీకు కొత్త కాదు. ఎలా చెయ్యాలో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మర్డర్ ని డ్రంక్ అండ్ డ్రైవ్ గా మార్చండి. చిన్నా బదులు మా వాడు అరెస్టు అవుతాడు.
"నేను ఇలాంటివి చాలా హ్యాండిల్ చేశాను అని నువ్వే చెప్పావ్. దానికి సరిపడ ప్రతిఫలం ఎంతో కూడా నీకు బాగా తెల్సుండాలి" అంటూ పోలీసు ఆఫీసర్ ఋషి కి తనకి ఏం కావాలో సంకేతం ఇచ్చాడు.
ఋషి పక్కనే ఉన్న తన మనిషి వైపు చూశాడు. అతను వెంటనే లోపలికి వెళ్ళాడు.
అదే సమయం లో పక్క గది లో నుండి ఒక అమ్మాయి అరుపులు, మంచం చప్పుడు వినిపిస్తుంది.
ఆ చప్పుడు విన్న ఆఫీసర్ ఋషి వైపు చూశాడు.
మీరు కూడా గుర్రం ఎక్కుతారంటే చెప్పండి. అన్న తరువాత మిమ్మల్ని పంపిస్తా
ఆ... వద్దులే.. మల్లెప్పుడైనా చూస్తా. తొందర్గా ఈ కేస్ మూసేయాలి. టైమ్ లేదు.
లోపలికి వెళ్ళిన ఋషి మనిషి ఒక్క రెండు 500 రూపాయిల డబ్బు కట్ట తెచ్చి ఋషి కి ఇచ్చాడు.
ఋషి అది తీసుకొని ఆఫీసర్ కి ఇచ్చాడు.
"ఇలాగే తీస్కెళ్లమంటావా?" అంటూ ఆఫీసర్ వెటకారంగా అడిగాడు.
ఋషి కోపంగా ఆ డబ్బు తెచ్చిన వాడి వైపు చూశాడు. అతను వెంటను భయం తో పక్కనే ఉన్న వార్తాపత్రికను తీసి ఆఫీసర్ చేతిలో నుండి డబ్బు కట్టను తీస్కోని చుట్టి ఇచ్చాడు.
"పర్లేదు దీంతో సద్దిచెప్పుకుంటా" అంటూ ఆఫీసర్ చిన్నగా నవ్వి ఆ డబ్బు కట్టాలను తీస్కోని అక్కడి నుండి వెళ్లిపోయాడు.
****
సిగరెట్ ని నోట్లో పెట్టుకొని జేబులోంచి లైటర్ ని తీసి సిగరెట్ ని కాల్చాడు ఋషి. ఇంటి వరండా లో నిలబడి పొగ తాగుతూ ఉన్నాడు.
కొద్ధి సేపటికి అరుపులు వినిపించిన గది నుండి ఋషి యెజామని తలుపులు తీసి బయటికి వచ్చాడు. అతని వంటి మీద లుంగీ మాత్రమే ఉంది. వాళ్ళంతా చమటతో తడిసి ఉంది.
ఋషి చేతిలో నుండి సిగరెట్ తీస్కోని తన నోట్లో పెట్టుకొని పొగ ఊదుతూ "దీంతల్లి అసల్ సహకరించలే. ఒక్కటి పీకాల్సి వచ్చింది" ఋషి వైపు చూస్తూ " ఇంతకీ ఆఫీసర్ తో పని జరిగిందా?"
"హా అన్న!" అంటూ బదులు ఇస్తూ ఋషి తన జేబులోంచి ఇంకో సిగరెట్ తీస్కోని వెలిగించాడు.
పొగ తాగుతూ తన యజమాని వైపు చూశాడు. ఇబ్బంది పడుతూ "అన్న! నాకు 10 లక్షలు కావాలి."
యజమాని ఋషి వైపు కనుబొమ్మలను పైకి లేపి చూశాడు.
చెప్పా కదా అన్న. బాబు కి ఆపరేషన్ చేయించాలి. ఇన్ని యేళ్లుగా మీ దగ్గర పని చేస్తున్న. కొంచెం ఆలోచించండన్న.
యజమాని ఋషి మాటలు వింటూ ఆకాశం వైపు చూస్తూ ఏదో ఆలోచూస్తూ సిగరెట్ తాగుతూ ఉన్నాడు.
అదే సమయం లో ఋషి ఫోన్ రింగ్ అయ్యింది.
జేబులోంచి ఫోన్ తీశాడు ఋషి.
ఆ చెప్పు చందు బాబు.
యజమాని ఫోన్ మాట్లాడుతున్న ఋషి వైపు చూశాడు.
అటు వైపు నుండి చందు తన ఫోన్ ని ఒక టేబల్ మీద పెట్టి ఫోన్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతున్నాడు. ఆ ఫోన్ డిస్ప్లే లో ఋషి ఫోటో మరియు అతని ఫోన్ నో కనిపిస్తున్నాయ్.
ఋషి భాయి! ఒక కేస్ ఉంది. నా గెస్ట్ హౌస్ కి వచ్చి క్లియర్ చేస్కో.
చందు మాట్లాడుతూ ఉన్నప్పుడూ పక్కనే ఒక 10 సంవత్సరాల కుర్రాడు వారి మాటలని వింటూ ఏడుస్తూ ఉన్నాడు.
ఋషి ఫోన్ నీ తన యజమాని చెవి వద్ద పెట్టాడు. తన కొడుకు చందు చెప్పే మాటలు విన్నాడు యజమాని.
ఋషి వైపు తిరిగి "15 లక్షలు ఇస్తా. చందు చెప్పిన పని చెయ్."
ఋషి ఏదో సాదించా అన్నట్టు ఆనంద పడుతూ ఫోన్ ని తిరిగి తన వద్దకు తీస్కోని "చందు బాబు, ఇంకో 15 నిమిషాల్లో అక్కడ ఉంటా" అంటూ ఫోన్ కట్ చేశాడు.
అటు వైపు చందు కూడా చిన్న గా నవ్వుతూ పక్కనే ఉన్న బాబు వైపు చూశాడు.
***
చందు హాల్ లో సోఫా లో కూర్చొని మందు తాగుతూ ఉన్నాడు. రూమ్ అంతా సిగరెట్ పొగతో నిండి ఉంది.
డోర్ బెల్ రింగ్ అయ్యింది.
చందు హాల్ లో ఉన్న ఒక వ్యక్తి వైపు చూశాడు. అతను వెళ్ళి గది తలుపులు తీశాడు. ఎదురుగా ఋషి నిలబడి ఉన్నాడు. గది లోపల ఉన్న పొగ ఋషి కి స్వాగతం పలికింది.
ఋషి ని చూసిన చందు, మందు గ్లాస్ పూర్తిగా తాగేసి టేబల్ మీద పెట్టాడు. మిగిలిన మందు బాటిల్ ని తీస్కోని లోనికి వస్తున్న ఋషి వైపు వెళ్ళాడు.
నేను ఇదంతా చూడ్లేను. తొందర్గా పూర్తి చేసి నాకు ఫోన్ చెయ్. సాయంత్రం పార్టీ ఉంది. ఏర్పాట్లు చేసుకోవాలి.
హ్మ్మ! సరే!
"లోపల బెడ్రూం లో ఉంది. ఇంకో విష్యం పక్క గదిలో దాన్ని కొడుకు కూడా ఉన్నాడు. వాడి సంగతి కూడా చూస్కో" అని చెప్పి చందు అక్కడి నుండి బయటికి వెళ్ళాడు. అతనితో పాటు ఉన్న వాళ్ళు కూడా చందు ని అనుసరించారు.
చందు మరియు తన అనుచరులు అక్కడి నుండి వెళ్ళాక, ఋషి హాల్ లో చల్లా చదురుగా పడి ఉన్న అమ్మాయి బట్టలు, మందు బాటిల్లు, సిగరెట్లు చూసి కొంత చిరక్కుగా మొహం లో భావాలు మార్చాడు. వాటిని కాలితో నూక్కుంటూ బెడ్రూం వైపు వెళ్ళాడు.
ఒక అమ్మాయి నగ్నంగా మంచం మీద పడి ఉంది. తన వీపు గది పైకప్పు వైపు చూస్తోంది. తన తల 180 యాంగిల్ లో ఋషి కి ఉంది. తన పాంటు వెనకాల నుండి ఒక గొని సంచి తీశాడు. అది పట్టుకొని అమ్మాయి మొహం ఉన్న వైపు వెళ్ళాడు.
ఆ అమ్మాయిని చూసి ఋషి ఒక్కసారిగా కుదేలు అయ్యాడు. తన కళ్ళలో నుండి నీళ్ళు మెల్లిగా చంప వైపు జారుతున్నాయ్.
"శైలూ..." అంటూ చేతి వేళ్ళని తన భార్య ముక్కు వద్ద పెట్టి శ్వాస ఉందో లేదో చూశాడు. ఊపిరి గాల్లో కలిసి చాలా సేపు అయ్యిందని తెలుసుకున్నాడు. కోపం బాదా అన్నీ తన శ్వాసలో చేరాయి. మోకాళ్ళ మీద కూర్చొని తన భార్య మొహం ని పట్టుకొని గట్టిగా అరిచాడు.
ఆ అరుపు ముగిసే సమయానికి తనకి వెనక నుండి ఒక లోహపు చప్పుడు వినిపించింది. ఋషి మెల్లిగా వెనక్కి తిరిగి చూశాడు.
తన కన్న కొడుకు తుపాకి ఋషి వైపు పెట్టి నిల్చోని ఉన్నాడు.
"చిన్న?" అంటూ ఋషి తన కొడుక్కి ఏదో చెప్పా బోయాడు.
కానీ అంతలో చిన్న చేతిలో ఉన్న తుపాకి నుండి ఒక బుల్లెట్ ఋషి ఛాతీ లో నుండి దూసుకుంటూ వెళ్లింది.
ఆ క్షణం ఋషి కి తన కొడుకు కళ్ళలో తన మీద ఉన్న కోపం కనిపించింది. అదే సమయం లో ఋషికి తన కొడుకు జీవితం గురించి భయం వేసింది. తన ఆలోచనలు ఆచరణ మొదలట్టే లోపే కళ్ళు చీకటిని చూసింది. తన కొడుకు జీవితం నిశీది వైపు లాగింది.
***