భువనగిరిలో రాత్రి గస్తి తిరుగుతున్న పోలీసులకు ,మోటర్ సైకిల్స్ పై ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ కొందరు విద్యారులు కనిపించారు. పట్టుకునేందుకు ప్రయత్నించగా ఒకవిద్యార్ధులు దొరికాడు మిగిలిన వారు పారిపోయారు.వారిని విచారించగా రవి అనేయువకుడు స్ధానిక వ్యాపారవేత్త,బాగా పలుకుబడి కలిగిన వ్యక్తి కుమారుడు. ఇంజనీర్ విద్యర్ధి. ఫోన్ మోగడంతో "హల్లో "అన్నాడు పోలీసు అధికారి. " నేను వ్యాపారవేత్త రంగనాధాన్ని మాట్లాడుతున్నా, ఎంతధైర్యం నీకు నాకుమారుడినే పోలీస్ స్టేషన్ కు తీసుకువెళతావా ? ఈవిషయం అందరికి తెలియక ముందే మావాడిని వదిలేయి అయినా పిల్లలు ఆవయసు వాళ్ళు అలాంటి సాహసకరమైన ఆటలు ఆడటం సహజం వాళ్ళు కాకుండా మనం ఆసాహసాలు చేయగలమా? పదినిమిషాల్లో మావాడు విడుదలకావాలి" అని ఫోన్ పెట్టేసాడు రంగనాధం.తనపై ఉన్నత అధికారుల వత్తిడి రావడంతోవారి బండి తాళాలు ఇస్తూ '' అబ్బాయి విద్యార్ధి దశలో ఉన్ని నీవు ఇటువంటి పనులుచేస్తూ న్యాయస్ధానం ఆదేశంతో,శిక్ష అనుభవించడం జరిగితే భవిష్యత్తులో నీకు ప్రభుత్వ ఉద్యోగాలు రావు,పైగా తలకు హెల్ మేట్ లేకుండా బైక్ నడపటం ప్రమాదం. "అన్నాడు పోలీసు అధికారి." హెల్ మెట్ ధరిస్తే నేను చేసే సాహసాలు చూసి ఎదటివారు నన్ను ఎలాగుర్తిస్తారు? ఉద్యోగం చేసే ఖర్మ నాకులేదు.మాసంస్ధలలో వందల మంది బ్రతుకుతున్నారు నేను ఒకరిదగ్గరకు పనికి వెళ్ళడం ఏమిటి ? ఇరవై తరాలు తిన్నా తరగని ఆస్తికి ఏకైక వారసుడిని. మీఅబ్బాయి చదువుతుంది మాకాలేజిలోనే "అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చి మూడు లక్షల ఖరీదు చేసే తన బైక్ తో వెళ్ళిపోయాడు.
కాలక్రమంలో నెలలు గడచి పోయాయి... ఓకరోజు బైపాస్ రోడ్డులో ఇంజనీరింగ్ కాలేజి వద్ద మోటర్ బైక్ లారి గుద్దుకున్నాయి అని ఫోన్ రావడంతో వెళ్ళాడు పోలీసు అధికారి. అక్కడ గుమ్మికూడిన జనాలను తప్పుకుంటూ లారి ముందు భాగాన పడి ఉన్న మోటర్ సైకిల్ చూస్తూనే ఆబండి ఎవరిదో గుర్తించాడు. జరగవలసిన పనులు చకచకా జరిగిపోయాయి. ఆ బైక్ పై ప్రయాణిస్తున్న అతనికి హెల్ మెట్ లేని కారణంగా తలకు గాయాలు అయ్యాయి అని వేదిక వచ్చింది.స్ధానిక సి.సి.కెమేరాలలో బైక్ నడుపుతున్నవారు ,ఒంటి చక్రంతో బండి నడిపే ,విచిత్ర పోకడవలనే ఈప్రమాదం జరిగిందని పోలీసులు, ప్రసార మాధ్యమాలవారు గుర్తించారు.
ప్రభుత్వవైద్యశాలలో తన కుమారుడిని చూడటానికి వచ్చిన వ్యాపారవేత్త రంగనాధం ,పోలీసు అధికారినిచూసి " నాచిన్నతనంలో ఒక కథ చదివాను,తోటకూర దొంగిలించిననాడే వాడిని మందలించి ఉంటే ఈనాడు ఇంత పెద్ద దొంగగా మారి ఉండే వాడు కాదు అని ఒక తల్లి ఏడుస్తుంది తనకుమారుడును చూసి. ఆరోజున మీరు మందలించి ఉంటే నేడు నాపిల్లవాడికి ఈస్ధితి వచ్చేదికాదు. తప్పుచేసిన వాడిని కాకుండా తమరిని మందలించి నేను ఎంత తప్పు చేసానో ఇప్పుడు తెలుసుకున్నాను. అవసరాలకుమీంచిన ధనం పిల్లలకు ఇవ్వడం, మనపిల్లల్ని మినమే తప్పుడు మార్గంలోనికి పంపిన వాళ్ళం అవుతాము. వయసుకు మించిన వాహనాలతో విన్యాసాలు చేయడం అంతప్రమాదమో ఈసంఘటన ద్వారా అందరూ తెలుసుకున్నరు.ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రతి తల్లి తండ్రికి ఉంది. మీపట్ల తప్పుగా నాడు నేను పవర్తించిన తీరుకు నన్నుమన్నించండి "అన్నాడు రంగనాధం . "అయ్యో పెద్దవారు మన్నింపు అనకండి మనపిల్లలు క్షేమంగా ఉండాలి అంటే వారికి ప్రమాదాలపట్ల తగిన అవగాహన కలిగించాలి. బాధపడకండి వారంలో వారు కోలుకుంటారు "అన్నాడు పోలీసు అధికారి.