” రుద్ర సమస్యల సృష్టికర్త, అల్లరి వాడి జన్మహక్కు. అమ్మ చేసే ప్రతీపని చేయడానికి ప్రయత్నిస్తాడు. అలా చేసే సందర్భంలో ఎన్నో పాడుపనులు చేస్తాడు. గదిలో నీళ్ళు ఒంపుతాడు, గుడ్డపెట్టి రాస్తాడు. ఖాళీగా ఉన్న కుక్కరు తెస్తాడు, దాని మీద మూత పెట్టడానికి ప్రయత్నిస్తాడు. టక్కు టిక్కు మని శబ్దం చేస్తాడు. అట్లకాడతో బల్లమీద ధడేల్ ధడేల్ మని కొడతాడు. సమయం పన్నెండు గంటలు కావస్తోంది. వంటింట్లో వంట పని చేస్తోంది సౌమ్య. పరుగున సౌమ్య దగ్గరికి వెళ్లి “ఆమ్మా నాకు ఆకలేస్తోంది అన్నం పెడతావా? పెట్టావా?” అని మారాం చేశాడు రుద్ర. “కుండలో గుర్రాలు తోలకురా! కాసేపు ఆగితే అన్నం పెడతాను.” అంది సౌమ్య. అయినా వాడి ఏడుపు ఆపలేదు. మునిమామ్మ గారు రుద్రను దగ్గరగా తీసుకుని “కుండలో గుర్రాలు తోలడం” అంటే ఏంటో చెప్తాను విను. కథ పూర్తి అయ్యేసరికి అమ్మ వంట పూర్తి అవుతుంది. ఎంచక్కా భోజనం చెయ్యొచ్చు.” అంది ముని మామ్మ. “సరే మామ్మగారు” అన్నాడు మునిమనవడు. “విశాలమైన ప్రదేశం, అనుభవజ్ఞులైన రౌతులు ఉంటేనే గుర్రాలు పరుగులు తీయగలవు. అలాంటిది కుండలో పరిగెత్తడం సాధ్యమా అంటే సాధ్యం కాదనే చెప్పాలి. కొన్ని పనులకు కొంత సమయం పడుతుంది మనం తొందరపడినా ఆ పనులు జరగవు. సరిగ్గా ఇలాంటి సమయం లో తొందరపెడితే “కుండలో గుర్రాలు తోలొద్దని” అంటారు. అంచేత నువ్వు కూడా అమ్మని అల్లరి పెట్టి ‘ఇప్పుడే అన్నం కావాలి’ అనకూడదు. ఒక్క క్షణం ఆగితే వేడి వేడి అన్నం, పప్పు, నెయ్యి వేసి కలిపి తెస్తుంది.” అని చెప్పేరు మునిమామ్మగారు. ఇంతలో సౌమ్య అన్నం కలిపి తెచ్చింది. “అమ్మా! కుండలో గుర్రాలు తోలను కానీ నా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి… వాటిని బయటకు పంపించేస్తావా?” అన్నాడు రుద్ర. “హారి గడుగ్గాయి… ఎంత త్వరగా పట్టేశాడు.” అని ఆశ్చర్యపోయారు మునిమామ్మగారు. కొడుక్కి కడుపునిండా అన్నం పెట్టి నిద్రపుచ్చింది సౌమ్య. ఓ పక్క పని పూర్తి కాకుండానే తొందరపెట్టే దుందుడుకు వ్యక్తులను 'కుండల్లో గుర్రాలు తోలతాడు " అని, ఎవరైనా అనవసరంగా కంగారు పెట్టినప్పుడు 'కుండల్లో గుర్రాలు తోలకు!' అని కూడా విసుక్కుంటారు. అలా ఈ జాతీయం ప్రాచుర్యం