సంక్రాంతి గిఫ్ట్‌ - తాత మోహనకృష్ణ

Sankranthi gift


"శ్రీకాంత్! మన పెళ్ళికి మా నాన్న ఒప్పుకుంటారంటావా!?.."

"నాకేం తెలుసు లత..మీ నాన్న గురించి నీకే తెలియాలి.."

"మా నాన్నకు మన ప్రేమ గురించి చెప్పాలంటేనే భయంగా ఉంది.."

"రేపు మీ నాన్న మూడ్ బాగునప్పుడు చెప్పు లత! ఒప్పుకోలేదనుకో...చచ్చిపోతాను అని చెప్పు.."

ఇంకో నాలుగు రోజుల్లో సంక్రాంతి వస్తోంది గా! మా ఇంట్లో సంక్రాంతి చాలా గ్రాండ్ గా చేసుకుంటాము. ఇప్పుడు ఇంట్లో అంతా సంక్రాంతి హడావిడి లో ఉన్నారు. రేపు టైం చూసి.. మన విషయం నాన్న కి చెప్తాను ..

మర్నాడు లత ఇంట్లో మంచి టైం చూసుకుని.. నాన్న తో మాట్లాడాలనుకుంది..

"నాన్నా..! మీతో కొంచం మాట్లాడాలి.."

"ఏంటి బేబీ..?"

"ఈ సంక్రాంతి కి నాకు మీరు ఒక గిఫ్ట్ ఇవ్వాలి. నేను ఏది అడిగినా, కాదనకూడదు.."

"అలాగే బేబీ మాటిస్తున్నాను ! మంచి గిఫ్ట్ అడిగితే.. ఇస్తాను. ఏమిటో చెప్పు బేబీ.."

"నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. అతనినే పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాను. శ్రీకాంత్ చాలా మంచి వాడు. మీరు చూస్తే, ఖచ్చితంగా ఒప్పుకుంటారు.."

"రేపు శ్రీకాంత్ ని ఇంటికి ఇన్వైట్ చెయ్యి..మాట్లాడుతాను"

"హలో..! శ్రీకాంత్! 'ఐ యాం వెరీ హ్యాపీ టుడే'..." అని ఫోన్ అందుకుంది లత

"ఎందుకో..?"

"ఈ రోజు నాన్నకు మన గురించి చెప్పేసాను..ఆయన నిన్నురేపు ఇంటికి రమ్మన్నారు..రేపు నువ్వు నీట్ గా రెడీ అయి, సాయంత్రం రావాలి. నేను నీ కోసం వెయిట్ చేస్తుంటాను. నాన్న అడిగినవాటికి సరిగ్గా సమాధానం చెప్పు.."

"అలాగే లతా డియర్..!"

మర్నాడు శ్రీకాంత్ టైం కు వచ్చాడు..

"హలో అంకుల్! నేను శ్రీకాంత్..నేను మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాను..మీరు ఒప్పుకుంటే, పెళ్ళి చేసుకుంటాను.."

"ఏం చేస్తున్నావు ఇప్పుడు శ్రీకాంత్.."

"చదువు అయిపోయింది...బిజినెస్ ప్లాన్ లో ఉన్నాను.."

"ఏం బిజినెస్ చేస్తావు..? నేను కుడా బిజినెస్ చేస్తాను..అమ్మాయి చెప్పే వుంటుంది.."

"లత లో నీకు ఏమిటి నచ్చింది..?"

"అన్నీ ఇష్టమే సర్..లత లేకుండా నేను బతకలేను.."

"మా అమ్మాయి కుడా నిన్ను చాలా ఇష్టపడుతుంది. ఈ రోజుల్లో, ప్రేమించుకోవడం తప్పు కాదు. నేనూ.. నీ లాగే, చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసి, ఈ రోజు ఇంతటి గొప్పగా ఉన్నాను. నా అల్లుడు కుడా, నా లాగ మంచి బిజినెస్ చేస్తూ..ఫ్యూచర్ లో నా బిజినెస్ చూసుకునే తెలివితేటలు ఉండాలనేదే నా ఆలోచన..

నిన్ను ప్రూవ్ చేసుకోడానికి నీకు ఒక అవకాశం ఇస్తాను. నువ్వు గెలిస్తే, మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్ళి చేస్తాను. ఇంకో మూడు రోజుల్లో సంక్రాంతి పండుగ. ఈ సారి, మా ఫ్యామిలీ మొత్తం సంక్రాంతి కోసం ముంబై వెళ్తున్నాము...నా సిస్టర్ ఇంటికి. నేను వచ్చేసరికి..నేను నీకు ఇస్తున్న ఈ హ్యాండ్ క‌ర్చీఫ్‌లు ఎక్కువ ధర కి అమ్మాలి.."

"అలాగే సర్.."

బయటకు వెళ్ళిన తర్వాత..లత కి సైగ చేసి బయటకు రమ్మనాడు శ్రీకాంత్..

"లతా..! నేను నిన్ను చూడకుండా..ఇన్ని రోజులు ఉండలేను..నేనూ మీతోనే వస్తాను..ఎవరికీ తెలియకుండానే.."

"ఏమో..నీ ఇష్టం..రేపు మేము కార్ లో ముంబై బయల్దేరుతున్నాము. మరి పందెం..?"

"కంగారుపడకు లతా!..చూస్తూ ఉండు..."

ప్లాన్ ప్రకారం..శ్రీకాంత్..లత వాళ్ళు వెళ్ళే కార్ ని కొంచం చెడగోట్టాడు. ఎలాగంటే, అది కొంత దూరం వెళ్ళిన తర్వాత..ఆగిపోయేటట్టు. శ్రీకాంత్ కి కార్ విషయాలు బాగా తెలుసు..

మర్నాడు లత తో పాటు..తన పేరెంట్స్ అందరూ కార్ లో ముంబై కి స్టార్ట్ అయ్యారు. కార్ సిటీ దాటిన తర్వాత..అంతా అడవి మార్గానా వెళ్తుంది. అదీ రాత్రి పుట ప్రయాణం. చుట్టుపక్కల అలికిడి లేదు. సడన్ గా కార్ ఆగిపోయింది. లత నాన్నకు కార్ డ్రైవింగ్ తెలుసు గాని, కార్ రిపేర్ తెలియదు. కార్ సర్వీసు చేయించినా..ఎందుకు ప్రాబ్లం వచ్చిందా? అని తిట్టుకుంటూ..అందరిని ఒక చెట్టు కింద కూర్చోమని చెప్పాడు.

అటుపక్క మారువేషం లో వెళ్తున్న శ్రీకాంత్ ఇదంతా చూసి..కార్ ఆపి.."ఏమైంది సర్..? ఎనీ ప్రాబ్లం?"

"కార్ ఆగిపోయింది..ఎందుకో తెలియట్లేదు.."

"నన్ను చూడమంటారా..?"

"ఇక్కడ మీరు తప్ప మాకు హెల్ప్ చెయ్యడానికి ఎవరూ లేరు ఈ టైములో..మీకు కార్ రిపేర్ తెలుసా..?"

"తెలుసు సర్..కానీ, ఒక షరతు..నేను ఏది అడిగితే..అది మీరు చెయ్యాలి.."

"ఓకే..అలాగే..!" అని ఒప్పుకున్నాడు లత తండ్రి..

"బయట చాలా వేడి గా ఉంది సర్..ముందు..అలా కూర్చొని...అందరూ ముఖం తుడుచుకోండి...ఈ హ్యాండ్ క‌ర్చీఫ్‌ లతో.."

శ్రీకాంత్ తనకున్న తెలివితేటలతో కార్...రిపేర్ చేసి..స్టార్ట్ చేసాడు.

"ఇప్పుడు చెప్పు నీకు ఏమిటి చెయ్యాలో...?"
"నా సర్వీసు కి డబ్బులు అక్కరలేదు. కానీ, నా హ్యాండ్ క‌ర్చీఫ్‌ లకి ఒక వెయ్యి ఇప్పించండి సర్!"
"ఇదిగో వెయ్యి రూపాయలు.."
"థాంక్స్ సర్...."

"ఎవరు నువ్వు..? శ్రీకాంత్....???"
"అవును సర్...నేనే...మీరు చెప్పినట్టుగా.. నేను హ్యాండ్ క‌ర్చీఫ్‌లు అమ్మేసాను.."

"గ్రేట్ శ్రీకాంత్! నేను ఇచ్చిన హ్యాండ్ క‌ర్చీఫ్‌లు మాకే అమ్మి...నన్ను ఇంప్రెస్ చేసావు..ఇలాంటి తెలివితేటలు ఉంటే, బిజినెస్ లో నా అంత గొప్పవాడివి అవుతావు. నీకు మా అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చెయ్యడానికి నేను ఒప్పుకుంటున్నాను.."


******

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు