.......కానీ కథ అక్కడితో ఆగిపోలేదు. - బొబ్బు హేమావతి

Kaanee katha akkaditho aagipoledu

ఆరోజు హాస్టల్ వార్డెన్ గా ఉన్న శ్రీజ దగ్గరకు సెక్యూరిటీ గార్డ్స్ ఒక అబ్బాయిని హాస్టల్ చుట్టూ తిరుగుతూ ఉంటే చూసి క్యాచ్ చేశారు.

అమ్మాయిల హాస్టల్ లోకి ఎందుకు వెళ్ళావు అని శ్రీజ అతనిని ప్రశ్నించింది.

మా క్లాస్మేట్ కడుపునొప్పి అని నాకు ఫోన్ చేసింది. నేను మెఫ్తాల్ స్పాష్ తీసుకుని వచ్చాను తన కోసము. అప్పటికే రాత్రి 11 అయ్యింది. హాస్టల్ గేటు వేసేశారు. తను ఏడుస్తూ లోపలికి రమ్మని తనకు కడుపు నొప్పి చాలా ఎక్కువగా ఉందని చెప్పింది. అందుకే వెళ్లాను అన్నాడు.

ఎలా వెళ్లావు?

పిట్టగోడ మీద ఎక్కి బాల్కనీలోకి వెళ్లి తన రూమ్ లోకి వెళ్లాను.

గేటు దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ కి కడుపు నొప్పి టాబ్లెట్ ఇస్తే ఇవ్వరా... నీవు ఎందుకు వెళ్లావు?

ఆ అమ్మాయి రమ్మంది నేను వెళ్లాను.

జవాబులు చాలా క్యారెలెస్ గా ఉన్నాయి.

అమ్మాయిని కూడా పిలిపించింది.

ఎందుకు అబ్బాయిని రమ్మన్నావు?

చాలా ఎక్కువ గా కడుపునొప్పి వచ్చింది. అందుకే రమ్మన్నాను.

నీకు రూమ్ మేట్స్ లేరా అని శ్రీజ అడిగింది.

మేడం వాళ్ళు ఎవరు నన్ను పట్టించుకోరు , ఇతనే నా స్నేహితుడు, రమ్మన్నాను అంది.

ఆ అమ్మాయి ఫోన్ తీసుకొని చూసింది. ట్రూ కాలర్ లో ఎన్నో మెసేజ్లు. అది కూడా ఆ అబ్బాయికి. బాత్రూం దగ్గర ఉన్నాను రమ్మంటూ సంకేతాలు. ఇక్కడ ఎవరూ లేరు, నేరుగా బాత్రూంలోకి వచ్చేయి అంటూ మెసేజెస్.

ఇంకా ఆ మెసేజ్ లోనే ఒక మెసేజ్... అతనిని చాలెంజ్ చేస్తూ...

"అర్ధరాత్రి 12.30 కి అమ్మాయిల హాస్టల్ లో నా రూమ్ కి రాగలవా".

మెసేజెస్ వాళ్ళిద్దరికీ చూపించి దీనికి మీ జవాబు ఏంటి. ఆ అమ్మాయి నిన్ను అర్ధరాత్రి హాస్టల్ కి రమ్మని చాలెంజ్ చేసింది. నువ్వు వెళ్లావు. ఈ వయసులో మీరు చేసే పనులు తప్పు కదా. చదువుకి జ్ఞానానికి పెట్టాల్సిన వయస్సు కామానికి కోరికకు పెడుతున్నారు అంది.

ఇద్దరూ తల వంచుకున్నారు.

మిమ్మల్ని చూసి ఇంకొకరు ఫాలో అవుతారు అంటూ వాళ్ళిద్దరి మీద కేసు స్టూడెంట్ కౌన్సిల్ కి రిఫర్ చేసింది.

ఇంతలో సెక్యూరిటీ ఇంకో ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చారు. వారిద్దరూ విరిసి విరిగియని మొగ్గల్లాగా ఉన్నారు. ఇంకా మేజర్ కూడా కాలేదు. సెక్యూరిటీ గార్డు రమణ శ్రీజ వైపు చూసి చెప్పాడు...

మేడం వీళ్ళిద్దరూ క్లాస్ లో పట్టుబడ్డారు. స్నేహితుడు తాళం వేసుకొని బయట నిల్చోని ఉన్నాడు. నాకెందుకో అనుమానం వేసి ఎందుకు ఇక్కడ ఉన్నావు అంటూ తాళం తీయాలని వెళ్ళగానే అతను అక్కడి నుంచి పారిపోయాడు. నా దగ్గర ఉన్న డూప్లికేట్ తాళంతో నేను తలుపు తీసి చూడగా ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకొని క్లాస్ రూమ్ లో బెంచ్ మీద పడుకొని ఉన్నారు అని చెప్పలేక చెబుతూ తలవంచుకున్నాడు.

వాళ్ళిద్దరూ టీవీ గా తల ఎత్తుకొని చూస్తున్నారు ఆమెని. ఆమె వాళ్ళ వైపు చూడగానే...

ఎంతో పౌరుషంగా ఆ అమ్మాయి చెప్పింది "మేమిద్దరం భార్యాభర్తలము".

శ్రీజ ఆశ్చర్యంగా అది ఎలాగా అంది?

నెల క్రితం మేమిద్దరమూ ఉంగరాలు మార్చుకున్నాము గుడిలో. అప్పటినుండి మేమిద్దరం భార్యాభర్తలము అంది. అబ్బాయి నిశ్శబ్దంగా తల ఉంచుకున్నాడు.

మరి మీ పేరెంట్స్ కి తెలుసా అంది?

ఆ అమ్మాయి ధైర్యంగా తలెత్తుకొని చెప్పింది మేడం... నేను ఐఏఎస్ అవుతాను బాగా చదివి. రాజు అంటూ సిగ్గుపడుతూ ఐపీఎస్ అవుతాడు. అప్పుడు మేము మా పేరెంట్స్ కి చెప్తాము.

అమ్మాయి ధైర్యానికి విస్తుపోతూ... మరి మీ పేరెంట్స్ ని పిలిపిస్తాము. ఈ మాట వాళ్లకు కూడా చెప్పండి అనగానే ఆ అబ్బాయి ఏడుస్తూ... వద్దు మేడం... ప్లీజ్ చెప్పకండి అంటూ ఉంటే ఆ అమ్మాయి మాత్రం పిలిపించండి అంది.

సిస్టంలో శ్రీజ ఆ అమ్మాయి సెమిస్టర్ క్రెడిట్ స్కోర్ చూసింది. చాలా మంచి స్కోర్ ఉంది అమ్మాయికి. అవుట్ ఆఫ్ టెన్ 9.7 ఉంది. కానీ అబ్బాయి 12 సబ్జెక్టులు ఫైల్. ఆ అమ్మాయి తన చదువు స్ట్రెస్ ని తగ్గించు కోవడానికి ఆ అబ్బాయిని పావుగా వాడుకొంటున్నది అని అర్థం అయ్యింది.

వాళ్ళిద్దరికీ కౌన్సిలింగ్ కి రెఫర్ చేస్తూ వాళ్ల పేరెంట్స్ కి ఇన్ఫోర్మ్ చేయమని రికమెండ్ చేసింది శ్రీజ.

ఇంతలో అమ్మ అంటూ అటెండర్ సావిత్రి వచ్చి రెండు చేతులు నలుపుకుంటూ నిలబడింది.

ఏం కావాలి సావిత్రి అని శ్రీజ అడగగానే....

అమ్మ 10000 ఉంటే అర్జెంటుగా సద్దండి. నెల జీతము ముందుగానే ఖర్చు అయిపోయింది. పిల్లోడు ఐఐటీలో చదువుతున్నాడు. వానికి ఫీజు కట్టాలా. వాడయ్య రూపాయి ఇవ్వట్లేదు. మేస్త్రి పనికి పోతా అక్కడ దేన్నో తగులుకున్నాడు. ఇంటికి వచ్చి రెండు నెలలు అయ్యింది. వాడి అమ్మ అయ్యను కూడా నేనే పోషించాలి. దాంతోనే కులకతా ఉన్నాడు. ఆ నా బట్టకి మేము ఏమైపోయినా పట్టలేదు....

మా ఉసురు పోసుకుని ల** కూతురు ఏమి బాగుపడుతుంది అని ఏడుస్తూ సావిత్రి మీరే సాయం చేయాలమ్మా అనగానే....

శ్రీజ అకౌంటెంట్ కి ఫోన్ చేసి డబ్బు సావిత్రి కి టెన్ థౌసండ్ అడ్వాన్స్ పేమెంట్ ఇవ్వమంది. ఆ మాట సావిత్రి కి చెప్పి పిల్లాడి చదువు కోసం ఎప్పుడు ఎలాంటి సాయం కావాలన్న అడుగు అంది . సావిత్రి సంతోషంతో థాంక్స్ అమ్మా అంటూ వెళ్ళిపోయింది.

పరమేశ్వరి ఇంతలో గబగబా శ్రీజా దగ్గరకు వచ్చి చెప్పింది... మేడం మన కెమిస్ట్రీ ఫ్యాకల్టీ సరోజ వంట గదిలో వంట చేస్తూ ఉంటే చీర కొంగుకి నిప్పు అంటుకుని 70% కాలిపోయింది. చాలా సీరియస్ గా ఉందంట. వినోదిని హాస్పిటల్లో చేర్పించారు. రండి మేడం వెళ్ళొద్దాం అంది.

కెమిస్ట్రీ ఫ్యాకల్టీ సరోజ చాలా మంచిది. అందరినీ చాలా మంచి వాళ్ళు అని నమ్మేస్తుంది. ఏమి జరిగిందో ఏమో అనుకుంటూ మేమిద్దరం వెళ్ళాం. అక్కడ హాస్పిటల్ లో ICU ముందు తన ఇద్దరు కొడుకులు బయట కూర్చొని ఉన్నారు.

మేము వెళ్ళగానే, మమ్మల్ని లోపలికి తీసుకెళ్లారు. శరీరం అంతా కాలిపోయి చర్మం ఊడిపోయి దీనాతి దీన స్థితిలో సరోజ. తనని అలా చూసి తట్టుకోలేక పోయా.

అప్పటికే ఇన్స్టంట్ జరిగి పదిరోజులు అయిందని నర్స్ చెప్పింది. సరోజ భర్త అక్కడ కనిపించలేదు.

నెమ్మదిగా సరోజ పక్కన కూర్చోని ఎందుకు ఇలా చేశావు అని అడిగాను.

చీర స్టవ్ మీద పడి కాలింది అని నెమ్మదిగా చెప్పింది.

నేను తన వైపు చూసి సరోజ అనగానే... కంట్లో నీళ్లు.

మేడం... మానసిక హింస. ఎవరికి చెప్పుకోలేకపోతున్నా. కూర్చుంటే తప్పు. నిల్చుంటే తప్పు. ఇంట్లో పని చేస్తున్నా , బయట ఉద్యోగం చేస్తున్నా... కానీ ఆడదాని బతుకుకి విలువలేదు.

నా మీద నాకు అపనమ్మకం వచ్చేసింది. ఎప్పటినుండో పిల్లల కోసం బతుకుతున్నాను. నీకు వాడికి ఏమి సంబంధం అని ఎవరో ఒకరితో నాకు సంబంధం అంటగడతాడు. సెక్సువల్ హరస్మెంట్.

ఎవడైనా నా వైపే చూస్తే చాలు వాడికి నాకు రంకు అంటగడతాడు.

నువ్వు అంత బాగుంటావు కదా అందుకే నీమీదే అందుకే అందరి చూపులు అంటాడు.

వేసుకున్న చీర విప్పదీసి వేరే చీర కట్టుకోమంటాడు.

ఏదైనా ఫంక్షన్ కి వెళ్దాం అన్నా మా అయన చెప్తేనే వెళ్లాలి.

భయం. అందుకే ఎక్కడికి వెళ్లడం లేదు.

ఏం వంట చేయాలో డిక్టేట్ చేస్తాడు. చేసిన తర్వాత నీకు ఆ మాత్రం చేత అవుతుందా. ఉప్పు ఎక్కువ లేదా కారం తక్కువ ఎదో ఒకటి అంటాడు. మీ అమ్మ నీకు నేర్పించుంటే కదా అంటాడు.

ఆ మాటలు విని విని నాకు ఏమీ చేతకాదు అనిపిస్తుంది.

తన మాటలు విని వెంటనే షిఫ్ట్ డాక్టర్ తో మాట్లాడి సైకాలజిస్ట్ ని అరెంజ్ చెయ్యమని శ్రీజ రిక్వెస్ట్ చేసింది..ముందు తనకు కావాల్సింది మానసిక బలం. తరువాత తను ట్రీట్మెంట్ కి సహకరించగలదు అని డాక్టర్ కూడా వెంటనే సైకాలజిస్ట్ ని పిలిపించాడు.

కాలేజీకి రాగానే శేఖర్ ఎదురుపడి ఆమె పక్కన ఎవరు లేనిది చూసి చాలా చిన్నగా తల వంచుకుని ఓర కళ్ళతో ఆమె వైపు చూసి "పతివ్రతా వేషాలు" అన్నాడు.

శ్రీజ ఉలిక్కిపడి అతని వైపు చూసేలోపల నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.

ఆ మాట ఆమె లోలోపలి గాయాన్ని కెలికింది.

ఆ రోజు ఇంటికి వెళ్ళగానే.... మరుసటి రోజు తన కూతురు కీర్తి పుట్టిన రోజు అని కేక్ తయారు చేయడం మొదలుపెట్టింది.

చాక్లెట్ ఫ్రూట్ కేక్...చాలా బాగా వచ్చింది.

కీర్తి నవ్వుతూ అమ్మని వాటేసుకుని మా అమ్మ అంటూ ఉంటే చింటూ మా అమ్మ అంటూ తనని కౌగలించుకున్నాడు.

అమ్మని నేను తినేస్తాను అని కీర్తి అంటే నేను తినేస్తాను అని చింటూ అంటూ అమ్మని గట్టిగా కోరికాడు.

ఇద్దరి ప్రేమను పొందుతూ శ్రీజ సంతోషంతో ఆ రోజు జరిగిన సంఘటనలను మర్చిపోయింది.

కానీ ఆ రోజు అర్థరాత్రి నిద్రలో తన గుండెలపై ఎవరో కూర్చొనున్నట్లు అనిపించి ఉలిక్కిపడి నిద్రలేసింది. వళ్ళంతా చెమట తో తడిసిపోయింది భయంతో.

కిటికీ పక్కన ఏదో నీడ. భయాన్ని పారద్రోలడానికి కిటికీ తెరిచింది. చుట్టూ చీకటి... గాఢాంధకారం. ఇంటి పక్కన ఉన్న పారిజాతం పూల సువాసన.

చెట్టు పక్కన ఏదో పాకిన చప్పుడు విని అటు చూసింది.

చీకట్లో గుచ్చి గుచ్చి చూసింది. గాలికి ఆకులు కదిలిన చప్పుడు అనుకుని కిటికీ మూసి పిల్లల పక్కన పడుకుని బలవంతగా నిద్రపోవడానికి గట్టిగా కళ్ళు మూసుకునింది.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు