ప్రేమ పరీక్ష - శరత్ చంద్ర

Prema pareeksha

ఎప్పుడూ అయిదింటికే వచ్చేవాడు ఈరోజు ఆరవ్వస్తుంది ఇంకరాడెంటి అని ఎదురుచూస్తుంది రాజ్యలక్ష్మి . మీది మధ్యతరగతి కుటుంబం అని డొక్కు స్కూటర్ శబ్ధం వెక్కిరిస్తూ ఉండగా వచ్చాడు హరి. స్నానం చేసి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. టీ తెచ్చి ఇచ్చింది. కాస్త నీరసంగా ఉన్నాడు హరి, కానీ తను అది గమనించలేదు. మన పక్కింటి లక్ష్మి లేదు,పోయిన నెల పెళ్లిరోజైతే వాళ్ళాయన తనకు బంగారు గొలుసు చేయించాడంట. ఎదురింటి సరస్వతికి పోయిన వారం తన పుట్టినరోజని వాళ్ళాయన జుంకాలు చేయించాడు. అంతెందుకు మీ అన్నయ్య ఉమకు టెన్త్ అనివర్సిరీ అని ఏకంగా డైమాండ్ రింగ్ చేయించాడు. సరే ! ఇప్పుడేమంటావు! వచ్చే చిరాకుని ఆపుకొని కాస్త నిదానంగా అడిగడానికి ప్రయత్నించాడు హరి.తన చిరాకును గమనించి ,నేనేమంటాను, ఊరికే అలా కాలక్షేపానికి చెప్తున్న అంటూ మాట మార్చేసింది. హరి,రాజ్యలక్ష్మి ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ల ప్రేమని రెండు కుటుంబాలు ఒప్పుకోలేదు. ఎవరి కారణాలు వాళ్లకు ఉన్నాయి.. హరి వాళ్ల నాన్న స్టీల్ మరియు సిమెంటు వ్యాపారం చేస్తాడు. బాగానే సంపాదించాడు. తన తండ్రి తరువాత ఆ వ్యాపారం చూసుకోవాల్సింది తానే అని ,లక్ష్మిని నేను చాల బాగ చూసుకుంటానని లక్ష్మి వాళ్ల తల్లి తండ్రులకి ఎన్నో విధాల చెప్ప ప్రయత్నించాడు హరి. కానీ వాళ్ళు దేనికీ ఒప్పుకోలేదు. లక్ష్మి వాళ్ల అమ్మకి తన మేనల్లుడిని ఇచ్చి చేయాలని కోరిక ఉండడమే దానికి కారణం.ఈ కాలేజీ ప్రేమలు ఎక్కువ రోజులు నిలవవని అది కేవలం ఆ వయసు లోని ఆకర్షణ మాత్రమే అని వాళ్ళ తనను తాను సమర్థించుకునేది. లక్ష్మి కి కూడా అదే విషయాన్ని ఎన్నో సార్లు చెప్పింది. కానీ తను ఆ మాటల్ని నమ్మలేదు. తరువాత హరి వాళ్ళ నాన్నను ఒప్పించడానికి ప్రయత్నించారు.నేను తెచ్చిన సంబంధం కాకుండా తనకు నచ్చిన వాళ్ళని చేసుకున్నాడని హరి వాళ్ల నాన్నకు పట్టింపు. నా నిర్ణయం పైన గౌరవం లేనివాడికి నా ఇంట్లో చోటు లేదని తన ఆస్తి మొత్తం తన చిన్న కొడుక్కే రాసిస్థానని అన్నాడు. ఆ మాటకు పౌరుషంతో ఇంట్లో నుండి బయటకు వచ్చేసాడు హరి. ఒక wholesale వ్యాపారం లో అకౌంటెంట్ గా చేరాడు. నెలకు పదమూడు వేలు జీతం.ఆదాయం విషయం పక్కన పెడితే కొన్ని సార్లు ఉన్న జీతం కూడా ఖర్చులకి సరిపోయేది కాదు.లక్ష్మి కూడా ఎదైన ఉద్యోగం కోసం వెతుకుతుంది. ఇద్దరూ ఒక కొత్త జీవితాన్ని శూన్యం నుండి మొదలు పెట్టారు. రాత్రి ఎనిమిదయ్యింది. హరి నేను ఇప్పటికిప్పుడు కొత్త చీర కొంటానంటే నీ రియాక్షన్ ఏంటి ? అన్నం వడ్డిస్తూ అంది. నా రాజీ అలాంటి పిచ్చి పనులు చేయదు అన్నాడు హరి నవ్వుతూ. ఒకవేళ చేస్తే ? హరి మొహంలో రంగులు మారాయి. కొంపదీసి కొనేశవ ఏంటి ? ఆదుర్దాగా అడిగాడు. కొత్త చీర కొని చాలా రోజులయ్యింది కదండీ అందుకే.. సరే ఎంతయ్యింది ? ఎంతా ఏం లేదండీ జస్ట్ పదమూడు వేలు.పద్దెనిమిది వేలంటా, ఫిల్పకర్ట్ లో ఆఫర్ లో వచ్చింది అని తీసేసుక్కున.అంత డబ్బేకడిదే, దాదాపు అరిచేసాడు హరి. దేవుడి పటాల వెనుక పోయిన వారం ఉంచారు కదా. చెంప చెళ్లుమన్నది. నాకు ఒక్క మాటైనా చెప్పాలని తెలియదా ? గట్టిగా అరిచాడు.లక్ష్మీకి కూడా కోపం వచ్చింది. ఇన్ని రోజులూ అడిగే తీసుకుంటున్నాన? అంటూ వడ్డిస్తున్నా గరిటను టేబుల్ పైన విసిరేసింది.అది కాస్త సాంబారు పాత్రకు తగిలి వేడివేడి సాంబార్ హరి చెయ్యిని కాల్చేసింది. హరి చేతికి మందు రాస్తుంది లక్ష్మి. ఇద్దరూ చిటపటలాడుతున్నరు. కాలేజీలో నా వెంట తిరిగేటప్పుడు ఎన్ని మాయ మాటలు చెప్పావ్. నీ కోసం ఆకాశంలో చంద్రుణ్ణి సైతం తీసుకొస్తా, నీ కష్టానికి నెన్నడ్డు నిలబడతా అంటూ అన్నీ బూటకపు మాటలు నమ్మి చేసుకున్నా నిన్ను. అప్పటికి మా అమ్మ చెప్పింది వద్దే వద్దే అని నేనే వినిపించుకోలేదు. నువ్వేమైనా తక్కువ తిన్నావా, అప్పట్లో ఎంత అణకువగా ఉందేదానివి.నోట్లో నాలుకలేని దానిలాగ. రాజి చాలా అందంగా ఉన్నావు అన్న చిరున్నవే, నడ్డిముక్కు దాన అని తిట్టినా చిరునవ్వే. ఆ నవ్వు చూసే మోసపోయి చేసుకున్నానే నేను. నువ్వింత గయ్యలిగా మారుతవని నేనేమైనా కల కన్ననా అంటూ సమర్థించుకున్నాడు హరి. ఆ మాటకు లక్ష్మి పెదవులపై మళ్ళీ చిరునవ్వు మెదిలింది. కాసేపాగి ఎప్పుడో ఆర్డర్ పెట్టాను,రేపే డెలివరీ వస్తుందండి, తీసుకుంటానండి. ఏం పర్వాలేదు, ఆర్డర్ కేన్సిల్ చేసి తిప్పి పంపించేయి. చేతికి రాస్తున్న ఆయింట్మెన్ట్ ఒక్కసారిగా పక్కకి విసిరేసి, అటు వైపుకు తిరిగి పడుకుంది. హరి కూడా మళ్ళీ ఏం మాట్లాడలేదు. రాత్రాస్సలు నిద్ర పట్టలేదు.అంత కోపమెందుకో ఒక్క చీరె కదా. పెళ్లికి ముందు నేనేం అడిగిన కాధనేవాడు కాదు.ఇప్పుడేమో ఒక్క చీరకే ఇంతంగా విసుక్కున్నాడు.అమ్మ చెప్పినట్టుగా ఈ కాలేజీ ప్రేమ ఎక్కువ రోజులు నిలవదా ? హరికి నా మీద ప్రేమ తగ్గిపోతుందా . ఛీ ఛీ నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను .హరికి తెలిస్తే బాధపడతాడు.నాతో ప్రతి విషయం పంచుకుంటాడే మరి ఆ డబ్బు గురించి ఎందుకు చెప్పలేదు? ఎదైన అవసరం కోసం దాచుంటాడు. ఆఫీస్ లో ఈ మధ్య పని ఒత్తిడి చాలా పెరిగిందన్నాడు. అయిధుమంది పని తానొక్కడే చేస్తున్నాడు అని చెప్పాడు. బహుశా ఆ ఆలోచనలోనే మర్చిపోయింటాడు.నేనే ఏం తెలుసుకోకుండా కర్చుపెట్టేశాను. అయినా కొనేముందు ఒకసారి తనకు చెప్పి ఉంటే ఈ తగువంత ఉండేదే కాదు. టిఫిన్ చేసేటప్పుడు క్షమించమని అడుగుతా అని వంట చేస్తూ ఆలోచించింది లక్ష్మి. అనవసరంగా రాజీని కొట్టాను. ఎంత బాధ పడిందో ఏమో. అయినా నాకెందుకంత కోపం, ఈ మధ్య నాకు మరీ చిరాకు పెరిగిపోతుంది. మహారాణిలా చూసుకుంటాను అని మాటిచ్చను. ఇప్పుడేమో ప్రతి విషయానికి విసుకుంటున్నాను.తన మీద నాకు ప్రేమ తగ్గిపోయిందని అనుకుంటుందేమో. లేదు,లేదు.నా రాజీ ఎన్నటికీ అలా అనుకోదు. తనకు నేనంటే చాల ప్రేమ.రాత్రి నా చెయ్యి కాలేసరికి,ఎంత కన్నీరు పెట్టుకుంది. పాపం.నిజంగా తను నాకు దొరకడం నా అదృష్టం. వెంటనే వెళ్ళి క్షమించమని అడగాలి అనుకుంటూ త్వర త్వరగా స్నానం చేసాడు. వంట గదిలోకివెళ్ళడు హరి. లక్ష్మీ వంట చేస్తుంది. దగ్గరికి వెళ్ళాడు.నన్ను క్షమించు రాజీ.రాజీ ఐయాం సారీ.కనీసం నా వైపు చూడనైన చూడవా అంటూ తన వైపు తిప్పుకున్నాడు. చాలా రోజుల నుండి స్కూటర్ బాగా విసిగిస్తుంది మన రవి లేడు వాడు e మధ్యే కొత్త బండి కొన్నాడు . వాడి స్కూటర్ అమ్ముతనాన్నడు. నా ఫ్రెండ్ కాబట్టి పదిహేను వెలకే ఇస్తానన్నాడు. దానికోసం వుంచాన డబ్బు. తప్పంతా నాదే ఆ డబ్బు గురించి నీకు ముందే చెప్పుంటే నువ్విలా చేసేదానివి కాదని నాకు తెలుసు.అనవసరమైన కోపంతో కొట్టాను.ఇంకెప్పుడు నీ పై చేయిచేసుకోను. అంటూ గద్గద స్వరముతో కంటతడితో తన చెంపను తాకుతూ అన్నాడు. తప్పంతా నాదే హరి. నీకెన్నేనో పనులుంటై అన్ని నాకు చెప్పాలా ఏంటి.నేనే నిన్ను అడిగి ఉంటే సరిపోయేది. అంటూ హరి కన్నీళ్లు తుడుస్తూ నాకే చీర వద్దు.ఈ చిన్న చిన్న విషయాలకు మన మధ్య ఇంకెప్పుడు గొడవలు రాకూడదు అంటూ తనను హత్తుకుంది లక్ష్మీ. సాయంత్రం సిధ్ధంగా ఉండు. బయటకెల్దం. మనం సరదాగా గడిపి చాలా రోజులవుతుంది. రేపటి మన పెళ్లి రోజుకి ఈరోజు సాయంత్రం నుండే సెల్బరేషన్స్ మొదలుపెడదాం సరేనా. ఎక్కడికి వెళ్తున్నాం ఆతృతగా అడిగింది. సర్ప్రైజ్. కనీసం ఎన్నింటికి , అధైన చెప్పు. అయిదింటికి సిధ్ధంగా ఉండు. తయారయ్యి సిధ్ధంగా ఉండి ఎప్పుడొస్తాడా అని వరండా లో అటు ఇటు తిరుగుతూ ఎదురుచూస్తుంది లక్ష్మీ. అయిదు దాటి ఆరయ్యింది. ఏడయ్యింది. ఇక రాడు అని విసుక్కుంటూ లోపలికి వచ్చింది. ఏడున్నరకు ఇంటికొచ్చాడు హరి. కనీసం ఈ రోజు కూడా త్వరగా రాలేవా ? నీ కోసం ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా అంటూ కోప్పడింది లక్ష్మీ. కాని అతను చాలా అలిసిపోయినట్లు కనిపించాడు, వచ్చి మంచంపై కూర్చున్నాడు. వెంటనే తన పక్కకెల్లి కూర్చుంది లక్ష్మి. తన భుజంపై వాలి కునుకు తీశాడు. లక్ష్మి ఇంకేం మాట్లాడలేదు. హరి నీ తన ఒళ్ళో పడుకోపెట్టుకున్నది. తనకు కూడా నిద్రపట్టేసింది. రాత్రి పదకొందింటుకి మెలుకువ వచ్చింది హరికి. అలసట తగ్గింట్టనిపించింది. లక్ష్మీ నిద్రపోతుంది. డిన్నర్ కి తీసుకెళ్తా అని చెప్పా ఇప్పుడేమో ఇలా కాలి కడుపుతో నిద్రపోయే చేశాను అనుకుంటూ కిచెన్లోకెళ్లాడు. రాజీకి ఎంతో ఇష్టమైన చైనీస్ రామెన్ నూడుల్స్, వైట్ సాస్ పాస్తా అరగంటలో తయారు చేశాడు. ఫ్రిజ్లో ఉన్న ఐస్క్రీం పైన దానిమ్మ ద్రాక్ష పండ్లను కోసి ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్లో మూడింటిని సిద్ధం చేశాడు. కాని లక్ష్మీకి ఇదంతా నచ్చుతుందో లేదో అని దిగులుగానే ఉన్నాడు. హరి మెల్కున్నప్పుడే లక్ష్మీకి కూడా మెలుకువ వచ్చింది. హరి ఏం చేస్తున్నాడో అని నిద్ర నటిస్తూ మొత్తం గమనిస్తుంది. రాజీ లే డిన్నర్ చేద్దాం అంటూ తట్టి లేపాడు. తను కూడా అప్పుడే మెల్కున్నట్టుగా లేచింది. నన్ను క్షమించు రాజీ ,e రోజు త్వరగానే వద్దాం అనుకున్న కాని రాలేకపోయను. రేపు కచ్చితంగా వెళ్దాం అంటూ తప్పు చేసిన గిల్టీ ఫీలింగ్ తో నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. టేబుల్ పై అన్నింటినీ సర్ధాడు. ఇద్దరూ కూర్చున్నారు. సడెన్ గా కరెంట్ పోయింది. టేబుల్ పైన కొవ్వొత్తి వెలుగులో లక్ష్మి నవ్వుకుంటూ కనిపించింది. క్యాండిల్ లైట్ డిన్నర్ అంటూ నవ్వుతూ చూసింది లక్ష్మీ. హరి కళ్ళు చెమ్మగిల్లి ఉన్నాయి.రాజీ నువ్వు నన్ను ప్రేమించి నన్ను నమ్మి మీ కుటుంబాన్ని కూడా వదిలి నాతో వచ్చేసవ్ కాని నేను నిన్ను సంతోషంగా చూస్కొలేక పోతున్నాను.రాజీ నన్ను క్షమిస్తావ ? అబ్బబ్బబ్బా ఇక ఆపుతావా ని సారి దండకం. మంచి సమయాన్ని పాడు చేస్తున్నావ్. కొద్ది సేపు ఆగి మళ్ళీ చెప్తుంది లక్ష్మి. అయినా ఇప్పుడేమయ్యింది. డిన్నర్ కి తీసుకెళ్లాలేకపోయనాన ? నాకోసం నువ్వు కష్టపడి చేసిన వంటల కంటే అక్కడేం అంత రుచిగా ఉండదు. ఏ ఫైవ్ స్టార్ట్ హోటేల్లోనైన ఇంత మంచి సమయం,ప్రైవసీ మనకు దొరకవు. అసలు నువ్వు నాకోసం ఈ రాత్రి మేలుకొని ఇంత చేయడమే నాకు చాలు. నువ్వు నాతో గడిపే ఈ సమయమే నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. నేను చెప్తున్నాను" యూ ఆర్ తీ బెస్ట్ హస్బెండ్." కనీసం నీకొక చీరకూడ కొనలేక పోయనే నేనెలా.. అబ్బబ్బా అసలిదంత ఆ దిక్కుమాలిన చీర వల్లే వచ్చింది. నాకిప్పట్లో ఏ చీర వద్దు. ఇక దాని విషయం మర్చిపో. హరి నవ్వుతూ చూశాడు. తన తెచ్చిన కవర్లో నుండి చీర తీసి లక్ష్మి చేతికిచ్చాడు. లక్ష్మి కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోయాయి. మరి ఆ డబ్బు ? అంటూ ప్రశ్నార్థకంగా చూసింది. స్కూటర్ కి ఎప్పుడొచ్చినా తోందరెం లేదులే ఇంకో అయిధారునెల్లు అయ్యాక తీసుకుందాం అని అన్నాడు. హరి తనపై చూపించిన ఆ ప్రేమకు తన కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ మాత్రపు కన్నీటిని కూడా మోయలేక హరి గుండెలపై వాలి పోయింది లక్ష్మీ. గడియారం పన్నెండు కొట్టింది. ఈ ప్రేమ పరీక్షకు మూడేళ్ల ప్రాయం నిండింది.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు