మేరెజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ - బొమ్మిరెడ్డి పల్లి ప్రమీల రవి

Marriages are made in heaven

"వసూ ఎనిమిది అవుతోంది ఇంకా పడుకుంటే ఎలా... ఆడపిల్లలు పొద్దున్నే లేవాలి గాని. " అంది లక్ష్మి కాంతమ్మ కూతురు తో కోపంగా. "ఇవాళ సండే సెలవేగా... ఒక గంట ఎక్కువ పడుకుంటే ఏమిటి నీ గోల?" విసుక్కుంటూ మళ్లీ దుప్పటి మీదకు లాక్కుంటూ అంది వసుంధర. "హనుమ మామయ్య పెళ్లి సంబంధం మాట్లాడానికి పది గంటల కి వస్తా అన్నాడు. కొంచం లేచి తయారయి రా" రుస రుస లాడు కుంటా వంటింట్లో కి గారెలు మరో వాయి వెయ్యడానికి వెళ్ళిపోయింది లక్ష్మి కాంతమ్మ. వసుంధర కి అదే కోపం. తనకి చెప్పకుండా పెళ్లి చూపులు ఆరెంజ్ చెయ్యడం. వెంకటరావు, లక్ష్మి కాంతం ల కి ఇద్దరు అమ్మాయిలు పెద్ద అమ్మాయి వసుంధర రెండో అమ్మాయి సుజాత. వసుంధర బీకామ్ కాగానే బ్యాంక్ లో గత నాలుగేళ్లుగా క్లర్క్ గా జాబ్ చేస్తోంది. సుజాత బీటెక్ కాగానే యుఎస్ లో మాస్టర్స్ చేసి రీసెర్చ్ చేస్తోంది. వసుంధర కి ప్రమోషన్ తీసుకొని ఆఫీసర్ అవాలని లక్ష్యం. దానికి ముఖ్య కారణం కౌంటర్ లో పనిచేస్తుంటే వెనక కూర్చునే ఆఫీసర్లు, వాళ్ల ఆటిట్యూడ్ బాస్ఇజం చూసి తను కూడా ప్రమోషన్ తెచ్చుకోవాలని అంత వరకు 'నో పెళ్ళి' అని డిసైడ్ అయింది.వచ్చే ఏడాది ప్రమోషన్ కి తను ఎలిజిబుల్ , టెస్ట్ కి ప్రిపేర్ అవుతోంది కూడా. అలాంటిది అమ్మ అర్ధం చేసుకోవట్లేదు అని బాధ. లక్ష్మీ కాంతమ్మ గారి కి తొందరగా అమ్మాయిల కి వివాహం చేశాయాలని. తప్పించు కోడానికి వెంటనే ఒక ఐడియా వచ్చింది. తన క్లోజ్ ఫ్రెండ్ రజని కి ఫోన్ కలిపి " రాజీ నేను మీఇంటికి వద్దమనుకుంటున్నాను. మీకు ఒకే నా. బుజ్జి గాడ్ని కి కూడా చూసి చాల రోజులు అయింది. మీకు ఏమి ప్రోగ్రాం లేక పొతే నే.." "భలే గా మాట్లా డు తావు. తొందర గా వచ్చేయి. ." అంది. రజని,వసుంధర కంటే రెండేళ్లు సీనియర్. వాళ్ళ బ్యాంక్ కస్టమర్ నే ప్రేమ వివాహం చేసుకుంది. వాళ్ళకి పది నెలల బాబు. వసుంధర కి వాడితో ఆడు కోవాలంటే చాలా ఇష్టం. రజని వాళ్ళు యేడాది క్రితం కొత్త ఇల్లు కట్టుకుని సిటీ ఔట్ స్కర్ట్ కి షిఫ్ట్ అయిపోయారు.వెంటనే తయార్ అయి కొంచం కాఫి తాగి క్యాబ్ బుక్ చేసుకొని వెళుతూ మాట వరసకి చెపుతున్నట్లు "నేను రజనీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా సాయంత్రానికి వచ్చేస్తా. " అంటూ చోద్యం చూస్తున్నట్లు చూస్తూన్న అమ్మ ఏదో అంటున్న పట్టించుకోకుండా బయలు దేరి వెళ్తుంటే గేట్ దగ్గర హనుమ అంకుల్ కని పించినా చూడ నట్లు వెళ్లి పోయింది వసుంధర. రజని వాళ్ల ఇల్లు చిన్నగా ఉన్నా చుట్టూ జాగా బాగా వదిలారు. చాలా చెట్లు పెంచు తున్నారు. ఆ వాతావరణ0 వసుంధర కి చాలా యిష్టం. వసుంధరనీ చూడ గానే రజని "ఫస్ట్ ఇడ్లీలు లాగించేయి తర్వాత నీకు చాలా పని ఉంది" అంది. " ఏమిటో అంత పని.." "నువ్వు వస్తున్నావు అంటె మీ బావగారు నార్త్ ఇండియన్ డిషెస్ కావాలట. నాకేమో రావు. నువ్వు ఎక్సపర్ట్ కదా. అందుకే మార్కెట్ కి పరిగెత్తారు. ఏవో తెస్తారు ట " అంది రజని. మాటల్లోనే మూర్తి వచ్చాడు సంచి నిండా మసాలా సామనుతో. "బుజ్జి గాడిని పడుకో పెట్టి స్నానం చెసి వస్తా. ఈలోపల కిచెన్ అంతా నీదే. విజృంభించి నీ టాలెంట్ చూపించు " అంటూ బెడ్ రూమ్ లోకి వెళ్ళి పోయింది రజని. మూర్తి అలా ఒక సిగరెట్ లాగించి వస్తా అంటూ వీధి చివర పాన్ షాపు కి వెళ్ళిపోయాడు. ఆలోచించి బగరాబైగన్, జీరా రైస్ అని డిసైడ్ అయి వంట లో పడి పోయింది వసుంధర. భోజనాలు అయ్యాక బుజ్జి గాడితో ఆటలతో సాయంత్రం ఆరు గంటల వరకు గడిచి పోయింది. "నేను ఇక బయలు దేరుతా.." అంది వసుంధర. "అంతా దూరం క్యాబ్ లో ఒక్కతీవీ ఈవెనింగ్ టైం లో మంచిది కాదు. నేనూ , బావగారు డ్రాప్ చేస్తాం. బుజ్జి గాడికి వీక్లీ ఔటింగ్ కూడా అవుతుంది " అంటూ వసుంధరనీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఒక సారి మీ అమ్మ గారిని పలకరించి వెళ్తాం అంటూ ఇంట్లోకి వచ్చారు రజని, మూర్తి. నాన్న హాల్లో నే కూర్చోన్నారు. అమ్మ వాళ్ళ గది లో ఉన్నట్టు ఉంది గది లోంచి అమృతాంజనం వాసన వస్తోంది. అమ్మ కోపం తో తలనెప్పి తెచ్చుకున్నట్టుంది అనుకుంటూ "అలా అయితే మళ్లీ ఏమ్ వండు కుంటారు ఇప్పుడు ఇంటికి వెళ్లి..సింపుల్ ఆలూ ఫ్రై ,చారు చేస్తా డిన్నర్ ఇక్కడే కానిచేయండి" అంటూ సరా సరి కిచెన్ లో కి పరిగెత్తింది వసుంధర. మూర్తి వెంకట్రావ్ గారి తొ మాట్లాడుతుంటే రజని లక్ష్మీ కాంతమ్మ గారి రూమ్ లో కి వెళ్ళింది పలక రించ డానికి. అరగంట లో వంట చేసి భోజనాలు అయ్యాయి అని పించి వాళ్ళని సాగా నంపింది వసుంధర. మళ్లీ మామూలే సోమ వారం నుంచి బ్యాంక్, కస్టమర్స్ హడావిడి. మళ్లీ శనివారం వచ్చేసింది. వసుంధర కి ఆదివారం ఫోబియో. అమ్మనీ ఎలా ఫేస్ చేయాలి. ఆలోచన లో ఉన్న వసుంధర దగ్గరగా వొచ్చి "వసు రేపు కూడా మా ఇంటికి రావాలే..." అంది రజని. "మొన్నే గా వొచ్చింది. మీ ఆయన ఇద్దరినీ వాయిస్తాడు ఏమ్ పనిలేదా అంటూ.." అంది వసుంధర. "మా ఆయనే రిక్వెస్ట్ చేసాడు. రేపు వాళ్ళ ఫ్రెండునీ లంచ్ కి పిలిచాడు. ఆయన గారికి బిర్యానీ అంటే ప్రాణం ట. నాకేమో చెయ్యడం రాదు. అందుకే ఈ బతిమాలు. తల్లీ తప్పించు కో లేవు కాబట్టి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కి విచేయి. ఇప్పుడు ఇంటికి వెళ్తూ కావలసిన సామాగ్రి పట్టు కెళ్త. బయట మా ఆయన కార్లో వెయిట్ చేస్తూ వున్నా డు " అంటూ వెళ్ళి పోయింది. అయితే ఈ సండే కూడా అమ్మని ఫేస్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటూ ఇంటికి బలుదేరింది వసుంధర. అనుకున్నట్లు గా పొద్దున్నే లేచి ఇంట్లోకి అన్నం, కూర పులుసు వండి డైనింగ్ టేబిల్ మీద సర్ది అక్కడే కూర్చుని కాఫి తాగుతూ మాట్లాడు కుంటున్న తల్లి తండ్రుల కి 'నేను రజనీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా' అని చెప్పుకుంటూ బయటపడింది వసుంధర. వసుంధర నీ చూడంగానే మూర్తి"మీకు ఇది టెస్ట్. నేను మా ఫ్రెండు కి బెస్ట్ బిర్యాని తినిపిస్తా అని ప్రామిస్ చేసా. నా పరువు మీరే నిలా పెట్టాలి"అంటూ చేతులు జోడించాడు. చిన్నగా నవ్వు కుంటు వసుంధర కిచెన్ లోకి వెళ్ళి పోయింది. మొత్తం బిర్యానీ సామగ్రి చేతికి అప్పగించి రజని"బుజ్జీ గాడికి కొంచం నలత గా ఉంది. ప్లీజ్ భారం అంతా నీమీద పెడ్తున్న " అంటూ జ్వరం తొ ఏడుస్తున్న బుజ్జి గాడిని తీసుకొని గది లొకి వెళ్ళిపోయింది. వెంఠనే కార్యాచరణ లోకి దిగింది వసుంధర. సొంత ఆలోచన తొ ముందు స్టార్టర్ గా మంచూరియా ,టొమాటో సూప్ , మెయిన్ కోర్సు గా ఆలూ దమ్ బిర్యాని, మిర్చీ కా సాలన్, డబుల్ కా మీటా స్వీట్ తొ ముగించేసింది. వడియాలు వేయిస్తుంటే కాలింగ్ బెల్ మోగింది. గెస్ట్ వొచ్చేసి నట్టు ఉంది అనుకుంది. హల్ లోనే ఒక పక్కగా డైనింగ్ టేబుల్ ఉంది. వండిన పదార్థాలు డైనింగ్ టేబిల్ మీద సర్దాలి అని ఒక్కక్క ఐటం మెల్లిగా చేర వేస్తుంటే మూర్తి "వసు ఈయన మా ఫ్రెండ్ చక్రవర్తి" అంటూ పరిచయం చేశాడు. అసలే కిచెన్ లొ మగ్గిన అవతారం తోనా పరిచయం అని కొంత కోపం వొచ్చినా రాని నవ్వుతో "నమస్కారం" అంది వసుంధర. ఈలోగా రజని వొచ్చి తను కూడా ఆయన్ని విష్ చేసి వసుంధర వైపు తిరిగి"రా లోపలి కి వెళదాం పద" అంటూ బెడ్ రూమ్ లోకి తీసుకు వెళ్ళిపోయింది. అల్మారా నుంచి ఒక ఇస్త్రీ చీర తీసి "ఇది మార్చుకుని కొంచం ఫ్రెష్ అయి రా" అంటూ బయటికి హల్లోకి వెళ్లి పోయింది. చేసేది లేక తను చెప్పినట్లు తయారయి బుజ్జి గాడి దగ్గర కూర్చుంది. రజని "అదేంటి బుట్ట బొమ్మా లా ఇక్కడ కూర్చున్నావు హాల్లొకి రా. బుజ్జి గాడు ఇప్పుడే లేవడు. క్రోసిన్ సిరప్ వేసా గా" అంటూ చేయి పట్టు కొని హాల్లో సోఫాలో కూర్చోబెట్టింది. "ఇవాళ మా స్పెషల్స్ అన్నీ మా ఆఫీసర్ గారే చేశారు" అంటూ వసుంధరనిఆమె వంటని పొగడుతూ అన్నాడు మూర్తి. మూర్తి ఎప్పుడూ వసుంధర నీ ఆఫీసర్ అని గేలి చేస్తుంటాడు. ఇంతలో రజని సూపు, మంచరియా సర్వ్ చేస్తూ "ఇవి స్టార్టర్స్" అంటూ అందరి ముందర వుంచింది. టేస్ట్ చేసిన చక్రవర్తి గారు "లవ్లీ.. చాలా ఏమ్మిగా గా బావున్నాయి"అంటూ మళ్లీ సర్వ్ చేసుకున్నాడు. అప్పుడు గమనించింది వసుంధర. మాంచి హైటు దానికి తగ్గట్టు ఫీజిక్. చామన ఛాయ అయినా ముఖంలో ఏదో కళ. డ్రెస్సింగ్ కూడా నీట్ గా చెప్పాలంటే చూడంగానే ఆకట్టు కునేలా వున్నాడు. మాటల్లో తెలిసింది అతను చార్టెడ్ అకౌంటెంట్ అనీ ఒక పెద్ద ఫైనాన్స్ కంపెనీకి జనరల్ మేనేజర్ అని. అతను తలచుకుంటే వాళ్ళ కంపెనీ డిపాజిట్ యే బ్యాంక్ లో అయినా పెట్టచ్చు అని. ఇంకేమి వసుంధర లెక్కలు వేసుకుంది. తన ఆఫీసర్ ప్రమోషన్ కి బిజినెస్ టార్గెట్స్ కూడా కౌంట్ అయితాయి. ఇంతలో చక్రవర్తి తనే బ్యాంక్ టార్గెట్స్ టాపిక్ రైస్ చేశాడు. వెంఠనే రజని వసుంధర ప్రమోషన్ ఆస్పిరేషన్ అందుకు మంచి రిపోర్ట్ రావాలంటే బిజినెస్ టార్గెట్స్ గురించి చెప్పింది. చక్రవర్తి తమ కంపెనీ అకౌంట్నీ వాళ్ళ బ్యాంక్ కి షిఫ్ట్ చేయడానికి ఆఫర్ చేశాడు. సోమ వారం నాడు బ్యాంక్ వచ్చి అకౌంట్ ఓపెన్ చేయిస్తాను అని తన పర్సనల్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తానని అసూరెన్స్ ఇచ్చాడు. వసుంధర కృతజ్ఞత పూర్వకరం గా ఆతని వైపు చూసింది. అతని చిరు నవ్వు ఎంతో ధైర్మంనీ యిచ్చింది. లంచ్ అయిపోయాక ఇంక వసుంధర బయలు దేరటానికి తయారయ్యింది. చక్రవర్తి నేను డ్రాప్ చేస్తానంటూ తను కూడా అటే వస్తున్నాను అని తన కారు లో లిఫ్ట్ ఇస్తా నంటూ ఆఫర్ చేశాడు. వసుంధర కొంచం బిడియంగా అతని తొ కారు లో బయలుదేరింది. దారి పొడవునా డిస్కషన్ లో ఆతని నాలెడ్జ్ వసుంధర కి అర్థం అయింది. ఇంట్లోకి రమ్మనలా అని ఆలోచిస్తున్న వసుంధర కి బై చెప్తూ చక్రవర్తి కారు రివర్స్ చేసు కొని వెళిపోయాడు. అన్నట్లుగానే చక్రవర్తి బ్యాంక్ వచ్చి అకౌంట్స్ ఓపెన్ చేశాడు. అతని డిపాజిట్ తొ బ్రాంచ్ డిపాజిట్ టార్గెట్స్ నీ మించి పోవడంతో బ్రాంచ్ మేనేజర్, రీజినల్ మేనేజర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. రజని "ఇంకేంటి ఆఫీసర్ ప్రమోషన్ కొట్టేసి నట్లే. ట్రీట్ ఇయ్యాల్సిందే" అంది .స్టాఫ్ అంతా అడ్వాన్స్డ్ కంగ్రాట్స్ చెప్తుంటే వసుంధర ఈ క్రెడిట్ అంతా చక్రవర్తి గారిదే అనుకుంటూ రజని తొ "చక్రవర్తి గారిని ఏదైనా మంచి హోటల్ లో ట్రీట్ ఇస్తే బాగుంటుంది కదా నువ్వే ఇనిషియెట్ చేయాలి " అంది వసుంధర. "మంచి ఐడియా కాని నువ్వే ఇన్వైట్ చేస్తే బాగుంటుంది. కాల్ చేసి రేపు శని వారం ఆరెంజ్ చెయ్ "అంటూ సజెషన్ చేసింది రజని. అనుకున్నట్లు గానే శని వారం తాజ్ మహల్ హోటల్ లో లంచ్ కి చక్రవర్తి వొచ్చాడు. లంచ్ అయిపోగానే తనకు ఆఫీసు లొ అర్జంట్ పని ఉందంటూ చక్రవర్తి వెళ్ళిపోయాడు. సంతోషం తోవెలిగిపోతున్న వసుంధర ముఖం చూసి "ఏంటీ అమ్మాయి గారు ఆనంద పడిపోతున్నారు. మనసులో మాట చెప్పచ్చు గా"అంది రజని. సిగ్గు పడుతున్న వసుంధర ముఖం చూస్తూ"నా దగ్గర దాచడం ఎందుకు... నీకు చక్రవర్తి అంటే ఇష్టం కదూ. ఊ అంటే మ్యాచ్ ఫిక్స చేస్తా " అంటున్న రజని భుజం మీద సిగ్గుతో వాలి చెప్పకనే తన ఇష్టం తెలియచేసింది వసుంధర. "సరే అయితే ఇక నేను ఇంటికి వెళ్లాలి బుజ్జి గాడు ఎదురు చూస్తుంటాడు."అని క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయింది రజని. ఆటో లో ఇంటికీ వెళ్తూ అలోచ లో పడింది వసుంధర. అతని కులం ఏమిటో తెలియదు ఇంట్లో అమ్మా నాన్న వొప్పుకుంటారో లేదో అనే భయం పట్టుకుంది. రాత్రి అంతా నిద్రపోలేదు. రేపు ఆదివారమే కదా లేట్ గా లేవచ్చులే అనుకుంటూ తెల్లారుఝామున మంచి నిద్ర లోకి జారీ పోయింది. పొద్దున్నే మళ్లీ అదే గోల. లక్ష్మి కాంతమ్మ గారు "ఒసే పొద్దెక్కింది లేవవే" అంటూ. చిరాకు గా "పో. నా ఇష్టం వచ్చినప్పుడు లేస్తా" అంటూ ముసుగు తన్నింది వసుంధర ."మాట వినవు గా "అంటూ ఆవిడ వంట గది లోకి వెళ్ళపోయింది. అలా ఎంత సేపు పడుకుందో బయట హాల్ లో హడావిడి కీ మెలుకువ వచ్చింది వసుంధర కి. హనుమా అంకుల్ గొంతు పెద్దాగా వినిపిస్తోంది. వసుంధర కి కోపం నషాళానికి అంటింది. గబుక్కున లేచి ఆ నిద్ర మొఖం తోనే హాల్లో కి వచ్చీ "అమ్మా"అంటూ ఒక్క కేక వేసింది. అందరూ ఒక్కసారి ఉలిక్కి పడి వసుంధర నే చూస్తున్నారు. అప్పుడే చూసింది వసుంధర అక్కడ వున్న హనుమ అంకుల్ తో పాటు రజని, మూర్తి ఇంకా సర్ప్రైజింగా చక్రవర్తి అతని పక్కన ఒక పెద్దావిడ వాళ్ళ అమ్మగరేమో. వెంటనే రజని నవ్వుతూ "వసు... కోపం తగ్గించవే. ఆ రోజు మీ అమ్మగారిని చూసి మాట్లాడక ఈ నాటకం ఆడక తప్పలేదు. చక్రవర్తి ఎవరో కాదు మీ హనుమ అంకుల్ గారి అక్కయ్య గారి కొడుకు అంటే ఆయన మేన అల్లుడు. చూడు ఈ నాటకం లొ మా పాత్రలు నీ కోసమే" అంది. వసుంధర రజని చేయిని గట్టిగా పట్టుకుంది తన కృతజ్ఞతగా. చక్రవర్తి అందుకుని"వసుంధర గారు మీరు కోరు కున్నట్లు గానే మీకు ఇష్టం అయితే ...మీ ఆఫీసర్ ప్రమోషన్ తర్వాతే వివాహం. " సిగ్గు తొ గభాల్న అమ్మ భుజం మీద వాలి వసుంధర"అమ్మ నాన్న లకి మా మంచి ఏమిటో తెలుసు. సారి అమ్మా నిన్ను భాద పెట్టాను" అంటూ కన్నీరు కారుస్తున్న వసుంధర నీ దగ్గరగా తీసుకుంది లక్ష్మికాంతమ్మ.నాన్న వెంకట్రావ్ తల మీద ప్రేమ గా తడుతుంటే హనుమా అంకుల్ కి రెండు చేతులతో నమస్కారం చెసింది వసుంధర.దూరంగా ఉండి కొంటే చూపులు చూస్తున్న చక్రవర్తి కి అభిమాన పూర్వకం గా కళ్ల తోనే తన ప్రేమ వ్యక్తం చేస్తూ ఆనందంగా కళ్ళు మూసుకుంది వసుంధర. ఇదేనేమో "మేరీజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్".. అంటే అనుకుంది వసుంధర.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు