తన ఇంటి అరుగుపై కథ వినడానికి చేరిన పిల్లలు అందరికి మిఠాయిలు పంచిన తాతయ్య " బాలలు మీరు ఎటువంటి కథ వినాలి అనుకుంటున్నారు " అన్నాడు.
" తాతగారు మాటలసందర్బంగా కుక్కను కొడితేడబ్బు అంటూ ఉంటారు పెద్దవాళ్ళు ఆమాట ఎలాపుట్టిందో కథా రూపంలో తెలీయజేయండి " అన్నది కన్యక.
"అలాగే చెపుతాను వినండి.పూర్వం మన రాజ్యపొలిమేర్లలో చొక్కరాతి అనేగ్రామంలో శివయ్య అనే యువకుడు నివసిస్తుండేవాడు తనకు ఎవరులేక పోవడంతో తనకుఉన్నపొలంలోనే యిల్లు నిర్మంచుకుని ఆదరణలేని కొందరు వృధ్ధులను,బాలలను చేరదీసి వారికి భోజన, వసతి సదుపాయాలు కలిగించాడు,ఇతని చేస్తున్న మంచిపనికి ఆపరిసర ప్రాంతాలలోనివారు తమకు తోచిన సహయంగా కూరగాయలు,పప్పు దినుసులు,ధాన్యం,ధనం అందిస్తూ ఉండేవారు. యిద్దరు దొంగలు ఓకరోజు పొరురాజ్యంలో దొంగిలించి నగలు,ధనం మూటకట్టుకుని రాత్రం తాప్రయాణంచేసి వస్తూ శివయ్య యింటికి కూతవేటు దూరంలోకివచ్చి తాము దారిలో సేకరించూకున్న మాంసాహరాన్నినిప్పులపై కాల్చుకుని దాన్ని బంగారం ధనంఉన్న మూటలో దాచి,మూటను అక్కడేఉంచి కొద్దిదూరంలోని వేపచెట్టు పుల్లలు రెండు విరుచుకుని పక్కనేఉన్న వాగువద్దకు చేరి దంతాలు శుభ్రపరుచుకోసాగారు. కాల్చిన మాంసం వాసనకు వచ్చి ఒకుక్క వారు కాల్చిన మాంసం మూట వాసన చూడసాగింది.అదిగమనించిన దొంగ కుక్కపైకి అందుబాటులోని రాయి విసిరాడు, రాయిని తప్పించు కున్నకుక్క ఆమూటను నోటకరుచుకుని వేగంగా పరుగుతీస్తూ శివయ్య యింటి ముందు ఉన్నతొటలోనికి వెళ్ళింది. కుక్కను కొందూరం తరిమిన దొంగలు రక్షకభటులు కనిపించడంతో చల్లగా జారుకున్నారు. కూరగాయల కొరకు తొటలోనికి వచ్చిన వృద్దురాలు చేతికర్రతో కుక్కకు ఒక్కటి తగిలించింది, అప్పటికే మూటలోనిమాంసం అంతా తిన్నకుక్క మూటవదిలి తొటవెలుపలకు పరుగు తీసింది.
అప్పుడేవచ్చిన శివయ్య మూటవిప్పి బంగారునగలు,ధనంచూసి వాటిని న్యాయాధికారికి అప్పగించాడు.న్యాయాధికారి తమ రాజుగారి వద్దకు దాన్నిపంపించాడు.మరుదినం శివయ్యను పిలిపించిన రాజుగారు శివయ్యచెప్పిన విషయంవిని "కుక్కనుకొడితేడబ్బా"అని ఆశ్చర్యపోయి, ఆసోమ్ముకలవారెవరో వచ్చివారం రోజులలోగా నిరూపించుకుని వీటిని తీసుకు వెళ్ళవలసిందిగా ఆరోజే శివయ్య ఊరి పరిసరాల్లో చాటింపు వేయించాడు. గడువు ముగిసిపోవడంతో శివయ్యను పిలిపించిన రాజుగారు "శివయ్య భళా నీ నిజాయితి మెచ్చదగినది,యిప్పటికే నీ పరోపకారగుణం సేవాభావం గురించి విన్నాను,నీలాంటి నిజాయితి పరులే మనదేశానికి వెన్నుముక లాంటివారు నిన్ను అభినందిస్తూ ఈమూట లోని ధనం, నగలు నువ్వే స్వీకరించు,నీసేవలను మరింత పెంపొందించు. నువు నడుపుతున్న నిరాదరుల ఆశ్రమానికి నీకు కావలసిన ధన సహయం ప్రతి మాసం అందేలా ఏర్పాటుచేస్తాను" అన్నాడు రాజుగారు.ఆధనంతో రాజుగారి సహయంతొ శివయ్య ఎందరినో ఆదుకున్నాడు. అలానాటినుండే కుక్కనుకొడితేడబ్బు అనే మాట పుట్టింది" అన్నాతాతగారు "డబ్బులు వస్తాయని కనిపించిన కుక్కను కొట్టకండి "అన్నాడు తాతగారు.
కిలకిలా నవ్వుతూ తమ ఇళ్ళకు బయలుదేరారు పిల్లలు అందరు.