భూషణ చారి కి దయ్యాలు, చీకటి అంటే చచ్చేంత భయం. కష్టపడి చదివి రైల్వే గేట్ మెన్ జాబ్ సంపాదించాడు, మైదుకూరు అనే గ్రామంలో ఊరి చివరన ఉన్న నాలుగవ రైల్వే గేట్ వద్ద పోస్టింగ్.
నాలుగో రైల్వే గేటు ప్రత్యేకత ఏమిటంటే, గేట్ మెన్ హౌస్ కి ఎదురుగా స్మశాన వాటిక ఉంటుంది. ఆ గేటు వద్ద కొత్తగా చేరిన వారు తప్ప, ఆ నాలుగో గేటు గురించి తెలిసిన వారు ఎవరు అక్కడ డ్యూటీ చేయరు. కొత్త వారైనా సరే రెండు మూడు రోజులు అంతే! అటువంటి చోటు మన భూషణాచారికి, మొదటి రోజు నైట్ డ్యూటీ పడుతుంది.
విచిత్ర శబ్దాలు, అరుపుల మధ్య మొదటి రోజు డ్యూటీ బిక్కు బిక్కు మంటూ భయపడుతూ గడుస్తుంది. అవిచిత్ర శబ్దాలు అరుపులకు గల కారణం ఆ ఊరిలోని ఆకతాయి యువకులు, నాలుగో రైల్వే గేట్ వద్ద డ్యూటీ చేయడానికి వచ్చిన గేట్ మెన్ ను భయపెడుతూ, వారితో ఆడుకుంటారు, భూషణ చారి యొక్క అమాయకత్వం భయాన్ని గమనించిన నిజమైన దయ్యం, ఆ ఆకతాయిలకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది, భూషణ చారి బిక్కు, బిక్కుమంటూ రెండొవ రోజు డ్యూటీ కి వచ్చాడు
పథకం ప్రకారం ఆకతాయిలు, గేట్ మెన్ రూమ్ కరెంటు ను తొలగించారు, మొత్తం చీకటి మయమయిపోయింది.భూషణ చారి గుండె వేగం పెరిగింది, కళ్ళు మూసుకొని శ్రీ ఆంజనేయం ప్రసన్నజనేయం అని చిన్నగా గోనుగుతున్నాడు, గజ్జల శబ్దాలు, వింత ఏడుపు శబ్దాలతో రూమ్ దెగ్గరికి చేరుకున్నారు, భూషణ చారి ని మరింత భయపెట్టటానికి గది లోపలికి చేరుకున్నారు, ఒక్కసారి గా గది తలుపులు మూసుకున్నాయి, 4 ఆకాతాయి యువకులు నిశబ్దం అయిపోయారు. భూషణ చారి పెద్ద గా నవ్వుతూ, రండి రా రండి అన్నాడు ఆడ గొంతు తో, ఆకతాయి యువకుల గుండెలు జారీ పోయాయి.
నలుగురి ని గదిలో ఒక దరువు వేసింది, భూషణ చారి ఒంట్లో దూరిన ఆ దయ్యం.అప్పటినుంచి ఇంకెప్పుడు ఆ ఆకతాయి యువకులు నాలుగోవా రైల్వే గేట్ వైపు వెళ్ళలేదు, భూషణ చారి కూడా వింత శబ్దాలు వినలేదు. ఎవరూ డ్యూటీ చేయలేని ఆ రైల్వే గేట్ వద్ద సాహసంగా విధులు నిర్వహించి పుట్టుకతో వచ్చిన భయాన్ని కూడా అదిగమించాడు, సంవంత్సరంలోనే ప్రమోషన్ పొంది, జూనియర్ ఇంజనీర్ గా ప్రమోషన్ పొందాడు.