తీయని జ్ఞాపకాలు - బి.రాజ్యలక్ష్మి

Teeyani gnapakalu

వేసవి కాలం వేడికి వుదయాన్నే లేచిన రమణి ఫ్రెష్ అయ్యి దాశరథి కవితలు చదువుకుందామని కూర్చుంది ! ఇంతలో అమ్మ జానకి “మణీ యివాళ రాఘవ వస్తానన్నాడు ,గుర్తుందా “అంటూ రమణి కి ఇడ్లీ ప్లేట్ అందిస్తూ అన్నది .అవును నిజం గానే మర్చిపోయింది .మురళి జ్ఞాపకాలలో రాఘవ విషయం వెనక్కి వెళ్లింది .నవ్వుకుంది రమణి .
రమణి డిగ్రీ కాలేజీ లో lekcharar మురళి కూడా అక్కడే లెక్చరర్ ..అతను రెండు సంవత్సరాలు ముందు జాయిన్ అయ్యాడు ,రమణి జాయిన్ అయ్యి ఒకసంవత్సరం అయ్యింది .పరిచయాలు తమాషాగా జరిగాయి .రమణి గణితం సబ్జెక్ట్ ,మురళి ఫిజిక్స్ !ఒకరోజు స్టాఫ్ రూమ్ లో రమణి చేతిలో దాశరథి కవితాసంకలనం ,మురళి చేతిలో తెన్నేటి హేమలత గారి మోహనవంశీ ,యిద్దరూ ఎవరికి వారు చదువుకుంటూ లీనమయ్యారు .ఆయమ్మ కాఫీ పెట్టివెళ్లింది .వాళ్లదృష్టి అటువైపు వెళ్లలేదు . కాఫీ చల్లారింది .ఆయమ్మ. మౌనం గా అవి తీసుకెళ్లింది .
“దాశరథి కవితల్లో ప్రకృతి వర్ణన , చదువంటే మనం ఆ తోటలో వున్నట్టుగానే వుంటుంది కదండీ “అంటూ మురళీ వైపు చూసింది .వులిక్కిపడ్డాడు మురళి .ఒకే చోటు పనిచేస్తున్నా యెన్నడూ యిద్దరూ మాట్లాడుకోలేదు అలాంటిది సడన్ గా రమణి మాట్లాడడం తనల్ని వుద్దేశించె యెందుకంటే స్టాఫ్ రూమ్ లో వాళ్లిద్దరే వున్నారు .మురళి రమణి వైపు చూసి నవ్వుతూ “అవునండీ “అన్నాడు .ఆలా వాళ్లిద్దరి పరిచయం క్రమం గా పెరిగింది .కానీ యెప్పుడూ సాహిత్యం మీదే వుండేవి .అభిప్రాయాలూ ,ఆలోచనలూ ఆశయాలు కలిసాయి .ఇద్దరి తల్లితండ్రులకు యిష్టమయ్యింది ..సెలవులయ్యాక తిరుమలలో కళ్యాణం చెయ్యాలని నిర్ణయించారు .

“అక్కయ్యా “భుజాలు పట్టి వూపుతున్న కృష్ణ ను చూడగానే రమణి యీ లోకం. లోకి వచ్చింది .అవును రాఘవను చూసి. పదిహేడేళ్లయ్యింది .అప్పుడు తనకు
యేడేళ్లు , రాఘవ కు పదిహేనేళ్లు . ఎలావున్నాడో తనల్ని గుర్తుపడతాడో లేదో ,అసలు తను గుర్తుపడుతుందో లేదో ! రమణి నవ్వుకుంది ,
పదిహేడేళ్ళక్రిందటి రాఘవ !!

రమణి తండ్రి రామచంద్రం ,రాఘవ తండ్రి రాజశేఖరం ఒకే బ్యాంకు లో పనిచేసేవారు .ఇళ్లు మాత్రం ఒకరు. హైదరాబాద్ అయితే యింకొకరు సికింద్రాబాద్ . రాజశేఖరానికి ఒకడే కొడుకు. రాఘవ ,రామచంద్రానికి రమణి ,కృష్ణ .ఆదివారాలు రెండు కుటుంబాలు యెవరోఒకరి యింట్లో కలిసేవి ! ఎక్కువగా రాఘవ. వాళ్లే వచ్చేవాళ్లు .రమణి ,రాఘవ ఆడుకునేవాళ్లు ,అల్లరి చేసేవాళ్లు అప్పుడప్పుడూ కోపం గా పోట్లాడుకునేవాళ్లు ! రాఘవ కవ్వించేవాడు రమణి అలిగేది .మళ్లీ రాఘవే అలకపోగొట్టేవాడు .సరదాగా గడిచిపోయేవి . తనల్ని మొట్టికాయలేసేవాడు ముద్దుపెట్టుకునేవాడు .రాఘవ బొమ్మలు గీసేవాడు .ఒకసారి తను చీమిడిముక్కుతో యేడుస్తుంటే బొమ్మగీసి వెక్కిరించాడు .ఆ బొమ్మ యిప్పటికీ అపురూపం గా దాచుకుంది .తర్వాత వాళ్లకు ట్రాన్ఫర్ అయ్యి విజయవాడ వెళ్లిపోయారు .తను చదువు పూర్తయ్యి లెక్చరర్ గా జాయిన్ అయ్యింది .రామచంద్రం గారు. మరోలోకానికి వెళ్లిపోయారు .

ఆదివారం వచ్చింది . జానకి,రమణి ,కృష్ణ రాఘవ కోసం యెదురుచూస్తున్నారు .ఇంటిముందు కార్ ఆగింది రాఘవ దిగాడు .జానకి గుర్తుపట్టింది .అతనికి చెంప మీద నల్లని పెద్ద పుట్టుమచ్చస్ బాగా జ్ఞాపకం .రమణి నవ్వేసింది .
“రా బాబు “జానకి లోపల కుర్చోపెట్టింది .
“అబ్బో రమణి బాగా పొడవయ్యిందే !”అంటుూనవ్వాడు .
“రమణి కాలేజీ లెక్చరర్ రాఘవా ,కవితలు కథలూ దానిప్రపంచం !అల్లరి రమణి కాదిప్పుడు .ఇన్నేళ్లకు గుర్తుపెట్టుకుని వచ్చావు చాలా సంతోషం ,అసలు మా యిల్లు యెలా కనుక్కున్నావు “అడిగింది జానకి

“”అత్తయ్యా. చాలా రీసెర్చ్ అయ్యింది లే ,మెం విజయవాడ వెళ్లిపోయాం , అమ్మ నేను బ్యాంకు వుద్యోగం లో చేరిన రెండు నెలలకుచనిపోయింది .నాన్న మానసికం గాబలహీనమయ్యాడు .నా వుద్యోగం యింట్లో నాన్నను చూసుకోవడం !అంతే ! రెండేళ్లకు నాన్న తట్టుకుని ఆధ్యాత్మకం వైపు పయనం .ఇప్పుడు నాన్నకు స్నేహితులు ,చర్చలూ తనకంటూ ఒక ప్రపంచం ..నా బదిలీల్లో యిప్పుడు హైదరాబాద్. వచ్చాను . నాన్న నా దగ్గరే వుంటాడు .ఇక్కడ మామయ్య పనిచేసిన బ్యాంకు లో మీ యింటి అడ్రస్ సాయం. తో వెతికి అక్కడే ఫోన్ నెంబర్ సంపాదించి వచ్చాను . “అన్నాడు రఘవ.

“కబుర్లు తర్వాత ,ముందు భోజనానికి రా “అన్నది జానకి
“నీకిష్టమని మామిడికాయ పప్పు ,చిక్కుడుకాయ కూర. చేసాను “అంది జానకి
“ఇంకా నా రుచులు గుర్తున్నాయి నీకు “అన్నాడు రాఘవ .

“పెళ్లయిందా రాఘవా “అడిగింది. జానకి

“లెదత్తయ్యా రమణి ని యిచ్చెయ్యి చంకలో వేసుకుని పెళ్లి చేసుకుంటాను “అన్నాడు. నవ్వుతూ .

“రమణి పెళ్లి సెటిల్ అయ్యింది. మురళి కాలేజీ లో లెక్చరర్ ,”అంది. వైదేహి .
“గుడ్ ,నాకు. సెటిల్. అయ్యింది. నీరజ నా బ్యాంకు వుద్యోగిని అది చెప్పాలనే వచ్చాను. అన్నాడు రాఘవ .

రమణి కి యెందుకో రాఘవ తన. చిన్నప్పటి స్నేహితుడు ,యిక్కడే వుంటే బాగుంటుంది మళ్లీ ఆ సరదాలు వస్తాయా ? కానీ యెందుకో అతని తో చనువుగా వుండలేకపోయింది అలాగని అతన్ని మర్చిపోలేకపోతున్నది ..రాఘవ మారలేదు ,అదే చనువు అదే ఆప్యాయత !

రాఘవ వెళ్లిపోయాడు .జీవితం లో యెన్నో యెన్నో అనుభూతులు ,యెన్నో యెన్నో అందమైన. మలుపులు ! కొన్ని గుండెలోతుల్లో మంచుబిందువుల్లా నిలిచిపోతాయి , తడి తగుల్తుంది. కానీ ఘనీభవం కాదు .స్నేహం వేరు ,ప్రేమ. వేరు .స్నేహం చల్లని మలయసమీరం ! ప్రేమ మధుర పరిమల్స్ మల్లెల వసంతం .

మురళి నవ్వు గుర్తుకొచ్చింది ! రమణి పెదాలపై చిరునవ్వులు. సమ్మోహనం గా వున్నాయి .
—————/—————————/———///

మరిన్ని కథలు

Pareeksha
పరీక్ష
- తాత మోహనకృష్ణ
M B Company
M B కంపెనీ
- మద్దూరి నరసింహమూర్తి
A1 farmula
ఏ1 ఫార్ములా
- వై.కె.సంధ్యా శర్మ
Oke okkadu
ఒకే ఒక్కడు
- కందర్ప మూర్తి
Mitam
మితం
- ఆదిత్య ప్రణవ్
Bamma ki ichina mata
Bamma ki ichina mata
- Prabhavathi pusapati
Peddakodalu
పెద్దకోడలు
- మద్దూరి నరసింహమూర్తి
Parina pachika
పారిన పాచిక!
- - బోగా పురుషోత్తం