క్రికెట్ పిచ్చి - తాత మోహనకృష్ణ

Cricket pichhi


"ఒరేయ్ సుబ్బు..! మీ అమ్మాయికి ఇంకా పెళ్ళి చెయ్యవేమిటి రా...!"

"ఏం చెయ్యమంటావు చెప్పరా..!"

"అమ్మాయి లక్షణంగా ఉంటుందిగా..ఎవరైనా సరే, మారు మాట్లాడకుండా పెళ్ళి చేసుకుంటారుగా.."

"అదీ నిజమే..! కానీ ఏం చెయ్యమంటావు..? మా అమ్మాయికి క్రికెట్ పిచ్చి కదా..అదే ప్రాబ్లం ఏమో..?"

"అయితే క్రికెటర్ మొగుడుగా కావాలా..?"

"కాదు.."

"మరి..?"

"పెళ్ళిచూపులలో అబ్బాయితో మా అమ్మాయి విడిగా మాట్లాడుతోంది..తర్వాత..అబ్బాయికి 'నో' చెబుతుంది. ఏమిటి మాట్లాడుతోందో తెలియదు..అడిగితే చెప్పట్లేదు..!" అన్నాడు సుబ్బు

"కూతురిని మెల్లగా అడగరా...ఎలాంటి వాడు కావాలో..? అలాంటివాడినే తెస్తే సరి..ఎందుకు ఈ అనవసరపు పెళ్ళిచూపులు.."

"నువ్వు చెప్పింది నిజమే, కానీ..అమ్మాయి తనకు కావాల్సిన అబ్బాయితో తానే మాట్లాడి 'ఓకే' చేస్తుందంటా.."

"పోనీ నువ్వు అడగరా...'అంకుల్' అంటూ నీతో చాలా క్లోజ్ గా మాట్లాడుతుందిగా నా కూతురు.." అన్నాడు సుబ్బు

"అలాగే..ట్రై చేస్తాను.."

"అమ్మాయి కావ్య..! ఎలాగున్నావు ..? పప్పన్నం ఎప్పుడు పెట్టిస్తావు..?"

"ఈ రోజు మా ఇంట్లో పప్పు సూపర్ ఉంది..తినండి అంకుల్.."

"జోకులు వద్దు..పెళ్ళి భోజనం కావాలి..అదీ నీ పెళ్ళి భోజనం.."

"అదా అంకుల్..! నాకు అబ్బాయిలు ఎవరూ నచ్చట్లేదు.."

"మీ నాన్న అబ్బాయిల ఫొటోలు నాకూ పంపాడు. మీ నాన్నది మంచి సెలక్షన్. మా అమ్మాయికీ.. మీ నాన్నే పెళ్ళి సంబంధం చూసాడు తెలుసా...? అలాంటిది నీకు ఎందుకు నచ్చట్లేదో..? ఇంతకీ నీకు అబ్బాయిలో ఏమిటి కావాలి..?'

"చెబుతాను అంకుల్..మరి నవ్వకూడదు.."

"సరే..చెప్పు..నీకు నచ్చినవాడికోసం నేనూ చూస్తాను"

"నాకు క్రికెట్ అంటే ఇష్టమని మీకు తెలుసు కదా అంకుల్.."

"ఎందుకు తెలియదు..క్రికెట్ మ్యాచ్ ఉంటె చాలు.. ఇంట్లో నీ సందడి చూస్తూనే ఉంటాను కదా.."

"కొంపదీసి పెళ్ళి కొడుక్కి క్రికెట్ పిచ్చి ఉండాలా..నీలాగ..?"

"కాదు..కాదు..ఇండియన్ టీమ్ లాగ కానీసం పదకొండు మంది పిల్లల్ని కని, టీమ్ ని తయారు చెయ్యాలి.. అని అడిగాను. దానికి అబ్బాయిలందరూ పారిపోతున్నారు...."

"అంతమందంటే కష్టం కదా..కావాలంటే ఇద్దర్నో ముగ్గిరినో కని, క్రికెటర్ని చేస్తే బాగుంటుంది..అంతమందిని పెంచి, టీమ్ ని తయారు చెయ్యడం చాలా కష్టం తల్లీ..అర్ధం చేసుకో.."

"సరే అంకుల్..మీ మాట వింటాను.."

"అయితే నీకు పెళ్ళి దాదాపు అయిపోయినట్టే.." అంటూ ఆ శుభవార్త సుబ్బు చెవిన వెయ్యడానికి పరిగెత్తాడు..

********

మరిన్ని కథలు

Cycle nerchukovadam
సైకిల్ నేర్చుకోవడం
- మద్దూరి నరసింహమూర్తి
Konda godugu
కొండ గొడుగు
- టి. వి. యెల్. గాయత్రి.
Panimanishi
పనిమనిషి
- మద్దూరి నరసింహమూర్తి
Sanitorium
శానిటోరియం
- ఆకేపాటి కృష్ణ మోహన్
Chavu paga
చావు పగ
- వేముల శ్రీమాన్
Jeevinchu
జీవించు
- B.Rajyalakshmi