కవిత్రయ భారతంలో పలు పాత్రలు మనకు కనిపిస్తాయి. ఓక్కొక్కపేరు,పలువురికి కనిపిస్తుంది ఉదాహరణకు 'భీముడు'పేరు న ధర్మరాజుతమ్ముడు,మరొకరు,సూర్యోపాసనచే బ్రాహ్మణులకు అన్నదానంచెసిన రాజు,మరోకరు విదర్బరాజు నలదమయంతి తండ్రి,వేరొకరు అగ్నివంశజుడైన వహ్నిపుత్రుడు . నీలుడు ఇతను విరాటజ్ఞాతి,మరోకరు ఇదేపేరునఉన్న మహీష్మతి దేశరాజు.వేరే పేర్లలో 'అలంబసుడు'జటాసురుని కొడుకు 15 వ రోజు యుధ్ధంలో ఘటోత్కజు ని చేతిలో మరణించాడు.మరోకరు బకాసురుని సోదరుడు,వేరొకరు సాత్యకీ చేతిలో 14 వ రోజు యుధ్ధంలో మరణించిన రాజు.'కర్ణుడు'కుంతిదేవి పుత్రుడు,మరోక కర్ణుడు దుర్యోధనుని తమ్ముడు ఉన్నాడు.ఇలా ఒకే పేరు పదుగురికి కనిపిస్తుంది.
మహభారతంలో ప్రధానంగా కనిపించే పేర్లు ఇవే !
సత్యవతి,పరాశరుడు,వ్యాసుడు,శంతనుడు,గంగాదేవి,భీష్ముడు,
విచిత్రవీర్యుడు,చిత్రాంగదుడు,అంబ,అంబిక,అంబాలిక,పాండురాజు,
ధృతరాష్ట్రుడు,గాంధారి,శకుని,కుంతిభోజుడు,కుంతి,మాద్రి,దుర్వాసుడు,
కర్ణుడు,ధర్మరాజు,భీముడు,అర్జునుడు,నకులుడు,సహదేవుడు,
దుర్యోధనుడు,దుశ్శాసన,దుస్సహన,దుశ్శలన,జలసంధన,సమన,సహన,విందన,అనువిందన,దుర్ధర్షన,సుబాహు,దుష్ప్రధర్షణ,దుర్మర్షణ,దుర్ముఖన,దుష్కర్ణన,కర్ణన,వికర్ణన,శలన,సత్వన,సులోచన,చిత్రన,ఉపచిత్రన,చిత్రాక్షన,చారుచిత్రన,శరాసన,దుర్మదన,దుర్విగాహన,వివిత్సు,వికటానన,
ఊర్ణనాభన,సునాభన,నందన,ఉపనందక,చిత్రభానన,చిత్రవర్మన,సువర్మన,దుర్విమోచన,అయోబాహు,మహాబాహు,చిత్రాంగన,చిత్రకుండలన,
భీమవేగన,భీమబలన,బలాకి,బలవర్ధనన,ఉగ్రాయుధన,సుసేనన,
కుండధారన,మహోదరన,చిత్రాయుధన,నిశాంగి,పాశి,బృందారకన,
దృఢవర్మన,దృడక్షత్రన,సోమకీర్తి,అంతుదారన,దృఢసంధన,జరాసంధన,
సత్యసంధన,సదాసువాక్,ఉగ్రశ్రవస,ఉగ్రసేనన,సేనాని,దుష్పరాజన,
అపరాజితన,కుండశాయి,విశాలాక్షన,దురాధరన,దృఢహస్తన,సుహస్తన,
వాతవేగన,సువర్చసన,ఆదిత్యకేతు,బహ్వాశి,నాగదత్తన,అగ్రయాయి,కవచి
,క్రధనన,క్రుంధి,భీమవిక్రమన,ధనుర్ధరన,వీరబాహు,ఆలోలుపన,అభయన,దృఢకర్మణ,దృఢరథాశ్రయన,అనాధృష్య,కుండాభేది,విరావి,చిత్రకుండలన,ప్రథమన,అప్రమధి,దీర్ఘరోమన,సువీర్యవంతన,దీర్ఘబాహు,సుజాతన,
కాంచనధ్వజన,కుండాశి,విరజ,యుయుత్సుడు,దుస్సల.
కౌరవుల ఏకైక సోదరి దుస్సల. ధృతరాష్ట్రునికి, ఒక వైశ్య వనితకి జన్మించినవాడు యుయుత్సుడు. కురుక్షేత్ర సంగ్రామములో పాండవుల పక్షానపోరాడాడు. అర్జునుని మనుమడు, అభిమన్యుని పుత్రుడుఅయిన పరీక్షిత్తునకు చిన్నతనములో సంరక్షకుడిగా వ్యవహరించాడు.
మరియు భానుమతి,రాథ,ద్రోణాచార్యుడు,కృపాచార్యుడు,అశ్వథ్థామ,శ్రీకృష్ణుడు,దేవకి,వసుదేవుడు,రేవతి,శశిరేఖ,ఉగ్రసేనుడు,కంసుడు,నందుడు,యశోద,శిశుపాలుడు,.కాక,జరాసంధుడు,విదురుడు,హిడింబి,హిడింభాసురుడు,బకాసురుడు,ద్రౌపతి,దృపదుడు,సైంధవుడు,సత్యభామ,రుక్మిణి,బలరాముడు,
సాత్యకి,సుధాముడు,జాంబవతి,ప్రమీల,అభిమన్యుడు,ఉత్తర,విరాటరాజు,
కీచకుడు,ఏకలవ్యుడు,సూర్యుడు, దేవేంద్రుడు,యధర్మరాజు,
అశ్వినీదేవతలు,శల్యుడు,జనమేజయుడు,వైశంయనుడు
వంటి 1655 పాత్రలు మనకు కనిపిస్తాయి.
ద్రుపద మహారాజు కుమార్తె ద్రౌపతి.పాండవుల భార్య.ఈమెతనతొలి జన్మలో 'నలయానుడు'అనే ఋషి కూతురు.అప్పటిపేరు'ఇంద్రసేన' 'మౌద్గల్యుడు' అనే మునిభార్య.అతను కుష్ఠివ్యాధి పీడితుడు కావడంవలన ఆమె చేసిన సేవలకు మిక్కిలిసంతసిల్లి ఆమెను వరం కోరుకోమనగా తనభర్తను ఐదురూపాలలో తనను సంతోషించమంది.అనంతరం మరుజన్మలో కాశీరాజు కుమార్తెగా జన్మించి శివుని గురించి తపస్సు చేసి మెప్పించి వరంకోరుకోమనగా,పతి,పతి,పతి,పతి,పతి అని ఐదుమార్లు పలకడంతో 'తధాస్తూ'అనిశివుడు వెళ్లిపోయాడు.మరుజన్మలో ద్రౌపతిగా జన్మించి పాండవులకు భార్యఐయింది.ఆమె యజ్ఞకుండమున పుట్టుటవలన 'యజ్ఞసేనా'అని,పాంచాలరాజు కూతురైనందున 'పాంచాలి'అని,ఈమె అసలుపేరు కృష్ట.ఈమెకు ధర్మరాజువలన ప్రతివింధ్యుడు,భీమునివలన శ్రుతసోముడు,అర్జునివలన శ్రుతకీర్తి,నకులునివలన శతానుకుడు, సహదేవునివలన శ్రుతసేనుడు జన్మించారు.వీరందరిని ఉపపాండవులు అనిఅంటారు.
మహభారతయుధ్ధంలో అర్జునుని రథ కేతనం (జండా)కపిరాజు , ద్రోణాచార్యుని రథ కేతనం బంగారు వేదిక,అశ్వత్ధామ రథకేతనం సింహంతోక,కృపాచార్యుని కేతనం బంగారు వృషభం,కర్ణుని రథకేతనం సర్పం,సైంధవుని రథ కేతనం వరాహం,భూరిశ్రవుని రథకేతనం యూపస్ధంబం.యుధ్ధరంగంలో ఏవీరుడు ఎక్కడఉన్నాడో ఈరథకేతనాల ద్వారా ,శంఖాలధ్వని తో గుర్తించగలుగుతారు.
నాలుగోరోజు యుద్దంలో ఇరువర్గాలు తమ గజబలగాలను ప్రవేశ పెట్టాయి.కౌరవ సేనలను వ్యాళవ్యూహంలో భీష్ముడు నడిపాడు.పాండవ సేనల ముందుభాగాన నిలిచిన అర్జునుని భీష్మ,కృప ,ద్రోణ,శల్య, వివింశతి, దుర్యోధన,భూరిశ్రవులు చుట్టుముట్టారు.వారిపన్నాగం తెలిసినన అభిమన్యుడు భీష్ముని ఎదుర్కొన్నాడు.ముచ్చటపడిన భీష్ముడు
అభిమన్యుని శరాలను మార్గంలోనే తుంచసాగాడు.మరో పక్క భీముడు కోళ్ల మందపై పడిన తోడేలులా, తన గధతో కౌరవ గజాలను కూల్చుతూ దుర్యోధనుని తమ్ములను పధ్నాలుగు మందిని పరలోకంపంపి విజయోత్సాహంతో చేసిన సింహనాదానికి కురుక్షేత్రం అంతా మారుమ్రోగింది..అది విన్న భీష్ముడు భీముని ఎదుర్కొన్నాడు. సహాయంగా వచ్చిన సాత్యకిని అలంబుసుడు ఢీకొన్నాడు,అలసిపోయిన అలంబుసునికి సాయంగా భూరిశ్రవసుడు వచ్చాడు.భీముని పైకి సుప్రతీకం అనే ఏనుగుపై వచ్చిన నరకాసురుని పుత్రుడు భగదత్తుడు ,తనశరాలతో భీముని మూర్చ పోయేలాచేసాడు.అదిచూసిన ఘటోత్కజుడు నాలుగు దంతాల ఏనుగు సుప్రతీకాన్ని నిలువరించాడు. అతనికి సాయంగా ధర్మరాజు వచ్చాడు. ఘటోత్కజుడు తన చిత్ర,విచిత్ర,మాయ యుధ్ధంతో కౌరవ సేనలను పరుగులు పెట్టించాడు. శల్యుని కుమారుడు రుక్మాంగదుడు ధృష్టద్యుమ్నుని సారధిని గాయపరిచాడు. కోపించిన ధృష్టద్యుమ్నుడు అతన్ని విరథుడు గాచేసి తన గధతో వాడి శిరస్సు నేలరాల్చాడు. కుమారుడి మరణంచూసిన శల్యుడు కోపంతో ధృష్టద్యుమ్నుని తో భీకరంగా పోరాడసాగాడు. దుర్యోధనుడు భీమునితో తలపడగా,మాగధుడు తన మదగజాన్ని అభిమన్యునిపై ఉసిగోల్పాడు.అభిమన్యుని శరాలకు మదగజం తోపాటు
మాగధుడు నేలకూలారు.ఇరుపక్కల వందలాది సేనలు నేలరాలు తున్నారు .వీరుల సింహనాదాలు,శంఖానాదాలతో కురుక్షేత్రమే కంపించింది.
ఆకాలంలో ధనుర్బాణాలను 'ముక్త' 'అముక్త' 'ముక్తాముక్త' 'యంత్రముక్త'
అనే నాలుగు విధాలుగా చెప్పారు.
మహస్త్రాల ప్రయోగం అయిదు విధాలుగా చెప్పారు. 1.ప్రయోగం.2.ఉపసంహారం.3.నివర్తనం.అంటే అవసరం అయితే వాడిన అస్త్రాన్ని మరలా ప్రయోగించడం.4. ప్రాయశ్చిత్తం అంటే తమ అస్త్రాంచే మరణించిన నిరపరాథులను బ్రతికించడం. 5.ప్రతిఘాతం అంటే శత్రువులవలన నిష్పలమైన దేవతాస్త్రాలను పునరుద్దరించటం. ఇంకా యుధ్ధరంగంలో వాడే ఆయుధాలు శక్తి,పట్టిసము ,రస్తి,హలము ,త్రిశూలము,గధ, పరశువు,ఖడ్గము,పాసెము (రజ్జువు) చక్రము,బండిపాలము , తొమరము ,ఘోరశరము ,భూఘండి, వత్సదంతం,కర్మీరము,అంజలిక,నారాచము,కుంతము,నఖరము.
మొదలగు ఆయుధాలు వినియోగించబడ్డాయి.
సూర్యుడు అస్తమించడంతోనాలుగోరోజు యుధ్ధం ముగిసింది.