"తాతయ్యా..! బయట వేడిగా ఉన్నా..మీరు ఇక్కడ గార్డెన్ లోనే కూర్చుంటారు ఎందుకు..? ఇంటి లోపలికి వచ్చి ఏసీ లో కూర్చోవచ్చుగా..?" అని అడిగింది ఇంటిలోపల నుంచి బయటకు వచ్చిన మనవరాలు కుసుమ
"నాకు ఇక్కడే బాగుంటుంది కుసుమ..ఇక్కడ చల్లగానే ఉందిగా..పైగా ఫ్రెష్ ఎయిర్ కూడా దొరుకుతుంది.."
"ఇక్కడ ఎందుకు చల్లగా ఉంటుంది..?" అడిగింది కుసుమ
"మన గార్డెన్ లో చాలా మొక్కలు, చెట్లు ఉన్నాయి కదా..వాటి వల్ల ఇక్కడ చాలా చల్లగా ఉంది. చెట్లు ఎక్కడ ఎక్కువ ఉంటాయో అక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది.."
"ఈ మొక్కలు అన్నీ మీరే నాటారా తాతయ్య..?"
"నా చిన్నప్పుడు..ఈ మొక్కలను.. మా నాన్నగారు, నేను నాటాము. అప్పుడు నాటిన మొక్కల నుంచి ఇప్పుడు మనకి నీడ, చల్లటి గాలి వస్తున్నాయి.."
"నిజమే తాతయ్య..!"
"ఇప్పుడు మీరు గదిలో ఏసీ వేసుకుని ఉంటున్నారు. అప్పట్లో ఇన్ని సౌకర్యాలు లేవు. మా చిన్నతనం లో ఇలా బయటే గాలి కోసం కూర్చునే వాళ్ళము. కరెంటు పొతే, అందరూ గాలి కోసం బయటకే రావాలి. అందుకే, అందరం మొక్కలు పెంచాలి..చెట్లని నరకడం తగ్గించాలి. రోజు రోజుకూ వాతావరణంలో పెరిగిపోతోన్న వేడిని తగ్గించాలి.."
"అయితే, నేను కూడా ఎక్కువ మొక్కలు నాటుతాను..మా ఫ్రెండ్స్ కి కూడా నాటమని చెబుతాను.." అంది కుసుమ
*****