తొలిముద్దు - తాత మోహనకృష్ణ

Tolimuddu

ముద్దు అంటే ఎవరికి ఇష్టముండదు..? అందులోనూ అందమైన అమ్మాయితో ఆ తొలి ముద్దంటే. ఈ రోజుల్లో..ముద్దుకు అసలు విలువే లేదు. ఒక ఆడ ఒక మగకి నాలుగు మాటలు కలిస్తే చాలు..ముద్దుకు గ్రీన్ సిగ్నల్. అదీ ముదిరితే..ఇంకా అడ్వాన్స్ అయిపోతున్నారు.

కానీ నా విషయం వేరు. నేను చిన్నప్పటినుంచి చాలా పద్దతిగా పెరిగాను. అలాగే నా ఆలోచనలు కూడా. బాగా చదువుకుని, పెద్ద ఉద్యోగంలో ఉన్నాను. చూడడానికి బాగానే ఉంటాను.

ఎంతో మంది ఆడవారు నన్ను తినేసేలా ఒక ముద్దు కోసం చూసినా.. నేను ఎప్పుడూ చలించలేదు..నా గురించి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోలేదు. నా తొలిముద్దు మాత్రం నాకు కాబోయే పెళ్ళాం తోనే అని ఎప్పుడో డిసైడ్ అయ్యాను. ఫ్రెండ్స్ అంతా నేను పాతకాలం మనిషినని హేళన చేసినా సరే..అదే నా పాలసీ అని అందరితోనూ ఖచ్చితంగా చెప్పేసాను.

మా ఆఫీస్ లో కొంత మంది అమ్మాయిలు అయితే.. నా ఎంగిలి తిని ముద్దు పెట్టినంత ఆనందాన్ని పొందడానికి ట్రై చేశారు. దానికీ నో ఛాన్స్. నా ఎంగిలి తినాలన్నా.. నా పెళ్ళానికి మాత్రమే హక్కుంది.

ఇంత ఆలోచనలు ఉన్న నాకు..ఇంట్లో పెళ్లి చెయ్యాలని డిసైడ్ చేశారు. తొలిముద్దు కోసం ఇప్పటికే పాతిక బర్త్ డేస్ ఓపిక పట్టాను. సినిమాలు చూస్తున్నాను, టీవిలో హాట్ మూవీస్ చూస్తున్నాను కదా..నాకు తొందరే మరి. నాకు వచ్చే అమ్మాయి ఎలా ఉంటుందో అని అప్పుడే ఆలోచనలో పడ్డాను. ఆమె పెదాలు పెద్దవిగా ఉంటే, పెట్టే ప్రతి ముద్దుని బాగా ఎంజాయ్ చేయొచ్చని ఎక్కడో చదివాను.

పేరెంట్స్ చాలా ఫొటోస్ చూపించారు. పై నుంచి కింది వరకు చూసినా, కొంత నచ్చినా.. పెదాల విషయంలో మాత్రం ఒప్పుకోలేను. పెళ్లికి ముందు అమ్మాయిలో పైకి కనిపించే అందంతో పాటు ఆ పెదాలు కుడా అందంగా, పెద్దగా ఉండాలని అనుకోవడం తప్పు కాదు కదా..! మిగిలినవి మనం ఎలాగో సెలెక్ట్ చేసుకోలేము..బయటకు కనిపించేవి కనీసం మనసుకు నచ్చేటట్టు ఉండాలని.. చూసిన ఫొటోస్ రిజెక్ట్ చేసేసాను.

చివరకి ఒక అమ్మాయి బాగా నచ్చింది..కాకపోతే ఆ అమ్మాయి ఉండేది వేరే ఊరిలో. అక్కడే జాబ్ చేస్తోంది.

ఒక మంచి రోజు..పెళ్లి చూపులు కోసం బయల్దేరాము. పెళ్లి చూపులలో అమ్మాయిని చీరలో చూసిన తర్వాత..నాకు ఇంకా బాగా నచ్చేసింది. ఇద్దరినీ విడిగా మాట్లాడుకోమన్నారు. ఇద్దరమే ఉన్న ఆ గదిలో నా మొదటి ముద్దు పెట్టాలన్నంతగా అమ్మాయి నచ్చేసింది. మరి ఆ అమ్మాయి మనసులో ఏముందో..?

"హలో..నేను మీకు నచ్చానా..?" అని తెగించి అడిగేసాను

"ఆ అమ్మాయి నన్ను పైనుంచి కింది వరకు చూసి..బాగానే ఉన్నారు..నాకు మీరు బాగా నచ్చారు.."

"అయితే మనకి సగం పెళ్లి అయిపోయినట్టే..నా కోరిక ఒకటి ఉంది.." అని అన్నాను

"చెప్పండి.." అని తియ్యగా అంది

"తొలిముద్దు కోసం పాతిక సంవత్సరాలు వెయిట్ చేసాను. మీరు నన్ను ఓకే చేసిన తర్వాత..ఇక ఆగడం నా వల్ల కావట్లేదు.."

"ఛా..! మరి నేను కాదా..ఇరవై సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను ఆ తొలిముద్దు కోసం. పెళ్ళైతే..నా పెదాలే కాదు.. నేనే పూర్తిగా మీ సొంతం.. అప్పుడు ఏమైనా చేసుకోండి.."

"నేను చాలా లక్కీ..కానీ దొంగిలించిన జామకాయ..పెళ్ళికి ముందు కాబోయి పెళ్ళాంతో ముద్దు టేస్ట్ వేరే కదా.."

"మీకు భలే టేస్ట్ లు ఉన్నాయే..! అయితే ఎంగేజ్‌మెంట్ అయ్యాక..ఒకటి ఇస్తాను..పెళ్ళివరకు ఇంకొన్ని ఇస్తాను..అంతే..! " అంది ఆమె

"అయితే ఎంగేజ్‌మెంట్ ఇప్పుడే చేసేసుకుందాం..! మా పేరెంట్స్ తో ఇప్పుడే చెబుతాను.." అని అన్నాను

"తొందర ఎక్కువే..కాబోయే శ్రీవారికి.." అంటూ బుగ్గ గిల్లింది నాకు కాబోయే పెళ్ళాం

******

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు