శ్రీవారికి ప్రేమలేఖ - తాత మోహనకృష్ణ

Srivariki prema lekha


"నేను ప్రేమించనూలేదు, ఒక ప్రేమలేఖ రాయనూలేదు..నాకు పెళ్ళి ఫిక్స్ చేసేసారు.." అంది రాధ

"పోనిలే..పెళ్ళయ్యాకా ప్రేమించొచ్చులే.." అంది తల్లి

"ఏంటమ్మా..! పెళ్ళికి ముందు ఉండే ప్రేమ వేరు. పెళ్ళికి ముందు అబ్బాయి...నువ్వు సారీ లో అయితే బాగుంటావు, ఈ కలర్ డ్రెస్ లో అయితే నువ్వు చాలా బాగుంటావు అని అంటారు. అదే పెళ్ళైన తరువాత..ఈ నైటీ వేసుకో, ఆ నైట్ డ్రెస్ వేసుకో అంటారు..భర్త ఇంకా రొమాంటిక్ అయితే, ఏమీ వేసుకోవద్దని అంటాడు.." అని నవ్వుతూ అంది రాధ

"ఛీ..ఏమిటే ఆ పాడు మాటలు.."

"పాడు మాటలు కాదు అమ్మా..ఇప్పుడే అవసరం..పెళ్ళైన తర్వాత నీ కూతురికి ఈ మాత్రం తెలియదా అని మీ వియ్యంకురాలు అంటే, నీకు ఎంత నామోషి చెప్పు.."

"చాలు ఆపు..పెళ్ళయ్యాక నీ మొగుడితో మాట్లాడుకో ఈ మాటలు.."

"సరేలే..!"

"పెళ్ళికి ఇంకా రెండు వారాలు టైం ఉంది గా...ఈ లోపు ప్రేమించుకోవే..ప్రేమలేఖలు రాసుకోవే.." అంది తల్లి

"అంతేలే మరి..శ్రీవారికి ప్రేమలేఖ అనమాట.." అని రాధ ప్రేమలేఖ రాయడం మొదలుపెట్టింది..

"ప్రియమైన కాబోయే శ్రీవారికి...మీకు కాబోయే శ్రీమతి మొదటి లేఖ..తప్పులుంటే క్షమించండి..ఓవర్ గా ఉంటే, లైట్ తీసుకోండి..

మీరు పెళ్ళిచూపులలో నాకు తెగ నచ్చేసారు. ముందు మగ పెళ్లివారికే కదా 'ఎస్' లేక 'నో' చెప్పే ఛాయిస్ ఇస్తారు.. అలాగే మీకూ ఇచ్చారు. మీరు ఏమంటారో అని తెగ టెన్షన్ పడ్డాను. మీరు 'ఎస్' అంటే, మన ఫస్ట్ నైట్ రోజు మీకు బోనస్ ముద్దులు ఇస్తానని మొక్కుకున్నాను. మీరు ఆ రోజు వెళ్లి, మర్నాడు విషయం చెబుతానన్నప్పుడు రాత్రంతా నాకు అసలు నిద్ర పట్టలేదు తెలుసా..! నా పక్కన మీ ఫోటోనే ఉహించుకున్నాను. నా మంచం మీద మీరు పక్కనే ఉండి, మాట్లాడుతున్నట్టు ఒకటే కలలు అనుకోండి..

అంతే కాదు.. పెళ్ళిచూపులలో మనల్ని విడిగా మాట్లడుకోమని పంపించినప్పుడు..మీరు నాతో ప్రేమగా మాట్లాడిన మాటలు..ఓరగా చూసిన ఆ చూపులు..దొంగచాటుగా నన్ను పై నుంచి కిందివరకూ స్కాన్ చేస్తునప్పుడే నాకు అర్ధం అయిపోయింది.. నేను మీకు నచ్చానని. నచ్చితేనే కదా, మళ్ళీ మళ్ళీ అలా చూస్తారు. మీ చూపులను బట్టి మీరు ఎంత చిలిపివారో నాకు అర్ధమైంది. పెళ్ళిచూపులలో మీరు అలా ధైర్యంగా ఉండడం కుడా నాకు బాగా నచ్చింది. నన్ను స్వీకరించినందుకు చాలా థాంక్స్..ప్రేమతో కూడిన మీ జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటాను.." మీ రాధ

కొన్ని రోజుల తర్వాత..బదులు ఉత్తరం వచ్చింది.

"ప్రియమైన కాబోయే శ్రీమతికి.. నీ కోసమే రాస్తున్న నా మొదటి ప్రేమలేఖ..

అసలు మీ ఫోటో చూసినప్పుడే నాకు నచ్చేసారు మిస్ రాధ. పెళ్ళిచూపులు ఒక ఫార్మాలిటీ అంతే..! అయితే నాకు మీ బోనస్ వచ్చినట్టే కదా..వెయిట్ చేస్తూ వుంటాను! పెళ్ళైన తరువాత..రోజూ నీ పక్కనే ఉంటాను..నీ వొళ్లోనే పడుకుని కబుర్లు చెబుతాను. కాబోయే శ్రీమతి ని అలా స్కాన్ చెయ్యడం తప్పు కాదేమో..! నిజంగా మీరు చాలా అందంగా ఉన్నారు..! నన్ను మీరు ఒప్పుకుంటారా లేదా..? అని నేను కుడా భయపడ్డాను. నిన్ను పొందిన నేను చాలా అదృష్టవంతుడను..

పెళ్ళి శుభఘడియల కోసం వేచి చూస్తున్నాను..!

**********

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ