తెల్లవారితే శనివారం. ఇంటికి వెళ్ళిపోయి అమ్మ చేతి వంట తినాలని ఆశ గా రిక్తహస్తలతో నిద్రలోకి జారుకున్నాడు అత్రేయ. కానీ లేవగానే రక్త హస్తలు, చేతి లో ఉన్న కత్తి ని చూసి భయబ్రాంతి కి గురవ్వుతాడు. పోలీస్ లు తన ని చుట్టు ముట్టారు. రక్తపు మాడుగులో మూడు శవాలు, కొన ఊపిరి తో కొట్టుకుంటున్న ఒక ప్రాణం చూసి ఆందోళన కి గురవ్వుతాడు. పని మనిషి చెప్పిన కథ ప్రకారం. ఉదయం శుభ్రం చేయడానికి రాగానే గది నుండి బయటకి వస్తున్న రక్తం చూసి భయం తో పోలీస్ ల కి ఫోన్ చేసింది. అంతకు మించి ఆమె కి ఏమి తెలియదు అని చెప్పింది. పోలీస్ లు అత్రేయ ని జైలు కి తీసుకెళతారు. పోలీస్ ల కథనం ప్రకారం. తాగిన మత్తు లో అతని స్నేహితులని అత్రేయ చంపేసాడు అనుకున్నారు. వాళ్ళకి దొరికిన అతి ముఖ్యమైన సాక్ష్యం. అత్రేయ చేతి లో ఉన్న కత్తి. ఎలక్షన్ సమయం కావడం తో కేసు ని త్వరగా ముగించాలి అనుకున్నారు. కానీ అక్కడ అసలు ఎం జరిగింది అని ఎవరు పట్టించుకోలేదు. కోర్ట్ లో సాక్ష్యాలు చూపించారు. నలుగురి మీద దాడి చేసి, ముగ్గురి ని చంపిన కారణం గా అత్రేయ కి ఉరి శిక్ష విధించారు. అది విన్న అత్రేయ తల్లి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అత్రేయ ది చాలా చిన్న కుటుంభం. వల్ల అమ్మ అక్క తో ఒక అద్దె ఇంటి లో నివాసం ఉంటున్నారు . డిగ్రీ ఫైనల్ ఇయర్ లో చదువుతూ కాళీ సమయం లో పని చేసుకుంటూ. ఇంటి ని పోషిస్తాడు. వల్ల అమ్మ గారికి ఆరోగ్య సమస్యల వల్ల ఆవిడ పని కి వెళ్లరు. వల్ల నాన్నగారు అత్రేయ చిన్నప్పుడు చనిపోయారు.అత్రేయ కూడా చనిపోతే ఇంకా వల్ల కుటుంభం దిక్కులేనిది అవుతుంది. ఇవన్నీ ఆలోచించుకుని అత్రేయ స్నేహితులు పోలీస్ ల ని కలుస్తారు . అత్రేయ చాలా మంచి వాడని . అతన్ని కాలేజ్ అంత గౌరవిస్తారు అని అసలు ఆ రూమ్ లో వాళ్ళు అత్రేయ స్నేహితులు కాదు అని చెప్పారు. అసలు అత్రేయ కి ఎటువంటి చెడు అలవాటు లేదు అని చెబుతారు. పోలీస్ లు ఆలోచించడం మొదలు పెట్టారు. ఎవరో తెలియని రూమ్ లో కి అత్రేయ ఎలా వచ్చాడు? అతను చంపకపోతే అసలు కత్తి అతని చేతి లో ఎలా ఉంది? ఒక వేళ అత్రేయ చంపకపోతే మరి వల్ల ని ఎవరు చంపారు? అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి అత్రేయ మరో స్నేహితుడు విజయ్ వస్తాడు. విజయ్ వివరించడం మొదలు పెడతాడు. అసలు అత్రేయ వేరే వల్ల రూమ్ కి ఎలా వెళ్ళాడు అని. కాలేజ్ లు ఓపెన్ చేయడం తో అత్రేయ హాస్టల్ కి వస్తాడు. కానీ హాస్టల్ లు ఇంక తీయకపోవడం తో ఇంటికి వెళ్లిపోదాం అని బయలుదేరాడు. అప్పటికే రాత్రి 9 కావడం తో అతనికి ఏ వాహనం దొరకదు. అప్పుడే అత్రేయ విజయ్ కి ఫోన్ చేస్తాడు. జరిగింది చెప్పి. ఆ రాత్రి కి విజయ్ ని వసతి కల్పించమని కొరతాడు. విజయ్ వాల్ల ఇంట్లో ఫంక్షన్ కావడం తో తిరస్కరిస్తాడు. కానీ స్నేహిడుని రోడ్ మీద వదలలేక. అక్కడ దగ్గర లో ఉన్న విజయ్ ఫ్రెండ్ రూమ్ లో కి పంపిస్తాడు. ఆలా అత్రేయ ఆ రూమ్ లో కి అడుగు పెడతాడు. ఇలా విజయ్ తన కి తెలిసింది వివరిస్తాడు. అత్రేయ మీద మత్తు తీసుకున్నాడో లేదో తెలియడానికి టెస్ట్ చేస్తారు. కానీ అతను ఎటువంటి మత్తు తీసుకోలేదు అని తేలుతుంది. అత్రేయ ఎడమ చేతి లో కత్తి ఉంటుంది కానీ అత్రేయ ది కుడి చేతి వాటం.సాక్ష్యాలు అన్ని అతని కి వ్యతిరేఖం గా ఉన్న. అసలు ఎవరు చంపారో చెప్పడానికి ఒక్క సాక్ష్యం కూడా లేదు. ఇంకా ఎం చేసేది లేక. మొదట ప్రశ్నించ వలసింది చివరకి ఏమి దొరకక అత్రేయ ని ఎం జరిగిందో వివరించామంటారు పోలీస్ లు . అత్రేయని ఇలా చెబుతాడు " నన్ను తీసుకు వెళ్ళడానికి ఒక అబ్బాయి వచ్చాడు. మేము ఇద్దరు కలిసి రూమ్ కి వెళ్లే సరికి మిగిలిన వాళ్ళు తాగుతున్నారు. నేను కూడా వల్ల తో పాటు కూర్చుని వాళ్ళు చెప్పేవి అన్ని వింటున్నాను . కొంత సేపటికి ఆ రూమ్ లో వాళ్ళు కాల్చిన గంజాయి పొగ మత్తు కి కళ్ళు తిరిగి పడుకున్న నేను లేచే సరికి వాళ్ళు చనిపోయి ఉన్నారు" అని చెప్తాడు. అసలు వాళ్ళు ఎం మాట్లాడుకున్నారు అని పోలీస్ లు అడుగుతారు. అత్రేయ చెప్పింది విని ఆశ్చర్య పోతారు. వాళ్ళు ఎం మాట్లాడుకున్నారు అంటే. "గంజాయి ఒక కొండా ప్రాంతం లో చల్లగా ఉండే ప్రదేశం లో పండిస్తారు. అది పెరిగిన వెంటనే కోసి పెద్ద కట్టలు ల చేర్చి. అది పెద్ద కట్టల నుండి కేజీ ప్యాకెట్ లు గా విభజిస్తారు. అడవి లో నుండి దారి తప్పి ఊరి మీద పడ్డ పులి ల గా. గంజాయిని కూడా ప్రతి చోటు కి చేరుస్తారు. అది బైక్ లు కార్ లు లారీ లు అయితే గవర్నమెంట్ ఆఫీసర్ లు పట్టుకుంటారు అని. గవర్నమెంట్ బస్సు ల లోనే తీసుకొస్తారు. ఎందుకంటే బస్సు లలో గంజాయి ని తనిఖీ చెయ్యరు కాబట్టి. ఆలా ఆ గంజాయి కేజీ ప్యాకెట్ లు గా ఏజెంట్ ల దగ్గర కి వస్తాయి. ఆ ఏజెంట్ లు కేజీ ప్యాకెట్ ల ని మళ్ళీ విభజించి చిన్న ప్యాకెట్ లు గా ప్యాక్ చేస్తరు. ఇలా ప్యాక్ చేసినవి. జిల్లాల నుండి మండలాలకి, మండలాల నుండి ఊరు లకి ఊర్ల నుండి కావలసిన వాళ్ళుకి చదువుకునే వాళ్ళుకి చేరుతాయి . ఇదే గంజాయి ని చాలా పేరులతో పిలుస్తారు. చాలా విధాలుగా ఆ మత్తు ని తీసుకుంటారు. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే. జైలు లో కి వెళ్లే ఖైదీ లు. ఒక బీడీ లో ఈ గంజాయి ని కూర్చి. అది వల్ల లోపల రంద్రం లో పెట్టుకుని ఆ గంజాయి ని తీసుకువెళతారు . ఇలా అత్రేయ చెప్పిన మాటలు విని అందరూ ఆశ్చర్యపోతారు. సగం విషయం తెలిసిన పోలీస్ లు, అత్రేయ కూడా అసలు వాళ్ళు ఎలా చనిపోయారో ఆలోచిస్తూ ఉంటారు. చనిపోయిన వాళ్ళు ఎలాగో జరిగింది చెప్పలేరు. ఆసుపత్రి లో కొన ఊపిరి తో ఉన్నవాడు లెగిస్తే కానీ అసలు జరిగింది తెలీదు. ఆలా అని వాడు బ్రతుకుతాడో చనిపోతాడో తెలీదు అని డాక్టర్ లు చెప్పలేకపోతున్నారు. వాడు చనిపోతే అత్రేయ ని ఉరి నుండి కాపాడటం ఎవరి తరం కాదు. రోజులు గడుస్తున్నాయి, అత్రేయ జైలు లో నరకం అనుభవిస్తున్నాడు. అతని ఉరి గడువు దగ్గర పడుతుంది. పోలీస్ లు జడ్జి ని కలిసి జరిగింది చెప్పేదాం అనుకుంటారు. కానీ వాళ్ళు విచారణ చేయకుండా అత్రేయ మీద తప్పుడు కేసు వేసినట్టు తెలిస్తే వల్ల ఉద్యోగాలు పోతాయి అని భయపడ్డారు. పోలీస్ లు ఆ గదిని మళ్ళీ తనిఖీ చేశారు. అప్పుడు వాళ్ళకి ఒక ఫోన్ కిటికి లో దొరుకుతుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండటం తో ఛార్జింగ్ పెట్టి అందులో ఏముందో చూడాలి అనుకుంటారు. కానీ ఈ లోపు హాస్పిటల్ లో ఉన్న వ్యక్తి కి స్పృహ వస్తుంది. అతన్ని అసలు ఎలా చనిపోయారు వల్ల ముగ్గురు అని అడగగా. మత్తు లో ఉన్నవాళ్ళని అత్రేయ చంపేసాడు అని చెప్తాడు. నన్ను కూడా పొడిచేసాడు. కానీ నా అదృష్టం బాగుంది బ్రతికాను, ఈ నిజం చెప్పడం కోసమే బ్రతికాను అని ఏడుస్తాడు. పోలీస్ లకి కేసు మళ్ళీ మొదటికి వచ్చింది. జైలు కి వెళ్లి అత్రేయ ని నిజం రప్పించడం కోసం రక్తం వచ్చే వరకు కొడతారు. కానీ అత్రేయ కి ఏమి తెలీదు అని ఏడుస్తూ చెప్తాడు. ఆ పోలీసుల లో ఒక పోలీసు కి ఆ ఫోన్ ఆలోచన వస్తుంది. వెంటనే అది ఓపెన్ చేసి చూడటం మొదలు పెడతాడు. అతను అందులో ఉన్నది చూసి ఆశ్చర్యపోతాడు. మిగిలిన పోలీసులకి చూపిస్తాడు. అది చూసిన వెంటనే వాళ్ళు జడ్జి ని కలవడానికి వెళతారు. అరగంట లో అత్రేయ రిలీజ్ అవుతాడు. కానీ అత్రేయ కి ఏమి అర్ధం కాదు. ఆ ఫోన్ లో ఏముందో తెలుసుకోవాలి అనే ఆలోచన బలం గా ఉంది. కానీ మళ్ళీ ఏమవుతుందో అని భయం కూడా ఉంది. చివరికి అడుగుతాడు. ఆ ఫోన్ లో ఏముంది సార్? అని.. పోలీసులు బదులు గా "ని ప్రాణం కాపాడిన వీడియో" అని సమాధానం చెప్తాడు. చివరకి వీడియో చూపిస్తాడు. వీడియో లో "గంజాయి మొత్తం వాళ్ళు చాలా ఆనందంగా కలుస్తారు. చాలా కబుర్లు చెప్పుకుంటారు. ఒకరి మీద ఒకరు జోక్ లు వేసుకుని. అంత ముగిస్తారు. అప్పుడే వల్ల కి చావు గంజాయి రూపం లో నే ఎదురవుతుంది. గంజాయి చివరికి చేతి గోరు అంత మిగులుతుంది. అది నేను కలుస్తా అంటే నేను కలుస్తాను అని గొడవ మొదలవుతుంది. కొట్టుకోవడం మొదలు పెడతారు. ఒకటే కత్తి నాలుగు ప్రాణాలు. ఇద్దరిద్దరూ చొప్పున గొడవ పడతారు. చివరికి ఎవరు గెలిస్తే వాళ్లదే ఆ కొంచెం గంజాయి. ఇలా కొట్టుకుంటూ ఉండగా ఒక వ్యక్తి వల్ల ముగ్గురి లో ఒకడిని పొడుస్తాడు. ఆ కత్తి వేరే వాడి చేతి కి వెళుతుంది. వాడు వేరే వాడిని పొడిచి చంపేస్తాడు. ఇంకా ఇద్దరి లో ఒకడు మాత్రం మిగలాలి. కత్తి లేని వాడు లొంగిపోతాడు. వదిలేయమని ప్రదేయపడతాడు. మత్తు లో రక్తం వాసన మరిగిన మృగంలా. వాడిని కూడా చంపేస్తాడు. ఆ రక్తం మడుగులో. ఆ గోరంత గంజాయి ని కలుస్తు వాడి పొట్ట మీద కత్తి గాటు పెట్టుకుని అత్రేయ చేతి లో కత్తి ని పెడతాడు. అది ఎవరో కాదు హాస్పిటల్ లో ఉన్న వ్యక్తి. ఆ వీడియో రికార్డు చేసిన వాడు చనిపోయిన. వాడు తీసిన వీడియో అత్రేయ ని బ్రతికించింది. అత్రేయ వెళ్లిపోతూ పోలీసు ని అడుగుతాడు. గోరంత గంజాయి కోసం ఇలా ఎందుకు చేసారు అని. మిత్తిమీరిన వ్యసనం ఏదైనా సరే అది ప్రాణాల మీదకి తెస్తుంది అని బదులు ఇస్తాడు. జైలు నుండి బయటకి వచ్చిన అత్రేయకి అతని స్నేహితుల సమూహాన్ని చూసి ఆనంద భాష్పాలు వస్తాయి. మంచి స్నేహం ఒక ప్రాణం కోసం నిలబడితే. మత్తు స్నేహం నాలుగు కుటుంబాలని భలి తీసుకుంది.