అతని కన్ను ఆమె మీద పడింది - బొబ్బు హేమావతి

Atani kannu aame meeda padindi

ఆ రోజు శుక్రవారం...🌸🌸🌸

పైగా అది కార్తీక మాసం....

ఆమె... శ్రీజ....

తెల్లారి లేచి తలంటు స్నానం చేసి...దేవుని పటాలను తుడిచి మనస్ఫూర్తిగా పసుపు కుంకుమలను అద్ది... దీపాలను వెలిగించింది.

కళ్ళు మూసుకుని ప్రార్తిచింది...అందరూ బాగుండాలి అనుకునింది.

ఇంటి బయట పైప్ తో నీళ్లు పట్టి చీపురుతో తోసి... ముగ్గు వేసింది. వాటికి రంగులు అద్దింది. ముగ్గు చూడగానే ఎంతో ముద్దు వచ్చింది.

అంతలోనే ... పిల్లలను నిద్రలేపి... స్నానానికి పదపద మంటూ తొందరపెట్టింది.

చింటూ ని దగ్గరకు తీసుకుని హాగ్ చేసుకుని బాత్రూం లో వదిలింది. చింటూ అమ్మ కు ప్రేమతో ముద్దు పెట్టి వెళ్ళనని మారాం చేస్తుంటే చిన్నగా బుగ్గ మీద చిటికె వేసి తలుపు మూసుకొని వంట గది వైపు వెళ్ళింది.

గబా గబా ఇడ్లిలో కి చెట్నీ చేసి ప్లేట్ లో పెట్టి తన కూతురు కీర్తిని వచ్చి టిఫిన్ చేయమని కాలేజ్ బస్సు వచ్చే టైం అయ్యిందని కేక వేసింది.

తను రోజ్ కలర్ సారీ బ్రౌన్ చెక్స్ బ్లౌజ్ వేసుకుని జుట్టు కి క్లిప్ పెట్టి తిలకం దిద్దుకునింది.

చింటూ కి టిఫిన్ పెట్టి తింటూ ఆ రోజు వాట్సాప్ తీసి చూసుకునింది. పదకొండు గంటలకు స్టాఫ్ మీటింగ్... తమ వైస్ ఛాన్సెలర్ తో.

తిని తినగానే, హ్యాండబాగ్ తీసుకుని లంచ్ బాక్స్ పెట్టుకుని ఇంటి కీస్ వేసి....

చింటూ ని బైక్ లో ఎక్కించుకుని స్కూల్ దగ్గర వదిలి ఎనిమిది నలభై కి తన కాలేజ్ చేరింది. అందరూ తనను చూసి అడ్మిరేషన్ తో విష్ చేస్తూ ఉంటే చిరునవ్వు తో స్టాఫ్ రూమ్ లో అడుగు పెట్టింది.

ఆమె లోపలికి వెచ్చేటప్పుడే రెండు కళ్ళు తనను గమనించి నొసలు ముడిచాయి. అటెండన్స్ రిజిస్టర్ తీసుకుని తన ఫస్ట్ పీరియడ్ మొదటి అంతస్తులో ఉంటే వెళ్ళింది.

క్లాస్ లో అడుగు పెడుతూ గుడ్ మార్నింగ్ ఎవరీ వన్ అని విష్ చేస్తూ లోపలికి అడుగు పెట్టగానే పిల్లలు మొహం వికసించింది ఆవిడను చూడగానే, గుడ్ మార్నింగ్ మామ్ అంటూ లేసి నిల్చున్నారు. ఆ పీరియడ్ అటెండన్స్ తీసుకుని తను ఆ రోజు చెప్పాల్సిన మాథ్స్ లెసన్... ట్రిగ్నోమెట్రీ బోర్డు మీద చెప్పసాగింది.... అప్పుడప్పుడు పిల్లల వైపు చూస్తూ...వారిని ప్రశ్నలు అడుగుతూ... క్లాస్ రూమ్ లో చివరి బెంచ్ పిల్లలు వింటున్నారో లేదో గమనిస్తూ...లెసన్ ముగించింది.

క్లాస్ అవ్వగానే స్టాఫ్ మీటింగ్ కి ఇంకా టైం ఉండడంతో నెక్స్ట్ లెసన్ ప్రిపేర్ అవ్వసాగింది. ఇంతలో స్టాఫ్ మీటింగ్ కి టైం కావొస్తోంది అనగానే, తను కూడా అందరి తో కలిసి సెమినార్ హాల్ కి వెళ్ళింది.

స్టాఫ్ మీటింగ్ మొదలయ్యింది....కాలేజ్ ఎలా డెవలప్ చెయ్యాలి అని వైస్ ఛాన్సలర్ మాట్లడుతూ ఉన్నప్పుడు కూడా ఆ కళ్ళు ఆమె వంక పదే పదే చూసాయి.

ఆ కళ్ళలో మోసపురితమైన వంకర నవ్వు.

ఎవరో చూస్తున్నట్లుంది అనుకుంటూ వీపుకు చూపులు తగుళ్తున్నాయి అనుకుంటూ వెనుతిరిగి చూసింది శ్రీజ.

అటు శేఖర్... కొత్తగా చేరిన బయాలజీ ఫాకల్టీ .. ఆమె వైపు చూస్తూ....

ఆమె తనవైపు చూడగానే తల వంచుకుని చేతిలో ఉన్న బుక్ లో ఏవో వెతుకుతున్నట్లు నటిస్తూ...

అతను తల వంచుకోగానే... శ్రీజ తిరిగి ఛాన్సలర్ వైపు తిరిగి ఆయన చెప్పేది వినసాగింది.

ఛాన్సలర్ ప్రొఫెసర్ మాధవరావు మాట్లాడుతూ.... ప్లీజ్ మీరందరూ యాక్టీవ్ గా ఉండాలి. స్టూడెంట్స్ ని ప్రతి పనిలో భాగస్వామ్యం చేయండి. ప్రతి రోజు ఒక గంట మన యూనివర్సిటీ పచ్చదనానికి కేటాయించండి. మీ సజెస్షన్స్ చెప్పండి.... అనగానే

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ వీరభద్రం... గొంతు సవరించుకుని మాట్లాడుతూ "...సార్.... డస్టబిన్స్ పెట్టించండి. ఎక్కడ చూసిన చిప్స్ పాకెట్స్, చాక్లెట్ రాపర్స్, కూల్ డ్రింక్ బాటిల్స్....

కాంటీన్ ప్రెమిసెస్ లోనే తిండి తినాలి అని ఆర్డర్ పాస్ చేయండి"

అనగానే....ఫైనాన్సియల్ మత్తు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ....సార్ నేను చెప్తాను... ఒక మాట అంటూ....

"స్టూడెంట్స్ కు nss compulsory చేయండి....క్లీన్ అండ్ గ్రీన్ లో అందరూ పాల్గొనాలి అని ఆర్డర్ చెయ్యండి" అని అంటూ ఉండగానే

వెంటనే... శేఖర్ కల్పించుకుంటూ..."సార్ నాది ఒక మాట....శ్రీజ మేడం ను నన్ను ఇద్దరినీ nss కోఆర్డినేటర్ గా సెలెక్ట్ చేయండి" అంటూ శ్రీజ వైపు చూసి "మనమిద్దరం ఒక జట్టు మేడం" అనగానే..

శ్రీజ... అతని వైపు కోపంగా చూస్తూ.... "నేను అడిగానా.... Nss కోఆర్డినేటర్ గా ఉంటాను అని.... సార్ ఇప్పటికే నేను hod హోదాలో ఉన్నాను. హాస్టల్ మైంటెనెన్సు నాదే.... ఇప్పుడు నేను ఎటువంటి కొత్త హోదాలు చెయ్యలేను.

అయినా ఇదేంటి... మీరు మీ స్థానం లో ఉండాలి కానీ.... యు అర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ "అంటూ శేఖర్ వైపు కోపంగా చూసింది.

పక్కనే ఉన్న మాథ్స్ ఫాకల్టీ పరమేశ్వరి.... "అవును ఏంటండీ శేఖర్... మీరు ఏమిటి ఆర్డర్ పాస్ చేస్తున్నారు" అంటూ...కొంచం గొంతు పెంచింది.

వెంటనే...శేఖర్ పక్కనే ఉన్న మధన మోహన్, శేఖర్ ని కూర్చోమంటూ వెనక్కి లాగాడు.

శేఖర్ తల నొక్కుకుంటూ చైర్ లో కూర్చుంటూ శ్రీజ వైపు కోపంగా చూసాడు.

సెమినార్ హాల్ నుండి బయటకు రాగానే... శేఖర్ శ్రీజ వెనుక నడుస్తూ "మేడం సారీ మీ అభిప్రాయం అడగకుండా నా ఉద్దేశం చెప్పినందుకు. నాకు మీ మీద చాలా గౌరవం ఉంది. మగ తోడు లేకుండా ఇద్దరు పిల్లలతో దైర్యంగా బతుకుతున్నారు. నాకు ఒక అవకాశం ఇవ్వండి" అనగానే...

శ్రీజ అతని వైపు చూస్తూ... చాలా మెసేజ్ కలెక్ట్ చేశారు. అయినా నా పర్సనల్ విషయాలు మీరు మాట్లాడకండి. ఏమి అవకాశం కావాలి మీకు అని కోపంగా అతని కండ్లల్లోకి సూటిగా చూస్తూ అనగానే....

శేఖర్... నత్తినత్తిగా మాట్లాడుతూ.... అవకాశం అంటే... అని... ఆమె వైపు చూడలేక.... చూస్తూ... ఫ్రెండ్షిప్ మేడం.... మీకు ఏ సహాయము ఎప్పుడు కావాలి అన్నా చేస్తాను అన్నాడు.

శ్రీజ.... మీతో నాకు ఫ్రెండ్షిప్ ఎందుకు... లిమిట్స్ లో ఉండండి. నేను ఊరుకోను అని కోపంగా అనగానే....

ఎంతో కూల్ గా.... సరే మేడం... మీరు వద్దు అంటే వద్దులే... అని వికారంగా నవ్వుతూ.... కుంటుకుంటూ వెళ్ళిపోయాడు.

శేఖర్ వడివిడిగా వెళ్లడం చూసి శ్రీజ ఎందుకు శేఖర్ నన్ను రెచ్చగొడుతున్నాడు అనుకుంది. ముద్దబంతి లాంటి శ్రీజ మీద శేఖర్ కన్ను పడింది.

శ్రీజ వంటరిది ఒక్క చేత్తోనే తన ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ తన ఉద్యోగాన్ని చూసుకుంటూ పల్లెల్లో ఉన్న తన తల్లిదండ్రుల టేక్ కేర్ చేస్తూ జీవితాన్ని సాగదీస్తోంది.

శ్రీజా కి యూనివర్సిటీలో ఎంతో మంచి పేరు. చాలా మంచి టీచర్ అని పిల్లల్లో ఆమె మీద ఎంతో అడ్మిరేషన్. ఆమె మాథ్స్ లెసన్ ఒక్కసారి చెప్తే చాలు బోర్డు మీద పిల్లలకి ఎంతో బాగా అర్థమవుతుంది. స్టూడెంట్స్ ఆమె క్లాసు కి ఎప్పుడు వెళ్దామా అని చూస్తూ ఉంటారు.

క్లాసులన్నీ కంప్లీట్ చేసుకుని వడివడిగా 4:30 అవ్వగానే ఇంటికి వెళ్ళింది. అప్పటికే చింటూ ఇంటికి వచ్చే ఉన్నాడు.

చింటూ అమ్మని చూడగానే పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరకు వచ్చి అమ్మని హత్తుకున్నాడు.

అమ్మ ఈరోజు స్కూల్లో ఏం జరిగిందో తెలుసా. లంచ్ పీరియడ్ లో అనిరుద్ నన్ను ఎగతాళి చేశాడు. నీకు నాన్న ఉన్నాడా అన్నాడు. నేను రేయ్ మా నాన్న గురించి ఏమీ మాట్లాడొద్దు మా నాన్న మిలటరీ లో ఉన్నాడు అన్నాను.

మీ అమ్మ నీకు కథలు చెప్తా ఉందిరా పొయ్యి మీ అమ్మని అడుగు ఎక్కడున్నాడో చెప్తాది అన్నాడు. నాన్న ఏడి మా నాకు నాన్న కావాలి అని దిగులుగా అన్నాడు.

అనిరుద్ తో పాటు మిగిలిన వాళ్ళు నన్ను బుల్లియింగ్ చేస్తున్నారు. నేను ఏడుస్తా ఉంటే మా టీచర్ వచ్చి తిరిగి మాట్లాడకుండా వాళ్ళని కొట్టకుండా ఎందుకు ఏడుస్తున్నావు అనింది.

ఎవరైనా నిన్ను ఏమైనా అంటే చూస్తూ ఊరుకోకు అంటూ నేను నీకు సపోర్ట్ చేయట్లేదు వాళ్లకి సపోర్ట్ చేయను నీ పోరాటం నువ్వు చేయాలి అనింది.
అమ్మ నేను ఏమి తప్పు చేశాను మా టీచర్ కూడా ఎందుకు నన్నే తిడతావుంది అని అన్నాడు ఐదేళ్ల చింటూ.

ఎప్పుడో ఎక్కడికో వెళ్లిపోయిన భర్త గుర్తొచ్చాడు ఆమెకు. సుమారుగా 15 సంవత్సరాలు సైన్యంలో పనిచేసి కార్గిల్ యుద్ధంలో తన సహచరుడు తన సన్నిహితుడు తన చేతిలోనే మరణించేటప్పుడు కలిగిన ట్రామా తో పిచ్చివాడు అయిపోయాడు.మిలిటరీ నుండి అతనిని పంపించేశారు. అప్పటికే తన కూతురికి 10 ఏండ్లు.తరువాత తను ఎంతో జాగ్రత్తగా అతనిని చూసుకున్నా కూడా గర్భవతిగా ఉన్న తనను కూడా వదిలి ఎక్కడికో వెళ్ళిపోయాడు. చింటూ తన తండ్రిని చూడనేలేదు.

అతని పరిస్థితి చూసి తను అతనిని సైకియాట్రిస్ట్ కి చూపిస్తే... అతనికి బైపోలార్ అని అతనికి ఎటువంటి స్ట్రెస్ పెట్టకుండా చూసుకోమని అన్నారు.ఒక్కోసారి తమతో ఎంతో ప్రేమగా ఉండేవాడు. ఒక్కొక్కసారి కోపంతో రేజ్ తో రగిలిపోయేవాడు. పక్కింటి వాళ్ళతో స్నేహితులతో గొడవపడేవాడు. ఒక్కొక్కసారి డిప్రెషన్ తో శక్తి లేనట్లు ఏమీ చేయలేక పడుకొని నిద్రపోయేవాడు.

చింటూ ను ప్రేమగా హత్తుకుని నాన్న వస్తాడు రా వస్తాడు మిలిటరీ లో ఉన్నాడు అన్నది శ్రీజ.
మనల్ని వదిలి ఎన్నో రోజులు ఉండలేడు. తప్పకుండా వస్తాడు. నువ్వు నీ స్నేహితుల మాటలు పట్టించుకోకు. ధైర్యంగా ఉండాలి. ఎవరైనా నిన్ను ఎగతాళి చేసినా ఎదుర్కోవాలి అన్నది.

చింటూ అమ్మ మాటలు వింటూ ఆనందంతో అలాగే అమ్మ అంటూ ఇంతలో పక్కింటి స్నేహితుడు గిరి చింటూ అంటూ రావడంతో ఆడుకుంటాను అమ్మా అని వెళ్లిపోయాడు. చింటూ వెళ్లిన వైపు చూస్తూ శ్రీజ "మీరు ఎక్కడున్నా మా దగ్గరకు రావాలి, పిల్లల కోసం అయినా రావాలి. ఇదే నేను రోజూ ఆ దేవుని ప్రార్థించేది" అనుకొని కళ్ళు మూసుకొని ఒకసారి ఆకాశాన్ని చూసి ప్రార్థించింది.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు