నిర్విక - బొబ్బు హేమావతి

Nirvika

ఆ వారం మేము పల్లెకు వెళ్ళిన వెంటనే, మా మేనల్లుడు ఉపమన్యు మా పిల్లల కోసం జున్ను తీసుకొచ్చాడు. నా పిల్లలు ఇద్దరు అతనితో కలిసి వాళ్ళ చెరుకు తోట చూసేదానికి వెళ్లారు. ఉపమన్యు ఎమ్మెస్సీ అగ్రికల్చర్ చేసి ఊర్లోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నాడు. చాలా చురుకైన వాడు. రైతులందరికీ కొత్త వ్యవసాయ పద్ధతులు నేర్పిస్తూ కొత్త వంగడాలను ఇంట్రడ్యూస్ చేసి మా ఊర్లో అగ్రికల్చర్ ని వేరే లెవెల్ కు తీసుకుపోయాడు. తన కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పాడు. తన పేరు నిర్విక. పేరే కాదు తన మనస్సు కూడా ఎంతో అందమైనది. కానీ అంత అందమైన మనసున్న నిర్విక తల్లి శాడిస్ట్. నిర్వికాకు చిన్నతనం నుండి తనకు కావలసిన ఆప్యాయత అంద లేదు. మనమంతా అనుకుంటాము అమ్మంటే ఆప్యాయతకు మారుపేరు అని. కానీ కొంతమంది తల్లులు ఉంటారు ఆ పేరుకే చెడ్డపేరు తెస్తారు. నిర్విక తల్లిదండ్రులు చాలా సాంప్రదాయవాదులు. వయసు వచ్చిన తర్వాత కూతురికి తల్లి స్నేహితురాలు లాగా ఉండాలి. తండ్రి తన కొడుకుకి స్నేహితుడు లాగా ఉండాలి. నిర్విక తల్లిదండ్రులు ఇక ఆపోజిట్. పిల్లలను అసలు పట్టించుకోరు. ఎప్పుడూ డబ్బు సంపాదన. నిర్విక తల్లిదండ్రులు మ్యానుఫ్యులేటర్స్. మేము వచ్చాము అని తెలిసి నిర్విక మా కోసం ఇంట్లోనే చాక్లెట్ కేక్ చేసి తెచ్చింది. రాగానే నన్ను కౌగిలించుకొని, మిమ్మల్ని చూసి ఎన్ని రోజులు అయింది అంటూ పిల్లల్ని ముద్దు చేసింది. నిర్విక తో మాట్లాడుతూ.... ఈమధ్య నాకు మీ నాన్న నాకు మా కమ్యూనిటీలో కనిపించారు. తన స్నేహితుడి కూతురి పెళ్లి రిసెప్షన్ కి వచ్చున్నారు.... అనగానే నిర్విక....అడిగింది ఎలా ఉన్నారు మా నాన్న చాలా బాగున్నారు. నేను మాట్లాడాను. తమ్ముడు యుఎస్ నుండి రిటర్న్ వచ్చాడని పెళ్లి సంబంధాలు చూస్తున్నామని చెప్పారు. నిన్ను ఈమధ్య కలవలేదా అని అడిగింది శ్రీజ... లేదు.... వాళ్లకి నేను ఉప్పుని పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు. పెళ్లయిన తర్వాత కూడా వాళ్ళు నాతో మాట్లాడటం లేదు. నేను ఎప్పుడైతే ఉప్పుని తీసుకొని మా ఇంటికి వెళ్లానో, వాళ్లకి చాలా కోపం వచ్చింది. మా అమ్మ నాన్న జవాబు కోసం అప్పటికి మేము మూడేళ్లు ఎదురు చూశాము. నేను ఉప్పు ని పెళ్లి చేసుకుంటానని ఎంత అడిగినా ఒప్పుకోలేదు. ఇంకా నేను మొండి పట్టుదలతో ఉండేది చూసి వాళ్ళు పెళ్లి కి ఒప్పుకున్నారు. కానీ ఒక కండిషన్ పెట్టారు. నాకు వాళ్లకి వాళ్ళ ఆస్తితో ఏ సంబంధం లేదని సంతకం పెట్టమన్నారు. వెంటనే వాళ్ళు ఎక్కడ అడిగితే అక్కడ సంతకాలు పెట్టేసాను. కళ్ళల్లో ఎంతో బాధతో... నిర్వి చెప్పింది. తర్వాత వాళ్లు నా పెళ్ళికి ఒప్పుకుని నా పెళ్లిని వాళ్ళ లెవల్ కు తగినట్లు చేశారు. ఉప్పు ఎప్పటినుండో నాకు మీ తల్లిదండ్రుల దగ్గర్నుంచి ఒక నయా పైసా వద్దు అంటున్నాడు. అలాగే జరిగింది. అంతా నా మంచికే. నేను ఉప్పుతో చాలా సంతోషంగా ఉన్నాను అనింది. కనీసం మీ తమ్ముడు కూడా నీతో మాట్లాడటం లేదా అని అడిగింది శ్రీజ. ఓహ్... పెళ్లికి ముందు వరకు నేను మా తమ్ముడు ఇద్దరు ఒక జట్టుగా ఉండే వాళ్ళము. మనం అనుకుంటాం కానీ ఆ ప్రేమలంతా నిజం కాదని మనకు అర్థం కావడానికి టైం పడుతుంది. ఎప్పుడైతే డబ్బు అనే మాట మనుషులు మధ్య వచ్చిందో అప్పుడే ఆ ప్రేమలన్నీ వికటించాయి. నేనేమీ అడక్కుండానే మా అమ్మ నీకు పెళ్లి అయిపోయింది. ఇక నీకు మాకు సంబంధం లేదు. నీ సంసారం విషయం నువ్వు చూసుకో. నీకు ఎటువంటి కష్టం వచ్చినా సరే మీ అత్తఇంటి వాళ్ళ సహాయం అడుగు. మా దగ్గరకు రాకు అనింది. ఆ మాటతో నేను ఒక్కసారిగా స్టన్ అయిపోయాను. అంతవరకు నేను కనీసం మా అమ్మ నా పక్కన ఉంది అనుకున్నాను. చిన్నప్పుడే మా అమ్మ నాతో నువ్వు మా ఇంట్లో లక్ష్మీదేవి. మా ఇంటి కనక రాశివి. కానీ మా ఇంటి కనకాన్ని ఎత్తుకు పోయేదానికి వచ్చిందానివి అంటా ఉంటే నాకు అర్థం కాలేదు. నాకు ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా మేము ఇప్పుడే పెళ్లి చేయము మా అమ్మాయికి అనేవాళ్ళు. ఎందుకు అనేది ఇప్పుడు నాకు అర్థమైంది. అమ్మాయి అంటే ఎప్పుడు మైనస్ కదా. అబ్బాయి అంటే ప్లస్. కట్నం రాబట్టుకోవచ్చు. మనుషుల్లో మానవత్వం ప్రేమాభిమానాలు చచ్చిపోయినాయి. కానీ మీ దగ్గరకు వచ్చాక నాకు మళ్ళీ ప్రేమ మీద ఆశ పుట్టింది. నా పూర్వజన్మ సుకృతంతోనే నేను ఉప్పు ని పెళ్లి చేసుకోగలిగినాను అనింది.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు