" రా మామా మంచి సమయానికి వచ్చావు బాగా మాగిన అరటి పళ్ళు ఉన్నాయి తోలు తీయకుండానే తినవచ్చు "అని కోతి,కుందేలుకు ఒక అరటి పండు ఇచ్చాడు. " చాలా సంతోషం అల్లుడు " అన్నాడు కుందేలు. "అప్పుడే మెల్లగా నడుచుకుంటూ వచ్చిన తాబేలు " కోతి బావా బాగా ఆకలిగా ఉంది నేను తినడానికి నీవద్ద ఏమైనా ఉన్నదా ?" అన్నాడు తాబేలు. " అలాగా ఇవిగో రెండు అరటి పండ్లు ఇవి తిని నీ ఆకలి తీర్చుకో "అన్నాడు కోతి.
తనకు ఒకటి,తాబేలుకు రెండు అరటి పండ్లు కోతి ఇవ్వడం చూసిన కుందేలు అసూయతో ముఖం పక్కకి తిప్పుకున్నాడు .
" ధన్యవాదాలు కోతి బావా సమయానికి, సమయానికి ఆహరం అందించి నాప్రాణాలు కాపాడావు ". అన్నాడు తాబేలు.
కుందేలు అసూయను గమనించిన కోతి " మామా మనకు లభించిన దానికి సంతోషించాలి ఎదటి వారి లభించినది చూసి ఎన్నడూ అసూయ పడకూడదు. ఎంతటి భయంకరమైన వ్యాధులకు మందులు ఉన్నాయి
కాని, అసూయ అనే వ్యాధి సోకిన వారికి మందులు లేవు . అసూయ
పరులు తమ జీవితాంతం అసంతృప్తితోనే ఉంటారు. ఎక్కడ అసూయ
ఉంటుందో అక్కడ సుఖః,సంతోషాలు ఉండవు. విషం కన్నా ప్రమాదమైనది అసూయ. విషం తీసుకున్న మనిషి కొంతసేపు వేదనతో మరణిస్తాడు కాని అసూయకు లోనైనవారు అనుక్షణం జీవితాంతం మరణిస్తూనే ఉంటారు. అసూయకు లోనైన వారు ప్రశాంత జీవితం గడుపలేరు. ఎప్పుడూ కోపంతో ఉంటారు.
అసూయ అన్నది ఒక బలహీనత, ఒక వక్రగుణం. ఎవరు అసూయకు లోనౌతారో వారు కృంగిపోతారు. నిరంతర ఇతరులను చూసి అసూయ పడటంతోనే వారి సమయం గడచిపోతుంది వారు తమ అభివృధ్ధి గురించి ఆలోచన చేయరు. అసూయ సుగుణాలన్నింటినీ నాశనం చేస్తుంది. మన విలువైన సమయాన్ని ఎదటి వారికి కేటాయించి అసూయపడటం తగదు. ఎక్కడ దాన గుణం ఉంటుందో,అక్కడ జాలి,దయ,కరుణ, ఆదరణ,సానుభూతి వంటి మంచి లక్షణాలు ఉంటాయి. ఎక్కడ స్వార్ధ గుణం ఉంటుందో అక్కడ ,అసూయ,ఈర్య,ద్వేషం వంటి తప్పుడు లక్షణాలు ఉంటాయి.కష్టంలో ఉన్నవారికి మనమాట సహయం ఎంతో నిబరం కలిగిస్తుంది.వృధ్ధులు,పిల్లలు, వ్యాధిగ్రస్తులను,పేదవారి వారి పట్ల దయతో ఉండాలి. "అన్నాడు కోతి . నిజమే అల్లుడు విలువైన మన సమయాన్ని ఎదటి వారికి కేటాయించి అసూయపడటంకన్నా మనం అభవృధ్ధి ఎలాచెందాలి అని ఆలోచన చేస్తే ఉన్నత స్ధితికి చేరుకోవచ్చు. మనకు ఉన్నంతలో సాటివారికి సహయపడితే ఆమానసిన ఆనందం వర్ణించలేనిది అని ఇప్పుడు తెలుసుకున్నాను " అన్నాడు కుందేలు.