మా ఆయన గ్రేట్ - తాత మోహనకృష్ణ

Maa aayana great


"ఏమండీ..! వంట అయ్యిందా..?" అడిగింది కాంతం

"ఈ రోజు ఎందుకు అంత తొందర..?"

"మొన్న మాటల్లో, మా ఫ్రెండ్స్ కి మీరు వంట బాగా చేస్తారని చెప్పాను..అంతే..! మా కన్నా వంట బాగా చేస్తారా మీ ఆయన? అని మన ఇంటికి వస్తానన్నారు. కొంచం రుచిగా చేసి, నా పరువు కాపాడండి.."

"నేను వంట చేస్తానని అందరితో చెప్పినప్పుడే మన పరువు పోయింది..ఇంకా ఏమిటి కొత్తగా పోయేది..?" అన్నాడు సుబ్బారావు

"ఈ రోజుల్లో ఎంత మంది మగవారు వంట చెయ్యట్లేదు..చెప్పండి..! అందరూ మీలాగే అనుకుంటారా ఏమిటి..? కాకపోతే, అందరికంటే, మా ఆయన గ్రేట్ అని అనిపించుకోవాలనేదే నా తాపత్రయం..అంతే!"

'నా బతుకు ఇలా తయారైంది ..ఏం చేస్తాం..?' అనుకున్నాడు సుబ్బారావు

ఈ లోపు కుక్కర్ పెట్టి, కూర్చున్నాడు సుబ్బారావు..గతం కళ్ళ ముందు కనిపించింది...

"ఒరేయ్ సుబ్బు..! మనం వెళ్ళేది పెళ్ళిచూపులకి.. అక్కడ అమ్మాయి తో సరిగ్గా మాట్లాడు. ఏం అడిగినా పాజిటివ్ గా సమాధానం చెప్పాలి..అప్పుడే అమ్మాయికి నచ్చుతావు.."

"అలాగే అమ్మా..నువ్వు చెప్పినట్టే చేస్తాను.." అన్నాడు సుబ్బారావు

పెళ్లిచూపులలో...

"నేను చేసిన స్వీట్ ఎలా ఉందో చెప్పనేలేదు..?" అని అడిగింది అమ్మాయి.. విడిగా అబ్బాయితో బాల్కనీ లో

"ఇంకా కొంచం పంచదార వేసుంటే, బాగుండేది..అయినా బాగుంది లెండి.."

"మరి నేను పెట్టిన కాఫీ..?"

"కొంచం డికాషన్ పల్చనైంది అంతే..! అయినా చక్కగా ఉంది.."

"ఇంతకీ నేను మీకు నచ్చానా..?" అడిగాడు సుబ్బారావు

"మీరు బాగున్నారు..నచ్చారండి.."

'పెళ్ళి జరిగిన తర్వాత తెలిసింది.. నన్ను ఎందుకు 'ఓకే' చేసిందో మా ఆవిడ. సండే వంటింట్లో డ్యూటీ అంతా నాదే. స్కూల్ నుండి మధ్యాహ్నం ఇంటికి వచ్చాక, రాత్రి వంట నాదే. వేసవి సెలవులైతే, నా మకాం అంతా వంటింట్లోనే. స్కూల్ లోనే హ్యాపీ గా ఉండేది..పిల్లలు అల్లరి చేసినా సరే..' అనుకున్నాడు సుబ్బారావు

స్కూల్ మాస్టర్ గా ఇప్పుడే రిటైర్ అయిన తర్వాత...వంటిల్లే నా రూమ్ అయిపోయింది. పెళ్ళాం మహిళా మండలి ప్రెసిడెంట్..ఎప్పుడూ ఇంట్లో మహిళలే, పార్టీలే..' అని అనుకుంటుండగా కుక్కర్ కూతతో ఈ లోకంలోకి వచ్చాడు సుబ్బారావు..

********

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి