రెండు ప్రశ్నలు ?? . - సృజన.

Rendu prasnalu

సింహరాజు పుట్టినరోజు కావడంతో సింహరాజు భార్య సివంగి విందు భోజనం అడవి జంతువులకు స్వయంగా వడ్డించింది. కడుపునిండా తిన్న జతువులు చెట్టు నీడన సేద తీరసాగాయి. " మిత్రులారా నాపుట్టిన రోజుకు విచ్చేసి మావిందు ఆరగించిన మీ అందరికి ధన్యవాదాలు. ఇప్పుడు మీకు రెండు ప్రశ్నలు వేస్తాను వాటికి తగిన సమాధానం చెప్పినవారికి తగిన బహుమతి ఉంటుంది " నక్కా,కోతి,కుందేలును చూస్తూ " మీరు ముగ్గురు మామిడి పండ్ల వ్యాపారులు అనుకుందాం, మీ ముగ్గురు దగ్గర వరుసగా 50, 30 మరియు 10 పండ్లు ఉన్నాయి. 50 మామిడి పండ్లు ఉన్న వ్యాపారి ఏ ధరకు అమ్ముతాడో మిగిలిన ఇద్దరూ అదే ధరకు అమ్మవలసి ఉంది.మోత్తం మామిడి పండ్లు ఆ ముగ్గురు అమ్మిన తరువాత ఆ ముగ్గురు వద్ద డబ్బులు సమానంగా ఉండాలి . ఎలా? నాకు వివరించండి "అన్నాడు. సింహరాజు.

నక్క,కోతి,కుందేలు తమలోతామే కాసేపు మాట్లాడుకుని " మహరాజా

50 పండ్ల వ్యాపారి మోదట 7 పండ్లు 10 రూపాయల చప్పున 49 మామిడి పండ్లు 70 రూపాయలకు అమ్మగా 1 పండు మిగులుతుంది. 30 పండ్ల వ్యాపారి 7 పండ్లు 10 రూపాయల చప్పున 28 మామిడి పండ్లు 40 రూపాయలకు అమ్మగా 2 పండ్లు మిగులుతుంది. 10 పండ్ల వ్యాపారి 7 పండ్లు 10 రూపాయల చప్పున అమ్మగా 3 పండ్లు మిగులుతుంది. 50 పండ్ల వ్యాపారి మిగిలిన ఆ ఒక పండును 30 రూపాయలకు అమ్మగా మోత్తం 100 రూపాయలు అవుతుంది. 30 పండ్ల వ్యాపారి మిగిలిన 2 పండ్లను 30 రూపాయల చప్పున 60 రూపాయలకు అమ్మగా మోత్తం 100 రూపాయలు అవుతుంది. 10 పండ్ల వ్యాపారి మిగిలిన 3 పండ్లను 30 రూపాయల చప్పున 90 రూపాయలకు అమ్మగా మోత్తం 100 రూపాయలు అవుతుంది " అన్నారు కోతి,నక్క,కుందేలు.

" భేష్ మరో ప్రశ్న.గుంటూరులోని జివితేష్ తన పుట్టినరోజున పంచడానికి కొన్ని చాక్లేట్టులు తీసుకొని ఇంటికి వచ్చి లెక్కవేసాడు. తన స్నేహితులకు రెండు చాక్లేట్టులు చొప్పున పంచగా ఒక చాక్లేట్టు మిగిలింది.మిగలడం నచ్చక మూడు చాక్లేట్టుల చోప్పున పంచగా మరలా ఒక చాక్లేట్టు మిగిలింది. మిగలడం నచ్చక నాలుగు చాక్లేట్టుల చొప్పున పంచగా మరలా ఒక చాక్లేట్టు మిగిలింది. ఈ విధంగా ఈ ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది మరియు పది చోప్పున పంచగా ఒకె చాక్లేట్టు మిగిలింది. అయితే ఆ చాక్లేట్లు ఎన్ని? "అన్నాడు సింహరాజు .

నక్క,కోతి, కుందేలు తమలో తామే కొద్దిసేపు తర్కించుకుని "మహరాజా 2,521 చాక్ లెట్లు అన్నాయి. "భళా సరైన సమాధానం చెప్పిన మీముగ్గురు బహుమతికి అర్హులే "అన్నాడు సింహరాజు.

సృజన .

అడవిజంతువులన్ని విజేతలకు జే జేలు పలికాయి.

మరిన్ని కథలు

Cycle nerchukovadam
సైకిల్ నేర్చుకోవడం
- మద్దూరి నరసింహమూర్తి
Konda godugu
కొండ గొడుగు
- టి. వి. యెల్. గాయత్రి.
Panimanishi
పనిమనిషి
- మద్దూరి నరసింహమూర్తి
Sanitorium
శానిటోరియం
- ఆకేపాటి కృష్ణ మోహన్
Chavu paga
చావు పగ
- వేముల శ్రీమాన్
Jeevinchu
జీవించు
- B.Rajyalakshmi