స్విస్ (ఓ! మంచి మత్తు) - MS

Swis (o manchi mattu)

ఫోన్ మోగింది! ఎత్తి హలో అనేలోపే, అక్కా..! తొందరగా క్రిందకు రా అని ఫోన్ కట్ చేశాడు. తొందరగా లేచి, తలుపు తెరిచి బయటకు వెళ్ళాను. కంగారుగా నా చేతులు పట్టుకుని sorry అక్కా, వెరీ వెరీ అనేసాడు. అంతే కంగారుగా, విషయం ఏమిటి ముందు చెప్పు రా అనంగానే, కార్ డోర్ తెరచి చూయించి, ఇదీ అనేశాడు అంతే టెంషన్ గా. చూడగనే విషయం తెలిసింది. తిన్నగా మా వాడి చెవి మెలేసి, ఇదా రా?? మీ బ్యాచిలర్ పార్టీ? అని కోపడ్డాను. బిక్కు బిక్కు మంటూ, నిలుచుని వున్నాడు. సరే, నువ్వు వెళ్లు. అక్కా రియల్లీ వెరీ సారీ. పార్టీ లో,నేను పక్కకు వెళ్ళాను, నాకు తెలియకుండానే స్విస్ చాక్లెట్ తినిపించేశారు ఆకతాయిలు. అపరాధంగా తలొంచుకున్నాడు వాడు. నేనేం వినిపించుకోకుండా, కార్ వెనుక సీట్లో ఉన్న వారిని క్రిందకు దించి, పట్టుకున్నాను జాగ్రత్తగా. సాయం పట్టన అక్కా అంటూ దగ్గరగా వచ్చాడు. కోపంతో చూసిన చూపుకు అక్కడే ఆగిపోయాడు. ముందుకు నడుస్తూ మెట్లు ఎక్కుతూ ఉంటే, వెక్కుతూ ములుగే శబ్దం విని, చేతితో దగ్గరకు రమ్మని సైగ చేశా. అదాటున వాడు నా కాళ్ళు పట్టేసుకుని సారీ అక్క అంటూ బావురు మన్నాడు. మన్నించేసి, ఇప్పుడు నువ్వు వెళ్లు, మిగిలినవన్నీ తర్వాత అనేసి, వాడిని పంపించేసా. మెట్లు ఎక్కుతూ ఉంటే, వీరి సనుగుడు, అది మరీ అంటూ... ష్...! మెల్లగా.ఎమ్ మాట్లాడకుండా రండి అంటూ మేడ పై, ఇంటిలోనికి చేరుకున్నాము. గదిలో మంచెం పై కూర్చోబెడుతూ, కదలకుండా ఇక్కడే ఉండాలి అని చెప్పేసి, బయటకు వచ్చి పక్కనున్న గదిలోకి తొంగిచూసా. అందరూ గాఢంగా నిద్రోతున్నారు. హమ్మయ్య అనుకుని, వంటింట్లోకి వెళ్లి గ్లాస్ పట్టుకుని గదిలోకి వెళ్లా. మంచెం పైనే అలానే కూర్చున్నారు. అసంకల్పితంగా నవ్వు వచ్చేసింది నాకు. తేరుకుని దగ్గరకు వెళ్లి, మూర్తీ గారు పటండీ తాగండి అంటూ గ్లాస్ నోటికి అందించా. మత్తులోనే, కళ్ళు రెండూ మూసి తెరుస్తూ, ఏంటిది అనేశారు. తాగాలి, అంటూ ముక్కు ముసేసా, గడ గడ గోల చేయకుండా తాగేశారు. గ్లాస్ పక్కన పెట్టి, కళ్లదాలు తీసి మడత పెట్టి టేబుల్ పై పెట్టి, కాసేపు కూర్చోండి కదలకుండా అని, వెళ్లి గీసర్ ఆన్ చేసి వచ్చాను. వచ్చేలోపే తూగుతూ, మరి నేనూ అంటూ చేతులు గాలిలో తిప్పుతూ, చుక్కలు లెక్కపెడుతున్నారు శ్రీ వారు. సరే, ఇప్పుడు మాట్లాడ కూడదు అన్నమాట. స్నానము చేసి తర్వాత హాయిగా నిద్రపోండి సరేనా కాలి షాక్స్ తీస్తు అన్నా. నువ్వు నాతో నే ఉంటావు గా?? అంతే అమాయకంగా ఆడిగేసారు మూర్తీ గారు. పెళ్లి చూపులో తాగిన కాఫీ కప్ తీసుకుని క్రిందకు వెళ్తుంటే, అలానే అడిగేసారు.అప్పటికి ఇప్పటికి ఏమాత్రం మారలేదు మూర్తీ గారు. తలచుకోగానే చిరు సిగ్గు ముంచుకొచ్చేసింది. గతం చాలా త్వరగా పన్నెండేళ్ళ జ్ఞాపకాలను ఇట్టే కరిగించించేసింది. పైగా మాతో పాటు మా అమ్మాయిని తోడుగా నింపింది మా కనుల పండుగలా. గీసర్ ఆఫ్ చేసి నీళ్లు చెక్ చేసి వచ్చాను. బాగా కాగాయి, ఈ మాత్రం వేడి పడాల్సిందే, ఆ మాత్రం దోషానికి! ఇంత కోపంలోనూ, అల్లరి చేయాల్సిన పని ఏంటో ఈ బారెడు జడ కు. విస్సుగా వెనక్కు వేసి, మూర్తీ గారి వైపు నడిచి, "రండి మూర్తీ!" గారు మీ స్విస్ బాత్! కాస్త కోపం, ఆ వెంటనే నవ్వు. వింతైన సంఘటన మరి నాకు. తలoట వేడి నీళ్లు పడి పడంగానే, ఉలిక్కి పడ్డారు. పాపం, వేడి నీళ్లు అలవాటు లేదు మరి మా మూర్తిగారికి. తప్పలేదు నాకు.తప్పు కూడా కాదు గా!!. స్నానం ముగిసింది. ఇఖ నిద్రే తరువాయి. తల బాగా తుడిచి హెయిర్ డ్రయిర్ పెట్టా, అలవాటు లేని పని మరి మూర్తీ గారు చేయి అడ్డు పెడుతూనే ఉన్నారు. విదిలించేస్తూ ఆ ఉన్న క్రోఫ్ ను తుడవడానికి అబ్బాబా, నాకు విసుగొచ్చింది. నిజంగానే అండీ, నమ్మేరు కాదు మీరు. ఇఖ ఆ తర్వాత అని అడక్కండి. మా మూర్తీ గారి మాటలు హమ్మో! ఇంత ప్రేమ!, ఇన్ని మాటలు లోలోన ఉన్నాయా అనిపించింది ఆ రోజు. బుద్దిగా వుండే నా ఏమండీ గారేన అనిపించింది నాకు. అన్నట్టు మత్తులో మాటలన్నీ నిజాలే అని విన్నాను. మరి నేను విన్నది నిజమే అంటారా?? ఏమో మరి. ఆ... ఆ... అలా మీలో మీరే నవ్వేసుకుంటూ ఉంటే ఎలా, రేపు ఉదయం మా తమ్ముడిని పెళ్లి కొడుకును చేస్తున్నాము. మీరూ వచ్చేయండి. అక్కడ చెప్పుకుందాం మన కబుర్లు. ఏమంటారు? ఉంటానే, మూర్తీ గారి శయన సేవ మిగిలి ఉంది. మనలో మన మాట, ఆ మాటలు మహ బాగా ఉన్నాయండి. ఇదో బ్యూటిఫుల్ మెమరీ! ముఖ్యంగా నాకు. ఇంతకూ, నేనెవరో చెప్పలేదు కదండీ, వసుధ శ్రీమతి వసుధ మూర్తీ.

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ