కురుక్షేత్ర సంగ్రామం.(5).
రామాయణం కామపురుషార్ధం మీద ఆధారపడిన ఇతిహాసమని, మహాభారతం అర్ధపురుషార్ధం మీద ఆధారపడిన ఇతిహాసమని 'కౌటిల్యుడు'తన అర్ధశాస్త్రంలో స్పష్టంగా చెప్పాడు.ఏకాలంలోనైనా, ఏదేశంలోనైనా సాహిత్యానికి స్వాతంత్ర ప్రతిపత్తి ఉండదు.ఏసాహిత్యానికైనా ఆపరిసర ప్రాంతాలలోని సమాజమే వేర్లుఊపిరి పోసుకుంటుంది.వేర్లు లేకుండా చెట్టు ఎలాఉండదో సామాజిక జీవితాలతో సంబంధంలేకుండా సాహిత్యంకూడా ఉండదు.తెలుగుభారతం క్రీ.శ.11-14శతాబ్దల నడిమి కాలంలో వెలువడినా,అందులోని సామాజిక జీవితం,సామాజికుల సంబంధ బాంధవ్యాలు ఆకాలానికి చెందినవి కావు. అయితే కవిత్రయ భారతం కేవలం అనువాదం మాత్రమే కాదు, అనుసృజన కూడా. కళాత్మకమైన ఈఅనుసృజనలో ఉన్నకొన్నిచేర్పులు,మార్పులతో మాత్రం కవిత్రయ కాలం నాటి సజాజం కొంత ప్రతిఫలించవచ్చు, మిగిలినిదంతా సంస్కృత భారత రచనా కాలంనాటి సామాజిక జీవితమే.
కవిత్రయంవారి మహభారతం పద్దెనిమిది పర్వాలుగా చెప్పబడింది.అవి ఆది,సభా, అరణ్య,విరాట, ఉద్యోగ,భీష్మ,ద్రోణ,కర్ణ,శ, సౌప్తిక,స్త్రీ,శాంతి, రాయబడింది.వీటిలో రెండున్నర పర్వలు నన్నయ్య,ఒకటిన్నర పర్వవం ఎర్రన,మిగిలిన పదిహేను పర్వాలు తిక్కన తీర్చిదిద్దారు.
ధృతరాష్టృనికి అజముఢ,ఆంబికాసుత,ఆంబికేయ,భారత,భరత శార్ధుల,భరత శ్రేష్ఠ,భరతర్షభ,భరతసత్తమ,కౌరవ శేష్ఠ,కౌరవరాజా, కౌరవేంద్ర,కౌరవ్య,కురుశార్ధుల,కురుశేష్ఠ,కురుద్వహ,కురుకులశ్రేష్ఠ,కురుకులోద్వహ,కురుముఖ్య,కురునందన,కురుప్రవీరా,కురుపుంగవా,కురురాజా,కురుసత్తమ,కురువంశవర్ఢనా,కురువీరా,కురువృధ్ధ,కురువృధ్ధవర్యా,వైచిత్రవీర్యా,ప్రజ్ఞచాక్షు మొదలగు పేర్లతో పిలువ బడ్డాడు.
దుర్యోధనుడుకూడా అజమీఢ,భరతశార్ధుల,భరతశ్రేష్ఠ, భారతాగ్రవ్య ,భరతర్షభ ,భరతసత్తమా ,భారతసత్తామ ధార్తరాష్టృ ,దృతరాష్టృపుత్ర ,దృతరాష్టృసూను ,దృతరాష్టృసీత ,ధృతరాష్టాృత్మజ ,గాంధారిపుత్ర ,కౌరవశ్రేష్టృ ,కౌరవనందన ,కౌరవాత్మజా ,కౌరవ్య ,కౌరవేయి,కురుశ్రేష్టృ, కురుకులాధమా ,కురుముఖ్య ,కురునందన ,కురీపతి ,కురుప్రవీరా ,కురుపుంగవా ,కురురాజా, రారాజా ,కురుసింహ ,కురువర్ధన ,సుయోధన
వంటి పేర్లతో పిలబడ్డాడు.
ద్రోణునికి పలుపేర్లు, ఆచార్య,భరద్వాజా ,భరద్వాజ సుత ,భరద్వాజాత్మజ
,భరతాచార్య,శోణేశ్వ ,శోణాశ్వవాహ ,శోణహయగురు,రుక్మరధ వంటి పేర్లతో పిలువబడ్డాడు.
ధృష్టకేతుకు ,చైద్య , చేదిజ ,చేదిప , చేదిపతి ,చేదిపుంగవా ,చేదిరాటు , చేదిరాజు ,శైశుపాలి , శిశుపాలసుత ,శిశుపాలాత్మజా వంటి పేర్లతో పిలువబడ్డాడు.
ఐదు తరాలు వారు పాల్గొన్న రణం మహభారతం మాత్రమే .జయం పేరున రాయబడిన ఈ మహాభారతం పంచమవేదంగా ప్రాశిస్తిపోంది. సంస్కృతమాలం(వ్యాసవిరిచితం)లో లక్షకు పైగా శ్లోకాలు ఉన్నాయి.కవిత్రయంవారి ఆంధ్ర మహాభారతంలో సుమారు 21,5000 పద్య గద్యలుఉన్నాయి.ఆంధ్రమహాభారతం ప్రకారం శతశృంగపర్వతంనుండి హస్తినాపురానికి వచ్చేనాటికి ధర్మరాజుకు 16,భీమునికి15, అర్జునునకు 14,కవలలైన భరత-శతృఘ్నలకు-13 సంవత్సరాలని తెలుస్తుంది.భీముడు-ధుర్యోధనుడు ఒకేరోజున జన్మించారుకనుక యిరువురి వయస్సు ఒక్కటే. కృపాచార్యులు అనంతరం ద్రోణాచార్యుల వద్ద విలువిద్య అభ్యసించినకాలం 13 సంవత్సరాలట.అంటే విలువిద్యముగిసేనాటికి ధర్మరాజు వయస్సు29 సంవత్సరాలు.లక్కయింటిలోను,ఏకచక్రపురంలోనుకలిసి సంవత్సరకాలం ఉన్నారు అనుకుంటే ధర్మరాజువయసు 30. ద్రౌపతిని వివాహం చేసుకుని పాండవులు దుృపదుని యింట సంవత్సరం ఉన్నారట అంటే ధర్మరాజుకు 31 వయసు.అనంతరం హస్తినకువచ్చి 5 సంవత్సరాలు ఉమ్మడిగా జీవించారట అంటే ధర్మరాజు వయస్సు 36.పిమ్మట రాజ్యంపంచుకుని ఇంద్రప్రస్ధపురం విశ్వకర్మచే నిర్మించుకొని 23 సంవత్సరాలు రాజ్యపాలన చేసారని సభాపర్వం చెపుతుంది. అంటే36+23=59. పన్నెండేళ్ళు అరణ్యవాసం,సంవత్సరం అజ్ఞాతవాసం 59+13=72 సంవత్సరాల వయసు ధర్మరాజుది.అతనికంటే కర్ణుడు దాదాపు 7లేక8 సంవత్సరాల పెద్దవాడు.మహభారత సంగ్రామంనాటికి ధర్మరాజు వయసు 72 అంటే అతని పితామహుడు అయిన భీష్ముని వయసు ఎంత. దాదాపు 150 నుండి 180 వరకు ఉండాలి .భీష్ముని తమ్ముడు బాహ్లీకుడు వయస్సుకూడా దాదాపుగా అంతే ఉంటుంది.కురుక్షేత్రసంగ్రామంలో ధృతరాష్ట్రుని1. పితామహుడు2. పిత , 3.భ్రాతృడు ,4.పుత్రుడు.5. పౌత్రుడు అనే 5 తరాలు అంతరించాయి.
వంశవృక్షం:చంద్రవంశంలో 39 వ తరం వాడు ప్రతీపుడు యితను శిబి కుమార్తే అయిన సునందను వివాహంచేసుకున్నాడు వారికి దేవాపి,శంతన,బాహ్లీకుడు. అనేముగ్గురు పుత్రులు జన్మించారు.దేవాపి బాల్యంలోనే తపోధనుడుగా వనవాసం వెళ్ళాడు.శంతనుడు రాజయ్యాడు.అతనికి గంగాదేవికి భీష్ముడు జన్మించాడు.అనంతరం యొజనగంధి అయిన సత్యవతిని వివాంచేసుకోగా,చిత్రాంగద విచిత్రవీర్యులు జన్మించారు.వీరిలోఒకరు గంధర్వరాజు చేతిలో మరణించగా, మరోకరు క్షయవ్యాధికి లోనై మరణించారు.సంతానంకొరకు సత్యవతి తనకోడళ్ళు అయిన అంబిక,అంబాలికలకు దేవర న్యాయంగా కృష్ణ ద్వైపాయని వలన ధృతరాష్ట్ర పాండురాజులు జన్మించారు.అంబిక పరిచారికయందు విదురుడుజన్మించాడు. గాంధాకివేదవ్యాసవరప్రసాదంగానూరుగురుసంతతిజన్మించారు. కుంతి
మాద్రిలకు పలు దేవతలవరాన పాండవులు జన్మించారు.ద్రౌపతి కిపాండవులకు ప్రతివింధ్యుడు-శ్రుతసోముడు-శ్రుతకీర్తి-శతానీకుడు-శ్రుతసేనుడు అనే పుత్రులు జన్మించారు.అంతేకాకుండా ధర్మరాజు నకు -దేవిక అనేభార్యకు యౌధేయుడు. భీముడు-జలంధరలకు సర్వంగుడు .హిడింభి యందు ఘటోత్కచుడు, అర్జున సుభద్రలకు అభిమన్యుడు. ఉలూపికి ఇరావంతుడు,చిత్రాంగదకు బబ్రువాహనుడు ,నకులుడు-రేణుమతిలకు నిరామిత్రుడు,సహదేవుడు-విజయలకు సుహోత్రుడు,, అభిమన్యు ఉత్తరలకు పరీక్షిత్తుడు,ఇతనికి మద్రావతికి జనమేజయడు జన్మించారు జనమేజయునిభార్య వుపుష్టి.
శంతనుడి సోదరుడు బాహ్లీకుడు అతనికి సోమదత్తుడు,అతనికి
భూరిశ్రవుడు ,శల శల్యులనే ముగ్గురు జన్మించారు. మెదటి తరంలో భీష్మ,బాహ్లీకులు-రెండో తరంలో సోమదత్తుడు.మూడవ తరంలో భూరిశ్రవుడు అతని సంతతి.నాల్గవ తరంలో ధృతరాష్ట్రా-పాండురాజుల సంతతి.ఐదవ తరంలో లక్ష్మణకుమారుడు-అభిమన్యుడు-ఉపపాండవులు-ఇరావంతుడు-ఘటోత్కచుడు.పాండు రాజు పౌత్రులలో చిత్రాంగద కుమారుడు బబ్రువాహనుడుతప్ప మిగిలిన12 మంది యుధ్ధంలో మరణించారు.ఇది క్లుప్తంగా ఐదు తరాల కథ.
ఐదవరోజు యుద్ధం ప్రారంభంలో శంఖము,భేరి,మృదగం,కాహళ ఢంకానగారాలు, తాళం,తంబుర, దుందుభి, కుంభ, పణవ,అణక,క్రకచ వంటి పలు వాద్యాఘెషలో కురు,పాండవ సేనలు ముందుకు కదిలాయి.
శ్రీకృష్ణుడు తన పాంచజన్యాన్ని,అర్జునుడు తన దేవదత్తాన్నా,ధర్మరాజు తన అనంత విజయాన్ని,నకులుడు తన సుఘోషను,సహదేవుడు తన మణిపుష్పకం అనేశంఖాలను పూరించడతో సేనలు ముందుకు కదిలాయి.
ఆరోజు భీష్ముడు తనసైన్యాన్ని మకర వ్యూహంలో నిలిపాడు.పాండవులు
శ్యేన వ్యూహం పన్నారు.భీముడు,భీష్మునిపై శరపరంపరలు గుప్పించసాగాడు.అదిచూసిన అర్జునుడు భీమునికి సాహయంగా వచ్చాడు.దుర్యోధనుడు తనకొందరి సోదరులతో భీముని చుట్టుముట్టాడు .భీముని ధాటికి ధుర్యోధనుడు మూర్చపోయాడు, అదిచూసిన భగదత్తుడు భీమునితో తలపడ్డాడు.భీ ష్మునికి, అభిమన్యునికి, ద్రోణుడు,సాత్యకిలకు భీకర సమరం జరుగసాగింది. అలాజరుగుతున్న భీకరసమరంలో పాండవసేనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. అర్జునునికి నాగకన్య ఉలూచికి జన్మించిన ఐరావంతుడు నేలకూలడం చూసిన ఘటోత్కచుడు కోపంతో కౌరవసేనపై విరుచుకుపడి మారణహోమం సాగించసాగాడు. అతన్ని భగదత్తుడు అడ్డుకున్నాడు. శిఖండి ఎదురు పడటంతో భీష్ముడు తప్పుకున్నాడు.శల్యునితో సాత్యకి పోరాడసాగాడు.సూర్యుడు పడమటి కనుమల్లోకి వెళ్లగా నాటియుధ్ధానికి విరామం ప్రకటించారు.