నందన వనాన్ని నందనందనుడు పాలించేవాడు. అతని పాలనలో ప్రజలు ఏ లోటూ లేకుండా హాయిగా జీవించేవాడు.
ఓ ఏడాది ఒక్క చినుకు కూడా కురవలేదు. రాజ్యంలో ప్రజలు తాగడానికి నీళ్లులేక అల్లాడిపోయారు. ఇది చూసిన రాజుకి గుండె తరుక్కుపోయింది. ఆనందం ఉప్పొంగే సమయంలో ‘ఇంత విపరీతమైన కరువు తాండవించడమా?’ అని దీర్ఘంగా ఆలోచించసాగాడు.
ఒకప్పుడు రాజ్యంలో రోడ్లకు ఇరు వైపులా చెట్లు దర్శనమిస్తూ చల్లని నీడనిచ్చేవి. ఇప్పుడవి కనుమరుగయ్యాయి. ఎండ వేడిమి ఎక్కువయింది. ఇటు, అటు చూసినా పచ్చదనం కనిపించలేదు. కళావిహీనంగా మారింది.
కొందరు స్వార్థ పరులు చెట్లును కూల్చి వేయడం వల్లే చెట్లన్ని మాయమయ్యాయని నందనందనుడు తెలుసుకున్నాడు. అప్పటి నుంచి చెట్లను తొలగిస్తే వెయ్యి వరహాలు జరిమానా ’ అని దండోరా వేయించాడు. దీంతో చెట్లను ఎవరూ తొలగించలేదు.
ఈ సారి చెట్లను పెంచితే పది వరహాలు బహుమతి ఇస్తానని ప్రకటించడంతో అందరూ ఒక్కో చెట్టును నాటారు. అవి పెరిగి పెద్ద వృక్షాలు అయ్యాయి. ఇప్పుడు రాజ్యంలో ఎటు చూసినా పచ్చదనం కనిపించింది.
నందనందనుడికి ఇంకో ఆలోచన కూడా వచ్చింది. ఉపయోగించే నీటిని వృథా కాకుండా చిన్న చిన్న గోతులు తవ్వి ఇంకిపోయేలా చేశాడు. దీంతో భూమిలో నీటి సామర్థ్యం పెరిగి బావుల్లో, చెరువుల్లో నీటి నిల్వలు పెరిగాయి. క్రమంగా వర్షపు జల్లులు కురిశాయి. ఇప్పుడు కరువు కనుమరుగైంది. పంటలు చక్కగా పండాయి. రాజ్యంలో ప్రజలు సకల సంపదనలతో సుభిక్షంగా జీవించసాగారు. నందనందనుడు తీసుకున్న మంచి ఆలోచనలతో ప్రజలు ఎంతో ఆనందించాడు.