భావన అద్దం లో తనని తాను చూసుకుంది. ఇప్పటికీ అందం తగ్గ లేదు. పెళ్ళయి రెండేళ్ళయినా తేడా రాలేదు. అతని కి ఇష్టమని బ్లూ ట్రాన్స్ పెరంట్ నైటీ వేసుకుంది. ముడి పెట్టకుండా జుట్టు లూజు గా వదిలేసింది.ఇంపోర్టెడ్ సెంట్ స్ప్రే చేసుకుంది. మామూలు గానే పెదవులు ఎర్ర గా ఉంటాయి. ఐనా లైట్ గా లిప్ స్టిక్ టచప్ ఇచ్చింది. వెనుక నుండి వెళ్ళి భార్గవ ని కౌగలించుకుంది. "అబ్బా, అల్లరి చేయకు. ప్రోజక్ట్ డెడ్ లెన్ దగ్గర పడుతోంది" కంప్యూటర్ స్క్రీన్ మీద నుండి తల తిప్ప కుండా.భార్గవ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. " డే షిఫ్ట్ లేదా" అడిగింది భావన అతని బుగ్గల్ని తన బుగ్గల తో రాస్తూ " యు ఎస్ క్లయింట్ మరి" చెప్పాడు భార్గవ! "హు" అని హాల్లోకి వచ్చి టీవి పెట్టింది. బ్లాక్ అండ్ వైట్ సినిమా కృష్ణ నటించిన వింత కధ సినిమా వస్తోంది. వాణీశ్రీ, కృష్ణ ల రోమాన్స్ తో టీవి వెడెక్కుతోంది. రాత్రంతా స్వప్నాల జ్వాల తో వేగాల్సిందేనా? భావన విరహోత్కంఠిత! ఆలస్యాన్ని ఆవలింతలతో గణించే నెలత ప్రియుడి కోసం తలుపు దగ్గరే తపించే ముదిత ఓహ్! ఏమి ఆమె ఎదురు చూపులు ఆమే సుమ మన విరహోత్కంఠిత ****** ఆ రోజు వెన్నెల రాత్రి. వెన్నెల కూడా వేడి గా ఉంది. భార్గవ నుండి ఫోన్. క్లయింట్ తో మీటింగ్ ఉందట. రాత్రి ఆలస్యమవుతుందని! ఇప్పుడు తను ఏమవ్వాలి వాసక సజ్జికా లేక విరహోత్కంఠితా? వెన్నెలా, యవ్వనం అడవి గాచిన వెన్నెలేనా. భావన లో రాలుతున్న విరహపు పుప్పోడి రేపు తున్న జ్వాల! కింద లాన్ లో కూర్చుని ఊయల బల్ల మీద ఊగుతోంది. కారు డ్రైవర్ రంగా మరియు పనిమనిషి నీల ల సంభాషణ వినబడుతోంది. రంగా కండల తో పుంసత్వానికి ప్రతినిధి లా ఉంటాడు. నీల నేరేడు పండు లా నిగ నిగ లాడు తుంటుంది. " రా మావా, నీ కిట్టవని కోడి కూర, రొయ్యల పులుసు సేసినాను" "సెయ్యక పోయినా పర్లేదే, నీ అందం సాలదా కొరుక్కు తినడానికి" " సర్లే, ముందు బువ్వ తిను" రంగా తృప్తి గా తిని నీల కిష్టమైన తెల్ల పంచె, గ్లాస్కో చొక్కా తొడుక్కున్నాడు. " శోబైన్ బాబు లా గున్నాడు నా మావ" అని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. " నువ్వు మాత్రం గళ్ళ రవిక, జరి చీరలో రంభ నాగున్నావు. "పో మావా" సిగ్గు పడింది నీల. వాళ్ళ అన్యోన్యత చూసి తను భార్గవ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసి ఎన్నాళ్ళయిందో అని భావన బాధపడింది. రాత్రి పన్నెండు దాటింది. నిద్ర పట్టక కిటికి తలుపు తెరిచింది. లాన్ లో ఆశోకా చెట్టు కింద కదలికలు. వెన్నెల ఆ దేహాలపై పడుతోంది. వాళ్ళిద్దర్నీ చూసి ఆశ్చర్యపోయింది. ఖజరహో శిల్పాలు ప్రాణం పోసుకున్నట్లు! రంగా, నీల నగ్నం గా వెన్నెల లో మెరిసి పోతున్నారు. రంగా బలమైన కండల కౌగిలి లో నీల కరిగి పోతోంది. ఆమె ఒళ్ళంతా ముద్దుల ముద్రలుంచాడు. ప్రతి ముద్దు లో నీ ముఖమే మావా అని నీల కిలకిలా నవ్వింది. " మావా యెన్నెలంటె అంత యెర్ర ఏంటి మావా?" " నువ్వన్నా, యెన్నెలన్నా నాకు పిచ్చి" " యెన్నెల రోజున ఒంటి మీద కోక ఉండనీవు కదా" " సెందురుడు కట్టుకోవడానికి ఇవ్వాలి" "సెందురుడు ఆడా మగా?" " నీలా చల్లగా ఉంటుంది కాబట్టీ ఆడే" అని పకా పకా నవ్వాడు నీల ని గట్టి గా హత్తుకుంటూ " మోట సరసం " అంది నీల అతని వెచ్చని ఊపిరి తగులుతుంటే! మన మధ్య లో గాలి కూడా దూర కూడదు అని రూమ్ లోకి వెళ్ళి పోయారు. తెల్లవారు జామున రంగ పాడే ఎంకి పాట వినబడింది. " ఏతమెత్తే కాడ ఎదురుగా కూకుండి మళ్ళి ఎప్పటల్లే తెల్లారి పోతుంటే చెందురుణ్ణి తిట్టు నా ఎంకి సూరీణ్ణి తిట్టు నా ఎంకి" ******** భార్గవ ఆఫీస్ నుండి రాగానే కోటు ని చూసింది. దాని మీద నల్లని కేశం కనబడింది భావన కి. కేశం చూసి క్లేశం చెందిన భావన" ఖండిత య్యింది. " ఎవర్తది," " నా ముఖం నేను చూడడానికే తీరిక లేదు" " నా ముఖం చూడడానికే చిరాకు" " ఊరికే ఏదో ఊహించుకోకు. " " స్వర్గం అనే ఊహించుకుని నిన్ను ప్రేమించా " " గుడ్, అలాగే ఉండు " ********* ఆ రోజు భార్గవ వస్తూనే" భావనా డార్లింగ్ " అంటూ భావనను చుట్టేశాడు. " ఈ రోజు గాలి ఇటు మళ్ళీందే! " " నేను చేస్తున్న ప్రొజెక్ట్ సక్సెస్. తరువాత ది స్విట్జర్లాండ్ లో. మనం స్విట్జర్లాండ్ లో రెండు నెలలు గడపబోతున్నాం" "వవ్! రోటీన్ కి దూరం గా" అంటూ భావన మనస్సు ఆనందం తో గువ్వ లా ఎగిరింది. ******* స్విట్జర్లాండ్ యూరప్ లో అందమైన ప్రదేశం. ప్రపంచం లోని సౌందర్యమంతా అక్కడే ఘనీభవించి నట్లు ఉంటుంది. వీకెండ్ లో లూసెర్న్ సిటి లో అందమైన సరస్సులు చూసి హొటల్ చేరారు. " లవ్ యు " అని భావన భార్గవ ను చుట్టుకుంది. "రంగా, నీల వెన్నెల ను బాగా ఎంజాయ్ చేస్తారు కదా" చెవిలో చెప్పాడు భార్గవ. "మీకెలా తెలుసు" "ఒక రోజు నిద్ర పట్టక లాన్ లో చూసాను" " దొంగా, పైకి కనబడవు కాని నీలో ఒక వాత్సాయనుడు ఉన్నాడు" " మనం కూడా వాళ్ళ ల్లా విహరిద్దామా?" భావన అడిగింది. " అమ్మో, నీ అందాన్ని చెట్లు కూడా చూడకూడదు." అని భావన అధరామృతాన్ని గ్రోలుతూ, దుప్పటీ కప్పాడు. ఇప్పుడు భావన స్వాధీన పతిక! ఆమె సమయస్ఫూర్తికి చక్కని ప్రతీక శ్రీవారి జ్ఞాపకాలను దాచుకునే నెమలీక ఎంత రాత్రైనా కానీ ఇంటికి రావలసిందే మాటలా! మజాకా! ఆమె స్వాధీన పతిక END