కురుక్షేత్ర సంగ్రామం. 14. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Kurukshetra sangramam.14

కురుక్షేత్ర సంగ్రామం.(14).

ఒకసారి అర్జునుడు తీర్ధ యాత్రలు తప్పని సరిగా చేయవలసి వచ్చింది.

పాండవులు సంవత్సరానికి ఒకరి వద్ద ద్రౌపతి గడపాలని నారదుడు నిర్ణయించగా అందరు అంగీకరించారు.నియమ భగంచేస్తు ఎవరైనా ద్రౌపతి మరొకరితో ఉండగా ఆయింటి లోనికివెళ్ళినవారు ఒక సంవత్సరం తీర్ధయాత్రలు చేయాలి.

ఒకరోజు ఒక బ్రాహ్మణుడువచ్చి అర్జునా నాపసువులను దొంగలు బలవంతంగా తోలుకు వెళుతున్నారని రక్షించమని కోరుకున్నాడు. ఆస్త్రితుని కోరిక మేరకు ఆయుధాగారం ఉన్నఇంటిలో ప్రవేసించి ఆయుధాలు ధరించి దొంగలను శిక్షించి ఆయుధ విసర్జనచేసి ధర్మరాజు ద్రౌపతి ఉన్నఇంటిలో ప్రవేసించిన కారణంగా సంవత్సరం తీర్ధయాత్రలకు బయలు దేరాడు.

అర్జుని వెంటపాండవుల పురోహితుడు 'ధౌమ్యుడు'అతని తమ్ముని కుమారుడు 'విశారదుడు'బయలుదేరారు.అలా ప్రయాణంచేసి వెళ్ళి 'భోగవతి'రాజ్యంలో ఉంటూ ప్రతిదినం గంగా నదికి స్నానం చేయడానికి వచ్చే అర్జునుని చూసిన 'ఉలూపి'అనేనాగకన్య తనను వివాహం ఆడవలసిందిగా కోరడంతో ఆమె పెద్దల అనుమతి పొంది వివాహంచేసుకున్నాడు.వారికి'ఇలావంతుడు' అనేకుమారుడు జన్మించాడు. తను మరిన్నిప్రదేశాలు చూడవలసి ఉన్నదని ఉలూపివద్ద శెలవు తీసుకుని,ఉత్తర,దక్షణ దేశాలలోగల సందర్మన ప్రాంతాలను దర్మిస్తూ,తనవిషయాలు ఎప్పటికి అప్పుడు శ్రీకృష్ణునికి,ధర్మరాజుకు తెలియబరుస్తు, పలు తీర్ధయాత్రల సందర్మనం చేసుకుని, పదమూడవ మాసంలోపాండ్యరాజైన'మలయద్వజుడు'పరిపాలించే 'మణిపురం' చేరుకున్నాడు.

ఆదేశపు రాజకుమార్తె 'చిత్రాంగద'వనవిహారం సమయంలో అర్జుని చూసి మోహపరవశురాలు అయింది.అర్జునుడు ఆమెను కోరుకున్నాడు.తోటలో విశ్రాంతి పొందుతున్న అర్జుని విషయాలు విశారదుని ద్వారా తెలుసు కున్న మలయద్వజుడు అర్జునుని విందుకు ఆహ్వానించి అనంతరం వసంత మండపంలో విడిది ఏర్పాటు చేయించాడు.ఇంతటి మహావీరుడు తన అల్లుడు అయితే అనిభావించి విశారదుని ద్వార విషయం విన్నవించాడు. సమ్మతించిన అర్జునుడు చిత్రాంగదను వివాహం చేసుకున్నాడు.కొంతకాలానికివారికి'బబ్రువాహనుడు'జన్మించాడు.

అక్కడిపెద్దలు, చిత్రాంగద వద్ద శెలువు తీసుకుని పలు తీర్ధయాత్రలు సందర్మిస్తూ,పంచతీర్ధంలోని'ఐదుగురు'నందా''లలిత''పద్మ'సౌరబీయి,సమీచి'అనేఅప్సరసలు కొలనులో మొసలి రూతపంలో ఉన్నవారికి శాపవిమోచనం కావించి, విశారదుని ధర్మరాజు వద్దకు పంపించాడు.తను ద్వారక కు దగ్గరలోని 'రైవత వనం'లో యతిరూపంలో కృష్ణుని సలహా మేరకు ఉండసాగాడు.బలరాముడు యతిరూపంలోని అర్జుననకు సేవలు చేసేందుకు'సుభద్ర'ను వినియోగించాడు .అప్పటికే అర్జునిపై మనసుపడిన సుభద్ర శ్రీకృష్ణుని సలహా మేరకు ఘటోత్కచుని సహాయంతొ వివాహం

చేసుకున్నాడు.వీరు హస్తినాపురానికి వెళ్ళడానికి ఆయుధాలు,రధం రహస్యంగా ఏర్పాటు చేసి 'పసుపతి దినోత్సవం'పేరున బలరాముని దూరంగాపంపాడు కృష్ణుడు.సుభద్రతో హస్తినకువెళ్ళాడు.వీరివివాహం గురించి తెలిసి మండి పదిన బలరాముని శాంతపరిచాడు శ్రీకృష్ణుడు .అలాసుభద్ర అర్జునులకు 'అభిమన్యుడు'జన్మించాడు.

పద్నాలుగో రోజు యుధ్ధంలో.....

ద్రోణుడు సైధవుని కాపాడటంకోసం శకటవ్యూహం పన్నాడు.దానికి పడమరభాగాన మధ్యలో పద్మవ్యుహం పన్ని సైధవుని చూట్టూ భూరిశ్రవుడు,కర్ణుడు,శల్యుడు,అశ్వత్ఢామ,వృషసేనుడు,కృపాచార్యుడు తనకుతోడుకాగా,పధ్నాలుగు వేల ఏనుగులు, అరవై వేల రధాలు, లక్ష గుర్రాలు,పది లక్షలమంది సైనికులను తమ చూట్టూ మోహరించాడు. అర్జునుని దేవదత్తం శ్రీకృష్ఞుని పాంచజన్యం శబ్ధంతో రణరంగమే ప్రతిధ్వనించింది.

అర్జుని శరాలధాటికి కుప్పలుగా కూలసాగారు కౌరవసేనలు.'అర్జునునికి అడ్డువచ్చిన కృతవర్మను మూర్చాగతుడినిచేసి ఎదురుపడిన వరుణుడికుమారుడు శ్రుతాయుధుడు తోయుధ్ధం చేయసాగాడు అజేయమైన వరప్రసాద గధను కోపంగా శ్రీకృష్ణుని పై ఆవేశంగా ప్రయోగించాడు.నిరాయుధులపై ప్రయోగిస్తే అది ప్రయోగించిన వారినే సంహారిస్తుంది.శ్రుతాయుధుడు మరణించడంతో చూసిన కాఃభోజరాజు అర్జునుని తో తలపడ్దాడు.క్రోధంతో హుకరించి కాంభోజరాజును ఓదివ్యాస్త్రంతో సంహరించాడు.శిబి వాసాతిదేశపతులు, మరో శ్రుతాయువు,అతాయువు దీర్ఘాయువు అనే కౌరవ వీరులను ఐంద్రాస్త్రంతో నేలకూల్చాడు అర్జునుడు.అతన్ని ద్రోణుడు ఎదుర్కోవడం చూసిన ధృష్టద్యుమ్నడు ద్రోణుడితో తలపడ్డాడు.భరద్వాజుడు సాత్యకిపై ఆగ్నేయాస్త్రంప్రయోగించగా దానిని వారుణాస్త్రంతో చల్లార్చాడు సాత్యకి.

అర్జునిపైకిఅవంతి రాజకుమారులు విందానువిందులు శరపరంపరలతో వచ్చారు.మెదట విందుని,పిదప అనువిందుడిని నేలకూల్చిన అర్జునుని కర్ణ దుర్యోధనులు ఎదుర్కోన్నారు.బృహత్కత్రుడు క్షేమధూర్తిని సంహరించాడు.ధృష్టకేతువు వీరధన్యుణ్ని కూల్చివేసాడు.సహదేవుడు నిరామిత్రుని యమపురికి పంపాడు.సాత్యకి చేతిలో వ్యాఘ్రదత్తుడు కూలిపోయాడు.అలంబసుడు భీమునితో భీకర యుధ్ధం చేయసాగాడు.అదిచూసిన ఘటోత్కచుడు అలంబసుని తోతలపడి పిడికిలిబిగించి అలంబసుని తలపై పొడిచాడు ఆ పోటుతో రక్తంకక్కుతూ మరణించాడు అలంబసుడు. సాత్యకిపైకి మదాంధుడు,జలసంధుడు శరవేగతో దూసుకు వచ్చారు తోలుత తన కత్తికి వారిని బలిచేసాడు. అదిచూసిన రారాజు,దుర్మర్షణ,దుస్సహ,వికర్ణ ,దుర్ముఖ ,దుశ్యాసన చిత్రసేనాది,అంబష్ట,టేంకణ ,పారదాది వంటి కౌరవవీరులు సాత్యకిపైకి వచ్చారు.అందరిని సాత్యకి నిలువరించగా,సుదర్శనుడు అనేరాజు ముందుకు వచ్చాడు మరుక్షణం అతని తలనేలరాల్చాడు సాత్యకి.వందల వీరులు సాత్యకి క్రోధానికి బలి కాసాగారు.

అక్కడ తనను చికాకు పరుస్తున్నశిశుపాల పుత్రుడుధృడకేతుణ్ని నేలపాలుచేసాడుభీముడు.విజయ,విచిత్ర,దుర్మద,దుస్సాహ,దుర్మర్షణులు,చిత్ర,విచిత్ర,చిత్రాక్ష,చారుచిత్రులు,చిత్రధ్వజ,చిత్రాయుధ,చిత్రకర్ములు,శత్రుంజయ,శత్రుసహ,సుదేహ,మదనద్రుమ,చిత్రబాహులు వంటి వందల కౌరవ వీరులను యమపురికి పంపసాగాడు భీముడు.

సాత్యకితో తలపడిన భూరిశ్రవుని యమపురికి పంపిడు.'అర్జునా సాయంత్రంకాబోతుంది సైంధవ వధకు సమయం ఆసన్నమైనది '.అంటూ తన సుదర్మనచక్రం సూర్యునికి అడ్డుగా నిలపడంతో లోకం అంతా చీకట్లు కమ్మయి.సంతోషంగా అర్జనుని మరణం చూడటానికి ఎత్తయిన గుట్ట పైకి ఎక్కాడు సైంధవుడు .

తనసుదర్శన చక్రాన్ని సూర్యుని నుండి తప్పించిన శ్రీకృష్ణుడు 'అర్జునా సైంధవుని తల తెగవేయి ఓదివ్యాస్త్రం ప్రయోగించి సైంధవుని శిరస్సుఖండించి అతని తండ్రి వృధ్ధక్షేత్రుడు శమత పంచకంలో ధ్యానంలో ఉన్నాడు అతని ఒడిలో పడేలా సంధించు అన్నాడుకృష్ణుడు.ఆచరించాడు అర్జునుడు.తన ఒడిలోపడిన తలను నేలపాలు చెసిన వృధక్షేత్రుడూ మరణించాడు.

భీమసేనుడితో తలపడిన బాహ్లీకుడు మరణించాడు.సాత్యకి చెతిలో సోమదత్తుడు అసువులు బాసాడు. కర్ణుడు ద్రుమసేనుడిని సంహరించాడు.

అలాయుధుని ఎదుర్కొన్నాడు ఘటోత్కచుడు. చేతిలోని గదను గురి చూసి విసిరాడు. దాని దెబ్బకి అలాయుధుని రథం పిండి పిండి అయిపోయింది. అయితే అలాయుధుడు తప్పించుకున్నాడు. ఆకాశానికి ఎగిసి అక్కణ్ణుంచి తన మాయ యుధ్ధం ప్రారంభించి రక్త వర్షాన్ని కురిపించసాగాడు. ఘటోత్కచుడు గుప్పించి ఎగిరి ఆకాశానికి చేరుకున్నాడు. అలాయుధుని జుత్తు పట్టుకుని నేల మీదికి లాక్కొచ్చాడు. ఈడ్చి కొట్టాడు. తర్వాత కత్తితో అలాయుధుని శీర్షం ఖండించి, దాన్ని పట్టుకుని దుర్యోధనుని సమీపించాడు. చూపించాడు.‘‘త్వరలో మీ కౌరవులకు ఇదేగతీ ఇంతే ధర్మానికే విజయం ’’ అన్నాడు. కర్ణుని ఎదుర్కొన్నాడు మళ్ళీ. బాణాలతో కర్ణుని కదలనివ్వకుండా సేసి,కౌరవసేనలపై మాయయా యుధ్ధం చేస్తూ వేసవి భానుడిలా వెలిపోతూ చిత్ర,విచిత్ర ఆయుధాలను ప్రయోగిస్తూ కౌరవసేనను అతలాకుతలం చేయసాగాడు.

అదిచూసిన దుర్యోధనుడు " మిత్రమా ఈ అసురుని నీవు తప్ప మరొకరు చంపలేరు. ఆలస్యం చేసిన కొద్దీ మన సేనలు మనకు దక్కకుండాపోతాయి. అందుకని ఇంద్రుడిచ్చిన దివ్యశక్తి ప్రయోగించి ఘటోత్కచుని బలి తీసుకో! ముందు ఈ గండాన్ని గట్టెక్కించు! భీమార్జునుల సంగతి తర్వాత భీముడు,అర్జునుల సంగతి అనంతరం వచ్చు’’ రారాజు అభ్యర్థన వింటూండగానే ఘటోత్కచుడు విజృంభించి కర్ణుని రథాన్ని, సారథిని, గుర్రాల్ని తుత్తునియలు చేశాడు. తర్వాత కర్ణుని అందుకోబోయాడు. అంతే! మరో ఆలోచన లేకుండా ఇంద్రుడిచ్చిన భీషణ శక్తిని అభిమంత్రించి ఘటోత్కచునిపై ప్రయోగించాడు కర్ణుడు.

భయంకర జ్వాలలు చిమ్ముతూఆ శక్తి ప్రయాణించ సాగింది...పెద్ద పెద్ద మెరుపులు మెరిశాయి. పగలే చీకటి కమ్మింది.అదిచూసి ఘటోత్కచుడు పరుగుతీశాడు. ప్రాణభయంతో పరుగులు తీసాడు ఘటోత్కచుడు. అయినా ఫలితం లేకపోయింది. ఘటోత్కచుని వెన్నులోంచి దూసుకొని పోయి అదృశ్యమయింది శక్తి. ఘటోత్కచుడు భీకర ఘర్జన చేసి నేల మీది పడి మరణించాడు. అతని నోటి లోంచి రక్తధారలు ఉవ్వెత్తుగా ప్రవహించసాగాయి. అది చూసి దుర్యోధనుడు ఎంతగానో ఆనందించాడు. కర్ణుని గుచ్చి కౌగిలించుకుని అభినందించాడు. అదేసమయంలో ద్రోణుడు విరాటుని,నేలకూల్చాడు.

పోద్దుపోవడంతో యుద్దం ఆరోజుకి ముగిసింది.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు