ఆమె కవ్వించింది - తాత మోహనకృష్ణ

Aame kavvinchindi


"బాగా తగ్గించమంటారా సర్..? లేక మీడియం లో చెయ్యనా..?" అన్నాడు రాము
"మీడియం లో చేసి..కొంచం తల బాగా మసాజ్ చెయ్యి రాము .."
"అదేంటి సర్..ఎప్పుడూ లేనిది మసాజ్ కుడా అడుగుతున్నారు..?"
"ఏవో టెన్షన్స్ రాము..ఏం చెయ్యమంటావు..?"
"ఈ రోజుల్లో టెన్షన్స్ అందరికీ కామన్ అయిపోయాయి సర్.."
"నాకు టైం అవుతోంది..కాస్త త్వరగా చెయ్యి రాము.."
"అలాగే సర్..అలాగే కూర్చోండి...పది నిమిషాలు..అయిపోతుంది"

ఈ లోపు ఆ సెలూన్ బయట నుంచి ఒక అందమైన గొంతు..

"బాబు..! ఖాళీ ఉందా..? మా అబ్బాయికి హెయిర్ కట్ చెయ్యాలి..."
"బాబుని బయట కుర్చోపెట్టండి మేడమ్...మీరు ఒక అరగంట తర్వాత రండి..అయిపోతుంది"

ఆ అందమైన గొంతు వినగానే..మూసుకున్న కళ్ళు సడన్ గా తెరిచాడు బాలు. 'ఈ గొంతు ఎక్కడో విన్నాను...బాగా పరిచయం..' అనుకుని బయటకు వచ్చి చూసాడు. అప్పటికే ఆ అమ్మాయి వెళ్లిపోయింది. మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు బాలు. రాము తన పని చేసుకుంటూ పోతున్నాడు..

కొంతసేపటికి ఆలోచించగా.. అది తన అన్య గొంతని గుర్తొచ్చింది. వెంటనే, ఆ అమ్మాయి గురించి రాముని అడిగాడు బాలు. ఆమె కొత్తగా ఈ కాలనీ కి వచ్చిందని..డీటెయిల్స్ తెలియవని చెప్పాడు. అనన్య తో తన పరిచయం గుర్తు చేసుకున్నాడు బాలు...

*****

అప్పట్లో మేము ఒక కాలనీ లో ఇంట్లో ఉండేవాళ్ళము. మా పక్క ఇల్లు చాలా రోజులుగా ఖాళీగా ఉంది. ఒక అందమైన అమ్మాయి వస్తే బాగున్ను అని అనుకునేవాడిని. ఒక రోజు ఒక ఆటో ఆ ఇంటి ముందు ఆగింది. అందులోంచి ఒక మసలావిడ దిగింది. 'అయ్యో..! సీనియర్ సిటిజన్స్ వచ్చారా మా పక్కింట్లోకి' అని అనుకున్నాను. కొంతసేపటికి ఒక స్కూటీ మీద ఒక అమ్మాయి వచ్చి "బామ్మా..!" అనుకుంటూ మా పక్కింట్లోకి వెళ్ళింది. ఆ అమ్మాయి చూడడానికి చాలా అందంగా ఉంది. నేను ఎలాంటి అమ్మాయి కోసం కలలు కన్నానో అలాగే ఉంది. ఇలా ఆలోచిస్తుండగా..

"హలో..! కొంచం వాటర్ ఇస్తారా..? మేము పక్కింట్లోకి కొత్తగా వచ్చాము.."
"అలాగే..ఇంతకీ మీ పేరు ఏమిటో తెలుసుకోవచ్చా మిస్..?"
"అనన్య..మీ పేరు..?"
"నా పేరు బాలు.."
"ఇదిగోండి..మంచినీళ్ళు..ఇంకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి అనన్య గారు.."
"అనన్య అనడం కష్టమైతే..అన్య అనండి. నేను ఇక్కడ కాలేజీ లో జాయిన్ అయ్యాను. మా బామ్మ నాతో ఉండి..నన్ను చూసుకుంటుంది"

అలాగ..మా ఇద్దరి మధ్య పరిచయం బాగా పెరిగింది. ఎంత పెరిగిందంటే, ఎక్కడికైనా షాపింగ్ కి వెళ్ళాలంటే..నన్నే రమ్మని అడిగేది అన్య. ఒక రోజు, తన ఫ్రెండ్ పెళ్ళి కి గిఫ్ట్ కొనాలని షాపింగ్ కి రమ్మని అడిగింది. అప్పటికే సాయంత్రం అయ్యింది. అర్జంట్ అంటే, ఇద్దరమూ షాపింగ్ కి వెళ్ళాము. గంటలు గడుస్తున్నా షాపింగ్ అవలేదు. చివరికి ఒక గిఫ్ట్ కొని..బయల్దేరింది అన్య.

"ఇంకేమైనా కొన్నావా అన్య..? చాలా లేట్ అయ్యింది.." అని అడిగాను
"ఏవో కొన్నానులే..ఆడవారికి సంబంధించి. ఈ మధ్య బట్టలు టైట్ అయిపోతున్నాయి. అందుకే, కొంచం పెద్దవి తీసుకున్నాను..అంతే..! నువ్వు కుడా మీ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళావుగా.." అంది అన్య

"సరేలే అన్య.." అని అన్నాను

అన్య చూడడానికి అందంగానే కాదు..చక్కని ఫిగర్ కుడా తనది. అప్పుడే అర్ధమైంది నాకు..తను ఏం కొన్నాదో..

కొంతకాలం మా స్నేహం ఇలాగే కొనసాగింది. ఒక రోజు నేను నిద్ర లేచేసరికి..పక్కింటికి తాళం ఉంది. అన్య వాళ్ళు ఊరు వదిలి వెళ్ళారని అంతా అనుకుంటున్నారు. రాత్రి నేను అడిగినదానికి ఏమైనా ఫీల్ అయి వెళ్లిపోయిందా...అని చాలా ఆలోచించాను.

*****

"సార్..! అయిపోయింది సార్..అద్దం లో చూసుకోండి.." అని రాము మాటలతో ఈ లోకంలోకి వచ్చాను

ఇంతలో...ఆ అందమైన గొంతు మళ్ళీ వినిపించింది. వెంటనే, బయటకు వెళ్లి చూసాను. 'ఎస్'.. తనే. చూసి కొన్ని సంవత్సరాలు అయింది..మనిషి కొంచం వొళ్ళు చేసింది. అందం మాత్రం తగ్గలేదు.

"అన్యా..." అని గట్టిగా పిలిచాను. వెనుకకు తిరిగి చూసిన తన కళ్ళలో ఏదో ఆనందం కనిపించింది.

"నన్ను గుర్తు పట్టావా..ఎలా ఉన్నావు?"
"నిన్ను మర్చిపోగలనా..బాలు.."
"అన్య..! ఆ రోజు ఊరు వదిలి ఎందుకు వెళ్ళిపోయావు..?"
"ఆ రోజు మా నాన్నకు వొంట్లో బాగోలేదని అమ్మ ఫోన్ చేసి వెంటనే రమ్మంటే, వెళ్ళాము. మళ్ళీ రాలేదు. "
"ఇంతకీ ఏం జరిగింది..?"

"మా నాన్న మా బావ తో పెళ్ళి ఫిక్స్ చేసేసాడు..ఒప్పుకోకపోతే, తన మీద ఒట్టు అన్నాడు. తప్పక పెళ్ళికి ఒప్పుకున్నాను. అప్పటికే పీరియడ్స్‌ రాకపోవడంతో, టెస్ట్ చేసుకుంటే, ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది.."

"ఎలా...?"

"ఎలాగో..తమరికి తెలియదా పాపం..! ఆ రోజు షాపింగ్ నుంచి వస్తున్నప్పుడు జరిగింది గుర్తులేదా బాలు..?"

******

ఆ రోజు షాపింగ్ చేసి, తిరిగి వస్తున్న మనకు..అనుకోకుండా వర్షం రావడం తో..బస్ స్టాప్ లోకి వెళ్లి నిల్చున్నాము. అప్పుటికే, మీ ఫ్రెండ్ తో మందు తాగిన మత్తులో నువ్వు ఉన్నావు. ఉరుముకి భయపడి, నా వెనుకే నిల్చున్ననిన్ను ఒక్కసారిగా నేను గట్టిగా పట్టుకునే సరికి..నీ పెదాలతో నా పెదాలు గట్టిగా హత్తుకున్నాయి. కొత్త కావడం తో నువ్వు అస్సలు ఆగలేదు. నాకూ కొత్తగా ఉండడంతో..నేనూ నిన్ను ఆపలేదు. ఆ తర్వాత..అక్కడితో ఆగక..నువ్వు హద్దులు దాటి..నన్ను పూర్తిగా ఆక్రమించుకున్నావు. అప్పుడు నా మనసు, శరీరం నా ఆదీనంలో లేవు. జరిగిన దానిలో నీ తప్పెంత ఉందో..నాదీ అంతే ఉంది. అందుకే దీని గురించి నీతో ఏమీ అనలేదు.

******

"నువ్వు చెబుతుంటే, ఇప్పుడే కొంచం కొంచం గుర్తుకు వస్తోంది అన్య. ఆ రోజు మైకంలో ఉన్న నేను ...తడిసిన బట్టలలో నీ వొంపు సొంపులు చూడగానే..నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. నన్ను క్షమించు అన్య. ఇదంతా నాకు అస్సలు గుర్తులేదు. అయితే ఈ అబ్బాయి..??"

"అవును..నీ కొడుకే..అన్నీ నీ పోలికలే"
"మరి మీ బావ..?"
"మా బావతో పెళ్ళైన కొన్ని రోజులకే, తను యాక్సిడెంట్ లో చనిపోయాడు. నిన్ను వెతుక్కుంటూ మళ్ళీ ఈ ఊరు వచ్చాను. ఇప్పటికి నువ్వు కనిపించావు బాలు"
"నేనంటే అంత ఇష్టమా అన్య..?"

"నీతో పొందిన సుఖం..ఇంకెవరితో ఉహించుకోలేను..అందుకే మా బావను కూడా దగ్గరకు రానివ్వలేదు. జీవితాంతం నీ పక్కన చోటు..నీతో సుఖం కావాలి. ఒక్క మాటలో చెప్పాలంటే, నాకు నువ్వే కావాలి బాలు.."

"అలాగే అన్య..అని గట్టిగా వాటేసుకున్నాడు బాలు.."

********

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు