ఒక రోజు పదిహేనేళ్ల రాము మరియు తన పదేళ్ల చెల్లెలు సాయంకాల వేళ కాలినడకన ట్యూషన్ నుంచి బయలుదేరారూ. ఆరోజు శేఖర్ మాస్టారు రాముని ఇంటి పని చేస్తున్నప్పుడు వేధించడంతో ఆలస్యం అయ్యింది. ఇంటికి మామూలుగా ఆరింటికి బయలుదేరుతారు, కానీ ఈరోజు ఏడు అయ్యిపోయింది! చీకటి పడింది.
కవిత - "నాకు భయం వేస్తోంది!"
రాము - "భయపడకు నేను ఉన్నాను ."
కవిత ఏడవడం మొదలు పెట్టింది. రాముకి ఏమిచేయాలో తెలియక తనచేయ్య పట్టుకుని నేను ఉన్నాను అని మళ్ళీ చెప్పాడు. కవిత ఏడుపు ఆగలేదు. రాము అప్పుడు ఒక ఐదు నిముషాలు తరువాత ... "నేను అమ్మకి కాల్ చేస్తాను ఉండు."
రాము - "అమ్మ ఫోన్ కాల్ కనెక్ట్ అవ్వలేదు." కవిత ఏడుపు ఆగలేదు.
కవిత - "అమ్మ ఫోన్ ఛార్జ్ చేసిందో లేదో!"
రాము - "నేను నాన్నకి కాల్ చేస్తాను ఉండు!"
కవిత - "నాన్నకా ?"
రాము - "అవును "
రాము తన నాన్నకి కాల్ చేసి మాట్లాడాడు.
కవిత - "నాన్న ఏమన్నాడు?"
రాము - "వెనక్కితిరిగి చూడకు!"
కవిత - "ఎందుకు?"
రాము - "నాన్న వెనుకనుంచి దారి చూపుతున్నాడు మనము చూడరాదు!"
కవిత - "అవునా? సరే అయితే"
వారు నడిచే దారిలో కొన్ని ఇల్లులు ఉన్నాయి.
రాము - "అదిగో ఆ కుడివయపు ఉన్న ఇంటిలో ఆంజనేయస్వామి ఉన్నాడు. మనల్ని కాపాడుతాడు! జై ఆంజనేయ అను!"
కవిత - "నీకు ఎలాతెలుసు?"
రాము - "నాన్న చెప్పారు!"
కవిత - "జై ఆంజనేయ!"
కవిత గెట్టిగా దేవుడు పేరు మళ్ళీ మళ్ళీ చెప్పటం ఆపైన రాము తనను దేవుడు పేరు కొంత మెల్లగా చెప్పు అనటం జరిగింది.
కవిత - "ఆ ఇల్లు వెళ్లిపోయింది కదా ?"
రాము - "అక్కడ దూరంగా కనపడే ఇంటిలో రాముడుని చూడడానికి ఆంజనేయుడు వెళ్ళాడు. అంటే రాముడు ఇంకా ఆంజనేయుడు ఇద్దరు ఉన్నారు! భయము ఎలా ?"
కవిత - "మరి సీతా దేవి?"
రాము - "ఉండు నాన్నని అడుగుతా "
పదినిమిషాలతరువాత.
కవిత - "అన్నయ్య? ఇల్లు వెళ్లి పోయింది !"
రాము - "మన ఇల్లు ఇంకా ఐదు నిమిషాలే. వాళ్ళు మన ఇంటికి వెళ్లారు. అక్కడే సీతా దేవి ఉంది."
కవిత చేతులు చాపిమరి - "ఎత్తుకో !"
రాము - "సరే"
మొత్తానికి ఇంటికి చేరారు వీళ్ళు ఇద్దరు. అమ్మ చెల్లిని ప్రేమగా హద్దుకుంది. ఇక అమ్మ యక్షప్రశ్నలు వేసింది.
కవిత - "నాన్న ఫోన్లో దారి చూప్పాడు లే అమ్మ!"
అమ్మ తన కూతురి తో అన్నది, " నాన్న ఫోన్ చేయటం ఏంటి తల్లి ?" అమ్మ వెనుక నాన్న ఫోటో ఇక దానికి దండ !
కవిత అమాయకంగా అంది , "ఏమో నాకు తెలియదు! వెనుకకు మాత్రం చూడకు!"
అమ్మ తన కొడుకు వయపు చూసింది. రాము చిన్నగా చిరునవ్వు జల్లాడు !