స్నానం - మద్దూరి నరసింహమూర్తి

Snanam

అత్తవారింటికి వచ్చిన కొత్తలో అత్తగారు కోడలు కౌసల్యని పిలిచి –

"అమ్మాయి, ఈ రోజు వరకూ అబ్బాయి బాగోగులు నేనే చూసుకున్నాను. ఇప్పుడు నీ చేతుల్లో అబ్బాయిని పెడుతున్నాను. ఇకమీదట నువ్వే వాడికి అన్నీను. ముఖ్యంగా సాలు మున్నూరు కాలం స్నానానికి వేడి నీళ్లుండాలి వాడికి. పొరపాటున చన్నీళ్ళు పోసుకుంటే ఆరోజు నుంచి వారం రోజుల వరకూ జలుబుతో బాధపడతాడు. అందుకే ఎప్పుడేనా తీర్థ యాత్రలకు వెళ్తే, అక్కడున్న నదులలో కానీ పుష్కరుణలలో కానీ స్నానం చేయక సంప్రోక్షణతోనే నెట్టుకొస్తున్నాడు. ఈ విషయం నువ్వు ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి సుమా" అని జాగ్రత్తలు చెప్పేరు.

"అలాగే అత్తయ్యా, మీరేమీ బెంగపెట్టుకోకండి. ఇక మీదట నేను చూసుకుంటాను" అని కౌసల్య అత్తగారికి మాటిచ్చింది.

కొత్తగా పెళ్ళైన కొడుకు కోడలికి కొన్నాళ్ళు ఏకాంతం ఇచ్చినట్టు అవుతుంది తీర్థయాత్రలకు వెళ్లినట్టు అవుతుంది అనుకున్న కృష్ణారావు తల్లితండ్రులు తీర్థయాత్రలకు బయలుదేరేరు.

వారు అలా వెళ్లిన తరువాత ఒక రోజు ఉదయం కౌసల్య –

"ఏమండీ మీకు చన్నీళ్ళ స్నానం అంటే భయమా, పడదా" అని అడిగింది.

"ఏమో. పడదు అన్న భయమేమో"

"అయితే ఈరోజు నేను చెప్పినట్టు చేయండి మీకు భయం పోతుంది"

"ఏమిటది"

"మనిద్దరం ఒకరినొకరం గట్టిగా కౌగలించుకొని కలిసి స్నానం చేద్దాం. మన మధ్య పుట్టే వేడికి మీకు నీళ్లలో చల్లదనము తెలియదు"

"నిజంగా అలా జరుగుతుందంటావా"

"ప్రయత్నించడంలో తప్పులేదుగా పైగా లాభం ఉండొచ్చేమో"

"లాభమా, అదేమిటి"

"ముందు స్నానాలగదిలోకి పదండి లాభమేంటో తెలుస్తుంది. నేను వీధి తలుపు, పెరటి తలుపు గడియలు పెట్టి వస్తున్నాను"

రెండు నిమిషాల తరువాత వచ్చిన కౌసల్య –

"ఇంకా లుంగీతోనే ఉన్నారా విప్పి అక్కడ అలా పడేయండి" అని,

అతను చూస్తూండగా తన బట్టలు ఒక్కొక్కటి విప్పడం ఆరంభించి ఆఖరికి పూర్తిగా నగ్నంగా నిలబడి –

"నన్ను చూస్తూంటే ఇప్పుడు మీలో వేడి పుడుతోందా"

-2-

"ఇప్పుడిప్పుడే పుడుతోంది, కొంచెం దగ్గరకిరా" అంటూ దగ్గరగా వచ్చిన కౌసల్యని కృష్ణారావు తమకంతో గట్టిగా కౌగలించుకున్నాడు.

కౌసల్య కూడా కూడా దీటుగా ప్రతిస్పందించింది.

భార్యాభర్తలిద్దరూ ఆ వేడికి కరిగిపోతూ స్నానాలగదినే పడకగదిగా భావిస్తూ చాలా సేపు ఉండిపోయేరు.

"నన్ను కౌగలించుకుంటే మీలో వేడి పుట్టి చన్నీళ్ళ స్నానం హాయిగా చేయగలరని నేను చెప్తే, ఇదేమిటి వేళకాని వేళలో ఇలా చేసేరు"

"నువ్వలా నిలబడితే చూస్తూ ఎలా ఉండగలను చెప్పు. నాకైతే చాలా బాగుంది, నీకు బాగులేదా"

"నాక్కూడా బాగుందనుకోండి. మనం వచ్చిన పని వదిలి ఇలా అయిపోయేమేమిటి అన్నదే నా ఆలోచన. సరే. అయిందేమిటో అయింది. ఇప్పుడు మీకు చాలా వేడి పుట్టింది కదా, నేను ఇలాగే నిలబడి ఉంటాను, హాయిగా చల్లటి నీళ్లతో స్నానం చేసేయండి"

"ఇందాకా పుట్టిన వేడి ఇప్పుడు తగ్గిపోయింది. కాబట్టి నువ్వలా నిలబడితే చాలదు, వచ్చి నన్ను కౌగలించుకో. ఇద్దరం ఒకేసారి స్నానం చేద్దాం"

"అలాగే. కానీ మీరు కౌగలింతతోనే ఆపేయాలి"

"అలాగే. ముందు నువ్వు వచ్చి నన్ను కౌగలించుకొని నాలో వేడి పుట్టించు"

కౌసల్య వచ్చి భర్తని బిగియారా కౌగలించుకొనేసరికి –

కృష్ణారావు కూడా దీటుగా ప్రతిస్పందించేడు.

ఈసారి కూడా కౌగిలింతతో ఆగలేకపోయేరు.

ఆ రోజుకి ఇద్దరూ వేడినీళ్లతోనే స్నానం కానిచ్చి - ఉష్ణం ఉష్ణేన శీతలం అన్నట్టుగా చల్లబడ్డారు.

రెండో రోజు చేసిన ప్రయత్నంలో ముందురోజులాగే భార్యని గట్టిగా కౌగిలించుకొని - వేడినీళ్లు కాకుండా చన్నీళ్ళు కాకుండా - నులివెచ్చని నీళ్లతో స్నానం చేయగలిగేడు కృష్ణారావు.

-3-

రెండు రోజులు సాగిన ఆనందానుభూతులలాగే సాగిన మూడోరోజున భార్యని ఇంకా గట్టిగా కౌగిలించుకొని చన్నీళ్లతోనే స్నానం చేయగలిగేడు కృష్ణారావు.

ఆ విధంగా కృష్ణారావు చన్నీళ్ళ స్నానం చేసే ప్రయత్నంలో –

తీర్థయాత్రలకు వెళ్లిన కృష్ణారావు తల్లితండ్రులు వచ్చేవరకూ –

--దొరికిన ఏకాంతాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారు.

తీర్థయాత్రల తరువాత వచ్చిన కృష్ణరావు తల్లి—

కొడుకు చన్నీళ్ళ స్నానం చేయడం, అలా చేసినా ఏమాత్రం అనారోగ్యం లేకుండా ఉండడంతో ఆశ్చర్యంగా కోడలిని పిలిచి –

“అమ్మాయి, అబ్బాయి చేత చన్నీళ్ళ స్నానం ఎలా చేయించగలిగేవు, అలా చేసినా వాడికి ఎటువంటి అనారోగ్యం రాకుండా ఎలా ఉంచగలిగేవు" అని ఆనందంతో అడిగేసరికి –

ఏమి జవాబు చెప్పాలో తెలియక సిగ్గుతో క్రిందచూపులు చూస్తున్న కోడలిని చూసి ఏదో అర్ధమైనట్లుగా –

"అబ్బాయి స్నానానికి వెళ్తున్నట్టున్నాడు, వాడికేమి కావాలేమో చూడు. నేను మామగారితో గుడికి వెళ్లి వస్తాను" అని వెళ్లిపోయిన అత్తగారికి మనసులోనే నమస్కారం చేసుకుంది కౌసల్య.

అప్పటినుంచి – కృష్ణరావు తల్లితండ్రులు ఎక్కువగా తీర్థయాత్రలకు కాలం వినియోగిస్తున్నారు.

*****

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు