కురుక్షేత్ర సంగ్రామం.2. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Kurukshetra sangramam.2

పాండవుల పక్షం వహించిన రాజ్యాలు, వంశాలు : ద్వారక, కాశి, కేకయ, మగధ, మత్స్య, ఛేది, పాండ్య, యదు మొదలుగాగల ప్రాచీన భారతదేశంలోని అనేకరాజ్యాలు పాండవుల పక్షం వహిస్తే,

కౌరవుల పక్షం వహించిన రాజ్యాలు, వంశాలు : ప్రాగ్‌జ్యోతిష రాజు, అంగ, కేకయ, సింధుదేశం, మాహిష్మతి, అవంతి, మద్ర, గాంధారము, బహ్లిక, కాంభోజ (యవన, సాక, తుషారులతో కలిపి) మరికొన్ని రాజ్యాలు.

పాండవ సైన్యం.

శాంతి ప్రయత్నాలన్నీ విఫలమైన తర్వాత పాండవులలో అగ్రజుడైన యుధిష్ఠిరుడు తన సోదరులను యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేయవలసిందిగా కోరాడు. మొత్తం పాండవ సైన్యాన్ని ఏడు అక్షౌహిణులుగా విభజించాడు. ఒక్కొక్క అక్షౌహిణికి ద్రుపదుడు, విరాటుడు, ద్రుష్ట్యద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి, చేకితానుడు, భీములను సైన్యాధిపతులుగా నియమించాడు. అందరి సమ్మతితో దృష్ట్యద్యుమ్నుని సర్వసైన్యాధిపతిగా నియమించాడు. అదనంగా కేకయ, పాండ్య, చోళ, కేరళ, మగధ మొదలగు రాజ్యాల సైన్యాలు పాండవుల పక్షాన యుద్ధంలో పాల్గొన్నాయి.

కౌరవ సైన్యంమార్చు

దుర్యోధనుడు సర్వసైన్యాధిపత్యం వహించమని భీష్ముని అభ్యర్థిస్తాడు. భీష్ముడు తాను కృతనిశ్చయుడనై యుద్ధము చేస్తాననీ, కానీ తాను పాండవులకు హాని చేయటం గానీ తన గురువు పరశురాముని అవమానించిన కర్ణుని తన సైన్యంలోకి తీసుకోవటం జరగదనే షరతులతో ఆమోదిస్తాడు. పాండవులపై అనురాగంతో, భీష్మ-కర్ణ సమేతమై దుర్భేధ్యమైన ‍‍‍కౌరవ సైన్యంతో పాండవులు పోరలేరని భీష్ముడు ఇలా నిర్ణయించాడని ఒక భావన. ధుర్యోధనుడీ షరతులనంగీకరించి భీష్ముని సర్వసైన్యాధిపతిగా అభిషేకిస్తాడు. కౌరవసేన పదకొండు అక్షౌహిణులు. సేనలో ద్రోణుడు, అతని కుమారుడు అశ్వత్థామ, కౌరవుల బావమరిది జయద్రధుడు, కృపాచార్యుడు, కృతవర్మ, శల్యుడు, సుదక్షిణుడు, భూరిశ్రవుడు, బాహ్లికుడు, శకుని మొదలగు మహావీరులు యుద్ధంలో పాల్గొన్నారు. వీరిలో కొందరు ధృతరాష్ట్రుని మీద విశ్వాసంతోను, కొందరు హస్తినాపురము మీద విశ్వాసంతోనూ కౌరవులకు సహాయ పడతారు.

విదర్భ రాజు రుక్మి, అతని రాజ్యం, బలరాములు మాత్రమే ఈ యుద్ధంలో మధ్యస్థులుగా ఉన్నారు.

కురుక్షేత్రయుద్ధంలో అనేక అయుధాలు వాడారు. భీష్మ, ధ్రోణ, అర్జున, కర్ణ, అభిమన్యు మొదలగు వీరులు ధనుర్బాణాలు, భీమ, ధుర్యోధనులు

గదను, ధర్మరాజు, శల్యుడు శూలాన్నీ వాడారు. ఇవికాక కత్తులు, బాకులు మొదలగు ఆయుధాలను కూడా ఉపయోగించారు.

భారతాన్ని చారిత్రక సత్యంగా గుర్తిస్తే, కురుక్షేత్రయుద్ధాన్ని చరిత్రలోనే అత్యంత రక్తపాతం జరిగిన యుద్ధంగా చెప్పవచ్చు. 18 రోజులలోనే ఇరుసైన్యాలలో దాదాపుగా అందరూ మరణిస్తారు. అభిమన్యుని వధకి ప్రతీకారంగా అర్జునుడొక్కడే ఒకే రోజులో ఒక అక్షౌహిణి కౌరవ సైన్యాన్ని హతమార్చాడు.

యుద్ధ వ్యూహాలు

విశిష్టమైన సైన్య రచనా పద్ధతిని వ్యూహం అని వ్యూహ శాస్త్రనిపుణులు వివరిస్తారు. తమ సైన్యం తక్కువగాను, ఎదటి సైన్యం ఎక్కువగాను ఉన్నప్పుడు వ్యూహం బాగా ఉపయుక్తమవుతుంది. ఒకవేళ అధికంగా సైన్యం ఉన్నా ఒక కట్టుదిట్టమైన విధానంతో దీన్ని విస్తరింపచేస్తూ తక్కువ ప్రాణనష్టం జరిగేలా, విజయం తమకు దక్కేలా తగినట్లుగా వ్యూహాన్ని నిర్మించుకోవాలి. మహాభారత యుద్ధ సమయంలో క్రౌంచ వ్యూహం, గరుడ వ్యూహం, మకర వ్యూహం, కూర్మవ్యూహం, శకట వ్యూహం, సూచి, శ్యేన, వజ్ర, అచల, సర్వతోభద్ర, మండలార్థ, శృంగాటక ఇలా అనేకానేక రకాల పేర్లతో వ్యూహాలు రూపొందించారు. పశువులు, పక్షుల పేర్లతో రూపొందించే వ్యూహాలు నిజానికి ఆయా పశువులు, పక్షులు తమ శత్రువులతో ఎలా పోరాడితే గెలుస్తున్నాయో అటువంటి స్వభావాన్ని అంతటినీ వ్యూహ రచయిత సంపూర్ణంగా అవగతం చేసుకుంటాడు. అచలం అంటే పర్వతం, అచల వ్యూహమన్నప్పుడు ఒకచోట ఒక క్రమపద్ధతిలో కొండలాగా కదలకుండా సైన్యం ఉండి శత్రువును ఎదుర్కొంటుంది, మకర వ్యూహంలో మకరం అంటే మొసలి, మొసలి నోరుభాగం అతి భయంకరంగా ఉంటుంది. దీన్ని తలపిస్తూ మకర వ్యూహన్ని రూపుదిద్దుతారు. కూర్మం వీపు భాగం ఎంతో గట్టి కవచంలాగా ఉంటుంది. కూర్మవ్యూహం పన్నేటప్పుడు సైన్యంలో ప్రధానమైన వారికి ఎవరికీ దెబ్బతగలకుండా మిగిలిన సైనిక భాగాలన్ని రక్షక కవచంలాగా ఉంటాయి. శ్యేనం అంటే డేగ, డేగ కళ్ళు ఎంతో చురుకుగా ఉంటాయి. ఆ కళ్ళతోటే తనకు కావలసిన పదార్థాన్ని ఎంతో దూరం నుండి చూసి చాకచక్యంగా తన ఆహారాన్ని తన్నుకుపోతుంది. అలాగే శత్రుసైన్యాన్ని చిత్తు చేయటానికి ఈ వ్యూహాన్ని వాడతారు. క్రౌంచ పక్షి ముక్కు చాలా ధృడంగా ఉంటుంది. ఈ వ్యూహంలో ముక్కు భాగంలో ఉండే వారిని జయించటమంటే శత్రువు ఎంతో కష్టానికి గురికావలసి వస్తుంది. వ్యూహాలు పన్నటానికి తగిన సమయం, వాటికి సంబంధించిన విషయాలను శుక్రనీతిలో గమనించవచ్చు. నదులు, అడవులు, దుర్గాలు, తదితర ప్రాంతాలలో తమ సేనకు ఏదైనా ముప్పు వాటిల్లబోతుంది అని సేనాపతి భావించినప్పుడు సందర్భానికి తగిన వ్యూహరచన చెయ్యడం జరుగుతుండేది. సైన్యం ప్రయాణిస్తున్నపుడు అగ్రభాగంలో ఉన్న సైనిక బలానికి ప్రమాదం ఎదురవుతుందన్నప్పుడు మొసలినోరు భాగాన్ని పోలినట్లుగా మకర వ్యూహాన్ని పన్ని శత్రువును చిత్తు చేసేవారు. అవతల శత్రువు కూడా బలంగానే ఉంటే డేగను పోలిన శ్యేన వ్యూహాన్ని పన్నేవారు. శ్యేన వ్యూహం పన్నటానికి ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే సూదిలాగా ముందుకు దూసుకుపోయి శత్రువును నాశనం చెయ్యటానికి సూచీ వ్యూహాన్ని పన్నేవారు. అగ్రభాగాన కాక, వెనుక భాగంలో శత్రువు వల్ల ప్రమాదం కలుగుతుందనుకుంటే శకటం (బండ) లాగా వ్యూహారచన చేసేవారు. ముందూ వెనుకా కాక పక్క భాగాల నుండి ప్రమాదం ముంచుకొస్తుందనుకుంటే వజ్ర వ్యూహాన్ని అలా కూడా కాక నాలుగువైపుల నుండి శత్రువులు దాడి చేయబోతున్నారనుకున్నప్పుడు చక్రవ్యూహమూ భద్రం, వ్యాళం అనే పేర్లున్న వ్యూహాలను కానీ పన్నేవారు. ఈ వ్యూహాలలో కొన్ని శత్రువులను దెబ్బతీయడానికి ఉపయుక్తమయ్యేవిగా ఉండగా, మరికొన్ని తమను తాము కాపాడుకోవటానికి పనికొచ్చేవిగా ఉంటాయి. వ్యూహాలకు అందులో వుండే సైనికులకు ఎప్పటికప్పుడు సూచనలిస్తూ ముందుకు నడవటానికికానీ శత్రువును నిర్భయంగా ఎదుర్కోమని చెప్పటానికి కానీ, వెనక్కి తిరిగి రమ్మనమని చెప్పటానికి కానీ సంబంధిత నాయకులు యుద్ధ సమయంలో ఉపయోగంచే వాద్య పరికరాలను ఉపయోగించటం, రథానికున్న ధ్వజాలు, జెండాలతో సూచనలు చేయడం లాంటివి చేస్తుండేవారు. ఇలా వ్యూహారచనా విన్యాసాలు సమరకళలో ఆనాడు ఎంతో ప్రాధాన్యం వహిస్తుండేవి.రెండవ రోజున పాండవులు క్రౌంచ వ్యూహంపన్నారు.అర్జునుని పైకి ద్రోణుడు,కృపుడు,శల్యుడు,దుర్యోధనుడు శతాధిక శరాలు ప్రయోగిస్తుంటే, వాటిని మార్గమధ్యంలోనే తుంచసాగాడు .

విరాటుడు,ధృష్టద్యుమ్నుడు,ద్రౌపతి పుత్రులు,భీష్మపరివారాన్ని

చుట్టుముట్టారు.అర్జునుని చేతిలో భీష్ముని సారథి గాయపడ్జాడు. అదిచూసిన ద్రోణ,కృప, శల్య, జయద్రధ,శకుని,వికర్ణులు అర్జునితో తలపడ్డారు అర్జునునికి సాయంగా, విరాటరాజు ( విరాటరాజు కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల పక్షాన తన ముగ్గురు కుమారులు, ఉత్తరుడు, శ్వేత,శంఖలతోయుద్ధంచేసాడు)సాత్యకి,దృష్టద్యుమ్నుడు,అభిమన్యుడూ,ద్రౌపతి నందనులు ప్రతివింధ్య, సత్సోముడు, శృతకీర్తి, శతానికుడు, శ్రుతశేనుడు అనే ఐదుగురు పుత్రులు వచ్చారు.భీముడు క్రోధంతో కళింగరాజు భానుమంతుని చంపి , శృతాయుధుని మూర్చపోఏలాచేసి .ఆనాటి యుధ్ధంలో ఎందరో కళింగ సైనికులతోపాటు ,కేతుమంతుడు, వరవీరుడు, వజ్రదేవుడు, అనేకవీరులు నేలకూలారు.కళింగ సైన్యానికి యముడిలా మారిన భీముడు తన శంఖాన్నిపూరించాడు ఆవిజయ ఘోషవిన్నభీష్ముడు తనరధాన్ని భీముని వైపు మళ్లించాడు.అంతలోని భీష్మునికిఅడ్డంగా మరుత్తు, సాత్యకి, శిఖండి వచ్చారు.వారిని అలానే నిలువరించి,భీముని ఎదుర్కొని అతని సారధి చంపివేసాడు.రథం కోల్పోయిన భీముడు భీకరగజంలా క్రోధంతో భ్రాంత,అవిధ్ధ,అప్లుత ,ఫ్రస్రుత,ప్లుత ,సంపాత, సముదీర్ణ విధాన హస్తలాఘ నాలతో వందలమంది కళింగ యోధులను నేలకూల్చసాగాడు.

అర్జునుడు, పాండవుల నష్టాలను అధిగమించడానికి ఏదైనా త్వరగా

చేయవలసి ఉందని గ్రహించి, భీష్ముని చంపాలని నిర్ణయించుకుని. కృష్ణుడు భీష్ముని రథాన్ని గుర్తించి అర్జునుని అతని వైపు నడిపిస్తాడు. అర్జునుడు భీష్ముని ద్వంద్వ యుద్ధంలో పాల్గొనడానికి

ప్రయత్నిస్తాడు, కాని కౌరవ సైనికులు అతన్ని రక్షించి అర్జునుడిపై దాడి చేస్తారు. అర్జునుడు మరియు భీష్ముడు గంటల తరబడి భీకర యుద్ధం చేస్తారు.

ద్రోణుడు మరియు ధృష్టద్యుమ్నుడు అదే విధంగా ద్వంద్వ యుద్ధంలో పాల్గొంటారు మరియు భీమునిచే రక్షించబడిన ధృష్టద్యుమ్నుని ద్రోణుడు ఓడించాడు . దుర్యోధనుడు భీమునిపై దాడి చేయడానికి కళింగ సైన్యాన్నిం పంపాడు మరియు కళింగ రాజుతో సహా వారిలో ఎక్కువ మందిచంపబడ్డారు. భీష్ముడు కళింగ సేనలకు విముక్తి కల్పించేందుకు వస్తాడు. భీముడికి సహాయం చేస్తున్న సాత్యకి భీష్ముని రథసారథిని

చంపాడు. భీష్ముని గుర్రాలు భీష్ముని యుద్ధభూమి నుండి దూరంగా తీసుకువెళతాయి.

ఆరోజు భీమార్జునుల ధాటికి కురుసైన్యం గజగజలాడింది.

ధృష్టద్యుమ్నుడు ద్రుపదుని కుమారుడు. ద్రౌపది అన్న. ద్రుపదుడు చేసిన యజ్ఞంలో ద్రౌపదితో పాటు ధృష్టద్యుమ్నుడు ఉద్భవించాడు. తన మిత్రుడు తనను అవమానించిన పాండవుల గురువు ద్రోణుని సంహరించేందుకు ద్రుపదుడు తపస్సు చేయగా వరం చేత ధృష్టద్యుమ్నుడు జన్మించాడు. ఇతడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల సైన్యానికి సర్వసైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు.

ధృష్టద్యుమ్నునికి బహుళ భార్యలు ఉన్నారు. అతనికి నలుగురు కుమారులు - క్షత్రధర్ముడు, క్షత్రవర్మన్, క్షత్రంజయుడు, మరియు ధృష్టకేతువు. మొదటి ముగ్గురు కురుక్షేత్రయుద్ధంలో ద్రోణుడిచే

గాయపడ్డారు , అయితే ధృష్టకేతువు కర్ణుడిచే గాయపడ్డాడు .

దృష్టద్యుమ్ముడు నిప్పులురాలే కళ్ళతో కృప,శల్య, అశ్వత్ధామలతో , తలపడి,ద్రోణపుత్రుని అశ్వాలను కూల్చాడు. అశ్వత్ఢామ శల్యుని రథంపైకి ఎక్కి వెళ్ళిపోయాడు. ఆసమరంలో దుర్యోధనుని కుమారుడు లక్ష్మణ కుమారుడు అభిమన్యునికి ఎదురుపడి గాయపడటంతో అతనికి సాయంగా దుర్యోధనుడు మరికొందరు కౌరవవీరులు వచ్చి అభిమన్యుని చుట్టుముట్టారు.అదిగమనించిన అర్జునుడు అభిమన్యునికి సాయంగా వచ్చి, తనశర పరంపరలతో ఆకాశాన్ని కమ్మివేసాడు.ఏవీరుడు ఎక్కడఉన్నాడో వారి శంఖారావంతో,తాళధ్వజాన్ని చూసిగుర్తించవలసి వస్తుంది.

సూర్యుడు పడమటికనుమల్లోకి వెళ్లడంతో ఆరోజు యుద్దం ముగిసింది.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు