దేవుని సృష్టి - Aduri.HYmavathi.

Devuni srushti

వరదాపురం అనే ఊర్లో కృష్ణయ్య అనే ధనికుడు ఉండేవాడు.

అతడి కుమారుడు వాసుదేవ . తన కుమారుని ఆ ఊర్లోనే ఉంటే

పిల్లలందరితో చేరి చెడి పోతాడని భావించి, నగరంలోని హాస్టల్లో చేర్పించి,

తన కుమారుని చదువు అయ్యేవరకూ గ్రామానికి కూడా రానివ్వక తామే వెళ్ళి

చూసి వచ్చేవారు. ధనానికి కొదువలేనందున అక్కడే ఉంటూ బాగా

చదువుకుని నగర నాగరికత కూడా ఒంట పట్టించుకున్నాడు వాసుదేవ.

వాసుదేవచదువు హైస్కూల్లో ఐపోయింది. కొంతకాలంక్రితం

ఎప్పుడో వదిలి పోయిన తన ఉండూర్లో, తాను పుట్టి పెరిగిన ఇంట్లోఉందా

మని తన ఆప్తమితృడైన ఆనందును కూడా వెంటతీసుకుని తన తండ్రి కి

తెలియపరచకుండానే ఐదుమైళ్ళు పొలాలమధ్య నడుస్తూ తన ఊరి

అందాన్ని ఆనందుకు చూపాలను భావించి , బస్సెక్కి ఊరి పొలిమేరల్లో

రోడ్డుమీద దిగేసి, ఆనందుకు తమ పొలాలూ , తోపులూ చూపుతూ తన ఊరి

అందాన్ని పొగుడుతూ పొలంగట్లమీద నడక సాగించాడు వాసుదేవ మితృడు

ఆనందుతో కలసి.

పొలాలుదాటుకుని పండ్ల తోటలుదాటుతూ మిట్టమధ్యాహ్నం కావటాన

కాస్తసేపు సేదతీరుదామని అక్కడే ఉన్న ఒక మఱ్ఱి మాను క్రింద ఇరువురూ

తమ కోట్లు, బూట్లు తీసేసి వెంట తెచ్చుకున్న వేడెక్కిన కూల్డ్రింక్ సీసాలు

త్రాగేసి ఆమఱ్ఱి మానును ఆనుకుని ,కాళ్ళు బారచాపు కుని కూర్చుని కబుర్ల

లోపడ్డారు.

మఱ్ఱి మాను పైకి చూస్తూ వాసుదేవ స్నేహితుడు ఆనందుతో "మిత్రమా!

అటుచూడు ఆపొలంలో నేలమీద అల్లుకుని ఉన్న తీగకు కాసిన గుమ్మడి

కాయలు ఎంత పెద్దవో!చిన్నతీగకు పెద్దకాయలు, ఆపక్కనే ఉన్న సొర తీగ

కు కాసిన పెద్ద సొరకాయలుచూడూ చిత్రంగా లేదూ! అటుపక్కనే ఉన్న దోస

పాదు చూడూ! సన్నగా నాజూగ్గా ఉన్న ఆ దోస కాయలు చూడూ పెద్ద కొబ్బరి

బోండాలంత ఉన్నాయి. చిన్న తీగలకు పెద్దకాయలు. ఈ మఱ్ఱి మాను ఎంత

పెద్దదో , దీని కొమ్మలే మన లాంటి వాళ్ళం నలుగురం కలిసినంత పెద్దవి.

దీనికాయలు చూడూ ఎంత చిన్నవో! వీటిని సృష్టించినది దేవుడంటారుకదా!

మరి ఆయనకామాత్రం విచక్షణ లేదంటావా! "అన్నాడు.

ఆనందు నవ్వుతూ "మనం దేవుని సృష్టి గురించీ చెప్పలేం మిత్రమా! ఈ

సృష్టి ఎన్నో వేలవేల ఏళ్ళక్రితం నుంచీ ఇలాగే ఉంది, మనకొచ్చిన లాంటి

సందేహం ఇంతకు ముందు కొంతమందికి వచ్చీ ఉండవచ్చు, రాకపోయీ

ఉండవచ్చు. ఎవ్వరూ దేవుని సృష్టిని మార్చ లేరు.ఆయన అందరికంటే

చాలా తెలివైన వాడు.మనం ఆయన సృష్టిని అనుభ వించడం తప్ప

విమర్శించకూడదు వాసుదేవా! " అన్నాడు .ఇద్దరూ కాస్తంతసేపు వాదు

లాడుకుని,అలవాటు తప్పిన నడక, ఎండ మూలాన నిద్రలోకి జారు

కున్నారు. కొంతసేపయ్యాక మెలకువవచ్చి తమమీద రాలి ఉన్న మఱ్ఱి

పండ్లను ఇరువురూ చూసుకున్నారు. ఆనందు నవ్వుతూ" చూశావా

వాసుదేవా! ఈ పండ్లే నీవన్నట్లు గుమ్మడి పండ్లంత, లేక సొరకాయలంత ,

లేకపోతే ఆదోసపండ్లంత పెద్దవైతే మనగతేమయ్యేది? కనుక భగవంతుని

సృష్టిని విమర్శించే సాహసం, మనం చేయ కూడదు." అనగానే వాసుదేవ "

సత్యం మిత్రమా! మరెన్నడూ ఇలామాట్లాడను, కానీ భగవంతుని తెలివి

అమోఘం సుమా! పద వెళదాం. పదినిముషాలు నడిస్తే మా ఇల్లు చేరుతాం

." అంటూ కోటూ, బూటూ చెత్తోపట్టుకుని ఊర్లోకి నడక సాగించారు ఇరువురూ,

దేవుని సృష్టినీ, ఆయన తెలివినీ స్మరిస్తూ.

***

మరిన్ని కథలు

A1 farmula
ఏ1 ఫార్ములా
- వై.కె.సంధ్యా శర్మ
Oke okkadu
ఒకే ఒక్కడు
- కందర్ప మూర్తి
Mitam
మితం
- ఆదిత్య ప్రణవ్
Bamma ki ichina mata
Bamma ki ichina mata
- Prabhavathi pusapati
Peddakodalu
పెద్దకోడలు
- మద్దూరి నరసింహమూర్తి
Parina pachika
పారిన పాచిక!
- - బోగా పురుషోత్తం
Tatayya salahalu
తాతయ్య సలహాలు
- గాయత్రి కులకర్ణి
Seshajeevitam
శేష జీవితం
- మద్దూరి నరసింహమూర్తి