ఒద్దిక . - Aduri.HYmavathi.

Oddika

అది ఒక అడవి. పక్కనే సరస్వతీ నది పారుతుంటుంది.

అడవిలో చాలా జంతువులూ, పిట్టలూ జీవిస్తుంటాయి. ఐతే వేటి కవి వేరువేరుగా వాటి

జాతితో కలసి పోతుంటాయి తప్ప ఒకదాన్నొకటి పలకరించుకోడం, కష్ట సుఖాలు

చెప్పుకోడం, కబుర్లాడుకోడం ఎన్నడూ ఉండేదికాదు.

ఒకజాతి వాటికి మరోకజాతి పక్షికానీ, జంతువుకానీ ఎదురైతే పక్కకు తప్పు కుని తల

త్రిప్పుకుని పోయేవి కానీ పలకరించుకునేవి కావు.

జింకలు వాటికవే, కుందేళ్ళు వాటికవే, బాతులు, కొంగలు , కోయిలలు, చిలుకలూ అన్నీ

వేటికవి జీవిస్తుండేవి.

ఐకమత్యంకానీ, కలివిడితనంకానీ వాటికి లేవు. అది చిట్టడవి కావ టాన, చుట్టూ

గ్రామాలుండటాన క్రూరమృగాలు మాత్రం ఉండేవికావు, అందుకే వాటిలో ఐకమత్యం

లేకపోయినా ప్రాణభయంలేకుండా జీవించ సాగాయి.

ఒకమారు మంచి వర్షాకాలం.కుండపోతగా వర్షం ఆగకుండా పడ సాగింది.

జంతువులు,పక్షులుకూడా ఆహారానికి బయటకు రాను భయ పడి వాటి స్థావరా ల్లోనే

ఉండి పోయాయి.

ఉన్నట్లుండి కిలకిలారావాలతో ఒక పక్షుల గుంపు వచ్చి సరస్వతీ నదీ తీరం

లో ఉన్న పెద్ద రావిచెట్టు మీద వాలాయి.అవి ఒక దానితో ఒకటి కిలాకిలా పలకరించు

కుంటూ చేసే మధురమైన శబ్దాల తో ఆప్రాంతం ఎంతో మధురంగా మారిపోయింది.

"ఇక్కడ ఏజాతిపక్షులూ, జంతువులూ కనిపించడం లేదే! ఇది నిర్జనా రణ్యమా! నది

సమీపంలో పక్షులు లేకపోడం వింతే." అని మాట్లాడు కోడం చూసి, తమ నివాసాల్లో

ఉంటున్న జంతువులూ, పక్షులూతలలు బయటికి పెట్టి చూస్తూ విన్నాయి.

వర్షం కాస్తంత తగ్గగానే రెక్కలు టపటపలాడించుకుంటూ బయటకు వచ్చాయి

పిట్టలన్నీ. జంతువులుకూడ తమనివాసాలనుంచీ బయట కు వచ్చాయి.

కొత్త పిట్టలు వాటిని పలకరిస్తూ " మేము సరస్వతీ నదికి చాలాదూరాన ఉండే బాహుదా

నదీ తీరపు అడవిలో ఉంటాం. కొత్త ప్రాంతాలు చూడ టం మాకు ఇష్టం. మేముఅప్పుడ

ప్పుడూ ఒక్కోప్రాంతానికి వస్తుంటాం. ఈమారు ఈప్రాంతానికి వచ్చాం. వర్షం ఎక్కువ

కావటాన కొద్దిసేపు మీ అనుమతిలేకుండా మీ ప్రాంతంలో ఆగవలసి వచ్చింది.

మన్నించం డి." అన్నాయి.

ఏపక్షికానీ, ఏజంతువుకానీ ఏమీ బదులివ్వలేదు.

"మీ అనుమతిలేకుండా ఇక్కడ దిగటాన మీకు కోపం రావడంసహజం, ఐతే ‘ఆపత్కాలే

నాస్థి మర్యాద’ అని మేము తప్పని పరిస్థితుల్లోఇక్కడ దిగాం . మన్నించండి. మీ కోపం

పోగొట్టి మీకు వినోదం కల్పించి మీ మనస్సులకు సంతోషం కలిగిస్తాం. అంతా కొద్దిసేపు

ఈ రావి వృక్షం క్రింద సభ చేయండి." అని చెప్పి,

రామచిలుక మేము చిలకలం, నెమళ్ళం , పావురాలం, కోయిలలం, హంసలం,

బాతులం బాతుల్లోనూ చాలా రకాలు, కొంగలం ఇంకా చాలా ర్మగుల పక్షులం ,

మారంగులు, స్వరాలూ వేరైన మేమంతా ఒకే జాతి పిట్టలం అని భావించి అంతా కలసి

ఉంటాం. అదేమాకు గొప్పబలం." అని చెప్పి అపగానే, నెమలి నృత్యం చేస్తుండగా,

కోయిల, పాట పాడు తుండగా హమ్మింగ్ బర్డ్ మ్యూజిక్ ఇస్తుండగా మిగతా పక్షులు కొన్ని

వాటి కి చేతనైన సంగీతాన్ని, చేస్తూ నెమలి నృత్యానికి సంగీతాన్ని అందించాయి.

నెమలి సుమారుగా అర్థగంటసేపు నృత్యంచేసి ఆపగా, కోయిల తనపాట అందుకుంది.

ఆతర్వాత హమ్మింగ్ బర్డ్ సంగీతాన్ని అందించింది.ఇలా ఆపక్షులన్నీ సుమారుగా

రెండుగంటలసేపు ఆ ప్రాంతపు పిట్టలకూ, జంతువులకూ వినోదం చేకూర్చాక,అంద

మైన హంసలు అటూ ఇటూ మనోహరంగా నడుస్తూ " మీకోపం పోయి ఉంటుందని

భావిస్తున్నాం. " అన్నాయి.

అప్పుడు ఆప్రాంతపు చిలుక " మీరింత బాగా స్నేహంగా , రంగులూ, ఆకారాలూ,

స్వరాలూ వేరైనా ఇంత ఐకమత్యంగా ఎలా ఉంటున్నారు!. అంతా కలసి ఉంటే ఎంత

మనోహరంగా ఉంటుందో మాకు అర్థ మైంది. మా ప్రాంత వాసులం ఎవ్వరం ఇంతవరకూ

ఇంతసేపు కలసి ఒకచోట ఉండలేదు. కలసి ఉంటే ఎంత సుఖమో,ఆనందమో మాకు

తొలిసారిగా అర్థమయ్యేలా చేసిన మీ కొత్త పిట్టలకంతా మా అందరి తరఫునా

ధన్యవాదాలు. ఇహ నుంచీ మేమందరం మీ లాగా కలసి ఉండాలని నేను

వాంఛిస్తున్నాను. ఏమంటారు మిత్రులారా!" అనగానే ఆప్రాంతపు పిట్టలూ, జంతువులూ

అన్నీ ఏకగ్రీవంగా తమ స్వరాలతో కలకలా ధ్వనులు చేయగా కొత్త పిట్టలూ తమ

స్వరాలను కలిపాయి.

అలా ఆప్రాంతంలో ఐకమత్యం ఏర్పడి అన్నీ సాయం కాలానికి ఒక చోట కల్సి,

కష్టసుఖాలూ తమ అనుభవాలూ చెప్పుకోసాగాయి. అలా కబుర్లాడుకోడంలోని మాధుర్యం

వారికి తెలిసివచ్చింది . ఎవరికి ఏ అవసరం వచ్చినా పరస్పరం సహకరించి

సంతోషించ సాగాయి. ఐకమత్యంలో మాధుర్యం వారికి అప్పుడు తెలిసివచ్చింది.

***

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి