కురుక్షేత్ర సంగ్రామం. 18 - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Kurukshetra sangramam.18

కురుక్షేత్ర సంగ్రామం.(18).

హైందవ సాంప్రదాయం ప్రకారం మనలోని 6 గుణాలు:1. కామం,2. క్రోధం,3. లోభం,4. మోహం,5. మదం,6. మత్సరం.వీటిని షడ్ గుణాలు అంటారు.మానవుడు ఈ షడ్గుణాలకు అతీతంగా జీవించాలని వాటి బలహీనతకి గురి కాకూడదని మన పెద్దలు చెపుతుంటారు.

షడ్గుణాలలో ఒకటైన క్రోధం అనగా కోపం లేదా ఆగ్రహం. మన మనసుకు నచ్చని లేదా మన అభిప్రాయాన్ని మరొకరు విమర్శించినా లేదా వ్యతిరేకించినా వారిపై మనకు కలిగే వ్యతిరేకానుభూతి లేదా ఉద్రేకాన్ని కోపంగా నిర్వచించవచ్చు. దీని పర్యవసానంగా ఎదుటివారిపై దాడి చేయటం, వారిని దూషించటం మొదలైన వికారాలకు లోనై తద్వారా వారి, చూసేవారి దృష్టిలో మన స్థానాన్ని దిగజార్చుకోవడం జరుగుతుంది. అందుకే క్రోధం కలిగినప్పుడు ఆవేశానికి లోను కాకుండా మనకు మనం శాంతపర్చుకోవడం ఎంతైనా అవసరం.

శాంతము గలవారు ఎంతటి కష్టతరమైన కార్యాన్నిసాధించగలరు . శాంతమూర్తులు దయాదాక్ష్యణ్యాలు, జాలీ,సానుభూతి, సేవాభావం, ఉపకారబుధ్ధికలిగిఉంటారు. కలహం,కలత-కల్లోలం-దౌర్జన్యం-భయం-దురాశ ఇవన్ని మనిషికి నెమ్మది లేకుండా చేస్తాయి.నిరాశ,నిస్పుహ, ఆవహింపబడి నరకప్రాయమైన జీవితం లభిస్తుంది. శాంతమూర్తి అయినవారు సమాజపరంగా ఎంతో గౌరవింపబడతారు. మౌనం చాలాగొప్పది.పెద్దల ఎదుట తక్కువమాట్లాడాలి ఎక్కువవినాలి.

కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకమ్, మౌనేన కలహో నాస్తి, నాస్తి జాగరతో భయమ్. మౌనం అనగా వాక్కుని నియంత్రించడం; లేదా మాటలాడడం తగ్గించడం. ఇదొక అపుర్వమైన కళ, తపస్సు. మాటలను వృథాగా వినియోగించకుండా దైవమిచ్చిన వరంగా భావించి ముక్తసరిగా అవసరం మేరకే మాట్లాడటం సర్వదా శ్రేయస్కరం. వినేవారికి ఇంపుగా, హితంగా, మితంగా మాట్లాడాలని, అలా చేతకానప్పుడు మౌనమే మేలని విదురనీతి వివరిస్తోంది.పాపాల పరిహారార్ధం నిర్దేశించబడిన ఐదు శాంతులలో మౌనం ఒకటి. ఈ పంచ శాంతులు: ఉపవాసం, జపం, మౌనం, పశ్చాత్తాపం, శాంతి.మౌనంగా ఉండేవారిని మునులు అంటారు.మాట వెండి అయితే, మౌనం బంగారం అని సామెత. మాట్లాడటం ద్వారా శక్తిని వృథా చేసుకునేకంటే మౌనంగా ధ్యానం చేయడం ద్వారా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చు.

నేరనిర్థారణ సందర్భాల్లో నేరస్థుడు మౌనం వహిస్తే నేరం అంగీకరించిన భావం వస్తుంది కాబట్టి ఆ సమయంలో మౌనాన్ని ఆశ్రయించడం అనుకూలం కాదు.అతిగా మాట్లాడేవారికి విలువ తగ్గిపోతూ ఉంటుంది.

మౌనం మూడు విధాలుగా చెప్తారు.

వాజ్మౌనం: వాక్కును నిరోధించడమే వాజ్మౌనం. దీనినే మౌనవ్రతం అంటారు. ఇలాంటి మౌనం వల్ల పరుష వచనాలు పలుకుట, అబద్ధము లాడుట, ఇతరులపై చాడీలు చెప్పుట, అసందర్భ ప్రలాపాలు అను నాలుగు వాగ్దోషాలు హరించబడతాయి.

అక్షమౌనం: అనగా ఇంద్రియాలను నిగ్రహించడం. ఇలా ఇంద్రియాల ద్వారా శక్తిని కోల్పోకుండా చేస్తే ఆ శక్తిని ధ్యానానికి, వైరాగ్యానికి సహకరించేలా చేయవచ్చును.

కాష్ఠమౌనం: దీనినే మానసిక మౌనం అంటారు. మౌనధారణలో కూడా మనస్సు అనేక మార్గాలలో పయనిస్తుంది. దానిని కూడా అరికట్టినప్పుడే కాష్ఠమౌనానికి మార్గం లభిస్తుంది. దీని ముఖ్య ఉద్దేశము మనస్సును నిర్మలంగా ఉంచుట. కాబట్టి ఇది మానసిక తపస్సుగా చెప్పబడింది.

మౌనం ఆరోగ్య వృద్ధికి తోడ్పడుతుంది. దీనివలన దివ్యశక్తి ఆవిర్భవిస్తుంది. బాహ్య, ఆంతరిక సౌందర్యాలను పెంచుతుంది. మనోశక్తులు వికసిస్తాయి. ఎదుటవారిలో పరివర్తనను తెస్తుంది. ఆధ్యాత్మిక శక్తి ఉత్పన్నమై ఆత్మకి శాంతి లభిస్తుంది. కోపము,ఆశ,అసూయ,భయం మొదలైనగుణాలు అశాంతికి గురిచేస్తాయి.సంతృప్తి,శాంతి,ప్రేమ ఆనందాన్నికలిగిస్తాయి .

ఈవిషయాన్ని మనం ధర్మరాజు, దుర్యోధనులలో చూడవచ్చు. ఈర్ష్య,ద్వేషాలకులోనైన దుర్యోధనుని పతనానికి కారణం అతని అహంభావమే....

దుర్యోధనుని మరణ వార్త విన్నఅశ్వత్ధామ 'అపాండవీయం చేస్తాను'అని శివుని ప్రార్ధించగా మహిమాన్వితమైన ఖడ్గంప్రసాదించాడు.రాత్రి సమయంలో అందరు ఆదమరచి నిద్రిస్తున్న సమయంలో పాండవుల శిబిరాలుచేరుకుని,ధృష్టద్యుమ్నుడు నిద్రపోతూ కనిపించాడు. నిద్రలేపి శిరస్సు ఖండించాడు.అంతరం ఉత్తమౌజుని ,యుధమాన్యుడు, శిఖండి, ద్రౌపతికి ధర్మరాజుకు జన్మించిన ప్రతివింధ్యుడు,భీమునికి జన్మించిన శ్రుతసోముడు, అర్జునునకు జన్మించిన శ్రుతకీర్తి,నకులునకు జన్మించిన శతానీకుడు,సహదేవునికి జన్మించిన శ్రుతసేనుడు అనే,ఐదుగురిని తనకత్తికిబలిచేసాడు.(వీళ్లుఐదుగురు విశ్మసులు అనే దేవతలు. విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని బాధించడం చూసినవీరు విశ్వామిత్రుని ఆక్షేపించగా,అతనిశాపం పొంది ద్రౌపతి గర్బన జన్మించి అవివాహితులుగా మరణించారు)అనంతరం కృప కృతవర్మలను కలుసుకుని,కొనఊపిరితొ ఉన్న దుర్యోధనుని వద్దకు వెళ్లి జరిగిన విషయం విన్నవించాడు అశ్వత్ధామ.అదివిన్న దుర్యోధనుడు 'మహాత్మా మీతండ్రిని చంపిన వారిని సంహరించి వీరుడు అనిపించుకున్నావు'అని ప్రాణాలు వదిలాడు . అదిచూసిన అశ్వత్ధామ తూర్పుదిశగా వెళ్లి న,అశ్వత్ధామ భాగీరధి తీరంలోని వేదవ్యాసుని సన్నిధిలో ఉన్నడు. వెదుకుతూ వెళ్ళినపాండవులు,అతన్ని యుధ్ధానికి ఆహ్వానించగా, వారిపై రెల్లుపుల్లనుతీసి "అపాండవం అగుగాక"అని మంత్రించి దాన్ని బ్రహ్మశిరోనామకాస్త్రం గా ప్రయోగించాడు.,అర్జునుడు అదేఅస్త్రాన్ని ప్రయోగించాడు. వేదవ్యాసుని సలహాపై అస్త్రాలురెండు ఉపసంహరించారు. అశ్వత్ధామ శ్రీకృష్ణుని శాపానికి గురై తన శిరోమణిని త్యగించి వెళ్ళిపోయాడు.కురుక్షేత్రసంగ్రామం అలాముగిసింది.అటు పాండవుల అయిదుగురు తొపాటు,సాత్యకి,యయుత్సుడు,కౌరవలపక్షన కృపాచార్యుడు,కృతవర్మ,అశ్వత్ధామలు మిగిలారు. ఉత్తరగర్బాన్ని శ్రీకృష్ణుడు రక్షించాడు.యుధ్ధరంగంలో మరణించిన కురు,పాండవవీరులకు వేదోక్తంగా దహనక్రియలు,అపర కర్మలు నిర్వహించి,అశౌచం అయ్యేవరకు శిబిరాలలో అక్కడే గడిపసాగారు.నారద,దేవల,కణ్వ,వ్యాసాది మునింద్రులు ఎందరో వచ్చి ధర్మరాజును ఓదార్చారు.అలాపాండవులు ముపైఆరు సంవత్సరాలు రాజ్యపాలన చేసి అనంతరం పరిక్షితునికి పట్టాభిషేకం చేసి స్వర్గంచేరుకున్నారు. అనంతరం అభిమన్యుడు ఉత్తరుల కుమారుడు-పరీక్షిత్తు.అతనికుమారుడు జనమజేయుడు.(ఇతను చంద్రవంశంలో45వ రాజు) అనంతరం శతానీకుడు,యజ్ఞదత్తుడు, నిశ్చక్రుడు, ఉపరాష్ట్రపాలుడు, చిత్రరధుడు, ధృతిమంతుడు ,సుషేణుడు, సునీథుడు, ముఖపాలుడు, నచక్షవు, సుఖవంతుడు,పారిప్లవుడు ,సునయుడు, రిపుంజయుడు,మృదువు, తిగ్మజ్యోతి,బృహద్రధుడు, వసుదాముడు,శతానీకుడు,ఉద్యానుడు,అహీనరుడు,నిర్మిత్రుడు,క్షేమకుడు,అతనుమ్లేచ్ఛులచే చంపబడ్డాడు. ఇతని కుమారుడు ప్రద్యోతుడు. ఇతనికుమారుడు వేదవంతుడు, అతనికి సునందుడు ఇతనికి సంతానం లేదు.ఇలాసాగింది చంద్రవంశం.

శుభం.

మరిన్ని కథలు

Guudivada
గుడివాడ
- బొమ్మిరెడ్డి పల్లి ప్రమీల రవి
Pareeksha
పరీక్ష
- తాత మోహనకృష్ణ
M B Company
M B కంపెనీ
- మద్దూరి నరసింహమూర్తి
A1 farmula
ఏ1 ఫార్ములా
- వై.కె.సంధ్యా శర్మ
Oke okkadu
ఒకే ఒక్కడు
- కందర్ప మూర్తి
Mitam
మితం
- ఆదిత్య ప్రణవ్
Bamma ki ichina mata
Bamma ki ichina mata
- Prabhavathi pusapati
Peddakodalu
పెద్దకోడలు
- మద్దూరి నరసింహమూర్తి