శాంతి చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఒక్కముక్క లో చెప్పాలంటే, బాపు బొమ్మ లాగ.. శరత్ కు శాంతి కాలేజీ లో పరిచయం. మొదటి చూపులోనే, శాంతి ని చాలా ఇష్టపడ్డాడు శరత్. స్నేహ, శాంతి స్కూల్ నుంచి మంచి ఫ్రెండ్స్. ఇద్దరు తరచూ కలుసుకునే వాళ్ళు. ఇప్పుడు..శాంతి, శరత్, స్నేహ ముగ్గురు కాలేజీ లో మంచి ఫ్రెండ్స్. శాంతి కి ప్రపోజ్ చెయ్యాలని టైం కోసం చూస్తున్నాడు శరత్.
శాంతి బావ రమేష్ కు శాంతి అంటే ఇష్టమని, ఇంట్లో పెళ్ళి మాటలు జరుగుతున్నాయని శరత్ కు తెలిసింది. ఆ మాట వినగానే, శరత్ చాలా బాధపడ్డాడు. తన కలలన్నీ కరిగిపోయాయి. శాంతి కి ప్రపోజ్ చెయ్యాలని టైం కోసం చూస్తున్న శరత్ కి ఇది ఒక షాకింగ్ న్యూస్. అంతగా ప్రేమించిన శాంతిని దూరం చేసుకుని బతకలేననుకున్నాడు శరత్. అందుకే, ఎలాగైనా శాంతి ని సొంతం చేసుకోవాలని అనుకున్నాడు.
శాంతి చదువు పూర్తయింది. కాలేజీకి కుడా సెలవులు ఇచ్చేసారు. ఇంక శాంతి ను కలవడం కుదరదని చాలా బాధ పడ్డాడు శరత్. ఇప్పుడు శాంతి ని చూడడానికి లేదు..ఎందుకంటే, ఆమె కు ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఈ రోజుల్లో పీటల పైన పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయి..ఇంకా నాకు ఛాన్స్ ఉందని అనుకున్నాడు శరత్.
శాంతి ఫ్యామిలీ మొత్తం...ముంబై కి షిఫ్ట్ అయ్యారు. తండ్రి కి అక్కడకు ట్రాన్స్ఫర్ అవడం తో తప్పలేదు శాంతికి. ఈ విషయం తెలుసుకున్న శరత్..శాంతి ఉండే ఏరియా లోనే ఒక ఫ్లాట్ తీసుకున్నాడు. అది శాంతి వాళ్ళ అపార్ట్మెంట్ కి ఎదురుగానే ఉంటుంది. అక్కడ ఒక టెలిస్కోప్ సెటప్ చేసుకుని... రోజూ శాంతి దిన చర్యలు గమనిస్తున్నాడు. ఇంట్లో ఉదయం పుట అందరూ బయటకు వెళ్ళిపోతారు. అప్పుడు శాంతి మాత్రమే ఇంట్లో ఉంటుందని తెలుసుకున్నాడు శరత్..
ఒకసారి ప్లంబర్ కోసం బుక్ చేసింది శాంతి. ఆ విషయం తెలుసుకున్న శరత్, ప్లంబర్ లాగా వాళ్ళ ఫ్లాట్ లోకి వెళ్ళాడు. బెల్ రింగ్ చేసాడు. శాంతి తలుపు తీసింది. ఇంకా రాత్రి నైటీ లోనే ఉంది. కొంచం వొళ్ళు చేసింది. ఆమె అందం చూసిన తర్వాత...శరత్ మనసు కొంచం శాంతించింది.
"ఎస్..! ఎవరు?"
" ప్లంబర్ కావాలని అడిగారంటా! మీ పేరు.." అని అడిగాడు శరత్..
"శాంతి" అని చెప్పింది
మాస్క్ వేసుకోవడం చేత, శరత్ ను గుర్తు పట్టలేదు శాంతి. శాంతి మాస్టర్ బెడ్రూమ్ లో టాప్ రిపేర్ అని బెడ్రూమ్ కు తీసుకొని వెళ్ళింది. ఈ లోపు ఫోన్ రింగ్ అయ్యింది. శాంతి హాల్ లో ఉన్న ఫోన్ రిసీవ్ చేసుకుంది.
"చెప్పు రమేష్! ఎలా ఉంది వర్క్ ఈ రోజు? ఇప్పుడే ఆఫీస్ కు వెళ్ళావు, అప్పుడే నేను గుర్తొచ్చానా? " అలా.. వాళ్ళ ఫోన్ సంభాషణ కొనసాగింది. శాంతి బావ రమేష్ ఆఫీస్ నుంచి అప్పుడప్పుడు శాంతి కి ఫోన్ చేస్తుంటాడు.
శరత్ తన వెంట తెచ్చుకున్న కెమెరాలను, బెడ్రూమ్ లో అమర్చాడు. టాప్ ఎలాగో రిపేర్ చేసి..వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. తన ఫ్లాట్ లో కంప్యూటర్ తో కెమెరాలు కనెక్ట్ చేసాడు. రోజూ శాంతి ని కెమెరాల ద్వారా చూస్తు..తన మాటలు వింటు ఇంట్లో జరుగుతున్నా విషయాలు అన్నీ తెలుసుకున్నాడు శరత్.
శాంతి తనకు శాశ్వతంగా కావాలనుకున్నాడు శరత్. దానికి రమేష్ ను తప్పించాలి. బాగా ఆలోచించాడు. ఈలోపు స్నేహ అమెరికా నుంచి హాలిడేస్ కి ఇండియా వచ్చింది. ఫ్రెండ్స్ అందరం కలుద్దామని మెసేజ్ పెట్టింది. ముంబై లో శాంతి హౌస్ లో కలుద్దామని స్నేహ డిసైడ్ చేసింది.
శరత్ ముంబై లో ఉన్నది ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేసాడు. ఎవరికీ అనుమానం రాకూడదని, శరత్ స్నేహ ను కలవడానికి ముంబై నుంచి హైదరాబాద్ లో తన ఇంటికి వెళ్ళాడు. అక్కడ నుంచి అందరూ కలసి, ముంబై బయల్దేరారు.
స్నేహ.. రామ్ ని పెళ్ళి చేసుకుని..అమెరికా లోనే సెటిల్ అయ్యింది. స్నేహ అమెరికా నుంచి రావడం చేత, కొంచం రిచ్ గానే పార్టీ ప్లాన్ చేసింది. షిప్ లో రాత్రంతా న్యూ ఇయర్ పార్టీ అరెంజ్ చేసింది. పార్టీ కి శాంతి తో పాటు, రమేష్ ని కుడా పిలిచింది స్నేహ. అందరూ శాంతి హౌస్ నుంచి షిప్ లోకి చేరుకున్నారు.
రాత్రి పదకొండు అయ్యింది. స్నేహ భర్త డ్రింక్ చేయడానికి కంపెనీ కోసం వెతుకుతున్నాడు. రమేష్ కు అలవాటు ఉంది. ఇద్దరూ కూర్చొని స్టార్ట్ చేసారు. సిట్యుయేషన్ అడ్వాంటేజ్ తీసుకుని, రమేష్ చేత బాగా తాగించాడు శరత్.
రామ్ అండ్ రమేష్ బాగా మత్తు లో ఉండి షిప్ పైకి ఎక్కారు. షిప్ సడన్ జర్క్ తీసుకోవడం చేత రమేష్ జారీ నీటిలో పడిపోయారు. రమేష్ మునిగిపోయాడు. వెంటనే గమనించిన అక్కడ సిబ్బంది రక్షించడానికి ప్రయత్నించారు. కానీ, రమేష్ దొరకలేదు, తర్వాత మరణించాడని ప్రకటించారు.
శాంతి షాక్ లోకి వెళ్లిపోవడం చేత.. వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేసారు. అందరూ చాలా బాధ పడ్డారు. . ప్రతి రోజు, హాస్పిటల్ లో శరత్.. శాంతి కి సేవలు చేసాడు. అక్కడే శాంతి పై తనకున్న మొత్తం ప్రేమను చూపించాడు శరత్. శాంతి చాలా ఇంప్రెస్ అయ్యింది. ఇంతలాగ తనని ఇష్టపడుతున్న శరత్ ను ఇన్నాళ్ళు ఒక ఫ్రెండ్ లాగ చూసింది..అతని ప్రేమ గుర్తించలేదు. రమేష్ కన్నా శరత్ చాలా మంచివాడు అని గుర్తించింది శాంతి. రమేష్ కు ఉన్నఅన్నీనెగటివ్ విషయాలు శరత్ కు ముందే తెలుసు కాబట్టి...వాటిన దృష్టిలో పెట్టుకుని శరత్.. శాంతి కి బాగా దగ్గర అయ్యాడు. శాంతి ఫోన్ లో రిసీవర్ యాప్ ని ఇన్స్టాల్ చెయ్యడం బాగా ఉపయోగపడింది. దాని ద్వారా..రమేష్ మాటలు..అతని విషయాలు అన్నీ శరత్ ముందే తెలుసుకున్నాడు.
కొన్ని రోజులకి శాంతి కోలుకుంది. ఇదంతా చూసిన శాంతి పేరెంట్స్, శరత్ కు శాంతి తో పెళ్ళి చేయాలని అనుకున్నారు. స్నేహ దగ్గర పెళ్ళి ప్రపోజల్ పెట్టారు. స్నేహ..శరత్ ను పిలిచి పెళ్ళి ప్రపోసల్ గురించి చెప్పింది. వినయంగా శరత్ " శాంతి కి ఇష్టమైతే.. నాకు ఇష్టమే " అన్నాడు.
స్నేహ.. శాంతి తో.. "శాంతి! శరత్ నీకు బాగా తెలుసు. నీకు హాస్పిటల్ లో చాలా సేవ చేసాడు. నువ్వంటే చాలా ఇష్టం. పెళ్ళికి ఒప్పుకో" అని అడిగింది
"నేనూ అదే అనుకుంటున్నాను స్నేహ.." అని తన మనసులో మాట చెప్పింది శాంతి.
తను ప్రేమించిన శాంతి ని మెప్పించి..శరత్ పెళ్ళి చేసుకున్నాడు.
******