అనుభవం నేర్పిన పాఠం! - - బోగా పురుషోత్తం

Anubhavam nerpina patham

శింగరాయ కొండను శీనప్ప పాలించేవాడు. శీనప్పకు నల్గురు కుమారులు వుండేవారు. వారికి విద్యా బుద్ధులు నేర్పడానికి గురుకులంలో చేర్చాడు.
కొన్నాళ్ల తర్వాత శీనప్ప కొడుకులు విద్య ఎంతవరకు వచ్చిందో చూద్దామని కురుకులానికి వెళ్లాడు. అయిఏ మార్గమధ్యంలో రాజుకు ఊహించని వింత అనుభవం ఎదురైంది. తన రాజ్యంలో ఇన్ని దారుణాలు జరుగుతున్నాయా? వాటిని అరికట్టలేకపోతున్నానా?’ అని విస్తుపోయాడు రాజు. రాజు పక్కనే వున్న మంత్రి సైతం ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు.. చెబితే రాజ్యం పరువు పోతుంది..!’’ అని తనలోనే దాచుకున్నారు.
తెల్లవారే సమయానికి గురుకులానికి చేరుకున్నారు. అక్కడ కూడా రాజు నిర్ఘాంతపోయే నిజాలు వెలుగు చూశాయి. గురుకుల అధిపతి వీరయ్య తన విలువిద్యను అందరికీ సమానంగా బోధిస్తున్నాడు. అయితే రాజుగారి కుమారులకు ఆ విద్య వంటపట్టలేదు. ఈవిషయాన్ని గురుకులాధిపతి స్వయంగా రాజుకు విన్నవించాడు.
రాజుకు గురుకులాధిపతి మాటల్లో నిజం గోచరించలేదు. కాసేపు అతని వైపే తేరిపార చూశాడు.
ఆ చూపునకు గురుకులాధిపతి తటపటాయించాడు. ఇక ఆలస్యం చేస్తే తన ఉనికికే ప్రమాదం వుందని గ్రహించాడు రాజు. వెంటనే గురుకులం కుటీరాన్ని క్షుణ్ణంగా పరిశీలించాడు. అక్కడ పెట్టె, ఇనుప ట్రంకు పెట్టె వున్నాయి. అనుమానం వచ్చి వాటిని తెరవాలని కోరాడు.
గురుకులాధిపతి నీళ్లు నములుతూ ‘‘ అందులో ఏమీ లేదు ప్రభూ.. ఏమీ లేదు ప్రభూ..!’’ అంటుంటే అతని శరీరం భయంతో వణకడం కనిపించింది.
అప్పటికే రాజుగారి నల్గురు కుమారులు అక్కడికి వచ్చారు. వారిని చూపుతూ ‘‘ ప్రభూ నీ కడుపున పుట్టారే కాని..ప్రయోజనం లేదు.. ఒక్కరికీ విలువిద్య వంటపట్టలేదు..పైగా నీ వారసులుగా వారికి ఏ మాత్రం అర్హత లేదు..’’ అని హేళన చేశాడు ‘‘ దొంగతనాలు కూడా చేస్తున్నారు ప్రభూ..’’ అని ఫిర్యాదు చేశాడు గురుకులాధిపతి.
రాజు శీనప్పకు గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లయింది. ఆ మాటను దిగమింగుకుని గురుకులాధిపతి మాటల్లో ఆంతర్యం ఏమిటా?’’ అని దీర్ఘంగా ఆలోచించాడు. అదే సమయానికి తన నల్గురు కుమారులను చూస్తుంటే విలు విద్యలో నిష్ణాతులైన వారిలా కనిపిస్తున్నారు. వారి ముఖాల్లో రాజ్య పాలనాధ్యక్ష తేజస్సు ఉట్టిపడుతోంది. అంతా గ్రహించాడు రాజు.
గురుకుల గురువు దగ్గరకు వెళ్లి ‘‘ సరే...మీరు చెప్పినవన్నీ నిజమేనని నమ్మి వెళుతున్నాం..వచ్చే విజయదశిమికి నాకుమారులలో అర్హుడైన వ్యక్తిని పట్టాభిషిక్తుడ్ని చేయాలనుకుంటున్నాను..వెంటనే అర్హులెవరో తేల్చండి..’’ అని ఆదేశించి అక్కడి నుండి వెళ్లిపోయాడు రాజు.
ఆరు నెలలు గడిచాయి. శింగరాయ కొండలో ముసుగు దొంగలు ఎక్కువయ్యారు. రాజు శీనప్ప అలజడికి కారణమెవరో అర్థం కాక బుర్రగోక్కున్నాడు. రహస్య గూఢచారులను నియమించినా కనుక్కోలేకపోయారు. చివరకు మంత్రి నిఘా వేశాడు.
ఓ రోజు రాజ్యంలో మారు వేషంలో సంచరిస్తుండగా ఓ ముసుగు ధరించిన వ్యక్తి మంత్రిపై దాడి చేశాడు. మంత్రి తేరుకోలేని దెబ్బకు కింద పడ్డాడు. అంతలోనే బలం కూడగట్టుకుని అతనివెనుకే పరిగెత్తాడు. వేగంగా పారిపోతున్న ముసుగు వ్యక్తి రాజుగారి పెద్ద కుమారుడి మాస్క్‌ విసిరి పారిపోయాడు.
అది తీసుకుని రాజు వద్దకు వెళ్లాడు. ‘‘ ఇది ఆ గురుకుల గురువు పనే అయివుంటుంది ప్రభూ..!’’ అన్నాడు.
రాజు ‘‘ నిస్సందేహంగా ఇది ఆ గురుకుల గురువు పన్నిన పన్నాగమే ..పదండి త్వరగా అతని అంతు చూద్దాం..’’ అని సైన్యాన్ని అప్రమత్తం చేశాడు రాజు.
ఏదో పనిలో వున్న గురుకుల గురువు తన వద్దకు వస్తున్న రాజును చూసి ముచ్చెమటలు పడ్డాయి. భయాన్ని లోనే దాచుకుంటూ తడబడుతూ రాజు వద్దకు వెళ్లాడు.
అతని భయాన్ని పసిగట్టిన రాజు ఇనుపపెట్టె వద్దకు వెళ్లి తెరిచాడు. తన ఊహ నిజమైంది. పెట్టె నిండా తన నలుగురు కుమారుల ముఖాల మాస్క్‌లు వున్నాయి.
ఇన్నాళ్లు అతని కొడుకుల ముఖాలు రూపంలో వున్న మాస్క్‌లు ధరించి దొంగతనాలు చేసిన సంగతి తెలిసిపోయిందని గ్రహించాడు గురుకుల గురువు.
అక్కడి నుంచి పరుగు పెట్టి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు గురుకుల గురువు.
ఇది గమనిస్తున్న రాజు గారి పెద్ద కొడుకు అక్కడికి వచ్చాడు.. అప్పటికే అనుభవం కలిగిన కత్తి సాముతో గురుకుల గురువును చాకచక్యంగా చేతితో పట్టుకున్నాడు. వెనుకనే వచ్చి ముగ్గురు కుమారులు తమ అనుభవ విలువిద్యతో గురుకుల గురువును బాణాలు సంధించి బంధించారు.
అప్పటికే ‘‘ భళా..భళా..కుమారులూ తండ్రికి తగ్గ తనయులు అనిపించుకున్నారు..రాజ్యంలో సృష్టించిన అరాచక శక్తులను చాకచక్యంగా పట్టుకున్నారు..ఇక నేను నిశ్చింతగా నిద్రపోతాను..ఇలాంటి వారి ఆటలు కట్టించి ప్రజల్లో ఆనందం నింపండి..’’ అన్నాడు రాజు శీనప్ప.
అప్పటికే వారి అనుభవం తనకు చక్కని గుణపాఠం నేర్పిందని గురుకుల గురువు వీరయ్యకు అర్థమయ్యింది. తాను రాజ్యంలో అలజడి సృష్టించి ప్రజల్లో తిరుగుబాటు తీసుకొచ్చి పాలనాధ్యక్షుడు కావాలని పన్నిన పన్నాగం బెడిసి కొట్టింది. తన దురాలోచనలతో తన గురుకుల గౌరవాన్ని మంటగలిపాడు. జీవితాంతం చెరసాలకు బందీ అయ్యాడు.
గురుకులంలో అనుభవవం నేర్పిన పాఠంతో రాజ కుమారులు పాలనా బాధ్యతలు చేపట్టి రాజ్యానికి ఏ సమస్యా రానివ్వకుండా ప్రజారంజకంగా పాలించ సాగారు.

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి