ట్రూ ఫ్రెండ్ - తాత మోహనకృష్ణ

True friend


ఆ రోజు సాయంత్రం ఎందుకో కమ్మని కాఫీ తాగాలనిపించింది. కాఫీ కలపడానికి కిచెన్ లోకి వెళ్ళి చూస్తే..పంచదార లేదు. తెచ్చుకోడానికి సందు చివర సూపర్ మార్కెట్ కు బయల్దేరాను. అసలే చలికాలం..బయట చాలా చల్లగా ఉంది..గాలి కుడా వీస్తుంది. ముందుకు నడుస్తూ..సూపర్ మార్కెట్ కు చేరుకున్నాను.

సూపర్ మార్కెట్ లోకి నా మొదటి అడుగు పెట్టగానే..ఎడమ పక్క ఒక అందమైన అమ్మాయి కనిపించింది. ఆమె ఫోన్ లో చాలా గట్టిగా మాట్లాడడం తో వెంటనే, నన్ను ఆకర్షించింది. ఒక ఇరవై సంవత్సరాలు ఉంటాయేమో..అందంగా ఉంది. తన నాజూకు చేతులతో పట్టుకున్న ఆ ఫోన్ లో ఎవరితోనో..'హెల్ప్' చేయమని అడుగుతుంది. మొదటి చూపులోనే, తెగ నచ్చేసింది. మొదటి చూపులో ప్రేమంటే ఇదేనేమో మరి!

ఆ అమ్మాయి వెంటే ఉండి..ఆమె మాటలు వింటూ..పంచదార కోసం తెగ వెతికేస్తున్నాను..నటించాలి కదా మరి! నచ్చిన అమ్మాయి బాధలో ఉంటే, అసలు చూడలేకపోతున్నాను.

"ఆ అమ్మాయి మళ్ళీ రేపు ఇదే టైం కు కాల్ చేస్తాను. ఇంటి నుంచి కాల్ చెయ్యడానికి అవదు...ఇక్కడకు వచ్చి చేస్తాను.." అని చెప్పి ఫోన్ పెట్టేసింది

"హలో మిస్! మీరు ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. నేనేమైనా.. హెల్ప్ చెయ్యగలనా..?" అని అడిగాను

"మీ పని చూసుకోండి..థాంక్స్!.." అని కోపంగా అంది

"మిస్.. మీరు చాలా టెన్షన్ లో ఉన్నారు...కూల్ గా ఉన్నప్పుడే మాట్లాడండి.." అని చెప్పాను

మర్నాడు, ఆ అమ్మాయి అదే టైం కు మళ్ళీ సూపర్ మార్కెట్ కు వచ్చింది. మార్కెట్ బయట ఫోన్ లో మళ్ళీ సీరియస్ గా మాట్లాడుతుంది.

"సందీప్! ప్లీజ్ నాకు హెల్ప్ చెయ్యి..నువ్వు నాకు చాలా రోజుల నుంచి ఫ్రెండ్ కదా...ఆ మాత్రం సాయం చెయ్యలేవా?.." అంది అమ్మాయి

"ఏమిటి..చెయ్యలేను అంటున్నావు..ఫ్రెండ్షిప్ కి విలువ ఇంతేనా సందీప్..?" అని ఫోన్ లో అడిగింది

"హలో! మిస్..ఎలా ఉన్నారు?"

"మళ్ళీ వచ్చారా నన్ను డిస్టర్బ్ చెయ్యడానికి..?"

"ఫోన్ లో మీరు మాట్లాడింది విన్నాను..మీరు ఏదో అవసరం లో ఉన్నారని అర్ధమైంది..ఎదురుగా ఉన్న నా లాంటి ఫ్రెండ్ ని వదిలేసి, ఎక్కడో ఉన్న ఫ్రెండ్ ని అంతలాగా బతిమాలుతున్నారు...అసలు ఏమిటి జరిగిందో తెలుసుకోవచ్చా?"

"నాకు ఒక 'హెల్ప్' కావాలి..మా ఇంట్లో అడగలేను..నాకు ఎప్పటినుంచో తెలిసిన నా ఫ్రెండ్ సందీప్ ని అడిగాను.."

"నా పేరు సునీల్..ఇక్కడ అపార్ట్మెంట్ లో ఉంటాను..సందీప్ ఎవరో తెలుసుకోవచ్చా..?"

"ఐదు సంవత్సరాల నుంచి ఆన్లైన్ లో నా ఫ్రెండ్...హెల్ప్ అడిగితే..నువ్వు నాకు అంతగా తెలియదు అంటున్నాడు.."

"మీ పేరు ఏమిటి మిస్..?"

"ఐ యాం వర్ష.."

"చూడండి వర్ష..ఎక్కడో ఉన్న ఫ్రెండ్ గురించి అలోచించే బదులు ..మీ చుట్టూ ఉన్న మంచి వారిని సహాయం అడగొచ్చు కదా! మీకు ఒక విషయం తెలుసా..? మీరు నా అపార్ట్మెంట్ లోనే ఉంటున్నారు.."

"నిజమా..?"

"మీకేం 'హెల్ప్' కావాలో చెప్పండి..నేను చేస్తాను.."

"వర్ష తనకున్న ఇబ్బంది చెప్పింది సునీల్ కు.. సునీల్ చేయాల్సిన సాయం చేసాడు.."

"థాంక్స్ సునీల్..మీరే నా ట్రూ ఫ్రెండ్.."

"అవసరానికి హెల్ప్ చేసేవాడే నిజమైన ఫ్రెండ్...ఈ ఆన్లైన్ లో ఫ్రెండ్షిప్ ఓన్లీ టైం పాస్ కోసమే. ..అలాగని అందరూ అలాగే ఉంటారని కాదు. నా లాంటి మంచి వారు కుడా ఉంటారు.." అని అన్నాడు సునీల్. అలా ఇద్దరి మధ్య స్నేహం పెరిగుతూ వచ్చింది..

ఒకరోజు ఇద్దరు కలుసుకున్నప్పుడు...

"నేను మిమల్ని మొదటసారి చూసినప్పుడే మీరు నాకు నచ్చేసారు..మీరు ఇంకోలాగ అనుకోకపొతే...'ఐ లవ్ యు వర్ష..!'..."

నేను మంచివాడిని. నన్ను నమ్మితేనే..నేను మీకు నచ్చితేనే..'ఓకే' చెప్పండి..రేపు నేను ఈ సూపర్ మార్కెట్ కి షాపింగ్ కోసం వస్తాను.. సాయంత్రం సిక్స్ కి..."

మర్నాడు...వర్ష..సూపర్ మార్కెట్ లో సునీల్ ని కలుసుకుంది. "నువ్వు నాకు నచ్చావు సునీల్..కాకపోతే, నిన్ను నమ్మడానికి టైం పట్టిందంతే! ..'ఐ టూ లవ్ యు' సునీల్.."

****

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు