మోడు చిగురు తొడిగింది - బి.రాజ్యలక్ష్మి

Modu chiguru todigindi

నడిరేయి !చుట్టూ గాఢాంధకారం మసక మసక దీపం వెలుగులో చాపమీద పడుకుంది గౌరి .చాకలి నీలమ్మ చేతిలో చిన్న సంచి పట్టుకుని నిలబడింది .
“గౌరీ పద పద తెల్లవారేలోపల రేవులో మునిగిరావాలి “అంటున్న తల్లిని వెర్టిగా చూసింది .కన్నీళ్ల చారల తో యెండిపోయిన ముఖం తో తల్లిని చూసింది ..
“గౌరమ్మా దూరం కదమ్మా ,తెల్లారకముందే వచ్చెయ్యాల !”అంది నీలమ్మ .
గౌరీ మరోప్రశ్న వెయ్యకుండా వాళ్లతో బయల్దేరింది .

ఆ చిన్న పల్లెటూళ్లో పుట్టింది .అక్కడే పెరిగింది .అక్కడే యేడవతరగతి దాకా చదువుకుంది .ఆ పల్లె లోనే పాముకాటు తో తండ్రి చనిపోయాడు .చిన్న పెంకుటింట్లో తల్లి పొలంపనులు చేసుకుంటూ గౌరిని పెంచింది ..
“గౌరీ తల్లి పిలుపుకు వులిక్కిపడి వర్తమానం లోకి వచ్చింది గౌరి .రేవు దగ్గరకు వచ్చేసారు .రేవునీళ్లు చల్లగా ఒంటికి తగుల్తుంటే తలారా స్నానం చేస్తూ తన ఆశాసౌధాలను కలకన్నది .నీలమ్మ యిచ్చిన పొడి చీర కట్టుకుని తడిజుట్టు విదిలించి గట్టిగా ముడేసుకుంది .ఇంటికి బయల్దేరారు .
తెల్ల తెల్ల వారుతున్నది .పక్షులన్నీ గ్రాసం కోసం వుషారుగా శబ్దాలు చేస్తూ ఆకాశం లో అందమైన తోరణాల్లాగా పరుగెడుతున్నాయి .గౌరి పక్షులను చూస్తూ “వాటికెంత స్వేచ్ఛ !!తన బాల్యం కూడా అలాగే వుండెది !”అనుకుంది .చిన్నతనపు మాధుర్యం గతం లోకి తీసుకెళ్లింది .

వెన్నెలరాత్రుళ్లు అట్లతతదియ రోజులు గౌరి కోసం యెదురుచూసేవి .గౌరి లేని పున్నమి బోసిపోయేది ,మంగళ ,జానకి ,.గౌరీ గోరింటాకు పెట్టుకుని వుయ్యాలలూగేవాళ్లు .దేవాలయం ప్రక్కనే చెరువుగట్టు అక్కడే చెట్లకు తాళ్లు కట్టి పోటీగా వుయ్యాలుగేవాళ్ళు.గోరింటాకు బాగా పండితే అందమైన మొగుడొస్తాడంటూ ముసిముసి నవ్వులు నవ్వుకునేవాళ్లు.తెల్లారుతుంటే పెరుగన్నం తిని దేవుడికి దణ్ణం పెట్టుకుని యింటికొచ్చేవాళ్లు.ముళ్లు గుచ్చుకుని అబ్బా అంటూ నొప్పిగా అరిచింది గౌరి .చెట్లచాటున దాక్కున్న అబ్బాయిలు కిసుక్కున నవ్వేవాళ్లు .వెన్నెల్లో మిలమిలా మెరిసిపోతున్న అమ్మాయిలముఖాలు కోపం తో యెర్రబడేవి.
బళ్లో టీచరు గారికి చెప్పి వీళ్లను బాగా కొట్టించాలి అంటూ అమ్మాయిలు అబ్బాయిలను గుర్తుగా చూసేవాళ్లు .అబ్బాయిలు వెక్కిరిస్తూ పారిపోయేవాళ్లు .శివరాం అమ్మాయిలను ఆటపట్టించేవాడు ..శివరాం కి బాగా దెబ్బలు పడేవి .గౌరి విలవిలలాడేది .ఒకరోజు వర్షం లో జారిపడితే శివరాం లేపి ఓదార్చాడు .గౌరి హృదయం వెనక్కి వెళ్లి శివరాం కోసం వెదికింది .ఆ చిలిపి బాల్యం కలగా కరిగింది .వెన్నెల్లో చుక్కలా మిగిలింది .తన స్నేహితులందరూ పల్లె లో లేరు .శివరాం ఎక్కడున్నాడో కూడా తెలియదు .
పల్లెలో పొలం పనులు చేసుకునే సీతమ్మ గారి అబ్బాయి సుబ్బయ్య తో గౌరి పెళ్లి జరిగింది .భర్త అనుమానాలు అవమానాలు అత్తయ్యగారి యీసడింపులు !గౌరి కొత్తజీవితం మరోమలువు !సుబ్బయ్య వ్యసనాలు అన్నీ యిన్నీ కావు .పైగా అత్తగారు కూడా కొడుకును మందలించేది కాదు .మరుభూమిలో విత్తనం లా అయ్యింది గౌరి కాపురం ..కల్తీ సారా త్రాగి చనిపోయాడు గౌరి భర్త ..పిల్లలు లేరు .నాలుగేళ్లకాపురం నత్తనడకతో సాగి గౌరిని యిసుకబాటలో నిలిపింది .తొలి సూర్యకిరణం మెరిసేలోగా ఇల్లుచేరారు గౌరి నీలమ్మ .

గౌరి చదువుకుందామని నిర్ణయించింది .అమ్మ దగ్గరకొచ్చేసింది .ఆశల వెలుగులో అందమైన భవిష్యత్తుకు పునాది వేసుకుంది .మోడు చిగురించింది .ఒకజీవనం ముగిసింది మరో జీవనం చిగురు తొడిగింది .

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు