మనము చేసిన పుణ్యం చెడని పదార్ధము అని పెద్దలు చెబుతూ ఉంటారు అంటే మనము ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాలు అన్ని మనము గత జన్మలో చేసిన పుణ్యాల ఫలితం అని అర్థం, మనము చూస్తూ ఉంటాము పరమ దుర్మార్గుడు కూడా ప్రస్తుతం చాలా సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు మనము వాడు పాపలు చేస్తున్న ఇంత సుఖంగా ఎలా ఉండగలుగుతున్నాడని మనము అనుకుంటూ ఉంటాము కానీ ఈ జన్మలో వాడు అనుభవిస్తున్నది గతజన్మలో పుణ్యాల తాలుక ఈ విషయము అర్ధము కావటానికి మీకు ఒక చిన్న కదా చెపుతాను
పూర్వం ఒక రాజు ఉండేవాడు ఆయనకు ఉన్నట్టుండి ఒక పెద్ద సందేహము వచ్చింది ఏమిటి అంటే నేను పుట్టిన సమయములోనే అంటే అదే ముహూర్తానికి చాలా మంది పుట్టి ఉంటారు కదా వారందరు రాజ్యాలు ఏలు తున్నారా లేదే? నేను ఒక్కడినే రాజు ఎలా అయ్యాను ? రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువ ?
ఈ సందేహ నివృత్తికి మర్నాడు సభలో తన జాతకం ఇంకా కొంతమంది అదే సమయములో జన్మించిన వారి జాతకాలు తెప్పించి సిద్ధాంతాల ముందు ఉంచి తన సందేహాన్ని వారి ముందు ఉంచాడు ఒక్కొక్క సిద్ధాంతి ఒక్కొక్క రకమైన సమాధానాలు చెప్పారు కానీ ఏవి ఆయనకు తృప్తి నివ్వలేదు ఈ విధమైన అసంతృప్తి తో రాజు దిగులు చెందుతూ రాజ్యములో తన సందేహాన్ని నివృత్తి చేసిన వారికి భారీగా పారితోషకం ఇస్తానని ప్రకటించాడు వచ్చిన వాళ్ళు చెప్పిన సమాధానాలు ఆయనకు తృప్తి నివ్వకపోగా ఇంకా అసంతృప్తిని అసహనాన్ని పెంచాయి
ఒక యోగి రాజు సందేహాన్ని తీర్చటానికి రాజు సమక్షంలోకి వచ్చాడు రాజు తన సందేహాన్ని ఆ వృద్ధ యోగికి వివరించగా రాజు గారి జాతకాన్ని పరిశీలించి ," రాజా మీ సందేహాన్ని తీరుస్తాను కానీ దానికి మీరు ఈ నగరానికి బయట ఉన్న సన్యాసిని ని కలిస్తే అయన మీ ప్రశ్నకు జవాబు చెపుతాడు" అని చెప్పాడు రాజు ఆ యోగి సలహా మేరకు ఊరు చివర అడవిలో ఉన్న సన్యాసి దగ్గరకు వెళ్ళాడు ఆ సమయానికి ఆ సన్యాసి బొగ్గు తినటం చూసిన రాజు ఆశ్చర్య పోయి ఈ బొగ్గు తినే సన్యాసి నా సందేహము ఏమి తీఉస్తాదు అని అయిష్టముగానే తన ప్రశ్నను అయన ముందు ఉనచాడు. ప్రశ్న విని చాల చికాకుగా ఇంక కొంత దూరము వెళితే ఇలాంటిదే ఒక గుడిసె వస్తుంది ఆ గుడిసెలో ఒక సాధువు ఉంటాడు అతనిని ఈ ప్రశ్న అడగండి అతను మీకు సరి అయినా సమాధానము చెపుతాడు అని చెప్పి విసురుగా గుడిసె తలుపు వేసాడు
రాజు నిరాశతో ఏమో తన ప్రశ్నకు సమాధానం దొరుకుతుందేమో అని మరో సాధువుకు బయలు దేరి ఆ సాధువు ఉన్న చోటుకు చేరాడు అక్కడ రాజు చేరే సమయానికి ఆ సాధువు మట్టి తింటున్నాడు రాజు ఆ దృశ్యాన్ని చూసి ఇబ్బందికరంగానే తన ప్రశ్నను అడిగాడు ఆ సాధువు చాలా కోపంగా ఆర్చి అక్కడినుండి వెళ్లిపొమ్మంటాడు రాజు ఆ సాధువును ఏమి చేయలేక తిరిగి పోబోయుంటే ఆ సాధువు రాజుతో ," ఇంకా కొంచము దూరం వెళితే ఒక గ్రామము వస్తుంది ఆ గ్రామములో చనిపోవడానికి సిద్ధంగా ఉండే బాలుడు ఉంటాడు నీవు ఆ బాలుడిని కలువు" అని కటువుగా చెపుతాడు రాజుకు ఇదంతా అగమ్యగోచరంగాఉంది అయినా తన సందేహ నివృత్తి కోసము ఆ బాలుడిని కలవాలని నిశ్చయించు కొని ఆ గ్రామము చేరి చనిపోవడానికి సిద్ధముగా ఉన్న బాలుడిని కలిసి తన సందేహాన్ని ఆ బాలుడి ముందు ఉంచుతాడు.
రాజు సందేహము విన్న బాలుడు ,"రాజా గత జన్మలో నలుగురు అన్నదమ్ములు అడవి గుండా ప్రయాణము చేస్తూ మధ్యలో ఆకలి వేస్తుంటే ఒక చెట్టు నీడకు చేరి వాళ్ళు తెచ్చుకున్న రొట్టెలు తినడానికి ఉపక్రమిస్తూ ఉండగా ఒక వృద్ధురాలు అక్కడికి వచ్చి తానూ ఆకలితో ఉన్నాను నాకు కొంచము ఆహారాన్ని పెట్టండని అభ్యర్థిస్తుంది ఆ నలుగురిలో మొదటి వాడు కోపంగా నీకు ఆహారాన్ని ఇస్తే నేనేమి తినాలి బొగ్గులు తినాలా? అని కోపంగా అరుస్తాడు ఆ వృద్ధురాలు రెండవ వాడిని అడిగితె వాడు పోమ్మా నీకు ఆహారము ఇస్తే నేను మట్టి తినాలి అని వెటకారంగా విసుక్కుంటాడు. ఆ వృద్ధురాలు మూడవవాడిని కూడా ఆహారాన్ని పెట్టమని అడుగుతుంది అప్పుడు ఆ మూడవ వాడు కోపంగా ఆ వృద్దురాలితో," ఏం ఇప్పుడు తినకపోతే చస్తావా ఏమిటి ? పో పో" అని చాలా ఈసడింపుగా మాట్లాడాడు ఆ వృద్ధురాలు ఆ నాలుగోవాడిని తినడానికి ఏదైనా పెట్టమని అడుగుతుంది ఆప్పుడు ఆ నాలుగో వాడు ,"అవ్వా,నీవు చాలా నీరసంగా కనిపిస్తున్నావు ఇదిగో ఈ రొట్టె తిను" అని తాను తినబోతున్న రొట్టెను ఆ వృద్ధురాలికి ఇచ్చాడు ఆ నాలుగో వ్యక్తివి నువ్వే అని చెప్పి ఆ బాలుడు ప్రాణాలు విడిచాడు జరిగిన సంగతులను ఆ రాజు తనను పంపిన యోగి దగ్గరకు వెళ్లి చెప్పి వివరణ అడుగుతాడు అప్పుడు అ యోగి ," రాజా నీవు తెలుసుకోవలసిన ఆశ్చర్యకరమైన విషయము ఏమిటి అంటే ఆ నలుగురు ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు వారిలో ఆ నాలుగో వాడు చేసిన పుణ్యము ఫలితముగా ఈజన్మలో నీవు రాజుగా జన్మించావు మిగిలిన వారు వారి కర్మానుసారము ఒకడు బొగ్గులు తింటూ మరొకడు మట్టి తింటూ మరొకడు చావుకు సిద్ధముగా ఉంది నీకు విషయము చెప్పి చనిపోయినాడు కాబట్టి మనము గతములో చేసిన పుణ్యము వృధా కాదు " అని రాజుకు వివరించి ఏ విధమైన పారితోషకం రాజు నుండి స్వీకరించకుండా వెళ్ళిపోతాడు.