కురుక్షేత్ర సంగ్రామం .10. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Kurukshetra sangramam.10

కురుక్షేత్ర సంగ్రామం(10).

యుద్ధప్రారంభంలోనే ఎవరికి ఎవరు అనే లక్ష్యాలు నిర్ణయింపబడ్డాయి.

ఉదాహరణకు దుష్టద్యుమ్నుడికి-ద్రోణుడు.శిఖండికి-భీష్ముడు.సాత్యకీకి-భూరిస్రవుడు. అర్జునునికి-కర్ణుడు.భీమునికి-దుర్యోధనుడు, అతని సోదరులు. సహదేవునికి -శకుని.నకులునికి శల్యుడు.ఇలాముందుగానే తమ లక్ష్యాలలు వీరులు నిర్దేసించుకున్నారు......

యుధ్ధప్రారంభంలో ముందు శిఖండిని నిలిపి ఇరువైపులా భీమార్జునులు నిలిచారు.భీష్ముడు యుధ్ధంలో మహాగ్రంగా పాండవసేనపై కాలరుద్రుడిలా మారణహామం సాగించసాగాడు.అది గమనించిన శిఖండి భీష్మునిని ఎదుట నిలిచి ఆయనపై బాణాలు సంధించసాగాడు.నవ్వుతూ భీష్ముడు మరోదిక్కుకు మరలి పాంచాల బలాలతో యుధ్ధం చేయసాగాడు.అలంబస భగదత్తులు సాత్యకిని చుట్టుముట్టారు.దుర్యోధనుడు అర్జునుని తోతలపడి విరధుడై మరోరధంఎక్కి శరాలు సంధించసాగాడు.కొంతసేపటికి దుర్యోధనుడు తప్పుకున్నాడు.కాంభోజరాజును అభిమన్యుడు,అశ్వత్ధామ విరాటరాజుతోనూ,సహదేవుడు కృపాచార్యునితోనూ,వికర్ణుడు నకులుని తోనూ పోరాడసాగారు.భీష్ముని అడ్డుకున్న విరాటునితమ్ముడు శతానీకుడు శక్తి ఆయుధాన్నిప్రయోగించగా భీష్ముడు దాన్ని నిరోధించి శతానీకుని మరణం ప్రసాదించాడు.అగ్నిశిలలా కనిపించిన భీష్మునిచూసిన పాండవసేనలు ఆహాకారాలుచేసాయి.అదిచూసిన కృష్ణుడు 'అర్జునా ఉపేక్షిప్తే భీష్ముడు ఎవ్వరిని వదలడు పద అతని సమయం ఆసన్నమైయింది'అని రధాన్ని భీష్ముని ముందు నిలిపాడు.ముందు శిఖండి వెనుక అర్జునుడు యుధ్ధం చేయసాగారు. శిఖండిని చూసి చిత్తరువులానిలబడిపోయాడు భీష్ముడు,అదేఅదనుగా ఆయన ధనస్సు విరిచాడు అర్జునుడు.విముఖుడై,నిరపేక్షుడై,నిరీహుడై నిమిత్తమాత్రంగా నిలబడిన భీష్ముని ఆయాసం తొలగేలా చల్లని మలయమారుతం ఆయనను కమ్మింది.శల్య,కృపవర్మలు అక్కడికి చేరుకున్నారు,వారిని సౌభద్ర విరాట ద్రుపద ఘటోత్కచుడులు అడ్డుకున్నారు.అర్జునుడు భీష్ముని శరీరం నిండాశరాలు దించాడు, తూలినభీష్ముడు దుశ్యాసనును బుజంపైచేయివేసాడు.అదిగమనించిన అర్జునుడు వేగంగా అంపశయ్య నిర్మించాడు. దానిపై తల తూర్పుదిక్కుగా ఉంచి వాలిన భీష్ముని చుట్టూ అందరూ మూగారు.'' నాయనా ఉత్తరాయణం వచ్చేవరకు నేను ఇలానే ఉంటాను. అర్జునా దాహంగాఉంది'' అన్నాడు భీష్ముడు. దక్షణ భాగాన'పర్జన్యాస్త్రం'సంధించగా పాతాళగంగ ఆయన దాహాన్ని తీర్చింది. '' మహశయా ఎండ,గాలి వానలు, శరగాయాలబాధ మీకు ఇప్పటి నుండి ఉండదు'' అని శ్రీకృష్ణుడు భీష్ణుని నుదుటిని తన కుడిచేతితో తాకాడు. 'శ్రీకృష్ణా నేను సత్యసంధుడను, ఈకౌరవ పాండవల సంక్షేమం కోరిన వాడను నాకుఎందుకు ఇటువంటి కష్టం ప్రాప్త అయింది " అన్నాడు భీష్ముడు.
" మహాశయా తమరు పరశురామునివద్ద అస్త్రవిద్య అభ్యసిస్తున్న సమయంలో నీరథంవెళ్ళేదారిలో ఒక పాము రహదారిపై అడ్డం ఉండటంతో మీచేతిలోని థనస్సుతో ఆపామును ఎత్తి దూరంగా విసిరివేసి మీదారిన నీవు వెళ్ళిపోయావు.ఆపాము ముళ్ళకంచపై పడి శరీరంనిండా ముళ్ళుదిగి ,కదలలేక ఆకలి దాహంతో మరణించే వరకు వేదన అనుభవించింది.దాని ఫలితమే ఇది " అన్నాడు శ్రీకృష్ణుడు.
" అవును తప్పు తెలిసి చేసినా తెలియకచేసిన శిక్ష అనుభవించక తప్పదు " అన్నభీష్ముడు.ఉత్తరాయణం కొరకు ఎదురుచూస్తూ భీష్ముడు అలా విశ్రాంతి పొందుతూ....ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకూ తన మరణం కోసం వేచి చూశాడు.

అంపశయ్య మీద ఉన్న భీష్ముడు.. పాండవులకు ముఖ్యంగా ధర్మరాజుకు రాజధర్మం, రాజనీతి గురించి అనేక విషయాలను తెలియజేశాడు. లౌక్యం, రాజ్యపాలన గురించి భీష్మపితామహుడు చేసిన ఉపదేశాలు కాలం మారినా విలువను మాత్రం కోల్పోలేదు. ఇక, స్నేహంలో పరిమితులు, పగ వల్ల పొంచి ఉండే ముప్పు గురించి చెప్పిన ఓ చిలుక కథ ఎన్నో విలువైన పాఠాలను నేర్పుతుంది.

బ్రహ్మదత్తుడు అనే రాజు, చిలుక స్నేహం గురించి ధర్మరాజుకు వివరించాడు. బ్రహ్మదత్తునికి ఓ చిలుక మీద అభిమానం ఏర్పడి, అది కాస్తా స్నేహంగా పరిణమించింది. ఆ చిలుక బ్రహ్మదత్తునికి సమీపంలోనే నివసిస్తూ ఉండేది. కాలం సాగుతుండగా ఆ చిలుకకి ఒక కుమారుడు జన్మించాడు. బ్రహ్మదత్తుని కుమారుడు ఆ చిట్టి చిలుకతో ఆటలాడుకునేవాడు. ఒకరోజు చిలుకతో ఆటాడుతున్న రాకుమారుడికి దానిపై కోపం వచ్చింది. అంతే! దానిని తన చేతులతో చిదిమి ప్రాణాలు తీశాడు. ఆ దృశ్యాన్ని చూసిన చిలుకకు గుండె మండిపోయింది. కోపం ఆపుకోలేక తన గోళ్లతో అతని రెండు కళ్లనూ పొడిచింది. దీంతో రాకుమారుడు చూపుపోయి అంధుడిగా మారిపోయాడు. చిలుక అంతటితో ఆగకుండా రాజు దగ్గరకు వెళ్లి ఈ విషయం గురించి చెప్పింది. ‘రాజా! నీ కుమారుడు నా బిడ్డను చంపి తప్పు చేశాడు. అందుకు ప్రతిఫలంగా నేను అతడ్ని కళ్లను పొడిచి గుడ్డివాడిని చేశాను. ఇందులో నా తప్పేమీ లేదు. అయినా ఇకమీదట నేను ఇక్కడ ఉండలేను’ అని చెప్పింది.

చిలుక మాటలు విన్న రాజు ‘నువ్వన్నది నిజమే! జరిగినదానిలో నీ తప్పేమీ లేదు. రాజకుమారుడు నీ కొడుకుకి హాని తలపెట్టాడు కాబట్టి ఫలితాన్ని అనుభవించక తప్పలేదు. మరి అలాంటప్పుడు నన్ను వదిలి వెళ్లాల్సిన అవసరం నీకేమొచ్చింది? అయిందేదో అయ్యింది. దయచేసి ఇకమీదట కూడా నాకు మిత్రుడిగానే ఉండు’ అని అర్థించాడు.

దీనికి చిలుక బదులిస్తూ..‘రాజా! నేను నీ కొడుకును అంధుడిగా మార్చేశాను.. కాబట్టి నీలో నా మీద పగ ఏర్పడి తీరుతుంది. ఇది నాలుగు రకాలుగా ఏర్పడే అవకాశం ఉంది. ఇతరుల భూమిని అపహరించడం వల్ల, ఆస్తి పంపకాల్లో అన్నదమ్ముల మధ్య, ఆడవారి మధ్య మాటామాటా పెరగడం వల్ల, ఎదుటివారి మనసుని గాయపరచడం వల్ల పగ పుడుతుంది. అలాంటి ప్రతికూల భావాలు ఒకసారి మొదలైతే, ఇక వాటికి అంతం ఉండదు. అలాంటి విద్వేషపూరిత వాతావరణంలో ఎవ్వరినీ నమ్మడానికి వీల్లేదు. నేను నీ కొడుకుకి అపకారం చేశాను కాబట్టి నీలో నా మీద విద్వేషం మొదలయ్యే ఉంటుంది. కాబట్టి నీ తీయ్యని మాటలు విని నేను ఇక్కడ ఉండలేను,’ అంటూ చిలుక ఎగిరిపోయింది.

కనుక ధర్మజా! రాజనేవాడు ఆ చిలుక మాదిరిగా తన జాగ్రత్తలో తనుండాలి. రాజ్యంలో ఎవ్వరినీ గుడ్డిగా నమ్మరాదు. సుతిమెత్తగా మాట్లాడుతున్నట్లు కనిపించాలే కానీ మనసు మాత్రం దృఢంగా ఉండాలి. అందరినీ నమ్మినట్లు ఉండాలి కానీ తన జాగ్రత్తలో తనుండాలి. ఎవరితోనూ హద్దులు దాటి చనువుగా మెలగరాదు. వ్యసనాలకు బానిసై విచక్షణ కోల్పోరాదు, అనుకున్న కార్యం పూర్తయ్యేదాకా రహస్యాన్ని బయటపెట్టరాదు. అంతేకాదు, పూర్తిగా తీరని రుణం, పూర్తిగా ఆరని మంట, పూర్తిగా చల్లారని పగ... ఈ మూడింటి విషయంలోనూ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అవి ఎప్పుడైనా ప్రాణాంతకంగా పరిణమించగలవంటూ భీష్ముడు హెచ్చరించాడు.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు