అది పరమ్ కనస్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్. ఆ ఆఫీసు లో ఇర వై మంది పనిచేస్తున్నారు. ఆ కంపెనీని పరమ్ పెయిన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలుచుకుంటారు. ఆ కంపెనీ లో బాధలు అలా ఉంటాయి మరి. ఫిబ్రవరి, మార్చి ఇంక్రిమెంట్లు టైమ్ కదా అందరూ బాస్ ని ఇంప్రెస్ చేసే పని లో పడ్డారు. ఎడ్మీన్ ఆనంద్ ఒన్ సైడ్ A4 పేపరు వాడి బాస్ మెప్పు కోసం తాపత్రయ పడుతున్నాడు. ఒక పెన్సిల్ రెండు ముక్కలు చేసి పొదుపు గా చూపిస్తున్నాడు. ఏక్కౌంటు ఆఫీసర్ ఇంటికి వెళ్ళడం మానేసి ఆఫీసు లోనే పడుక్కుంటున్నాడు. టైపిస్ట్ తరళ ఎర్లీ గా వచ్చి లేటు గా వెడుతోంది. డిస్ని స్టార్ లో వచ్చే దిక్కుమాలిన బంధం ఇంకెన్నాళ్ళు సీరియల్ ని కూడా చూడడం త్యాగం చేసింది. అందరూ తమ తమ పరిధి లో హడావిడి చేస్తున్నారు. ఒక్క పి ఆర్ ప్రభాకర్ తప్ఫ. ప్రభాకర్ కుదిరితే బాస్ ని కలుస్తాడు. లేక పోతే లేదు. ఉదయం పది గంటలికి వస్తాడు. నాలుగు గంటలికే ఆఫిసు నుండి వెళ్ళి పోతాడు. పి ఆర్ ప్రభాకర్ కి ఈ సారి వెయ్యి రూపాయిలే అని అందరూ గుస గుస లాడుకోసాగారు. వాళ్ళ మాటలు వింటూ ప్రభాకర్ చిరునవ్వు నవ్వేవాడు. రెండు నెలలు గడిచాయి. ******** హెడ్ ఆఫీస్ నుండి ఇంక్రిమెంట్ కవర్లు వచ్చాయి. ఊహించి నట్టు గొప్పగా ఇంక్రిమెంట్లు రాలేదు. కాని అందరూ ఆశ్చర్య పోయేలా ప్రభాకర్ కి ప్రమోషన్ మరియు ఐదు వేల ఇంక్రిమెంట్ వచ్చింది. ఇది ఏలా సాధ్యమా అని ఎవరికి అంతు పట్ట లేదు. ఏక్కౌంటు ఆఫిసర్ వామనరావు ప్రభాకర్ ని బార్ కి పిలిచి అసలు విషయం రాబట్టడానికి ప్రయత్నించాడు. " నీకు ప్రమోషన్ రావడం ఆశ్చర్యం గా ఉంది. ఏలా సాధ్యం?" "హార్డ్ వర్క్" అన్నాడు ప్రభాకర్. "అలా కాదు గాని ప్రభాకర్ ఇంకో మాట చెప్పు" ఎవరికీ చెప్పనని వామనరావు దగ్గర మాట తీసుకుని అసలు విషయం చెప్పాడు. "ఇటునుంచి కుదరక పోతే అటు నుంచి నరుక్కురమ్మ న్నారు." "మన బాస్ బొక్కా శ్రీనివాస రావు తో అదే చేసాను " " ఏం చేసావు?" " రాందాస్ ఫార్ములా" " కంచర్ల రాందాస్ ఏం చేసాడు? నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అన్నాడు కదా" " అంటే బాస్ భార్య భారతి గారికి దగ్గరయ్యి, ఆవిడ కి డిష్ రిచార్జ్, కుక్కర్ బాగులు, ప్లంబర్ పనులు అన్ని ఈ ప్రభాకర్ చూసుకున్నాడు. " " మీకు అందం తక్కువా? అలా మెనిక్యూర్, పెడిక్యూర్ చేయించుకుని జుట్టుకి రంగేస్తే, ఏ కాలేజ్ లో చదువుతున్నారు అని అడగక పోతే నా పేరు మార్చుకుంటా ". అని చెప్పా. బ్యూటి క్లినిక్ పరిచయం చేసా. భారతి గారికీ కొత్త లోకం చూపించా. భారతి గారు బజారు లో వాళ్ళ అమ్మాయి తో కనబడినప్పుడు " అక్క చెల్లెళ్లా? ". అని అడిగా. దాంతో ఫ్లాటయిపోయింది!. ఒక్క మాట లో చెప్పాలంటే ఆవిడ లో తల లో నాలుక నయ్యాను. ఇంక్రిమెంట్ లిస్ట్ తయారయ్యాటప్పుడు నా ఎంప్లాయి కోడ్, పేరు ఆవిడకు ఇచ్చా! "లోకాంతరంగుడు శ్రీకాంత నిను గుడి ఏకాంతమున ఏక శయ్యనున్న వేళా నను బ్రోవమని చెప్పవే" అంతే! మిగిలిన కధ నీకూ తెలుసు అన్నాడు. ప్రభాకర్. ఆశ్చర్యం తో వామన రావుఅలా నోరు తెరుచుకుంటే, బ్లెండర్స్ ప్రైడ్ తో మూసాడు ప్రభాకర్! END