సుహాసిని - బొబ్బు హేమావతి

Suhasini

నేను పెళ్లి చేసుకుని ఈ ఇంటికి రాగానే నాకు నైబర్ సుహాసిని పరిచయమైంది. అప్పటికి సుహాసిని కి ఇంకా పెళ్లి కాలేదు. సుహాసిని కి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. తనకంటే పెద్దదైన అక్క భావన, తనకంటే చిన్నదైనా చెల్లి విమల. అప్పటికే భావనకు పెళ్లయింది. భావన భర్త రిజర్వు ఫోర్స్ లో ఎస్ఐగా పని చేసేవాడు. చూడడానికి చాలా అందగాడు, మంచివాడుగా కనిపించాడు. కానీ కొద్ది రోజుల్లోనే అతని అసలు వేషం బయటకు వచ్చింది. పెళ్లయిన రెండు నెలలకే వాడి కన్ను సుహా మీద పడింది. సుహా అప్పటికే వెటర్నరీ డాక్టర్ గా యూనివర్సిటీ లో పనిచేసేది. అత్తగారింటికి చీటికిమాటికి వచ్చి, సుహా మీ అక్క చేసిన టిఫిన్ నాకు నచ్చలేదు, నువ్వు టిఫిన్ చేసి పెట్టు అనేవాడు. సుహా సినిమాకి వెళ్దాం రా అని సినిమాకు పిలుచుకొని వెళ్ళేవాడు. సుహా నువ్వు లేకపోతే నాకు చాలా బోర్ కొడుతుంది, త్వరగా రా... ఈరోజు ఫైవ్ స్టార్ హోటల్ లో పార్టీ ఉంది వెళ్దాం అనేవాడు. సుహా మీద లవ్ బాంబు ప్రయోగించాడు. కొద్దిరోజులలోనే తనను బావ మ్యానిప్యులేట్ చేస్తున్నాడని గ్రహించి సుహా తన అమ్మతో, బావ నన్ను చాలా బాధ పెడుతున్నాడు, నాకు ఇష్టం లేకపోయినా అక్కడికి రా ఇక్కడికి రా అంటున్నాడు... అమ్మా నాకు బావతో వెళ్లడం ఇష్టం లేదు అనింది. కొంచెం ఓపిక పట్టమ్మా... బావ కదమ్మా .... అక్క సంసారం పాడవుతుంది అనగానే ఓపిక పట్టింది. భావన అప్పటికే డిగ్రీ కాలేజీ లెక్చరర్ గా పనిచేసేది. నెల మొదట్లోనే ఆమె శాలరీ తీసుకునేవాడు. ఆమె చేతికి రోజు ఖర్చుకి డబ్బు ఇచ్చేవాడు. కొద్దిరోజుల్లోనే ఆమెను కంట్రోల్ చేయడం మొదలు పెట్టాడు. చెల్లెళ్ళతో మాట్లాడకూడదని, పుట్టింటికి వెళ్ళకూడదు అని బెదిరించేవాడు. రెండేళ్లయిన పిల్లలు పుట్టక పోయేసరికి నేను మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాను అనడం మొదలుపెట్టాడు. నేరుగా సుహాసిని దగ్గరికి వచ్చి నాకు మీ అక్క అంటే ఇష్టం లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు. సుహాసిని నాకు అటువంటి దృష్టి లేదు, నా అక్క భర్త నాకు తండ్రి తో సమానం అనింది. అతను ఒప్పుకోకుండా.... సుహాసిని కాలేజ్ దగ్గరికి వెళ్లి అక్కడ ఆమె స్నేహితులను బెదిరించడం మొదలుపెట్టాడు. ఆమెని నేను పెళ్లి చేసుకోబోతున్నాను. తనకి కూడా నేనంటే ఇష్టం. నాతో సినిమాలకి, పార్టీలకు వచ్చింది. మీరు ఆమెతో మాట్లాడొద్దండి అని చెప్పడం మొదలుపెట్టాడు. భావన భర్తను బెదిరిచ్చినా అతని లొంగలేదు. ఈ సంఘటనలు జరిగేటప్పటికీ భావన గర్భవతి అని తెలిసింది. అతను గర్భవతి అయిన భార్యని ప్రేమగా చూసుకోకుండా, ఇంతలో ఇంకోక ఆమెను ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. సుహా పేరెంట్స్ అతనిని ఎందుకు ఇలా చేస్తున్నావు, మా అమ్మాయి జీవితం ఏం కావాలి అంటే... మీ అమ్మాయి జీవితం బాగుండాలంటే మీ రెండో కూతురు సుహా ను నాకు ఇచ్చి పెళ్లి చేయండి అన్నాడు. సుహాసిని కి పెళ్లి చూపులు జరిగిన తరువాత, వాళ్ళ దగ్గరికి వెళ్లి సుహాసిని క్యారెక్టర్ మంచిది కాదు, నాకు సుహాసిని కి సంబంధం ఉంది మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పడం మొదలుపెట్టాడు. సుహా తన పేరెంట్స్ తో కలిసి తన బావని ఎంత గట్టిగా కోప్పడినా బెదిరించిన అతను లొంగలేదు. అతనికి మోహము కళ్ళకు కప్పేసి ఎలాగైనా సుహాసిని తనదానిగా చేసుకోవాలని నిర్ణయించుకుని ఇంట్లో అందర్నీ బెదిరించడం కొట్టడం మొదలుపెట్టాడు. భార్య గర్భవతి అని కూడా చూడకుండా ఆమెని కొట్టడం, ఆమెని హాస్పిటల్ తీసుకెళ్లకుండా ఇంట్లోనే బంధించడం, కాలేజీకి వెళ్లకుండా తలుపుకు తాళం వేసుకొని వెళ్లిపోవడం, ఇంట్లో ఎటువంటి తిండి లేకుండా అంతా మాయం చేసేసి, ఆమె ఆకలికి మలమల మాడుతూ ఏడుస్తూ తలుపు తీయమని అడుక్కుంటూ ఉంటే కిటికీ దగ్గర నిల్చుకొని వినోదంగా చూడడం.... ఈ విధంగా హరస్ చేస్తూ ఉంటే ఇక ఆమె తట్టుకోలేకుండా ఈ భర్త ఇక నాకు వద్దు అనుకుని పోలీస్ రిపోర్ట్ ఇచ్చింది. పోలీస్ ఎంక్వయిరీ లో అతను హరాస్మెంట్ ప్రూవ్ అయ్యి, ఆమెకు ఈజీగా విడాకులు వచ్చాయి. అప్పటికీ అతను సుహాసిని ని వదలకుండా ఆమెకు వచ్చిన ఒక పెళ్లి సంబంధాన్ని చెడగొట్టడానికి, నేరుగా అబ్బాయి ఇంటికి వెళ్ళాడు. అప్పటికే వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి....సుహా కాబోయే అత్తగారు.... సుహా మా ఇంటి కోడలు, మా అమ్మాయి, నువ్వు ఇక్కడికి వచ్చావంటే నీ కాళ్ళు ఇరగ గొడతామని చీపురు ఎత్తుకుని వాడిని కొట్టబోయింది. వాళ్లు సుహాసినికి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి ఆమెను ఆదరించి తమ కోడలుగా చేసుకున్నారు. ఆడపిల్లలుగా పుట్టడమే ఎన్నో ప్రాబ్లమ్స్. మనము వాటిని ఎదుర్కోవాలి. పారిపోకూడదు సమస్యల నుండి. ఆడవాళ్ల సమస్యలకు ముఖ్య కారణం, వాళ్ళల్లో ధైర్యం లేకపోవడమే. డబ్బులు సంపాదించొచ్చు గాని ధైర్యాన్ని సంపాదించలేము. ఆడపిల్లల్లో చిన్నప్పటి నుంచే నింపాల్సింది వాళ్ళల్లో వాళ్ల మీద వాళ్లకు విశ్వాసం. సుహాసిని చెల్లెలు భర్త చాలా మంచివాడు. విమలకు పెళ్లి అయినప్పటి నుంచి ఈ కుటుంబానికి ఎంతో అండగా ఉండేవాడు. ఇప్పుడు అటువంటి వానికి చాలా పెద్ద దెబ్బ తగిలింది. వయస్సు కు వచ్చిన కొడుకు మరణించడం అనేది ఏ తండ్రి తట్టుకోలేడు. ఇప్పుడు వాళ్ళిద్దరి బాధ తీర్చలేనిది. అప్పుడు నాకు భారతి గుర్తొచ్చింది. భారతి నాకు డిగ్రీ క్లాస్మేట్. అప్పట్లో భారతి కోసము తన బావ మా కాలేజీకి వచ్చేవాడు. బావ అంటే సరదా అనుకుని భారతి కూడా బావతో చాలా క్లోజ్ గా ఉండేది. ప్రతి రోజు కాలేజ్ లో వదిలి పెట్టి మళ్ళీ సాయంత్రం ఇంటికి తీసుకుని వెళ్ళేవాడు. సుహా కి భారతికి ఎంత తేడా. సుహా బావని నేను పెళ్లి చేసుకొను, నాకు తండ్రి లాంటి వాడు అని చెప్పేసింది.. కానీ భారతి అదే బావని అంటే అక్క భర్తను పెళ్లి చేసుకుంది. అక్కను హర్ట్ చేసింది. ఇప్పుడు అక్క, చెల్లి ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో అతనితో కాపురం చేస్తున్నారు. వాడికి ఏమి వాడు మగాడు వాడికి ఇద్దరు పెళ్ళాలు ఉన్నా వాడికి లెక్కలేదు. కానీ ఆడవాళ్ళ మనసులో ఉండే బాధను తీర్చలేము. ప్రతిరోజూ వాళ్లకి ఈ భూమి మీద నరకం. నేను నీకు బానిసను అవుతాను కాకపొతే నేను చెప్పినట్లు వింటేనే అంటూ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్లకి అఫెక్షన్ ఇవ్వకుండా వాళ్ళని లొంగదీసుకుని హర్ట్ చేస్తూ తనకు కావాలసిన విధంగా వాళ్ళని వాడుకుంటున్నాడు. ఆడాళ్ళను మాయ చేసి బతుకుతున్న వాడు ఒక వెధవ.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు