రిటైర్మెంట్ జీవితం - Madhunapantula chitti venkata subba Rao

Retairment jeevitam

ఇటువంటివి బయటికి తెలిసిస్తే నలుగురిలోను తలెత్తుకొని తిరగలేము ఆడపిల్లలు కలవాళ్ళం.

ఈ వయసులో ఆ బుద్ధులు ఏంటి అంటూ డైనింగ్ టేబుల్ వరకు వచ్చిన అత్తగారు వైపు తిరిగి పెద్ద కోడలు శాంత గట్టిగా అరుస్తోంది. నానమ్మ నువ్వేనా చెప్పు ఇది తప్ప కాదా పెద్దవాళ్ళు పుస్తకం చదువుకో వాలి లేదంటే టీవీ చూడాలి. ఆస్తమాను ఆ మొబైల్ లో చాటింగ్ ఏమిటి నేను చూసాను కాబట్టి సరిపోయింది.

నాన్న చూస్తే ఇంకా ఏమైనా ఉందా ఇంట్లో పెద్ద గొడవ అయిపోతుంది అంటూ పెద్ద మనవడు రఘు అచ్యుత రామయ్య గారి భార్య కామేశ్వరమ్మ గారితో చెపుతున్నాడు. నన్ను స్కూల్లో ఏడిపిస్తారు నానమ్మ అందరూ వేలెత్తి చూపిస్తారు తాతయ్య చేస్తున్న పనికి ఇప్పుడు మనవరాలు రమ్య ఒకటే గోల ఏమైందిరా అందరూ ఒకటే అలా గొడవ పెడుతున్నారు విషయం తెలియకుండా నా మీద అరిస్తే ఏమిటి ఉపయోగం. విషయం చెప్పండి నేను పరిష్కారం ఆలోచిస్తాను అంటూ చెప్తున్న కామేశ్వరమ్మ గారి మాటలు విని మనవడు రఘు అచ్యుతరామయ్యగారి రూమ్ లో నుంచి మొబైల్ ఫోన్ పట్టుకుని వచ్చి వాట్సప్ ఓపెన్ చేసి వాట్సప్ సందేశాలు చదవడం ప్రారంభించాడు. గుడ్ మార్నింగ్ తో ప్రారంభ మయ్యాయి సందేశాలు. ఇలాగా ఉదయం ప్రారంభమైన సందేశాలు మధ్య మధ్యలో ఆరోగ్యం గురించి పుస్తకాల గురించి సినిమాలు గురించి షికార్లు గురించి కుటుంబం గురించి అలవాట్లు గురించి హాబీలు చుట్టాలు గురించి ఒకటేమిటి ఇలా రోజంతా సందేశాలతో నిండిపోయి ఉంది. కాంటాక్ట్ లిస్టులో ఫోన్ నెంబర్ పింకీ అని సేవ్ అయ్యింది. ప్రొఫైల్ పిక్చర్ ఒక అమ్మాయిది ఉంది. ఇలా సందేశాలన్నీ చదువుతూ ఒక చోట ఆగిపోయాడు అనుమానంగా రఘు.

రేపు సాయంకాలం పార్కుకి ఎన్ని గంటలకు తీసుక వెళ్తారు పార్కుకి వెళ్ళిన తర్వాత అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందాం. మనo వెళ్ళిన పెద్దమ్మ గుడి చాలా బాగుంది. అన్ని వివరాలు మా అమ్మకి చెప్పాను. చాలా సంతోషించింది.నా మనసుకు చాలా ఆనందంగా ఉంది. మీరు దగ్గర ఉంటే నేను ఈ లోకంలో ఉండటం లేదు. నా బాధలు కన్నీళ్లు నా పరిస్థితి ఏమి గుర్తుకు రావటం లేదు. ఒంటరిగా ఉన్న నాకు మీ స్నేహం చాలా మంచి ఆనందాన్ని ఇస్తోంది. మీ మాటలు నాకు అమృతంలా ఉన్నాయి బతకాలని ఆశ కల్పిస్తున్నాయి ఇంట్లో మగ్గిపోయే నాకు ప్రపంచం చూపిస్తున్నారు . ప్రపంచం అంటే ఏమిటి ఇప్పుడే తెలిసింది నాకు. ఇది దేవుడు కలిపిన బంధం అంటూ సాగిపోతున్నాయి సందేశాలు అంటే తాతయ్య టూర్లు కూడా వెళ్తున్నాడన్నమాట. తాతయ్య పొద్దున్నే టిఫిన్ చేసేసి బయటకు వెళ్ళిపోతాడు. మళ్ళీ మధ్యాహ్నం ఒంటిగంటకు వచ్చి భోజనం చేసి కాసేపు పడుకుని లేచిన తర్వాత బయటికి వెళ్ళిపోతాడు. రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చి టిఫిన్ చేసి చాటింగ్ మొదలు పెడతాడు. ఇంట్లో ఉన్నంతసేపు చాటింగే. రఘుకు ఎక్కడిలేనీ కోపం వచ్చి ఫోన్ చదవడం ఆపేసి రఘు ఆలోచనలలో పడ్డాడు. బయటకు వెళ్లి ఏం చేస్తాడు. ఏమిటో ఈ మెసేజ్లు ఈ గోల ఏం అర్థం కాకుండా ఉంది. రేపు తాతయ్యని కచ్చితంగా అనుసరించి విషయం తేల్చేయాలి అని నిశ్చయించుకున్నాడు రఘు. అచ్యుత రామయ్య గారు ఒక జాతీయ బ్యాంకులో ఆఫీసర్ గా పనిచేసి వాలంటీరీ రిటైర్మెంట్ తీసుకుని కొడుకు ఆనంద్ దగ్గర ఉంటున్నాడు. ఆనంద్ కూడా జాతీయ బ్యాంకులో ఉద్యోగి. ఇద్దరు పిల్లలు.

అచ్యుత రామయ్య గారి మనవడు బీటెక్ చదువుతున్నాడు. మనవరాలు రమ్య ఇంటర్మీడియట్ చదువుతోంది. ఆనంద్ కి చిన్న వయసులోనే పెళ్లి చేయడం మూలంగా తొందరగా తాతయ్య అయిపోయారు అచ్యుత రామయ్య గారు. ఆయనకి స్పోర్ట్స్ అంటే ఇష్టం. సంఘ సేవ మరియు దైవభక్తి మక్కువ. అప్పటికే ఉదయం 9 గంటలు అయింది. అచ్యుత రామయ్య డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని టిఫిన్ చేస్తున్నారు. ఎవరూ ఆయనతో మాట్లాడడo లేదు. అచ్యుతరామయ్య గారు టిఫిన్ చేసేసి బయటకు నడుచుకుంటూ బయల్దేరారు. పది నిమిషాల తర్వాత మనవడు రఘు కూడా అచ్యుత రామయ్య గారిని అనుసరించాడు. ఒక కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత రోడ్డు పక్కన ఉన్న బంగ్లా లోపలికి వెళ్ళారు అచ్యుత రామయ్య గారు. బంగ్లా పైకి చూస్తే చాలా పెద్దదిగా ఉంది. బాగా డబ్బున్న వాళ్ళ ఇల్లేమో అనుకుంటూ రఘు ఆ ఆ ఇంటి ఎదురుగా చెట్టు వెనక నిల్చున్నాడు. ఏమైనా పరవాలేదు తాతయ్యని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి అనుకుంటూ రఘు ధైర్యంగా లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్లడానికి వాచ్మెన్ పర్మిషన్ ఇవ్వలేదు.

రఘు వెంటనే అచ్యుతరామయ్య గారికి ఫోన్ చేసి బయటకు రమ్మని చెప్పాడు. లోపల నుంచి వచ్చిన అచ్యుతరామయ్యగారిని చూసి వాచ్మెన్ సెల్యూట్ చేసి రఘు ని లోపలికి పంపించాడు. రఘును చూసి అచ్యుత రామయ్య గారు ఏమి మాట్లాడలేదు. మౌనంగా లోపలికి వెళ్ళిపోయారు. రఘు కూడ అచ్యుత రామయ్య గారిని అనుసరించి హాల్లోకి అడుగుపెట్టి అక్కడ దృశ్యం చూసిన తర్వాత రఘు ఆశ్చర్యపడ్డాడు. సుమారు పదిహేను సంవత్సరాల పిల్ల వాడు వీల్ చైర్ లో కూర్చుని ఉన్నాడు. ఎదురుగుండా టేబుల్ మీద పాఠ్యపుస్తకాలు ఉన్నాయి. ఇంతలో లోపల నుంచి మంచినీళ్లు తాగుతారా అని పనిమనిషి వచ్చి రఘు ని అడిగింది. రఘు అడ్డంగా తల ఊపాడు. రాజమ్మ పింకీ పాలు తాగి మందులు వేసుకోవాలి పాలు తీసుకురా అంటూ పనిమనిషి వైపు తిరిగి చెప్పాడు అచ్యుతరామయ్య గారు. రఘు కి ఏం మాట్లాడాలో తోచలేదు. మౌనంగా తాతయ్య కి కూడా చెప్పకుండా కుర్చీలోంచి లేచి ఇంటికి వచ్చేసాడు.

మధ్యాహ్నం ఒంటిగంట అయింది. అచ్యుతరామయ్య గారు ఎప్పటిలాగే బయట నుండి వచ్చి భోజనానికి వచ్చి కూర్చున్నాడు. తాతయ్య నన్ను క్షమించు నిన్ను అనుమానించా ను. నీ మీద అందరికీ అనుమానం రేకెత్తించాను.

అనవసరంగా అందరి మనసులు పాడు చే సి నిన్ను తిట్టించా ను అంటూ కాళ్ళ మీద పడ్డాడు. రఘును లేవనెత్తి అదేమీ లేదు రా చూడు మొట్టమొదట ఇతరుల ఫోన్లో దొంగతనం గా వాట్సప్ చూడడం చాలా తప్పు. అయితే ఆ మెసేజ్లు చూస్తే ఎవరికైనా అనుమానం రాక తప్పదు. నీకు ఒక విషయం చెప్పాలి. ఎవరికి ఇంతవరకు చెప్పలేదు.

నేను బ్యాంకులో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత నాకు ఏమీ కాలం గడిచేది కాదు. ఏం చేయాలో తోచేది కాదు. అలా అని మళ్లీ ఉద్యోగo ఎక్కడా చేయలే ను. డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు. కానీ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎలాగైనా ఆలోచిస్తూ కూర్చుంటే ఒకరోజు పేపర్లో ఒక ప్రకటన చూశాను. అది ఒక బాగా ధనవంతులు పెద్ద ఉద్యోగస్తులు ఇచ్చిన ప్రకటన. భార్యాభర్త కూడా ఇద్దరూ ఒక బ్యాంకులో జనరల్ మేనేజర్లు గా పనిచేస్తున్నారు. పొద్దున లేస్తే వాళ్లు బ్యాంకు కార్యకలాపాల్లో మునిగితేలుతుంటారు. వాళ్లకు ఒక అబ్బాయి. పాపం చిన్నప్పుడే పోలియో వచ్చి వీల్ చైర్ లోనే కాలక్షేపం చేస్తుంటాడు. తల్లికి తండ్రికి అబ్బాయిని పట్టించుకునే తీరికగాని సమయం కానీ లేవు. ఉదయం 9 గంటలకు ఇంట్లోంచి వెళ్లిపోయిన వాళ్ళు రాత్రి ఎప్పుడో కొంపకు చేరుతారు. పాపం పింకు వారికి సమస్యగా తయారయ్యాడు. కదల్లేని పరిస్థితి సొంతమనుషులు ఎవరూ ఇంటిలో ఉండని పరిస్థితి. చూసుకోవడానికి పని వాళ్ళు చాలామంది ఉన్నారు. స్కూలుకు వెళ్లలేడు. పదో తరగతి ప్రైవేట్ గా చదువుతున్నాడు.అందుకుని వారి ఇంటికి వచ్చి చదువు చెప్పి ఆ అబ్బాయికి అన్ని పనులు పనివాళ్ల చేత చేయించే ఒక కేర్ టే కర్ వారికి కావాలి జీతం కోరినంత ఇస్తామని కాస్త కరుణ జాలి దయ ఉన్నవాళ్లు సేవ అంటే ఇష్టం ఉన్నవాళ్లు చదువు చెప్పగల స్తోమత ఉన్నవాళ్లు కావాలంటూ ప్రకటన ఇచ్చారు. . తల్లిదండ్రులు ఇద్దరు బిజీగా ఉండడం వల్ల ఇంట్లో ఆ పిల్లవాడితో మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు. పనివాళ్ళు ఎక్కడో మూల కూర్చుని టీవీ చూస్తూ ఉంటారు. పిలిస్తేనే వస్తారు. మనసుతో మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు.

అమ్మానాన్నల దగ్గర ఆ ప్రేమ ఆప్యాయత అభిమానం దొరకలేదు. పిల్లవాడు పరిస్థితి చూసి ఒకసారి హాస్టల్లో జాయిన్ చేశారు. అబ్బాయి కి అక్కడ వాతావరణం నచ్చక తిండి నచ్చక నెలరోజుల పాటు జ్వరం వచ్చింది. అందుకే ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. నీకు తెలుసుగా నాకు సేవ అంటే ఇష్టమని . అబ్బాయిని చూడగానే నాకు చాలా జాలి అనిపించింది. విధి చాలా విచిత్రమైనది. మామూలుగా ఉంటే ఈపాటికి కాలేజీలో చదువుతూ ఉండాలి. ఇది ఒక ఛాలెంజింగా ఈ బాధ్యత తీసుకున్నాను అంటూ చెప్పుకుంటూ పోతున్నాడు అచ్యుత రామయ్య గారు . వారానికి ఒకసారి పార్కు తీసుకెళ్తుంటాను. మరొక వారం గుడికి తీసుకెళ్తుంటాను. కొంతసేపు టీవీ చూస్తాం. కొంతసేపు చదువుకుంటాము. ఏ బి సి డి లు దగ్గర్నుంచి తెలుగు అక్షరాల దగ్గర నుంచి నేర్పించడం మొదలుపెట్టే ఇలా ఆ అబ్బాయి నాకు బాగా దగ్గరి అయ్యాడు అంటూ చెప్పుకొచ్చారు అచ్యుత రామయ్య గారు.

అబ్బాయి పేరు టింకు. నువ్వు చూసింది వాళ్ళ అమ్మ గారి ఫోటో. ఒకసారి నేను పనిలో చేరిన మొదటి నెల ఆఖరున వాళ్ళ నాన్నగారు కవర్ నిండుగా నోట్లు పెట్టి టేబుల్ మీద పెట్టారు. నేను తిరిగి వారి చేతిలో పెట్టి రెండు చేతులు ఎత్తి దండం పెట్టాను. ఇది సేవ నా ఆత్మ సంతృప్తి కోసం చేస్తున్న పని మాత్రమే.కాలాన్ని సద్వినియోగం చేయాలనే ఆలోచన తప్పితే సంపాదించాలని కోరిక లేదు. దయచేసి అర్థం చేసుకోండి. మీ అబ్బాయి ఉన్నత స్థితికి వచ్చేంతవరకు నా ఆరోగ్యం బాగుంటే నేను కృషి చేస్తూనే ఉంటాను. ఒక సాధారణ పిల్లవాడిని వృద్ధిలోకి తీసుకురావడం అనేది పెద్ద కష్టమైన పని కాదు. ఈ విభిన్నమైన వ్యక్తిని స్కూలుకు పంపించకుండా చదివించడం అనేది చాలా కష్టమైన పని. ఇది నాకు చాలెంజ్ లాంటిది ఈ వయసులో అంటూ చెప్పాను. ఈ ఛాలెంజ్ లో విజయం సాధించినాడు నేనే మీ దగ్గర అడిగి తీసుకుంటాను అంతవరకు వేచి ఉండండి అంటూ చెప్పాను. అచ్యుతరామయ్యగారి కుటుంబ సభ్యులందరి కళ్ళల్లో నీళ్లు వచ్చే యి. తొందరపడి అచ్యుత రామయ్య గారిని అనుమానించినందుకు. ఈ వయసులో అలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము అంటూ పెద్ద కోడలు శాంత కాళ్లకు నమస్కారం చేసింది. తాతయ్య యూ ఆర్ గ్రేట్ అంటూ మనవరాలు వచ్చి గట్టిగా పట్టుకుంది. పింకీ చిన్నప్పటి నుంచి స్కూలుకి వెళ్లకపోవడం మూలంగా చదువు మొదట్లో కొంచెం కష్టంగా అనిపించినా అచ్యుతరామయ్య గారు ప్రత్యేక శ్రద్ద తీసుకుని కోచింగ్ ఇవ్వడం వల్ల పదవ తరగతి ఇంటర్మీడియట్ సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యి డిగ్రీలోకొచ్చాడు.ప్రతి పరీక్షకి కారులో పరీక్ష హాలు వరకు తీసుకెళ్లడం, పరీక్ష రాసే అంతవరకు ఆ చెట్టు కింద కూర్చోవడం అచ్యుత రామయ్య గారు చేసేవారు.

ఒక్కొక్కసారి పరీక్ష కేంద్రం చేరాలంటే మెట్లు ఎక్కవలసి వచ్చేది. ఆ కాలేజీలో ఉన్న అటెండర్లు సహాయం తీసుకుని వీల్ చైర్ లో పింకీనీ కూర్చోబెట్టి పైకి మోసుకుని వెళ్లేవారు. ఇలాంటి కష్టాలన్నీ పడి మొత్తానికి పింకీ డిగ్రీ సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యాడు. తాతయ్య దినచర్యలో మార్పు లేదు .పింకుకి బ్యాంకులో ప్రొఫెషనల్ ఆఫీసరు గా ఉద్యోగం వచ్చింది. తాతయ్య మధ్యాహ్నం ఇంటికి తిరిగి వస్తూ యాక్సిడెంట్లో లారీ గుద్ధి చనిపోయాడు. అలా ఒక సంవత్సర కాలం గడిచింది. పింకు తల్లి తండ్రి ఒకసారి ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చారు. తెరిచి చూస్తే ఆశ్చర్యం తాతయ్యకి గుడి. ఆయన దేవుడే మా దృష్టిలో. ఇది పింకీ కోరిక. పింకీ ఏది కోరితే అది చేస్తాo అంటూ ఆ తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. బ్రతికితే తాతయ్యాలా బ్రతకాలి అంటూ మనవరాలు మనవడు ప్రతిరోజు ఆ గుడికి వెళ్లడం అలవాటు చేసుకున్నారు. ఒక మనిషి తన నిజ జీవితంలో చేసే పని వల్ల ప్రతి ఒక్కరి గుండెల్లో ఎప్పటికీ సజీవంగా ఉంటాడనేది ఒక నగ్న సత్యం. అచ్యుతరామయ్యగా రిటైర్మెంట్ జీవితం అందరికీ ఆదర్శంగా ముగిసింది.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు