కురుక్షేత్ర సంగ్రామం .12. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Kurukshetra sangramam.12

కురుక్షేత్ర సంగ్రామం .(12).

భీముని కుమారుడు బార్బరీకుడు అతని తల్లి పేరు మౌర్వి(అహిలావతి). బర్బరీకుడు చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యలో అపార ప్రతిభను కనబరిచేవాడు. అస్త్రశస్త్రాల మీద అతనికి ఉన్న పట్టుని చూసిన దేవతలు ముచ్చటపడి అతనికి మూడు బాణాలను అందించారు. ఆ మూడు బాణాలతో అతనికి ముల్లోకాలలోనూ తిరుగులేదంటూ వరాన్ని అందించారు.

ఒకపక్క బర్బరీకుడు పెరుగుతుండగానే, కురుక్షేత్రం సంగ్రామం మొదలయ్యే సమయం ఆసన్నం అయ్యింది. భరతఖండంలోని ప్రతి వీరుడు ఏదో ఒక పక్షాన నిలబడాల్సిన తరుణం వచ్చేసింది. అలాంటి యుద్ధంలో బర్బరీకుడు కూడా పాలు పంచుకోవాలని అనుకోవడం వింతేమీ కాదు కదా! బర్బరీకుని బలమెరిగిన అతని తల్లి, ఏ పక్షమైతే బలహీనంగా ఉందో, నీ సాయాన్ని వారికి అందించమని కోరుతుంది. సంఖ్యాపరంగా చూస్తే పాండవుల పక్షం బలహీనంగా కనిపిస్తోంది కాబట్టి, పాండవుల పక్షాన నిలిచి పోరు సలిపేందుకు బయల్దేరతాడు బర్బరీకుడు. కానీ బర్బరీకుడులాంటి యోధుడు యుద్ధరంగాన నిలిస్తే ఫలితాలు తారుమారైపోతాయని గ్రహిస్తాడు శ్రీకృష్ణుడు. అందుకే బర్బరీకుని వారించేందుకు, ఒక బ్రాహ్మణుని రూపంలో అతనికి ఎదురుపడతాడు.

‘మూడంటే మూడు బాణాలను తీసుకుని ఏ యుద్ధానికి బయల్దేరుతున్నావు’ అంటూ బర్బరీకుని ఎగతాళిగా అడుగుతాడు కృష్ణుడు.

‘యుద్ధాన్ని నిమిషంలో ముగించడానికి ఈ మూడు బాణాలే చాలు. నా మొదటి బాణం వేటిని శిక్షించాలో గుర్తిస్తుంది. నా రెండో బాణం వేటిని రక్షించాలో గుర్తిస్తుంది. నా మూడో బాణం శిక్షను అమలుపరుస్తుంది!’ అని బదులిస్తాడు బర్బరీకుడు.

‘నీ మాటలు నమ్మబుద్ధిగా లేవు. నువ్వు చెప్పేదే నిజమైతే ఈ చెట్టు మీద ఉన్న రావి ఆకుల మీద నీ తొలి బాణాన్ని

ప్రయాగించు’ అంటూ బర్బరీకుని రెచ్చగొడతాడు శ్రీ కృష్ణుడు.

కృష్ణుని మాటలకు చిరునవ్వుతో ఆ రావి చెట్టు మీద ఉన్న ఆకులన్నింటినీ గుర్తించేందుకు తన తొలి బాణాన్ని విడిచిపెడతాడు బర్బరీకుడు. ఆ బాణం చెట్టు మీద

ఆకులన్నింటి మీదా తన గుర్తుని వేసి, శ్రీ కృష్ణుని కాలి చుట్టూ తిరగడం మొదలుపెడుతుంది.

‘అయ్యా! మీ కాలి కింద ఒక ఆకు ఉండిపోయినట్లు ఉంది. దయచేసి మీ పాదాన్ని పక్కకు తీయండి’ అంటాడు బర్బరీకుడు. శ్రీకృష్ణుడు తన పాదాన్ని పక్కకి జరపగానే అక్కడ ఒక ఆకు ఉండటాన్ని గమనిస్తారు.

ఆ దెబ్బతో బర్బరీకుని ప్రతిభ పట్ల ఉన్న అనుమానాలన్నీ తీరిపోతాయి కృష్ణునికి. ‘అతను కనుక యుద్ధ రంగంలో ఉంటే ఏమన్నా ఉందా!’ అనుకుంటాడు. పొరపాటున బర్బరీకుడు పాండవులకు వ్యతిరేకంగా యుద్ధం చేయాల్సి వస్తే, అతని బాణాలు వారిని వెతికి వెతికి పట్టుకోగలవని గ్రహిస్తాడు. అందుకే....‘బర్బరీకా! నువ్వు బలహీన పక్షాన నిలబడి పోరాడాలనుకోవడం మంచిదే. కానీ నువ్వు ఏ పక్షానికైతే నీ సాయాన్ని అందిస్తావో... నిమిషంలో ఆ పక్షం బలమైనదిగా మారిపోతుంది కదా! అలా నువ్వు పాండవులు, కౌరవుల పక్షాన మార్చి మార్చి యుద్ధం చేస్తుంటే ఇక యుద్ధభూమిలో నువ్వు తప్ప ఎవ్వరూ మిగలరు తెలుసా!’ అని విశదపరుస్తాడు. శ్రీ కృష్ణుడు మాటలకు బర్బరీకుడు చిరునవ్వుతో ‘ఇంతకీ నీకేం కావాలో కోరుకో!’ అని అడుగుతాడు. దానికి శ్రీ కృష్ణుడు ‘మహాభారత యుద్ధానికి ముందు ఒక వీరుడి తల బలి కావల్సి ఉందనీ, నీకంటే వీరుడు మరెవ్వరూ లేరు కనుక నీ తలనే బలిగా ఇవ్వ’మని కోరతాడు. ఆ మాటలతో వచ్చినవాడు సాక్షాత్తూ శ్రీకృష్ణుడే అని అర్థమైపోతుంది

బర్బరీకునికి. మారుమాటాడకుండా తన తలను బలి ఇచ్చేందుకు సిద్ధపడతాడు. కానీ కురుక్షేత్ర సంగ్రామాన్ని చూడాలని తనకు ఎంతో ఆశగా ఉందనీ, దయచేసి ఆ సంగ్రామాన్ని చూసే భాగ్యాన్ని తన శిరస్సుకి కల్పించమని కోరతాడు. అలా బర్బరీకుని తల కురుక్షేత్ర సంగ్రామానికి సాక్ష్యంగా మిగిలిపోతుంది.

బర్బరీకా నువ్వు గత జన్మలో ఓ యక్షుడివి. భూమి మీద అధర్మం పెరిగిపోయింది నువ్వే కాపాడాలి శ్రీమహావిష్ణు అంటూ బ్రహ్మదేవుడిని వెంటేసుకుని ఓసారి దేవుళ్లంతా నాదగ్గరకు వచ్చారు. దుష్టశక్తుల్ని సంహరించటానికి త్వరలో మనిషిగా జన్మిస్తాను అని వాళ్లకు చెప్పాను. ఇదంతా వింటున్న నువ్వు ఈ మాత్రం దానికి విష్ణువే మనిషిగా అవతరించడం దేనికి? నేనొక్కడిని చాలనా అని ఒకింత పొగరుగా మాట్లాడావు. దానికి నొచ్చుకున్న బ్రహ్మ నీకు ఓ శాపం విధించాడు. ధర్మానికీ, అధర్మానికీ నడుమ భారీ ఘర్షణ జరగబోయే క్షణం వచ్చినప్పుడు మొట్టమొదట బలయ్యేది నువ్వే అని శపించాడు. అందుకే నీ బలి. అంతేకాదు నీ శాపవిమోచనం కూడా అని వివరిస్తాడు శ్రీ కృష్ణుడు. అంతేకాదు... కలియుగంలో బర్బరీకుడు తన పేరుతోనే పూజలందుకుంటాడనీ, అతడ్ని తల్చుకుంటే చాలు భక్తుల కష్టాలన్నీ చిటికెలో తీరిపోతాయనీ వరమిస్తాడు శ్రీ కృష్ణుడు. మరో నమ్మకం ప్రకారం బర్బరీకుని బాణం శ్రీ కృష్ణుడు యొక్క కాలి చుట్టూ తిరగడం వల్ల, ఆయన కాలు మిగతా శరీరంకంటే బలహీనపడిపోయింది. అందుకని,శ్రీ కృష్ణుడు అవతార సమాప్తి చేయవలసిన సమయం ఆసన్నం అయినప్పుడు, ఒక బాణం ఆయన బలహీనమైన కాలికి గుచ్చుకోవడం వల్లే అది సాధ్యమైంది.

పన్నెండో రోజు యుధ్ధంలో...ద్రోణుడు గరుడ వ్యుహం పన్ని దానికి తను,దుర్యోధనుడు

అతని సోదరులు శిరస్సుగా,కృప,కృతవర్మలు కన్నులుగా,సింహళ, శూరసేన కేకయాదులు మెడ భాగంలో,బాహ్లీక, సోమదత్త, భూరిశ్రవులు కుడిరెక్కగా, అశ్వత్ధామ,సుదక్షణ,విందాన,విందులు ఎడమ రెక్కగా,శకుని, పౌండ్ర కళింగ,మగదాంబష్టులు వీపు భాగంగా ,నానాజానపద సేనలతో కూడిన కర్ణుడు తోకభాగంగా,సైంధవాడు మిగిలి నకౌరవ వీరులు, మిగిలిన అవయవాలుగా నిలబడ్డారు. ఆవ్యూహభాగాన తన సుప్రతీకం అనే ఏనుగుపైన భగదత్తుడు ఆసీనుడై ఉన్నాడు.

పాండవులు మండలార్ధ వ్యూహం పన్నాడు.

భగదత్తుడుప్రాగ్జ్యోతిష రాజ్య పాలకుడు నరకాసురుని కుమారుడు, నరక రాజవంశం రాజులలో రెండవవాడు. అతని తరువాత అతని కుమారుడు వజ్రదత్తుడు రాజయ్యాడు. శ్రీకృష్ణుడు తన తండ్రిని చంపాడని కృష్ణుడి పైన ప్రతీకారం తీర్చుకోవడం కోసం మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన ఉన్నాడు. కిరాత్ సైన్యానికి నాయకుడు. భూదేవి ప్రసాదించిన వైష్ణవాస్త్రాన్ని నరకాసురుడు తన కుమారుడైన భగదత్తుడుకి ఇస్తాడు. అస్త్రాల్లో కంటే ఎంతో వేగవంతమైన ఈ

వైష్ణవాస్త్రానికి తిరుగు ఉండదు. అంతేకాకుండా నరకాసురిడి దగ్గర సుప్రతిక అనే శక్తివంతమైన ఏనుగు కూడా ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో భగదత్తుడు కౌరవుల పక్షాన పోరాటం చేయసాగాడు. అతను తన ఏనుగుపై యుద్ధం చేసే నైపుణ్యం కలవాడు. యుద్ధం జరిగిన 12వ

రోజు అర్జునుడితో భీకర యుద్ధంలో పాల్గొన్నాడు. భగదత్తుడి

పద్నాలుగు ఇనప గదల్ని అర్జునుడు ముక్కలు చేశాడు. భగదత్తుడి రాజఛత్రాన్నీ ధ్వజాన్నీ ముక్కలు చేయగా, కోపంతో భగదత్తుడు తన చేతిలో ఉన్న అంకుశాన్ని వైష్ణవాస్త్ర మంత్రంతో అర్జునుడిపై వదిలాడు. అది చూసి కృష్ణుడు రథసారధి స్థానం వద్ద నిలబడి వైష్ణవస్త్రానికి ఎదురునిలవగా ఆ అస్త్రం దండగా కృష్ణుడి మెడలో పడి వైజయంతీమాలగా మారిపోయింది. (విష్ణువు భగదత్తుడికికు ఇచ్చిన ఆయుధం చివరికి తన అవతారం దగ్గరికే తిరిగి వచ్చింది).భగదత్తుడి కన్నులపైన రెప్పలు వాలిపోయి ఉండడంతో కళ్ళను తెరిచి ఉంచడంకోసం ఒక పట్టీతో నొసటి మీద కట్టుకొని రెప్పల్ని పైకి పట్టి ఉంచుతాడు. ఈ రహస్యం శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పి ముందుగా ఆ పట్టిని కొట్టమని చెప్పాడు. బాణంతో భగదత్తుడి ఏనుగు కుంభస్థలాన్ని కొట్టడంతో అది కింద పడిపోయింది. వెంటనే బాణంతో రెప్పల్ని కట్టిన పట్టీని కొట్టగా భగదత్తుడి కళ్ళు మూసుకుపోయి చీకటిమయమయింది. అప్పుడు అర్జునుడు అర్ధచంద్ర బాణం వేయగా అది భగదత్తుడి ఛాతీకి తాకి భగదత్తుడు చనిపోయాడు.

కలిక పురాణం, హర్షచరిత పురాణాలు, ఇతర పురాణాలలో ప్రస్తావించిన దాన్నిబట్టి నరకాసురుడికి భగదత్తుడు, మహాసిర్స, మాధవన్, సుమాలి అను కుమారులు ఉన్నారు. భగదత్తుడికి వజ్రదత్తుడు, పుష్పదత్తుడు

అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

యుద్ధఆరంభంలో సుశర్మ తమ్ములు సత్యవ్రతుడు,సత్యకర్ముడు,

సత్యవర్ముడూ,కేరళ,మాళవ,శీలీంద్ర,మగధ దేశ రాజులు తమ సైన్యంతో ఆరోజు అర్జునుని యుద్ధరంగం నుండి దూరంగా తీసుకువెళ్లేందుకు పన్నాగం పన్నారు.ఆరోజు అర్జునుని సుబాహుడు,సుశర్ముడు ,సురధుడు, సుధన్వుడు ఎదుర్కోన్నారు. తోలుత సుధన్వుడి శిరస్సు ఖండించి,దండి, మగధ కేరళ మచ్చిల్లాదులను సంహరించాడు. అనంతరం కౌరవసేనలను తురమసాగాడు. అర్జునుడు దనదేవదత్తాన్ని పూరించాడు.ఆ శంఖారావం విని వృషకుడు,అచలుడు,శకుని తమ్ములు,పార్ధునితో తలపడ్డారు.కొపించిన అర్జునుడు వషక అచలులను యమపురికి పంపాడు.అశ్వత్ధామతో తలపడిన నీలుడు మరణించాడు. అర్జునునికి ఎదురుపడిన కర్ణుడు అగ్నేయాస్త్రం ప్రయోగించాడు.దానిని వారుణాస్త్రంతో వారించాడు అర్జునుడు అంతలో ద్రోణ జయధ్రధులు వచ్చి కర్ణుని కాపాడుకున్నారు. అప్పటికే కర్ణుని తమ్ములు ముగ్గురు అర్జునుని బాణాలకు బలి అయ్యారు.

ద్రోణునికి ఎదురైన వృషకుని శిరస్సు నేలరాలింది.అనంతరం సత్యజిత్తుని యమపురికి సాగనంపాడు,వెను వెంటనే ధృఢసేనుని ప్రాణాలు

బలిగోన్నాడు. ద్రోణుడు.

సాయత్రం సూర్యుడు పడమటి దిశలో కుంగటంతో యుధ్ధ విరామ భేరిలు మోగాయి.ఆనాటి యుధ్ధం ముగిసింది.

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి