అన్వేషణ - బి.రాజ్యలక్ష్మి

Anveshana

“రాజా నిన్ను చూడాలని మనసు ఆరాటపడ్తున్నది ,నాన్న సంగతి నీకు తెలిసిందేగా యేది పట్టదు .నిన్ను చూసి రెండేళ్లు అవుతున్నది ,బాబు కి అప్పుడు పండుకి పన్నెండేళ్ళు .నీకు సెలవులు వీలవ్వాలిగా ,,మీకు వేసవి సెలవులు యివ్వగానే. మీ ముగ్గురు వచ్చి పదిరోజులుండి వెళ్లండి ,నీఆరోగ్యం జాగ్రత్త ,వేళకు తిను .వుంటాను “
అమ్మ

అమ్మ వుత్తరం చదువుతుంటే రాజా కు మనసంతా అదోలా అయ్యింది .తెలియకుండానే కన్నీళ్లు ధారాపాతం అయ్యాయి .వరండాలో వాలుకుర్చీలో కూర్చున్న రాజా ఆకాశం వైపు తలెత్తి చూసాడు ,చల్లగాలి ,దశమి నాటి చంద్రుడు కొబ్బరాకుల వూయలలొనించి అందం గా నవ్వుతున్నాడు ,నవ్వులో అమ్మ నవ్వుతూ కనిపించింది .అమ్మ తో గడిపిన మధుర క్షణాలు బాల్యం అంతా కళ్లముందు నిలిచింది .రాజా గతం లోకి వెళ్లాడు . చిన్నతనం కళ్లముందు నవ్వుతూ చూసింది .

కామేశ్వరి పదహారేళ్ల ప్రాయం పల్లెటూళ్ళో ఒక సంక్రాంతి పండగ సమయం లో గుళ్లో అమ్మ తో వెళ్లి వస్తుంటే స్ శ్రీలక్ష్మి కాలికి దెబ్బ తగిలి మట్టి రోడ్డు మీద పడి నిస్సహాయం గా కూర్చుంది ! కాలివేళ్లు చితికి రక్తం కారుతున్నది .కామేశ్వరి వెంటనే తన వోణి loss చింపి గుళ్లో కాసిని నీళ్లు తెచ్చి తుడిచి కట్టుకట్టింది .యింటిదాకా దింపింది ! శ్రీలక్శ్మి ఆ రోజే ఆ గడియలోనే కామేశ్వరిని కోడలుగా చేసుకోవాలనుకుంది . కామేశం చదువుకున్నాడు కానీ వ్యవసాయం ఇష్టపడ్డాడు.కామేశ్వరి రెండెళ్లతర్వాత శ్రీలక్ష్మి కోడలయ్యింది.కామేశం పల్లెటూరు వదిలి రానన్నాడు .కామేశ్వరి కొడుకు పుట్టాడు .వాణ్ణి పెద్ద పెద్ద చదువులు పట్నం లో చదివించాలని కోరిక .ఆ తల్లికి కొడుకు రాజా అంటే పంచప్రాణాలు .భర్తను పెట్టించుకోవడం తగ్గింది .కామేశం కామేశ్వరిని బాగా యిష్టపడి పెళ్లి చేసుకున్నాడు .ప్రతిక్షణం నవ్వులు సరాగాలు !కానీ కొడుకే సర్వస్వం ! కామేశం ప్రేమా ,కామేశ్వరి ప్రేమలో తేడా వుంది .తల్లి కొడుకు చదువుకోవాలి సిటీ లో స్థిరపదాలు అనుకున్నది .తండ్రి పల్లెటూళ్ళో పుడమి తల్లిని నమ్ముకుని వ్యవసాయం చేసుకోమన్నాడు .రాజా కు కూడా చదువుకోవాలని వుంది .
రాజా హైస్కూలు చదువు ఆ పల్లెటూళ్ళో ముగిసింది .సిటీ లో వుందామని కామేశ్వరి భర్త ను అడిగింది .ఆ పల్లెటూళ్లోకాలేజీ లేదు .కామేశం ఒప్పుకోలేదు .
“నా రాజా కు నేనే వండిపెట్టాలి “అని కామేశ్వరి కొడుకు తో సిటీ లో గది తీసుకుంది .సెలవుల్లో తల్లీకొడుకులు కామేశం దగ్గరకొచ్చేవాళ్లు.కామేశానికి
అప్పుడు పండగ లాగా వుండేది.
అమ్మకుతనంటే పంచప్రాణాలు.
వీధిలో స్కూటర్ శబ్దం వినిపించింది .రాజా ఆలోచనలకు అడ్డుకట్ట పడింది ,వర్తమానం లోకి వచ్చాడు .రాధికా వచ్చిందేమోనని అనుకున్నాడు .కాదు .
రాజా సిటీ డిగ్రీ కాలేజీ లో లెక్చరర్ గా పనిచేస్తున్నాడు .తల్లి అభిమతమ్ నెరవేర్చాడు .

మళ్లీ గతం కళ్లముందు నవ్వింది .రాజా రాధికను ప్రేమించి రెండువైపులా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు . వాళ్ల కాపురం నిత్యవసంతం .రాధిక రాజా ఒకరికొకరుగా ప్రాణం గా వుండేవాళ్లు.
రాధిక కడుపు తో వున్నప్పటినించి యింటి వాతావరణమే మారిపోయింది .
ఇంటిపని త్వరగా ముగించుకుని పుట్టబోయే బిడ్డను గురించి kallaku కంటూ మేజోళ్లు స్వెటర్లు అల్లుతూ మధ్య మధ్య పొట్టనిమురుకుంటూ వూహల్లో తేలిపోయేది .రాజా తన ప్రక్కన నించున్న పట్టించుకునేదికాదు .

ప్రసవం కోసం పుట్టింటికెళ్లింది ..రాజా ఒంటరివాడయ్యాడు ,భార్యకు బోలెడుసార్లు ఫోన్ చేస్తే రాధిక మాత్రం నెమ్మదిగా తీరికగా ఒక్కసారి మాట్లాడేది ఆ మాటలు కూడా పుట్టబోయే చిన్ని పాపాయి గురించే !రాజా అవసరాలను ఆలోచించేదికాదు .

పండు పుట్టాడు ,రాజా భర్త స్థానం ఒక మెట్టుదిగినట్టు ఫీల్ అయ్యాడు .ఐదోనెల భర్త దగ్గరకొచ్చింది .పడక మార్చుకుంది రాధిక ,తనూ ,పండు ఒక మంచం ,రాజా విడిగా మరోమంచం !పిల్లవాడి యేడుపులు ,కక్కడాలు రాత్రంతా నిద్రలుండేవి కావు వాళ్లిద్దరికీ.
సినిమాలు ,షికార్లు ఆగిపోయాయి .రాధిక ప్రపంచమంతా చిన్నారి పండు చుట్టే అల్లుకుంది .రాజా. కు రాధిక తనల్ని బొత్తిగా పట్టించుకోవడం లేదని కోపం గా వుండేదిఒక్కోసారి పిల్లాణ్ణి చూస్తే మహా చిరాగ్గా వుండేది .
పండు బళ్లో చేరాడు .రాధిక హడావుడి చెప్పక్కర్లేదు .ఉదయం వాణ్ణి రెడీ చెయ్యడం ,బ్రేక్ఫాస్ట్ తినిపించడం ,లంచ్ బాక్స్ పెట్టడం ,పుస్తకాలు బాగ్ లో సర్దడం ,రాధిక కు చెప్పలేనంత కోలాహలం !రాజా కు తన అవసరాలన్నీ తానే చూసుకోవడం అలవాటయ్యింది .భార్య తనల్ని నిర్ల్యక్షం చెయ్యడం రాజా కు బాధ వేసేది ,కోపం కూడా వచ్చేది .
భర్తను భార్య నిర్ల్యక్షం గా చూడడం అని భర్త భావిస్తాడు కానీ మాతృత్వం ముందు భర్త గా కాదు తండ్రిగా తల వంచాల్సిందే !భార్యా భర్తల ఆనంద దాంపత్య జీవన అమృత. ఫలాలు పిల్లలు !

మాతృవాత్సల్యం భార్యాభర్తల అనుబంధాన్ని దూరం చెయ్యకూడదు .వాకిట్లో స్కూటర్ ఆగింది .రాధిక రాజా వచ్చారు . “రాత్రి తొమ్మిదయ్యింది మేము బయట తిన్నాం,మీరు తినెయ్యండి “అంటూ రాధిక లోపలికెళ్లిందో .రాజామనస్సు చివుక్కుమంది .తన నిరీక్షణ అంతా క్షణం లో ఆవిరి అయ్యింది
వెంటనే తనకోసం ఆరాటపడుతున్న తల్లి వుత్తరం మళ్లీ చదువుకున్నాడు .అతని మనసు అన్వేషణ లో. అమ్మ ప్రేమను వెదుక్కుంటున్నది .. స్వార్హం ముసుగులో అమ్మను మర్చిపోయినందుకు కన్నీళ్లు సుడులయ్యాయి,వెంటనే బాగ్ లో బట్టలు సర్దుకున్నాడు ,పర్స్ లో డబ్బులు చూసుకున్నాడు ,”రాధి నేను అమ్మను చూసొస్తాను “అంటూ బయటకు వెళ్లిపోయాడు .

రాధిక నోరెళ్లబెట్టి ,కళ్లు పెద్దవి చేసి అలాగే రాజా ను చూస్తూ నిలబడింది .

-////////———/////——-//——-

.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు